సాక్షి, వరంగల్ : చివరి రోజైన బుధవారం వివిధ పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు.. ప్రజలపై హామీల వర్షం కురిపించారు. ఊరూ వాడ కలియదిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. రోడ్‌షోలు నిర్వహించారు. పెద్ద మనుసు చేసుకోవే అవ్వా.. ఈ సారి ఓటు నాకే వేయి.. నీకు కచ్చితంగా పింఛన్ ఇప్పిస్త.. అన్నా నీకు ఇల్లు మంజూరు చేయిస్తా.. కాలనీల్లో రోడ్లు వేయిస్తా.. తమ్మీ తాగునీటి సమస్య లేకుండా చేస్తా..అంటూ హామీలు ఇచ్చారు. అన్ని కులాలు, వర్గాల వారిని కలవడంతో పాటు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి రాగానే తగిన న్యాయం చేస్తామన్నారు. ఓటు వేయాలని వేడుకున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 126 ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు సాయంత్రం 5 గంటలవరకు ప్రచారం ముగించాయి.
పాలకుర్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
తొర్రూరు రోడ్‌షోలో మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు
మాటలు చెప్ప.. సేవ చేస్తా..
మాటలు కాదు.. సేవ చేసి చూపిస్తానని జనగామ రోడ్‌షోలో అభివాదం చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
బైక్‌పై సవారీ
మధ్యకోటలో బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రజా కూటమి తూర్పు అభ్యర్థి రవిచంద్ర
అవ్వా నేను వడ్డిస్తా..
ములుగు పట్టణ కేంద్రంలో ఓ హోటల్‌లో ప్రచారం చేస్తున్న ప్రజాకూటమి అభ్యర్థి సీతక్క
సార్ బాగున్నారా..
లోకోషెడ్ ఎదుట ఓటర్‌ను పలకరిస్తున్న టీఆర్‌ఎస్ పశ్చిమ అభ్యర్థి వినయ్‌భాస్కర్
కళాకారుల అండ ..
భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ అభ్యర్థి కీర్తిరెడ్డితో కళాకారులు
గెలిపిస్తే అభివృద్ధి చేస్తా..
జనగామ రోడ్‌షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రజాకూటమి జనగామ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య
రమణన్నా హారతి తీసుకో..
భూపాలపల్లిలో ప్రచారం చేస్తున్న ప్రజాకూటమి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి హారతి ఇస్తున్న మహిళ
ఆదరించండి..
కడిపికొండ రోడ్డు షోలో మాట్లాడుతున్న ప్రజాకూటమి వర్ధన్నపేట అభ్యర్థి దేవయ్య
పువ్వు గుర్తుంచుకో..
బేతోలులో ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ మానుకోట అభ్యర్థి హుస్సేన్ నాయక్
డోలు వాయిస్తూ..
మల్యాలలో ప్రచారం చేస్తున్న మానుకోట ప్రజాకూటమి అభ్యర్థి బలరాంనాయక్
తండాల అభివృద్ధే ధ్యేయం..
ఉగ్గంపల్లి మచ్యా తండాలో మాట్లాడుతున్న డోర్నకల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రెడ్యానాయక్
శంఖం పూరించి..
మానుకోట బట్టలబజార్ ప్రచారంలో శంఖం ఊదుతున్న టీఆర్‌ఎస్ మానుకోట అభ్యర్థి శంకర్‌నాయక్
Comments
Please login to add a commentAdd a comment