బ్యాంకులకే షాకిచ్చిన పేటీఎం, ఒక్క నెలలోనే 7వేల కోట్లు.. బాబోయ్‌ ఏంటీ స్పీడ్‌! | Paytm Shocking Business In Loan Disbursals, Run Rate Reaches Rs 34000 Cr In September | Sakshi
Sakshi News home page

బ్యాంకులకే షాకిచ్చిన పేటీఎం, ఒక్క నెలలోనే 7వేల కోట్లు.. బాబోయ్‌ ఏంటీ స్పీడ్‌!

Published Mon, Oct 10 2022 7:45 PM | Last Updated on Mon, Oct 10 2022 9:54 PM

Paytm Shocking Business In Loan Disbursals, Run Rate Reaches Rs 34000 Cr In September - Sakshi

పేటీఎం.. డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్న వారిలో ఈ పేరు తెలియని వారుండరు. ప్రస్తుతం కస్టమర్లకు అనుగుణంగా సేవలందిస్తు తన వ్యాపారాంలో జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతోంది. మొదట్లో డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫాం వంటి సేవలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన పేటీఎంలో ఇటీవల మరికొన్ని సేవలతో పాటు బ్యాంకుల తరహాలో లోన్‌ సదుపాయలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ బ్యాంకులే షాక్‌ తినేలా అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది పేటీఎం. 

వన్‌ కమ్యూనికేషన్స్(One97 communications) మాతృసంస్థగా పనిచేస్తున్న పేటీఎం కంపెనీ దేశంలోని ఇతర బ్యాంకింగ్ సంస్థలతో కలిసి కొన్ని త్రైమాసికాల క్రితం రుణ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సేవలను ప్రారంభించిన కొత్తలో కొన్ని అవాంతరాలు ఎదురైన వాటిని తట్టుకుని తగ్గేదేలే అన్నట్లుగా రుణ వితరణ రంగంలో తాజాగా భారీ వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ తక్కువ కాలంలోనే తన లోన్ బుక్‌ను అనేక రెట్లు పెంచుకుంది.

కంపెనీ రుణ వితరణ వార్షిక ప్రాతిపదికన సెప్టెంబరులో రూ.34,000 కోట్లకు చేరుకుంది. ఈ విషయాలను కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్స్ లో వెల్లడించింది.  పేటీఎం నివేదికలో.. సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో వెలువడిన ఫలితాల పరంగా.. గతేడాది పోలిస్తే ఈ సారి పంపిణీ చేసిన మొత్తం రుణాల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని తెలిపింది. గత సంవత్సరంలో ఈ సంఖ్య 28.41 లక్షలు ఉండగా ఈ సారి 92 లక్షలకు చేరుకున్నట్లు పేర్కొంది.


అదే క్రమంలో Paytm ద్వారా పంపిణీ చేసిన లోన్ల విలువ.. గత సెప్టెంబరు 2021 త్రైమాసికంలో రూ. 1,257 కోట్లు ఉండగా, ప్రస్తుతం సెప్టంబర్‌లో ఆరు రెట్లు పెరిగి రూ.7,313 కోట్లకు చేరుకుంది. నెలవారీ వృద్ధి చూస్తే కంపెనీ ఈ ఏడాది సగటున రూ.7.97 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 39 శాతం పెరిగింది.

చదవండి: మూడేళ్ల సీక్రెట్‌ బయటపడింది.. స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న సీఈఓ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement