
విశాఖపట్నం : హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో జబర్దస్త్ టీం సభ్యులు హల్‌చల్ చేశారు. విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు జనరల్ టికెట్ తీసుకుని థర్డ్ క్లాస్ ఏసీలో ప్రయాణం చేశారు. చెకింగ్ కు వచ్చిన టీసీ అభ్యంతరం చెప్పడంతో జబర్దస్త్ టీం సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు. దీంతో టీసీ ఈ విషయం గురించి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రైలు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత మళ్లీ రైల్వే సిబ్బందితో జబర్దస్త్ టీం సభ్యులు వాగ్వివాదానికి దిగారు. మీడియా రావడం గమనించి జబర్దస్త్ టీం సభ్యులు వెనక్కి తగ్గారు. షేకింగ్ శేషుతో పాటు మరో సభ్యుడు టీసీతో తీవ్ర వాగ్వివాదానికి దిగడం వీడియోలో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment