jabardast Team
-
డోర్నకల్లోజబర్దస్త్త్ కళాకారుల ప్రచారం
సాక్షి, డోర్నకల్: డోర్నకల్ పట్టణంలో సోమవారం జబర్దస్త్ కళాకారులు సందడి చేశారు. కళాకారులు రాకింగ్ రాకేష్, ఫణి పట్టణంలోని పలు వీధులలో రోడ్‌షో నిర్వహించారు. బీఎస్పీ అభ్యర్థి శ్రీనునాయక్‌ను గెలిపించాలని కోరుతూ పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షోలో పాల్గొన్న రాకేష్, ఫణి మాట్లాడుతూ విద్యావంతుడు, ఉన్నత ఉద్యోగం చేస్తున్న శ్రీనునాయక్‌ను డోర్నకల్ ఎమ్మెల్యే గెలిపించి ఆదరించాలని కోరారు. శ్రీనునాయక్‌తో తమకు ఉన్న పరిచయంతో డోర్నకల్ నియోజకవర్గంలో ఆయనను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నామని తెలిపారు. బీఎస్పీ అభ్యర్థి శ్రీనునాయక్ మాట్లాడుతూ స్థానికుడినైన తనను డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు దార్ల శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే స్టేషన్లో జబర్దస్త్ టీం హల్చల్
-
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో జబర్దస్త్ టీం హల్చల్
విశాఖపట్నం : హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో జబర్దస్త్ టీం సభ్యులు హల్చల్ చేశారు. విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు జనరల్ టికెట్ తీసుకుని థర్డ్ క్లాస్ ఏసీలో ప్రయాణం చేశారు. చెకింగ్ కు వచ్చిన టీసీ అభ్యంతరం చెప్పడంతో జబర్దస్త్ టీం సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు. దీంతో టీసీ ఈ విషయం గురించి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైలు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత మళ్లీ రైల్వే సిబ్బందితో జబర్దస్త్ టీం సభ్యులు వాగ్వివాదానికి దిగారు. మీడియా రావడం గమనించి జబర్దస్త్ టీం సభ్యులు వెనక్కి తగ్గారు. షేకింగ్ శేషుతో పాటు మరో సభ్యుడు టీసీతో తీవ్ర వాగ్వివాదానికి దిగడం వీడియోలో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మార్కాపురం:డాక్టర్ శామ్యూల్ జార్జి ఇంజినీరింగ్ కళాశాల స్థాపించి 20 ఏళ్లు అయిన సందర్భంగా ఆదివారం రాత్రి కళాశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను అలరించాయి. ప్రముఖ గాయకులు సమీరా భరద్వాజ్, సత్యాయామిని, మనీషా, దినకర్ బృందం పాడిన పాటలు అలరించాయి. జబర్దస్త్ టీమ్‌లో రాకెట్ రాఘవ బృందం చేసిన హాస్య సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి. కళాశాలలో వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థులకు ఐఆర్ఎస్ అధికారి కిశోర్‌బాబు, కళాశాల సాంకేతిక సలహాదారులు ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే సురేష్, కళాశాల కార్యదర్శి డాక్టర్ సతీష్, డైరెక్టర్ విశాల్‌లు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఇన్‌కమ్‌టాక్స్ కమిషనర్ విజయలక్ష్మి సురేష్, వీహెచ్‌ఆర్ విద్యా సంస్థల అధినేత వెన్నా హనుమారెడ్డి, ఏ–వన్ గ్లోబల్ కళాశాల చైర్మన్ షంషీర్ అలీబేగ్, సిబ్బంది పాల్గొన్నారు.