‘పోరు‘గల్లుల ప్రచార వేశాలు.. | Warangal Candidates Election Campaign | Sakshi
Sakshi News home page

‘పోరు‘గల్లుల ప్రచార వేశాలు..

Dec 4 2018 10:59 AM | Updated on Aug 27 2019 4:45 PM

Warangal Candidates Election Campaign  - Sakshi

సాక్షి, వరంగల్‌ : తెలంగాణ ఎన్నికలతో ఓరుగల్లు ప్రస్తుతం నేతల పోటాపోటీ ప్రచారలతో పోరుగల్లుగా మారింది. ప్రజలను ఆకట్టుకోవడానికి రాజకీయ నాయకులు వింత వింత వేశాలు వేస్తూ ప్రచారాలు చేస్తున్నారు. ఎన్ని వేశాలు వేసినా అన్నీ ఎన్నికల ముందే  వేయాలని ప్రచార మార్గంలో రోజుకి రెండు మూడు వేస్తూ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. 

 గురి తప్పదు మిత్రమా.. 

పాలకుర్తి : ఎన్నికల ప్రచారంలో భాగంగా బాణం ఎక్కుపెట్టిన టీఆర్‌ఎస్‌ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

తోడు నీడగా బతుకమ్మ.. 

మొగుళ్లపల్లి:  బతుకమ్మను నెత్తిన ఎత్తిన టీఆర్‌ఎస్‌ భూపాలపల్లి అభ్యర్థి  సిరికొండ మధుసూదనాచారి 

మీ ఓటు నాకే..

వరంగల్‌: తూర్పులో ప్రచారం చేపడుతున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌  

ఇది నా గెలుపు బండి..  

నల్లబెల్లి: ఎడ్లబండి నుంచి ప్రచారం చేపడుతున్న టీఆర్‌ఎస్‌ నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి 

కుండ చేస్త.. దాహం తీర్చుతా..

గూడూరు: మండలంలో కుమ్మరి కుండ చేస్తున్న టీఆర్‌ఎస్‌ మహబూబాబాద్‌ అభ్యర్థి శంకర్‌నాయక్‌ కూతురు తేజస్విని 

ఎన్నికల రైడ్‌లో దూసుకెళ్తా..

హన్మకొండ : ప్రచారంలో భాగంగా సైకిల్‌ తొక్కుతున్న ప్రజా కూటమి పశ్చిమ అభ్యర్థి రేవూరి ప్రకాష్‌రెడ్డి 

విజయ తిలకం..! 

పర్వతగిరి: ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ వర్ధన్నపేట అభ్యర్థి అరూరి రమేష్‌ నుదుట తిలకం దిద్దుతున్న మహిళ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement