
హన్మకొండ అర్బన్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న ఏడుగురు అభ్యర్థులకు సువిధ ద్వారా ఇచ్చిన ఎన్నికల ప్రచార అనుమతులు రద్దు చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.వెంకారెడ్డి తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్ధులు తమ ప్రచార ఖర్చుల వివరాలు ఆర్‌వో కార్యాలయంలో ఉండే ఎన్నికల వ్యయ పరిశీలకులకు అందజేయాలని, ఈవిషయంలో నోటీసులు కూడా జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అయినప్పటికీ అభ్యర్థులు స్పందించకపోవడంతో ఐపీసీ 171–1 ప్రకారం పోటీలో ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్, బీజేపీ అభ్యర్థి మార్తినేని ధర్మారావు, శివసేన అభ్యర్థి చిదురాల రాజన్న, డీబీఎఫ్ అభ్యర్థి నక్కా రాజేందర్‌రావు, ఆప్ అభ్యర్థి కృష్ణకిషోర్, ఇండిపెండెంట్ పబ్బ భానుకిరణ్, బీఎస్పీ అభ్యర్థి ఇమ్మడి కిరణ్‌లకు సువిధ అనుమతులు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment