డాక్టర్ శామ్యూల్ జార్జి ఇంజినీరింగ్ కళాశాల స్థాపించి 20 ఏళ్లు అయిన సందర్భంగా ఆదివారం రాత్రి కళాశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను అలరించాయి.
మార్కాపురం:డాక్టర్ శామ్యూల్ జార్జి ఇంజినీరింగ్ కళాశాల స్థాపించి 20 ఏళ్లు అయిన సందర్భంగా ఆదివారం రాత్రి కళాశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను అలరించాయి. ప్రముఖ గాయకులు సమీరా భరద్వాజ్, సత్యాయామిని, మనీషా, దినకర్ బృందం పాడిన పాటలు అలరించాయి. జబర్‌దస్త్ టీమ్‌లో రాకెట్ రాఘవ బృందం చేసిన హాస్య సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి.
కళాశాలలో వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థులకు ఐఆర్‌ఎస్ అధికారి కిశోర్‌బాబు, కళాశాల సాంకేతిక సలహాదారులు ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే సురేష్, కళాశాల కార్యదర్శి డాక్టర్ సతీష్, డైరెక్టర్ విశాల్‌లు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఇన్‌కమ్‌టాక్స్ కమిషనర్ విజయలక్ష్మి సురేష్, వీహెచ్‌ఆర్ విద్యా సంస్థల అధినేత వెన్నా హనుమారెడ్డి, ఏ–వన్ గ్లోబల్ కళాశాల చైర్మన్ షంషీర్ అలీబేగ్, సిబ్బంది పాల్గొన్నారు.