సాక్షి, కాజీపేట (వరంగల్): డ్రైవర్ అప్రమత్తతతో ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు భారీ ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు వేగంగా వస్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ వరంగల్ జిల్లా ఇంటికన్నె వద్ద్డ గేదెలను ఢీకొట్టడంతో రైలు ఇంజిన్ ముందు భాగంలో ఉండే క్యాటిల్ గార్డ్ సగం వంగిపోయింది. కాజీపేటకు చేరుకున్నాక సిబ్బంది దాన్ని సరిచేసి సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు అనుమతించారు. కానీ రైలు చిన్నపెండ్యాల స్టేషన్‌కు వచ్చేసరికి క్యాటిల్‌గార్డ్‌లోని కొంతభాగం విరిగి పట్టాలకు రాసుకుంటూ చక్రాల వద్దకు వచ్చింది. కానీ అప్రమత్తంగా ఉన్న డ్రైవర్ వెంటనే రైలును నిలిపివేయటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత కాజీపేట నుంచి మరో ఇంజిన్‌ను తెప్పించి రైలుకు జతచేసి పంపారు. 3 గంటలపాటు రైలు చిన్నపెండ్యాలలోనే నిలిచిపోయింది. సాయంత్రం 5.45కు సికింద్రాబాద్‌కు చేరుకోవాల్సిన రైలు రాత్రి 10.10కు చేరుకుంది.
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
Published Fri, Sep 13 2013 2:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement