
ప్రచారంలో ప్రసంగిస్తున్న రాకింగ్ రాకేష్
సాక్షి, డోర్నకల్: డోర్నకల్ పట్టణంలో సోమవారం జబర్దస్త్ కళాకారులు సందడి చేశారు. కళాకారులు రాకింగ్ రాకేష్, ఫణి పట్టణంలోని పలు వీధులలో రోడ్‌షో నిర్వహించారు. బీఎస్‌పీ అభ్యర్థి శ్రీనునాయక్‌ను గెలిపించాలని కోరుతూ పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షోలో పాల్గొన్న రాకేష్, ఫణి మాట్లాడుతూ విద్యావంతుడు, ఉన్నత ఉద్యోగం చేస్తున్న శ్రీనునాయక్‌ను డోర్నకల్ ఎమ్మెల్యే గెలిపించి ఆదరించాలని కోరారు. శ్రీనునాయక్‌తో తమకు ఉన్న పరిచయంతో డోర్నకల్ నియోజకవర్గంలో ఆయనను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నామని తెలిపారు. బీఎస్‌పీ అభ్యర్థి శ్రీనునాయక్ మాట్లాడుతూ స్థానికుడినైన తనను డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌పీ జిల్లా అధ్యక్షులు దార్ల శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment