సాక్షి, జనగామ: రాజకీయ పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. ఓటరు దేవుళ్లకు నమస్కారం... అయ్యా.. నేను మీ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడుతున్నా.. ముందస్తు ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ తమ భవితవ్యాన్ని వెతుక్కుంటున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు రెండు నెలల నుంచి ప్రచారం మొదలు పెట్టగా... కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్లు పదిహేను రోజులుగా ఊరూరా తిరుగుతూ హోరెత్తిస్తున్నారు. గెలుపోటములపై గత వారం రోజులుగా ఎవరికి వారే బేరీజు వేసుకుంటున్నారు. తమ నియోజక వర్గంలోని ఓటర్ల ఫోన్ నెంబర్లను సేకరించి, ఫోన్ల ద్వారా సొంతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. దీని ద్వారా తమకు ఎదురవుతున్న ఇబ్బందులు, చేయబోయే కార్యక్రమాలపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. గతంలో నేరుగా ఓటర్లను కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించే నాయకులు.. ప్రస్తుతం ట్రెండు మార్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment