
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి హౌర్హా వెళ్తున్న రైలులో ఉన్నట్టుండి పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి హౌర్హా వెళ్తున్న రైలులో బ్రేక్ లైనర్స్ పట్టివేయడంతో దట్టమైన పొగలు వ్యాపించింది. మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దీంతో ఆందోళన చెందిన వెంటనే రైలును ఆపేశారు. భయంతో రైల్లోంచి దిగి పరుగులు తీశారు. అర్ధగంటకుపైగా రైలును అధికారులు నిలిపి వేశారు. అనంతరం మరమ్మతులు చేపట్టి, యథాతథంగా రైలును పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment