eastcoast express
-
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి హౌర్హా వెళ్తున్న రైలులో ఉన్నట్టుండి పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి హౌర్హా వెళ్తున్న రైలులో బ్రేక్ లైనర్స్ పట్టివేయడంతో దట్టమైన పొగలు వ్యాపించింది. మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆందోళన చెందిన వెంటనే రైలును ఆపేశారు. భయంతో రైల్లోంచి దిగి పరుగులు తీశారు. అర్ధగంటకుపైగా రైలును అధికారులు నిలిపి వేశారు. అనంతరం మరమ్మతులు చేపట్టి, యథాతథంగా రైలును పంపించారు. -
రైల్వే స్టేషన్లో జబర్దస్త్ టీం హల్చల్
-
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో జబర్దస్త్ టీం హల్చల్
విశాఖపట్నం : హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో జబర్దస్త్ టీం సభ్యులు హల్చల్ చేశారు. విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు జనరల్ టికెట్ తీసుకుని థర్డ్ క్లాస్ ఏసీలో ప్రయాణం చేశారు. చెకింగ్ కు వచ్చిన టీసీ అభ్యంతరం చెప్పడంతో జబర్దస్త్ టీం సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు. దీంతో టీసీ ఈ విషయం గురించి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైలు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత మళ్లీ రైల్వే సిబ్బందితో జబర్దస్త్ టీం సభ్యులు వాగ్వివాదానికి దిగారు. మీడియా రావడం గమనించి జబర్దస్త్ టీం సభ్యులు వెనక్కి తగ్గారు. షేకింగ్ శేషుతో పాటు మరో సభ్యుడు టీసీతో తీవ్ర వాగ్వివాదానికి దిగడం వీడియోలో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
సాక్షి, కాజీపేట (వరంగల్): డ్రైవర్ అప్రమత్తతతో ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు భారీ ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు వేగంగా వస్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ వరంగల్ జిల్లా ఇంటికన్నె వద్ద్డ గేదెలను ఢీకొట్టడంతో రైలు ఇంజిన్ ముందు భాగంలో ఉండే క్యాటిల్ గార్డ్ సగం వంగిపోయింది. కాజీపేటకు చేరుకున్నాక సిబ్బంది దాన్ని సరిచేసి సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు అనుమతించారు. కానీ రైలు చిన్నపెండ్యాల స్టేషన్‌కు వచ్చేసరికి క్యాటిల్గార్డ్లోని కొంతభాగం విరిగి పట్టాలకు రాసుకుంటూ చక్రాల వద్దకు వచ్చింది. కానీ అప్రమత్తంగా ఉన్న డ్రైవర్ వెంటనే రైలును నిలిపివేయటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత కాజీపేట నుంచి మరో ఇంజిన్‌ను తెప్పించి రైలుకు జతచేసి పంపారు. 3 గంటలపాటు రైలు చిన్నపెండ్యాలలోనే నిలిచిపోయింది. సాయంత్రం 5.45కు సికింద్రాబాద్‌కు చేరుకోవాల్సిన రైలు రాత్రి 10.10కు చేరుకుంది.