
భూపాలపల్లి అర్బన్: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి గతంలో ఎప్పుడు లేని విధంగా ఆన్‌లైన్‌లోనే అలవెన్స్‌లు చెల్లించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మూడు రోజుల విధులకు సంబంధించిన టీఏ, డీఏలను నేరుగా సిబ్బం ది వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు ఎన్నికల విధుల్లో పాల్గొనే వారి బ్యాంకు ఖాతాల నంబర్లు సేకరిస్తున్నారు. డిసెంబర్ 7న నిర్వహించే పోలింగ్ కోసం అధికారం యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటికే ఈవీఎంలు వీవీ ప్యాట్‌లు జిల్లాకు చేరాయి. ప్రతి ఉద్యోగి వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. మొత్తం 42 అంశాలతో ఎన్నికల సిబ్బంది వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చుతున్నారు.సర్వం సన్నద్ధంజిల్లాలో 4,44,445 మంది ఓటర్లు ఉన్నారు. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో 572 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని రెండు పూర్తిస్థాయి నియోజకవర్గాల్లో 2,288 మంది పోలింగ్ ఆఫీసర్‌లు, 572 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 572 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించనున్నారు.
ఆయా నియోజకవర్గాలకు ఈవీఎంలు, వీవీప్యాట్‌ల కేటాయింపు పూర్తి చేశారు. రెండు దశల్లో ఈవీఎంల పరిశీలన సైతం చేపట్టారు. జిల్లా స్థాయి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు(ఈఆర్‌ఓ), సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారుల(ఏఆర్‌ఓ)కు శిక్షణ పూర్తి అయ్యింది. ఎన్నికల అధికారులు, సిబ్బందికి సంబంధించిన కరదీపికలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు చేరాయి. పోలింగ్ బూత్‌ల వారీగా అవగాహన కల్పించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపా«ధ్యాయులకు ఈనెల 15 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు.
ఉద్యోగుల వివరాల సేకరణ..
ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఎన్నికల సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చే ప్రక్రియ మొదలైంది. ఉద్యోగుల ఓటరు గుర్తింపు కార్డు మొదలుకొని బ్యాంకు ఖాతా నంబర్ల సేకరణలో యంత్రాంగం నిమగ్నమైంది. ఉద్యోగి పేరు, పనిచేస్తున్న గ్రామం లేదా పట్టణం వివరాలు, ఉద్యోగ విరమణ సమయం, ఇంతకు ముందు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారా..? జీతభత్యాలు, బ్యాంకు ఖాతా, సదరు బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ లాంటి వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాలో సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడంతో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్న సిబ్బందిని సైతం ఎన్నికల విధులకు వినియోగించుకోనున్నారు.
అలవెన్స్ పంపిణీలో పారదర్శకత
ఈ ఎన్నికల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు అలవెన్స్‌లు నేరుగా వారి ఖాతాల్లో జమా చేయనున్నారు. ఇతర సిబ్బందికి వ్యక్తిగత ఖాతాల్లోనే జమా చేస్తారు. అధికారులు, ఉద్యోగుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చాలనే లక్ష్యంతో నమోదు ప్రక్రియను వేగం చేశారు.ఉన్నారు. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో 572 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జిల్లాలోని రెండు పూర్తిస్థాయి నియోజకవర్గాల్లో 2,288 మంది పోలింగ్ ఆఫీసర్‌లు, 572 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 572 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించనున్నారు. ఆయా నియోజకవర్గాలకు ఈవీఎంలు, వీవీప్యాట్‌ల కేటాయింపు పూర్తి చేశారు. రెండు దశల్లో ఈవీఎంల పరిశీలన సైతం చేపట్టారు. జిల్లా స్థాయి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు(ఈఆర్‌ఓ), సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారుల(ఏఆర్‌ఓ)కు శిక్షణ పూర్తి అయ్యింది. ఎన్నికల అధికారులు, సిబ్బందికి సంబంధించిన కరదీపికలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు చేరాయి. పోలింగ్ బూత్‌ల వారీగా అవగాహన కల్పించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపా«ధ్యాయులకు ఈనెల 15 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు.
ఉద్యోగుల వివరాల సేకరణ..
ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఎన్నికల సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చే ప్రక్రియ మొదలైంది. ఉద్యోగుల ఓటరు గుర్తింపు కార్డు మొదలుకొని బ్యాంకు ఖాతా నంబర్ల సేకరణలో యంత్రాంగం నిమగ్నమైంది. ఉద్యోగి పేరు, పనిచేస్తున్న గ్రామం లేదా పట్టణం వివరాలు, ఉద్యోగ విరమణ సమయం, ఇంతకు ముందు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారా..? జీతభత్యాలు, బ్యాంకు ఖాతా, సదరు బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ లాంటి వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాలో సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడంతో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్న సిబ్బందిని సైతం ఎన్నికల విధులకు వినియోగించుకోనున్నారు.
అలవెన్స్ పంపిణీలో పారదర్శకత
ఈ ఎన్నికల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు అలవెన్స్‌లు నేరుగా వారి ఖాతాల్లో జమా చేయనున్నారు. ఇతర సిబ్బందికి వ్యక్తిగత ఖాతాల్లోనే జమా చేస్తారు. అధికారులు, ఉద్యోగుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చాలనే లక్ష్యంతో నమోదు ప్రక్రియను వేగం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment