లావాదేవీలు ఆన్‌లైన్‌లో చేయండి
-
జెడ్పీ సీఈఓ రామిరెడ్డి
ఆత్మకూరురూరల్ : రిటైల్ వ్యాపారులందరూ హోల్‌సేల్ లావాదేవీలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించాలని జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి అన్నారు. ప్రస్తుతం రూ.500, 1000 నోట్లు రద్దుతో ప్రజలు పడుతున్న కరెన్సీ కష్టాలపై వ్యాపారుల అభిప్రాయాలు, వారి ఇక్కట్లు తెలుసుకునేందుకు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్ద నోట్లు చెల్లక కొంత మేర వ్యాపారాలు దెబ్బతిన్న విషయం వాస్తవేమేనన్నారు. ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేస్తే కొంతమేర ఇబ్బందులు తగ్గుతాయన్నారు. రేషన్‌షాపు డీలర్లు స్వైప్ మిషన్లు ఉపయోగిస్తే ఇక్కట్లు తగ్గుతాయని సూచించారు.
ఇబ్బంది పడుతున్నాం.
ఈ సమావేశంలో సంగం, ఆత్మకూరు, ఏఎస్‌పేట తదితర మండలాలకు చెందిన వ్యాపారులు, పెట్రోల్ బంకు నిర్వాహకులు, డీలర్ల సంఘం అధ్యక్షులు, పొదుపు సభ్యులు పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాము పడుతున్న ఇబ్బందులను ఏకరవు పెట్టారు. కొత్త రూ.100, 500 నోట్లు విడుదల చేస్తే ఇంత ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు డాక్టర్ ఏ నిర్మలాదేవి, రమణయ్య, ఆత్మకూరు తహసీల్దారు సారంగపాణీ, ఏఈలు శాంతకుమార్, శ్రీనివాసరావు, సీడీపీఓ ఉషారాణీ, ఎంఈఓ మణిప్రసాద్, డీటీ శేషయ్య, సూపరింటెండ్ శ్రీనివాసులు, ఈవోపీఆర్డీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.