నోట్ల రద్దు, కరోనా దెబ్బకు పరిస్థితులు మారడంతో ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపుకు మొగ్గుచూపారు. అందుకు నిదర్శనంగా ఇటీవల డిజిటల్ లావాదేవీలు కూడా రికార్డ్ స్థాయిలో నమోదవడం. అయితే అటు డిజిటల్ చెల్లింపులు చేస్తున్న ప్రజలు ఇటు నగదు వినియోగంపై ఫోకస్ పెడుతున్నారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా చేతిలో నగదు నిల్వకు కూడా ప్రాధాన్యమిస్తునన్నారు. ప్రస్తుతం ప్రజల వద్ద రికార్డ్ స్థాయిలో నగదు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి.
వామ్మె అంత నగదు ఉందా!
నోట్ల రద్దు జరిగిన ఆరేళ్ల తర్వాత 2022 అక్టోబర్ 21 నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు రూ. 30.88 లక్షల కోట్ల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుందని ఆర్బీఐ తన తాజా నివేదికలో పేర్కొంది. కాగా 2016 నాటికి నవంబర్ నాటికి ప్రజల వద్ద రూ.17.70 లక్షల కోట్లు ఉండగా.. ఇటీవల ఆ వాటా అది 71 శాతం వరకు పెరిగి రికార్డ్ స్థాయికి చేరుకుంది. సాధారణ వ్యాపార లావాదేవీలు, వస్తువులు సేవల కోనుగోలు కోసం వినియోగించే డబ్బును ప్రజల వద్ద ఉన్న నగదుగా లెక్కిస్తారు.
కాగా చెలామణిలో ఉన్న కరెన్సీ నుంచి బ్యాంకుల్లో నగదును తీసివేసిన తర్వాత ఈ సంఖ్య వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొత్త కొత్త డిజిటల్ చెల్లింపు సాధనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. నగదు చలామణి సైతం అదే స్థాయిలో పెరుగుతండడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థలో అవినీతితో పాటు నల్లధనం (బ్లాక్ మనీ) తగ్గించడమే లక్ష్యంగా అప్పట్లో రూ.500, రూ.1000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
చదవండి: ట్విటర్ ఉద్యోగుల తొలగింపు సరైంది కాదు, అలా చేసుండాల్సింది: కేంద్రం ఆగ్రహం!
Comments
Please login to add a commentAdd a comment