Digital Banking
-
భారత్ అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర
పుణె: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా ఇన్ఫ్రా రంగానికి బ్యాంకులు దన్నుగా నిలవాలని, చిన్న–మధ్యతరహా సంస్థల అవసరాలకు తగ్గట్లుగా రుణ లభ్యత ఉండేలా చూడాలని ఆమె చెప్పారు. అలాగే, ఆర్థిక సేవలు అందుబాటులో లేని వర్గాలను బ్యాంకింగ్ పరిధిలోకి తేవాలని, బీమా విస్తృతిని మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. టెక్నాలజీతో కొత్త మార్పులు.. ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్‌ను సులభతరం చేసేందుకు ఉపయోగపడుతున్న టెక్నాలజీతో పరిశ్రమలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ ప్రాధాన్యం పెరుగుతోందని, ప్రస్తుతం భూటాన్, ఫ్రాన్స్ తదితర ఏడు దేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. అంతర్జాతీయంగా జరిగే రియల్–టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 45 శాతం వాటా భారత్‌దే ఉంటోందన్నారు.అయితే, టెక్నాలజీతో పాటు పెరుగుతున్న హ్యాకింగ్ రిస్కులను నివారించేందుకు, అలాంటి వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బ్యాంకుల్లో మొండిబాకీలు తగ్గుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ జూన్ ఆర్థిక స్థిరత్వ నివేదిక సూచిస్తోందని మంత్రి చెప్పారు. లాభదాయకతతో పాటు ఆదాయాలను పెంచుకునే దిశగా బ్యాంకులు తగు విధానాలను పాటించాలని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు. -
SBI: కస్టమర్లకు మరిన్ని సేవలే లక్ష్యం
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 69వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురష్కరించుకుని తన కస్టమర్లకు సేవలను మరింత విస్తృతం చేయడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పదకొండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించినట్లు వివరించింది. డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్లను మెరుగుపరచడం, తన వ్యవసాయ రుణ పోర్ట్‌ఫోలియోలో నష్టాలను తగ్గిండానికి 35 కొత్త వ్యవసాయ కేంద్రీకృత ప్రాసెసింగ్ సెల్‌లను ప్రారంభించడం ఇందులో ఉన్నాయి. కస్టమర్ల బ్యాంకింగ్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చడానికి, సేవల విస్తృతికి ఈ 11 చొరవలు దోహదపడతాయని బ్యాంక్ ప్రకటన ఒకటి పేర్కొంది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. → తన డిజిటల్ చెల్లింపుల సౌలభ్యతను గణనీయంగా మెరుగుపరచుకున్నట్లు బ్యాంక్ పేర్కొంది. బీహెచ్ఐఎం ఎస్బీఐ పే యాప్‌లో ట్యాప్–అండ్–పే, అలాగే యోనో యాప్‌లో మ్యూచువల్ ఫండ్స్‌పై ఎండ్–టు–ఎండ్ (పూర్తిస్థాయి) డిజిటల్ లోన్లు వంటి రెండు అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొంది. → ఎస్బీఐ సూర్య ఘర్ లోన్ విషయంలో పూర్తి డిజిటలైజేషన్ మరో కీలకమైన చొరవగా బ్యాంక్ వివరించింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్‌లను ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారులు రుణాలను పొందవచ్చని పేర్కొంది. 10 కేవీ సామర్థ్యం వరకు ఈ రుణాలు అందుబాటులో ఉంటాయి. ఎంఎన్ఆర్ఈ/ఆర్ఈసీ పోర్టల్‌లో దరఖాస్తుదారుల నమోదు నుండి లోన్ పంపిణీ వరకు మొత్తం ప్రక్రియ ఎస్బీఐ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించడం జరుగుతుందని తెలిపింది. → దేశం వృద్ధి చక్రాన్ని రూపొందించడంలో భారతీయ ప్రవాసుల గణనీయమైన సహకారాన్ని గుర్తించిన బ్యాంక్... పంజాబ్‌లోని పాటియాలాలో రెండవ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెంటర్ (జీఎన్సీ) ప్రారంభించింది. ఎన్ఆర్ఐ ఖాతాదారుల కు సేవలను మెరుగుపరచడానికి బ్యాంక్ డే రోజున పాటియాలాలో ఈ రెండవ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెంటర్‌ను చైర్మన్ దినేష్ ఖారా ప్రారంభించారు. ఈ సెంటర్లు గ్లోబల్ ఇండియన్ కమ్యూనిటీతో బ్యాంక్ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయి. ఎక్సలెన్స్ హబ్‌లుగా పనిచేస్తాయి. ఎన్ఆర్ఐ కస్టమర్లకు ప్రత్యేక సేవలను అందిస్తాయి. భారతదేశంలో 434 ప్రత్యేక ఎన్ఆర్ఐ శాఖల నెట్వర్క్, 29 దేశాలలో విదేశీ కార్యాలయాలు, జీసీసీ ఆరు దేశాలలో (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్– బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) 45 ఎక్సే్ఛంజ్ హౌస్‌లు, 5 బ్యాంకులతో భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఎన్ఆర్ఐ ఖాతాదారులకు సమగ్ర సేవలను అందించడానికి బ్యాంక్ సన్నద్దమైంది. → న్యాయవాదుల కోసం సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో పూర్తి సదుపాయాలతో కూడిన హైకోర్టు శాఖలను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. న్యాయవాదులు, న్యాయ నిపుణుల అవసరాలను ప్రత్యేకంగా తీర్చడానికి ఈ శాఖలు దోహదపడతాయి. → గృహ రుణాలకు సంబంధించిన ప్రాసెస్ మరింత పారదర్శకం కానుంది. గృహ రుణ గ్రహీతలు ఇప్పుడు వివిధ ప్రాసెసింగ్ దశల్లో వారి రుణ దరఖాస్తు స్థితికి సంబంధించి ఆటోమేటెడ్ ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు అందుకుంటారు. → వినియోగదారు పూర్తి సంతృప్తి, సౌలభ్యత లక్ష్యంగా ఆధునికీకరించిన ఈ నూతన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు బ్యాంక్ వివరించింది. -
డిజిటల్ హౌస్ అరెస్ట్ అంటే ఏమిటి? ఎలా ఎదుర్కోవాలి?
జనాన్ని మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ కొత్త మార్గాలను కనుగొంటున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ హౌస్ అరెస్ట్’ పేరిట నూతన తనహా వంచనకు తెర లేపుతున్నారు. ఈ పద్దతిలో సైబర్ నేరగాళ్లు పోలీసు, సీబీఐ లేదా కస్టమ్స్ అధికారులుగా నటించి, తాము టార్గెట్ చేసుకున్న వారికి ఫోన్ చేసి, వారిని ఇంట్లో బందీలుగా మారుస్తున్నారు. అనంతరం వారి బ్యాంక్ ఖాతాలోని సొమ్మును స్వాహా చేసేస్తున్నారు. ఇదే కోవలో ఇంటి తాకట్టు మోసానికి సంబంధించిన అనేక ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.ఆర్బీఐ ఇటీవల వెలువరించిన ఒక నివేదికలోని వివరాల ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రూ. 302.5 బిలియన్లు అంటే రూ. 30 వేల కోట్లకు పైగా డిజిటల్ మోసాలు నమోదయ్యాయి. గత దశాబ్ద కాలంలో అంటే జూన్ 1, 2014 నుండి మార్చి 31, 2023 వరకు భారతీయ బ్యాంకులలో 65,017 మోసం కేసులు నమోదయ్యాయి. రూ. 4.69 లక్షల కోట్ల మేరకు చీటింగ్ జరిగింది. యూపీఐ స్కామ్, క్రెడిట్ కార్డ్ స్కామ్, ఓటీపీ స్కామ్, జాబ్ స్కామ్, డెలివరీ స్కామ్ మొదలైన వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ‘డిజిటల్ హౌస్ అరెస్ట్’ అనే కొత్త పద్ధతి ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారింది.మోసగాళ్లు తాము టార్గెట్ చేసుకున్నవారిని ఇంట్లో బంధించి, వారిని మోసం చేసేందుకు ఈ కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు. ముందుగా సైబర్ నేరగాళ్లు బాధితులకు డబ్బులు చెల్లించాలని ఆడియో, వీడియో కాల్స్ చేస్తూ, అలజడి వాతావరణాన్ని సృష్టిస్తారు. స్కామర్లు ఏఐ సాయంతో రూపొందించిన వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా పోలీసులు లేదా అధికారుల మాదిరిగా నటించి, బాధితుల ఆధార్ నంబర్ లేదా ఫోన్ నంబర్‌తో తప్పులు దొర్లాయని చెబుతారు. ఇంతటితో ఆగకుండా ఆ మోసగాళ్లు అధికారులుగా నటిస్తూ, తాము టార్గెట్ చేసుకున్నవారిని ఇళ్లలో బంధించి, వారికి అరెస్టు భయం కల్పించడంతోపాటు, వెంటనే డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తారు. దీంతో అరెస్టు, పరువు నష్టం భయంతో బాధితులు స్కామర్ల ఉచ్చులో సులభంగా పడిపోతారు. దీంతో నిండా మోసపోతుంటారు.ఈ రకమైన మోసానికి గురికాకుండా ఉంటాలంటే విజిలెన్స్ సహకారం అవసరం. ఎవరికైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చినప్పుడు విజిలెల్స్ విభాగానికి ఫిర్యాదు చేయాలి. ఇటువంటి సైబర్ మోసాలు, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇటీవల సంచార్ సాథి వెబ్సైట్లో చక్షు పోర్టల్‌ను ప్రారంభించింది. దీనికి తోడు ఇలాంటి మోసాల బారిన పడినవారు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు.ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఇతర బ్యాంకింగ్ వివరాల వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయకూడదు. ఏ బ్యాంక్ లేదా ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థ ఎవరినీ పిన్, లేదా ఓటీపీని అడగదు. ఇటువంటి సందర్భాల్లో పొరపాటున కూడా వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని గుర్తుంచుకోండి. అలాగే ఆన్లైన్ మోసాల నివారణకు సోషల్ మీడియాతోపాటు బ్యాంక్ ఖాతాల పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండటం ఉత్తమమని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
ఎస్బీఐ ఫెస్టివ్ ఆఫర్స్: ఎస్ఎంఈలకు తీపి కబురు
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజన్ షురూ అయిన నేపథ్యంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) కోసం వరుస పండుగ ఆఫర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. కొన్ని లాభదాయకమైన హోమ్ లోన్ డిస్కౌంట్లతో పాటు ఎస్ఎంఈల కోసం కొలేటరల్-ఫ్రీ లోన్స్ అందించాలని ఎస్బీఐ నిర్ణయించింది. ముఖ్యంగా ఈ పండుగ సీజన్లో SMEల కోసం ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణాలను అందిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. (ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!) ఎస్బీఐ ఎండీ అలోక్ కుమార్ చౌదరి జీ బిజినెస్‌కు అందించిన వివరాల ప్రకారం ఎస్ఎంఈల కోసం కొలేటరల్-ఫీ లోన్( ఎలాంటి తనఖా) అందించేందు ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపారులు డిజిటల్‌గా క్రెడిట్ సౌకర్యాలను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాలను కస్టమర్లకు విస్తరించే లక్ష్యంలో భాగంగా ఇది డిజిటల్ సేవల ద్వారా వినియోగదారులకు అనుకూలమైన సేవలతో నిమగ్నమవ్వడానికి కూడా సహాయపడుతుందని భావిస్తోంది.అలాగే ‘అండర్‌రైటింగ్’ ప్రక్రియ లేదా రుణదాత ఒకరి ఆదాయం, ఆస్తులు, అప్పు, ఆస్తి వివరాలను ధ్రువీకరించే ప్రక్రియ మరింత ఈజీ చేస్తుంది. అంతేకాదు ఎస్ఎంఈలకు ఈ పండుగ సీజన్లో ఎస్బీఐ యోనో యాప్‌లో తమ ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశాన్నికల్పిస్తోంది. బ్యాంక్ తన ఎస్ఎంఈ రుణగ్రహీతలను ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లాగా యోనో యాప్‌లో తమ ఉత్పత్తుల లిస్టింగ్‌కు అనుమతిస్తుందని, ఈ ఆఫర్లు కస్టమర్లకు నచ్చతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇతర ఆఫర్లపై కూడా మాట్లాడిన ఆయన ఎంపిక చేసిన కస్టమర్లకు తమ గృహ రుణాలపై 65 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు రాయితీలను కూడా అందిస్తోంది. ఈ డిస్కౌంట్ డిసెంబర్ 31, 2023 వరకు కొనసాగుతుందన్నారు. -
యువ కస్టమర్లే లక్ష్యంగా బీవోబీ అడుగులు
బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ హెడ్ వీజీ సెంథిల్‌కుమార్, డిజిటల్ , యువ కస్టమర్లపై నిరంతర దృష్టి ద్వారా రిటైల్వ్యాపారంలో వాటాను పెంచుకోవాలనే బ్రాండ్ ఉద్దేశాన్ని నొక్కి చెప్పారు. ఆయన పంచుకున్న మరిన్ని విశేషాలు సంక్షిప్తంగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రస్తుతం భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. 15 కోట్లకు పైగా కస్టమర్ బేస్ ఉంది. తమ బ్రాండ్ సరియైన దిశలో నడపించండం ఎపుడూ సవాలే! అయినప్పటికీ, ఒక బ్రాండ్‌గా అనేక అధ్యయనాలు చేసాం. కస్టమర్ల అనుభవం పరంగా అన్ని బ్రాంచ్‌లలో ఒక సర్వే నిర్వహించాం. దీంతో బ్యాంకుపై కస్టమర్ల దృష్టిపై అవగాహన వచ్చింది. మార్కెటింగ్ పరంగా, యూత్‌ని టార్గెట్ చేయడమే లక్ష్యం. బాబ్ వరల్డ్ , ఇతర డిజిటల్ ఆఫర్లు బ్రాండ్ ఇమేజ్ను బలోపేతం చేయబోతున్నాయి. సమీప భవిష్యత్తులో, బ్రాండ్ రీకాల్, బ్రాండ్ కార్యకలాపాల ప్రభావం, ఇతర అంశాలపై నిర్దిష్ట సర్వేలు/అధ్యయనాలను కూడా నిర్వహిస్తాము.దీనిపై నిర్దిష్టమైన ఇన్పుట్లను పొందడానికి ప్రముఖ పరిశోధనా సంస్థలతో భాగస్వామి కావాలని ప్లాన్ చేస్తున్నాం. మా వ్యాపారంలో రుణాల విషయానికి వస్తే. దేశీయ పుస్తకంలో 42 శాతం కార్పొరేట్, రిటైల్ 22 శాతం, వ్యవసాయం 15.6 శాతం , MSME 13 శాతం. బాధ్యతల వైపు కూడా మనకు ఇలాంటి శాతాలు ఉన్నాయి. అయితే రిటైల్ వ్యాపారాన్ని ప్రస్తుత స్థితి నుండి పెంచాలనుకుంటున్నాము.అందుకే రిటైల్ విభాగంలో డిజిటల్ రుణాలపై దృష్టి పెడుతున్నాము. ప్రముఖ క్రీడాకారులు పీసీ సింధు, కె శ్రీకాంత్‌తోపాటు తాజాగా స్టార్ విమెన్ క్రికెటర్ షఫాలీ వర్మ బ్రాండ్ ఎంబాసిర్గా చేరిపోయారు. విమెన్ ప్రీమియర్ లీగ్‌లో ఒక బ్రాండ్ అసోసియేషన్‌గా మాత్రమే కాకుండా భారతదేశంలో మహిళల క్రికెట్‌కు అవసరమైన మద్దతును అందించాలనుకుంటున్నాం. యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని #LoansWithoutDrama ప్రచారాన్ని చేపట్టాం. మిగిలిన డిజిటల్ ప్లాట్ఫారమ్లన్నింటితో పోల్చినప్పుడు బీఓబీకున్న ఉన్న ప్రధాన బలం ఏమిటంటే, ప్లాట్‌ఫారమ్‌తోపాటు, తమ బ్రాంచెస్ కూడా సర్వీసింగ్ యూనిట్లుగా పనిచేస్తాయి. కస్టమర్లకు సేవ చేయడానికి 80 వేలకు పైగా సిబ్బంది ఉన్నారు. ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించవచ్చు కానీ మీరు సర్వీసింగ్ కోసం ఎంటర్ప్రైజ్ రిసోర్స్‌ను నిర్మించలేరు. కస్టమర్ సేవ విషయానికి వస్తే, సమస్యలను పరిష్కరించడానికి ప్లాట్‌ఫారమ్‌పై మాత్రమే కాకుండా ఆధారపడకుండా శాఖలు కూడా ఎల్లపుడూ ఖాతాదారులకు అందుబాటులో ఉంటాయి. -అడ్వర్టోరియల్ -
కరూర్ వైశ్యా బ్యాంక్ ఫస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ స్టార్ట్.. ఎక్కడంటే?
చెన్నై: ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) తమ 800వ శాఖను చెన్నైలో ప్రారంభించింది. దీనితో పాటు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు (తెలంగాణలోని గద్వాల్, ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి) తమిళనాడులో ఇంకో ఆరు బ్రాంచీలను తెరిచింది. దీంతో మొత్తం శాఖల సంఖ్య 808కి చేరిందని బ్యాంకు ఎండీ రమేష్ బాబు తెలిపారు. అటు తొలి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ (డీబీయూ)ని కూడా చెన్నైలో ప్రారంభించినట్లు వివరించారు. ఇందులో పూర్తిగా డిజిటల్ పద్ధతిలో సేవింగ్స్ ఖాతాలను తెరవడం, రిటైల్ రుణాలకు దరఖాస్తు చేసుకోవడం, టర్మ్ డిపాజిట్లు తదితర లావాదేవీలన్నింటినీ నిర్వహించుకోవచ్చని రమేష్ బాపు చెప్పారు. కేవీబీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,40,806 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. రూ. 1,106 కోట్ల లాభం ఆర్జించింది. -
ఎస్ఎంఈ డిజిటల్ బ్యాంక్ తేవాలి
ముంబై: చిన్న, మధ్య తరహా సంస్థల నిధుల అవసరాలను తీర్చేందుకు ఎస్ఎంఈ డిజిటల్ బ్యాంక్‌ను కేంద్ర బడ్జెట్లో ప్రకటించాలని బిజ్2ఎక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ అరోరా కోరారు. చిన్న వ్యాపార సంస్థలు రుణాల లభ్యత సమస్య ఎదుర్కొంటున్నాయని, వాటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకమైన ఎస్ఎంఈ డిజిటల్ బ్యాంక్ అవసరమన్నారు. కాసా అకౌంట్లు, ఇన్వాయిస్, పేమెంట్ ప్రాసెసింగ్, కరెస్పాండెంట్ బ్యాంకింగ్, ఎస్ఎంఈ క్రెడిట్, ట్రేడ్ ఫైనాన్స్ సేవలను ఎస్ఎంఈ డిజిటల్ బ్యాంక్ అందించొచ్చన్నారు. బిజ్2ఎక్స్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్‌కు కస్టమైజ్డ్ ఆన్లైన్ లెడింగ్ సేవలను అందించే సాస్ ప్లాట్‌ఫామ్. -
డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, అమరావతి: డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి సూచించారు. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన 27వ రాష్ట్ర స్థాయి కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్, ఆన్లైన్ లోన్ యాప్‌ల మోసాల విషయంలో ప్రజలు పూర్తి అవగాహనతో, అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మోసాలను నియంత్రించేందుకు జాతీయ స్థాయిలో ఒక పరిష్కార మార్గాన్ని రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మోసాలను అరికట్టేందుకు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్, అభయగోల్డ్, హీరా, కపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు, సహారా, ప్రగతి, అవని, ఆదర్శ్ తదితర కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించిన కేసుల ప్రగతిపైనా సమావేశంలో చర్చించారు. కేసులను ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సీఎస్ స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఇన్చార్జ్ అంజనీ మిశ్రా, డీజీఎం రూటా మహాపాత్ర, ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, విజయకుమార్, సత్య ప్రభాకరరావు, విజయవాడ ఏసీపీ సీహెచ్ శివప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధి గతిని మార్చిన డిజిటల్ బ్యాంకింగ్
న్యూఢిల్లీ: భారత్ స్థిరమైన వృద్ధి సాధించడం వెనుక బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రధాన కారణాలుగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. 2014కు ముందున్న ఫోన్ బ్యాంకింగ్ స్థానంలో గత ఎనిమిది సంవత్సరాల్లో డిజిటల్ బ్యాంకింగ్ ప్రవేశపెట్టడం స్థిరమైన వృద్ధికి దోహదపడినట్టు చెప్పారు. యూపీఏ సర్కారు హయాంలో ఫోన్ బ్యాంకింగ్ ద్వారా ఎవరికి రుణాలు ఇవ్వాలి, నియమ నిబంధనలపై ఆదేశాలు ఫోన్ ద్వారా వెళ్లేవన్నారు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా.. దాని బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే అంత పురోగమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను (డీబీయూలు) ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫోన్ బ్యాంకింగ్ విధానంలో ఫోన్ ద్వారానే బ్యాంకుల నిర్వహణను నేతలు నిర్ధేశించేవారని వ్యాఖ్యానించారు. ఫోన్ బ్యాంకింగ్ రాజకీయాలు బ్యాంకులను సంక్షోభం పాలు చేశాయని, వేలాది కోట్ల రూపాయిల స్కామ్‌లకు దారితీశాయని విమర్శించారు. తమ ప్రభుత్వం పారదర్శకతపై దృష్టి పెట్టి బ్యాంకింగ్ రంగాన్ని మార్చేసినట్టు చెప్పారు. ‘‘నిరర్థక ఆస్తులను (ఎన్పీఏలు) గుర్తించడంతో పారదర్శకత వల్ల వేలాది కోట్ల రూపాయిలను తిరిగి బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొచ్చాం. బ్యాంకులకు నిధుల సాయం అందించాం. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చర్యలు తీసుకున్నాం. అవినీతి నిరోధక చట్టాన్ని సంస్కరించాం’’ అని ప్రధాని వివరించారు. దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) చట్టాన్ని తేవడం ఎన్పీఏల సమస్యకు పరిష్కారం లభించినట్టు చెప్పారు. కస్టమర్లు బ్యాంకుల దగ్గరకు వెళ్లడం కాకుండా, వారి దగ్గరకే బ్యాంకులు వచ్చేలా డిజిటల్ బ్యాంకింగ్‌తో మార్పులను తీసుకొచ్చినట్టు వివరించారు. మారుమూల ప్రాంతాలకూ బ్యాంకు సేవలను చేరువ చేయడానికి అధిక ప్రాధాన్యం చూపించినట్టు చెప్పారు. చిన్న వర్తకులూ డిజిటల్‌కు మారాలి.. గ్రామాల్లోని చిన్న వర్తకులు సైతం పూర్తిగా డిజిటల్ లావాదేవీలకు మళ్లాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రతీ బ్యాంకు శాఖ 100 మంది వర్తకులను తమతో అనుసంధానించాలని కోరారు. ఈ చర్య మన ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తు సన్నద్ధంగా మార్చేస్తుందన్నారు. ‘‘డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలు అన్నవి నేడు మన ఆర్థిక వ్యవస్థకు, స్టార్టప్ ప్రపంచానికి, భారత్‌లో తయారీకి, స్వావలంబన భారత్‌కు గొప్ప బలం’’అని ప్రధాని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ కలయిక అవినీతి నిర్మూలనకు సాయపడుతున్నట్టు తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా లబ్ధిదారులకు రూ.25 లక్షల కోట్లను బదిలీ చేసినట్టు ప్రకటించారు. పీఎం–కిసాన్ పథకం కింద మరో వాయిదా ప్రయోజనాన్ని సోమవారం బదిలీ చేయనున్నట్టు చెప్పారు. ఈ పథకం కింద ఒక్కో రైతుకు ఒక ఎకరానికి రూ.6,000 (మూడు వాయిదాలుగా) ప్రయోజనం లభించనుంది. బ్లాక్‌చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీని తీసుకురావాలన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘డిజిటల్ కరెన్సీ అయినా, డిజిటల్ లావాదేవీలు అయినా ఇందులో ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ చర్య పొదుపులను పెంచుతుంది. భౌతిక కరెన్సీని తగ్గిస్తుంది. తద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు’’అని వివరించారు. -
బ్యాంకులకే షాకిచ్చిన పేటీఎం, ఒక్క నెలలోనే 7వేల కోట్లు.. బాబోయ్ ఏంటీ స్పీడ్!
పేటీఎం.. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వారిలో ఈ పేరు తెలియని వారుండరు. ప్రస్తుతం కస్టమర్లకు అనుగుణంగా సేవలందిస్తు తన వ్యాపారాంలో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. మొదట్లో డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫాం వంటి సేవలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన పేటీఎంలో ఇటీవల మరికొన్ని సేవలతో పాటు బ్యాంకుల తరహాలో లోన్ సదుపాయలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ బ్యాంకులే షాక్ తినేలా అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది పేటీఎం. వన్ కమ్యూనికేషన్స్(One97 communications) మాతృసంస్థగా పనిచేస్తున్న పేటీఎం కంపెనీ దేశంలోని ఇతర బ్యాంకింగ్ సంస్థలతో కలిసి కొన్ని త్రైమాసికాల క్రితం రుణ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సేవలను ప్రారంభించిన కొత్తలో కొన్ని అవాంతరాలు ఎదురైన వాటిని తట్టుకుని తగ్గేదేలే అన్నట్లుగా రుణ వితరణ రంగంలో తాజాగా భారీ వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ తక్కువ కాలంలోనే తన లోన్ బుక్‌ను అనేక రెట్లు పెంచుకుంది. కంపెనీ రుణ వితరణ వార్షిక ప్రాతిపదికన సెప్టెంబరులో రూ.34,000 కోట్లకు చేరుకుంది. ఈ విషయాలను కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్స్ లో వెల్లడించింది. పేటీఎం నివేదికలో.. సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో వెలువడిన ఫలితాల పరంగా.. గతేడాది పోలిస్తే ఈ సారి పంపిణీ చేసిన మొత్తం రుణాల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని తెలిపింది. గత సంవత్సరంలో ఈ సంఖ్య 28.41 లక్షలు ఉండగా ఈ సారి 92 లక్షలకు చేరుకున్నట్లు పేర్కొంది. అదే క్రమంలో Paytm ద్వారా పంపిణీ చేసిన లోన్ల విలువ.. గత సెప్టెంబరు 2021 త్రైమాసికంలో రూ. 1,257 కోట్లు ఉండగా, ప్రస్తుతం సెప్టంబర్లో ఆరు రెట్లు పెరిగి రూ.7,313 కోట్లకు చేరుకుంది. నెలవారీ వృద్ధి చూస్తే కంపెనీ ఈ ఏడాది సగటున రూ.7.97 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 39 శాతం పెరిగింది. చదవండి: మూడేళ్ల సీక్రెట్ బయటపడింది.. స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న సీఈఓ! -
డిజిటల్ రుణ పరిశ్రమ విస్తరణకు మేలు
ముంబై: డిజిటల్ రుణాల జారీకి సంబంధించి ఆర్బీఐ తీసుకొచ్చిన నూతన నిబంధనలను పరిశ్రమ స్వాగతించింది. మరింత బాధ్యతాయుతంగా పరిశ్రమ వృద్ధి చెందడానికి సాయపడతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టళ్లు తదితర డిజిటల్ చానళ్ల ద్వారా జారీ చేసే రుణాలకు మధ్యవర్తుల సాయం తీసుకున్నా కానీ.. ఆయా రుణాలను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు నేరుగా రుణగ్రహీతల ఖాతాల్లోనే జమ చేయాలని ఆర్బీఐ బుధవారం నూతన నిబంధనలను ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఇష్టారీతిన వడ్డీ రేట్లు వసూలు చేయరాదని, అనైతిక రుణ వసూళ్ల విధానాలను అనుసరించకూడదని ఆదేశించింది. దీనిపై డిజిటల్ లెండర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (డీఎల్ఏఐ) స్పందించింది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోణంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఫైనాన్షియల్, ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్‌ల మధ్య సహకారాన్ని తప్పనిసరి చేయడాన్ని సానుకూలంగా పేర్కొంది. కస్టమర్లకు, ఫిన్‌టెక్ సంస్థలకు కొత్త నిబంధనలు ఎంతో సానుకూలమని డీఎల్ఏఐ ప్రెసిడెంట్ లిచీ చప్మన్ (జెస్ట్‌మనీ) పేర్కొన్నారు. లోపాల ఆసరాగా వ్యాపారాల నిర్మాణానికి అనుమతించేది లేదని ఆర్బీఐ స్పష్టం చేసిందన్నారు. ఆర్బీఐ నూతన నిబంధనలు ఇప్పటికే సేవలు అందిస్తున్న సంస్థలకు కొంత ప్రతిబంధకమని కోటక్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. పారదర్శకత, గోప్యతపై మరింత దృష్టి సారించాల్సి ఉంటుందని తెలిపింది. చదవండి: పెరిగే వడ్డీ రేట్లతో ఇళ్ల డిమాండ్‌కు సవాళ్లు -
ఆశపడ్డారో.. కొంప కొల్లేరే! కుక్కపిల్లని కూడా వదలరు
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్థిక లావాదేవీలన్నీ ఉన్నచోటనుంచే కడుపులో చల్ల కదలకుండా చాలా ఈజీగా చేసేస్తున్నాం. అంతేనా ఒక చిన్న క్లిక్‌తో ఇన్‌స్టంట్‌గా రుణాలు, యాప్ ద్వారా ఎక్కడినుంచి ఎక్కడికైనా క్షణాల్లో నగదు బదిలీ చేస్తున్నాం. దీంతో ఈ డిజిటల్ వేదికల్లోని కీలకసమాచారం నేరస్థులకు ఆదాయ వనరుగా మారిపోయింది. మోసాలకు వారు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. అందుకే ’నాకు తెలుసులే‘ అని అనుకోవద్దు. ఎంత తెలివితనం ఉన్నా సైబర్ నేరగాళ్లు ఏదో ఒక కొత్త మార్గంలో వచ్చి నిండా ముంచే స్తున్నారు. మోసాలకు నమ్మకమే మూలం. మోసపోయిన తర్వాత కానీ, అర్థం కాదు అందులోని లాజిక్. తాము అవతలి వ్యక్తిని ఏ విధంగా నమ్మి మోసపోయామో? బాధితులను అడిగితే చెబుతారు. అవగాహనే మోసాల బారిన చిక్కుకోకుండా కాపాడుతుంది. ఈ తరహా పలు కొత్త మోసాలపై ఆసక్తికరమైన విషయాలు మీ కోసం. కుక్క పిల్లనీ వదలరు.. హైదరాబాద్ వాసి శాంతి (33)కి పెట్స్ అంటే పంచ ప్రాణాలు. పెళ్లయి ఏడేళ్లు అయినా ఇంత వరకు కుక్క పిల్లను పెంచుకోవాలన్న కోరిక నెరవేరలేదు. ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా అయినా తనకు కుక్కపిల్ల తెచ్చి ఇవ్వాలని భర్తను కోరింది. ఆమె భర్తకు ఫేస్బుక్లో ‘ఇంటి వద్దకే పెట్స్ డెలివరీ’ పేరుతో పోస్ట్ కనపడింది. ఆ వివరాలు తీసుకొచ్చి పెళ్లానికి ఇచ్చాడు. ఆమె ఎంతో సంతోషంతో ఆ నంబర్ కు కాల్ చేసి మాట్లాడింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడాడు. రాజస్తాన్‌లో ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో తన సెంటర్ ఉందని.. కరోనా కారణంగా తన వద్ద భారీ సంఖ్యలో కుక్కలు ఉండిపోయినట్టు ఒక ఆసక్తికరమైన స్టోరీ చెప్పాడు. వాట్సాప్‌కు వీడియోలు పంపిస్తాను చూడండి అని కోరాడు. కొద్ది సేపటి తర్వాత వాట్సాప్ లో వచ్చిన వీడియోలు చూసిన తర్వాత శాంతికి ఆరాటం ఆగలేదు. వెంటనే కుక్కపిల్లకు ఆర్డర్ చేసేయాలన్నంత ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే వీడియోల్లోని కుక్క పిల్లలు అంత క్యూట్‌గా ఉన్నాయి. మార్కెట్ ధర అయితే ఒక్కో పెట్‌కు రూ.45,000–50,000 ఉంటుందని, ఎక్కువ సంఖ్యలో కుక్క పిల్లలు ఉండిపోయినందున ఒకటి రూ.5,000కు ఇస్తానని రాజస్తాన్ కేటుగాడు ఆఫర్ ఇచ్చాడు. అడ్వాన్స్‌కింద ముందు రూ.2,000 పంపించాలని కోరాడు. రసీదు కూడా ఇస్తానన్నాడు. డెలివరీ సమయంలో మొత్తం చెల్లిస్తానని ఆమె చెప్పడంతో నో అన్నాడు. దాంతో రూ.500 పంపించింది శాంతి. ఆమె పేరుతో రసీదు ప్రింట్ చేసి వాట్సాప్ చేశాడు. వారం రోజుల్లో పెట్‌ను మీ ఇంటి వద్దకు తీసుకొచ్చి డెలివరీ చేస్తారని.. ఆర్మీ వ్యాన్‌లో రవాణా చేస్తున్నామంటూ ఒక నకిలీ వీడియో పంపించాడు. కొన్ని రోజులు గడిచాయి. డెలివరీ తేదీ వచ్చినా అవతలి వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రాలేదు. దాంతో ఉండబట్టలేక శాంతి కాల్ చేసింది. ఈ రోజు పెట్ వస్తుందని, గంటలో డెలివరీ వాళ్లు కాల్ చేస్తారని చెప్పాడు. అన్నట్టు గంటలోపే ఒక కొత్త నంబర్ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. మీరు డీల్ చేసిన వ్యక్తి మోసగాడని, మిమ్మల్ని మోసం చేశాడంటూ అవతలి వ్యక్తి చెప్పాడు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. వాట్సాప్ లో తాము కోరిన వివరాలన్నీ ఇస్తే ఫిర్యాదు దాఖలు చేస్తామని స్టోరీ వినిపించాడు. ఇదే విషయం ఆమె తన భర్తతో చెప్పింది. అవేమీ చేయకు.. ఇక వదిలేసెయ్ అని అతడు చెప్పాడు. ఇంతకీ వాట్సాప్ లో ఫిర్యాదు కోసం కోరిన వివరాలు ఏవి అనుకున్నారు..? బాధితుని పేరు, ఫోన్ నంబర్, చిరునామా, నష్టపోయిన మొత్తం, అకౌంట్ నంబర్/ వ్యాలెట్ నంబర్/ యూపీఐ నంబర్, బ్యాంకు ఖాతా లేదా గూగుల్ పే అయితే ఆ వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్, డెబిట్/ క్రెడిట్ కార్డు నంబర్.. ఈ వివరాలన్నీ పంపాలని కోరాడు. అవి కనుక ఇచ్చి ఉంటే.. ఆ ఖాతా లేదా కార్డులోని బ్యాలన్స్ అంతటినీ.. ఓటీపీ కనుక్కుని మరీ మోసగాళ్లు ఊడ్చేసేవాళ్లు. శాంతి భర్తకు చెప్పడం.. అతను ఊరుకోమని చెప్పడంతో మోసం రూ.500కే పరిమితం అయింది. ఆన్లైన్లో తెలియని వారితో వ్యక్తిగత వివరాలు పంచుకోకపోవడం, తెలియని వారికి డబ్బులు పంపించకుండా ఉండడం ఒక్కటే పరిష్కారం. అసలు వారితో ఆయా అంశాలు చర్చించవద్దు. నకిలీ రూపాలు.. రోడ్డు పక్కన అంబరెల్లా టెంట్ వేసుకుని మార్కెటింగ్ చేసే వ్యక్తుల పట్ల కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాలి. లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్, బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్ కంపెనీల ఉద్యోగులుగా మోసగాళ్లు రూపాలు మారుస్తున్నారు. టెంట్ వేసుక్కూర్చుని తమ వద్దకు విచారణకు వచ్చిన వారిని నిండా ముంచుతున్నారు. వారి వద్దకు వెళ్లి మీరే స్వయంగా విచారించినా.. లేక పక్క నుంచి వెళుతున్నా ఆకర్షణీయ కరపత్రంతో వారు పలకరిస్తారు. తాను ఫలానా బ్యాంకు లేదా బీమా కంపెనీ ఉద్యోగినని.. జీరో బ్యాలన్స్ ఖాతా లేదా.. కొత్త బీమా ప్లాన్‌ను ఆవిష్కరిస్తున్నామని చెబుతారు. ఈ రోజే ప్లాన్ కొనుగోలు చేస్తే ప్రీమియంలో భారీ రాయితీ ఇస్తామని ఆశ చూపుతారు. కుటుంబం మొత్తానికి రూ.15 లక్షల కవరేజీ కోసం ఏటా రూ.5,000 కడితే చాలని చెబుతారు. ఆలోచించుకోవడానికి కొంచెం వ్యవధి కావాలని అడిగితే.. మరో రూ.1,000 డిస్కౌంట్ ఇస్తామని, ఆ తర్వాత మళ్లీ ఇలాంటి ఆఫర్ ఉండదంటూ ఆలోచనలో పడేస్తారు. ఏదోవిధంగా ఒప్పించి ప్రీమియం కట్టించుకోవడం కోసమే వారు అక్కడ కూర్చున్నారని మనకు అర్థం కాదు. ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ 2 వారాల్లో ఇంటికి వస్తుందని.. నచ్చకపోతే అప్పుడు రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం వెనక్కి వస్తుందని పాలసీ తీసుకునేలా చేస్తారు. చెల్లించిన ప్రీమియానికి రసీదును కూడా ఇస్తారు. కానీ, అదంతా మోసమన్నది నష్టపోయిన తర్వాత కానీ అర్థం కాదు. ఏంటి మార్గం..? రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని, స్టాల్స్ పెట్టుకుని ఆర్థిక ఉత్పత్తులు విక్రయించే వారిని నమ్మొద్దు. ఒకవేళ మీకు మంచి ఆఫర్ అనిపిస్తే ఆ ఉద్యోగి పేరు, ఉద్యోగి గుర్తింపు ఐడీ వివరాలు తీసుకుని బీమా కంపెనీకి కాల్ చేసి నిర్ధారించుకోవాలి. బీమా పాలసీలు అయినా, క్రెడిట్ కార్డు అయినా, బ్యాంకు ఖాతా అయినా.. మరొకటి అయినా నేరుగా ఆయా బ్యాంకు, బీమా సంస్థల శాఖల నుంచి లేదంటే ఆన్లైన్ పోర్టల్‌కు వెళ్లి తీసుకోవడమే సురక్షితం. బయట ఇలా మార్కెటింగ్ వ్యక్తుల రూపంలో మంచి ఆఫర్ కనిపిస్తే దాన్ని బ్రాంచ్‌కు వెళ్లి నిర్ధారించుకుని తీసుకోవాలి. ఇలాంటి కొనుగోళ్ల విషయంలో ఏ వ్యక్తికి కూడా వ్యక్తిగత ఖాతా లేదా నంబర్‌కు నగదు బదిలీ చేయవద్దు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. డబ్బులు కొట్టేశారా..! ఆన్లైన్ లేదా టెలిఫోన్ కాల్ రూపంలో ఓటీపీ తీసుకుని మీ కార్డు/వ్యాలెట్‌లోని డబ్బు లు కొట్టేసినట్టు గుర్తించారా? ఆలస్యం చేయ కండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి జరిగిన ఘటన వివరాలపై ఫిర్యాదు చేయండి. అలాగే. https://cybercrime.gov.in లాగిన్ అయ్యి మోసానికి సంబంధించి వివరాలు నమోదు చేయాలి. బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్ను అప్లోడ్ చేయాలి. అనంతరం కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఈ పోర్టల్ నుంచి ఆయా రాష్ట్రాల పోలీసులకు, బ్యాంకులకు సమాచారం వెళుతుంది. దాంతో సైబర్ నేరస్థుల ఖాతాల్లో జమ అయిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేసి బాధితుల ఖాతాలకు జమ చేస్తారు. అయితే, ఎంత వేగంగా ఫిర్యాదు చేశారన్న దాని ఆధారంగానే రికవరీ ఆధారపడి ఉంటుంది. సైబర్ నేరగాళ్లు బదిలీ చేసుకున్న మొత్తాన్ని వెంటనే డ్రా చేసుకుంటే రికవరీ కష్టమవుతుంది. -
టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ చేతికి స్విట్జర్లాండ్ కంపెనీ!
న్యూఢిల్లీ: డిజిటల్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ కాన్ఫినాలేను కొనుగోలు చేసినట్లు సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా పేర్కొంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. స్విట్జర్లాండ్ కంపెనీ కొనుగోలుకి యూకే అనుబంధ సంస్థ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. 2012లో ఏర్పాటైన కాన్‌ఫినాలే బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ రంగాలలో ఐటీ కన్సల్టింగ్ సేవలందిస్తోంది. ఈ వ్యూహాత్మక కొనుగోలుతో అవలాక్ కన్సల్టింగ్, అమలు, నిర్వహణ సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి ద్వారా గ్లోబల్ వెల్త్‌మేనేజ్‌మెంట్‌లో విస్తరించనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలియజేసింది. అవలాక్ ప్రీమియం ఇంప్లిమెంటేషన్ పార్టనర్ టైటిల్ పొందిన నాలుగు గ్లోబల్ సంస్థలలో కాన్‌ఫినాలే ఒకటని ఈ సందర్భంగా వెల్లడించింది. బ్యాంకింగ్ నైపుణ్యానికి సాఫ్ట్వేర్ సామర్థ్యం జతకావలసిన అవసరమున్నదని బలంగా విశ్వసిస్తున్నట్లు కాన్‌ఫినాలే సీఈవో రోలండ్ స్టాబ్ పేర్కొన్నారు. ఇందుకు హెచ్‌సీఎల్ టెక్ పరిపూర్ణమైన భాగస్వామి అని పేర్కొన్నారు. -
వచ్చేస్తున్నాయ్ డిజిటల్ బ్యాంకులు
న్యూఢిల్లీ: ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఉద్దేశించిన డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు (డీబీయూ) త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి 75 జిల్లాల్లో ఇవి ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, 10 ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఈ దిశగా ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. డీబీయూలకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ గత నెలలో విడుదల చేసింది. ఆర్బీఐ ఫిన్‌టెక్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి సారథ్యంలోని కమిటీ వీటిని రూపొందించింది. ఇందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సీఈవో సునీల్ మెహతా నేతృత్వంలోని వర్కింగ్ గ్రూప్ తోడ్పాటు అందించింది. డీబీయూలను ఏర్పాటు చేయతగిన 75 జిల్లాల జాబితాను రూపొందించింది. ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న పైలట్ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. ఆర్బీఐ కమిటీ మార్గదర్శకాల ప్రకారం డీబీయూలను బ్యాంకింగ్ అవుట్లెట్లుగా పరిగణిస్తారు. ఇవి కనీస డిజిటల్ బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలు (రుణాలు, డిపాజిట్లకు సంబంధించి) అందించాల్సి ఉంటుంది. చదవండి: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా! టెక్ లవర్స్‌కు గుడ్ న్యూస్! -
పోస్టాఫీసుల్లో డిజిటల్ సేవలు
సాక్షి, హైదరాబాద్: తపాలా శాఖ డిజిటల్ సేవలకు సిద్ధమైంది. ఇప్పటి ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా డిజిటల్ సేవలందిస్తున్న పోస్టల్ శాఖ తాజాగా పోస్టాఫీసుల్లో జరిగే సాధారణ లావాదేవీలను సైతం డిజిటల్ సేవలకు శ్రీకారం చుట్టింది. స్పీడ్, రిజిస్టర్డ్, పార్శిల్ సర్వీస్ చార్జీలను డిజిటల్ చెల్లింపులకు అనుమితిస్తోంది. నగదుతో పని లేకుండా జీ పే, ఫోన్‌పే ద్వారా చార్జీలను స్వీకరిస్తోంది. వినియోగదారులకు వెసులుబాటు కలిగినట్లయింది. (చదవండి: సిలిండర్ వెయ్యి అయ్యింది. మహిళలకు కట్టెల పొయ్యే దిక్కయింది: కేటీఆర్) -
డిజిటల్ మోసాలతో జాగ్రత్త..
న్యూఢిల్లీ: ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఖాతాదారులను హెచ్చరించింది. ఇందుకోసం పాటించతగిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎవరికీ ఎప్పుడూ పాస్వర్డ్లు వెల్లడించరాదని, తమ పరికరాల్లో ’ఆటో సేవ్’, ’రిమెంబర్ (గుర్తుపెట్టుకో)’ ఆప్షన్లను డిజేబుల్ చేయడం ద్వారా డివైజ్‌లో కీలక వివరాలు ఉండకుండా చూసుకోవాలని సూచించింది. ఖాతాదారులు తమ డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీలు, ఎలక్ట్రానిక్ చెల్లింపులు, సోషల్ మీడియా సెక్యూరిటీకి సంబంధించి అన్ని అంశాలను గుర్తు పెట్టుకోవాలని ఎస్బీఐ పేర్కొంది. సంక్లిష్టమైన, విశిష్టమైన పాస్వర్డ్ ఉపయోగించాలని, తరచూ మార్చుకుంటూ ఉండాలని సూచించింది. ‘ఎన్నడూ మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్లు లేదా పిన్ నంబర్లను డివైజ్‌లో భద్రపర్చుకోవడం లేదా రాసిపెట్టుకోవడం, ఎవరికైనా చెప్పడం లాంటివి చేయొద్దు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ ఎన్నడూ మీ యూజర్ ఐడీ/పాస్వర్డ్లు/కార్డ్ నంబరు/పిన్/సీవీవీ/ఓటీపీ వంటి వివరాలు అడగదు‘ అని ఎస్బీఐ పేర్కొంది. మార్గదర్శకాల్లో మరిన్ని.. ► ఆన్లైన్ లావాదేవీల్లో భద్రత కోసం బ్యాంక్ వెబ్సైట్ అడ్రెస్లో ’https’ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ వై–ఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించవద్దు. లావాదేవీ పూర్తయిన వెంటనే లాగ్ అవుట్ అవ్వాలి. బ్రౌజర్‌ను మూసివేయాలి. ► యూపీఐ లావాదేవీలకు సంబంధించి మొబైల్ పిన్, యూపీఐ పిన్ వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలి. ► గుర్తు తెలియని యూపీఐ అభ్యర్థనలకు స్పందించవద్దు. ఇలాంటి వాటిని తక్షణమే బ్యాంకు దృష్టికి తీసుకురావాలి. నగదును పంపేందుకు మాత్రమే పిన్ అవసరం, అందుకునేందుకు అవసరం లేదని గుర్తుంచుకోవాలి. ► కస్టమర్లు తమకు తెలియకుండా ఏదైనా లావాదేవీ జరిగిందని గుర్తిస్తే వెంటనే తమ ఖాతా నుండి యూపీఐ సర్వీసును డిజేబుల్ చేయాలి. ► ఏటీఎం మెషీన్లు, పాయింట్ ఆఫ్ సేల్స్ డివైజ్‌ల దగ్గర లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. ► ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, పీవోఎస్, ఏటీఎం మెషీన్లలో లావాదేవీలకు సంబంధించి పరిమితులు సెట్ చేసి ఉంచుకోవాలి. ► మొబైల్ బ్యాంకింగ్ సెక్యూరిటీ విషయానికొస్తే కస్టమర్లు పటిష్టమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలి. తమ ఫోన్లు మొదలైన వాటిల్లో వీలైతే బయోమెట్రిక్ ధ్రువీకరణను ఉపయోగించాలి. ► సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎవరికైనా వ్యక్తిగత, ఆర్థిక సమాచారం వెల్లడించడం లేదా వ్యక్తిగత వివరాలను చర్చించడం వంటివి చేయొద్దు. -
వైఎస్సార్ జిల్లా రికార్డు.. ప్రతి బ్యాంకు ఖాతాదారుడు...
సాక్షి, అమరావతి: రాష్ట్ర బ్యాంకింగ్ రంగంలో పూర్తిస్థాయి తొలి డిజిటల్ జిల్లాగా వైఎస్సార్ రికార్డు సృష్టించింది. వైఎస్సార్ జిల్లాలోని ప్రతి బ్యాంకు ఖాతాదారుడు అందుబాటులో ఉన్న డిజిటల్ లావాదేవీల్లో కనీసం ఏదో ఒకదాన్ని వినియోగించడం ద్వారా ఈ రికార్డు నమోదైంది. దేశంలో నగదు లావాదేవీలు తగ్గించడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దశలవారీగా ఎంపిక చేసిన జిల్లాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో తొలి దశలో వైఎస్సార్ జిల్లా ఎంపికైంది. ఈ కార్యక్రమం కింద ఆ జిల్లాలో ఉన్న ప్రతి బ్యాంకు ఖాతాదారుడిని కనీసం ఏటీఎం కార్డు లేదా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌ల్లో ఏదో ఒకదాన్ని వినియోగించేలా ప్రోత్సహించారు. వైఎస్సార్ జిల్లాలో మొత్తం 377 బ్యాంకు శాఖలు ఉండగా.. అందులో 26,09,254 ఖాతాలు ఉన్నాయి. డిజిటల్ జిల్లాలో భాగంగా 88.39 శాతం మందికి రూపే/డెబిట్ కార్డు మంజూరు చేశామని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. అలాగే 24.19 శాతం మంది నెట్ బ్యాంకింగ్ వినియోగిస్తున్నారన్నారు. 38.39 శాతం మందిని మొబైల్, యూపీఐ లావాదేవీలు చేసేలా ప్రోత్సహించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలు రెండో దశలో శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలను పూర్తి స్థాయి డిజిటల్ జిల్లాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బ్రహ్మానందరెడ్డి చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 333 బ్యాంకు శాఖలు ఉండగా 38.14 లక్షల ఖాతాలు, గుంటూరు జిల్లాలో 854 బ్యాంకు శాఖలు ఉండగా 102.46 లక్షల ఖాతాలున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగింపులోగా ఈ ఖాతాదారులందరూ ఏదో ఒక డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యం వినియోగించేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రతి నెలా లక్ష్యాలను నిర్దేశించి సమీక్షించుకోవడం ద్వారా వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ రెండు జిల్లాలను డిజిటల్ జిల్లాలుగా మారుస్తామన్నారు. ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు కాగా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ తన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో తక్కువగా బ్యాంకింగ్ సేవలను వినియోగిస్తున్న మూడు జిల్లాలను ఎంపిక చేసింది. అక్కడ బ్యాంకింగ్ కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా తొలి దశలో విజయనగరం, వైఎస్సార్, విశాఖ జిల్లాలను ఎంపిక చేసినట్లు బ్రహ్మానందరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 294 బ్యాంకు శాఖలు మాత్రమే ఉన్నాయి. వైఎస్సార్ జిల్లాలో 377 శాఖలు, విశాఖపట్నం జిల్లాలో 778 బ్యాంకు శాఖలు ఉన్నాయి. అయితే చాలా గ్రామాలు గిరిజన ప్రాంతాలు కావడంతో ఇంటర్నెట్తో అనుసంధానం వంటివి లేక స్థానిక ప్రజలకు బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో లేకుండా పోయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు శాఖలు, ఇండియన్ పోస్ట్ లేదా బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి కొత్త జిల్లాలు రానుండటంతో మౌలిక వసతులు మెరుగుపడి ఇంటర్నెట్తో అనుసంధానం పెరుగుతుందన్న ఆశాభావాన్ని బ్యాంకర్లు వ్యక్తం చేస్తున్నారు. -
పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా ఎస్బీఐ యోనో యాప్..!
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ అనుభవాన్ని పెంపొందించడానికి బ్యాంకింగ్ అప్లికేషన్ "యోనో"ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ యాప్‌ను ‘ఓన్లీ యోనో’గా మారుస్తున్నట్లు తెలిపింది. వచ్చే 12 నుంచి 18 నెలలో ఈ మెరుగుపరిచి యాప్‌ను పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా అమల్లోకి తేవాలని ఎస్బీఐ యోచిస్తుంది. అంతేకాక ప్రస్తుత ఎస్బీఐ యోనో కస్టమర్లను ఓన్లీ యోనోలోకి మార్చనుంది. ఎస్బీఐ యోనో 2021లో యాక్టివ్ యూజర్ల పరంగా 35 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. ‘ఓన్లీ యోనో’ అనేది తదుపరి తరానికి చెందిన యాప్. ఇది పూర్తి డిజిటల్ బ్యాంకుగా రూపాంతరం చెందనుంది. ఇది పూర్తిగా పర్సనలైజ్డ్ కస్టమర్ సెంట్రిక్ డిజైన్‌లో వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా బ్యాంకులు కూడా డిజిటల్ లావాదేవీల కోసం ప్రత్యేకంగా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో నిర్దిష్ట కస్టమర్ సెగ్మెంట్‌కు తమ సేవలను అందిస్తున్నాయి. అంతకుముందు కంటే ఎక్కువ లక్ష్యంతో కస్టమర్లను చేరుకోనున్నాయి. ఫుల్ స్టాక్ డిజిటల్ బ్యాంకులకు సంబంధించి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి ప్రత్యేక లైసెన్సింగ్ విధానాలు లేవు. కానీ అవసరమైతే అలాంటి ప్రతిపాదనలకు చేసే అవకాశం ఉంది, అందుకని బ్యాంకులు దానికి సిద్ధమై ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 2017లో యోనోను ఎస్బీఐ లాంచ్ చేసింది. (చదవండి: ఆ రంగానికి కలిసొస్తున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం..!) -
పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకులు రావాలి: నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: దేశీయంగా అందర్నీ ఆర్థిక సేవల పరిధిలోకి తేవడంలో ఇంకా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ ఒక చర్చాపత్రంలో పేర్కొంది. ఇవి భౌతిక శాఖల ద్వారా కాకుండా పూర్తిగా ఇంటర్నెట్, దాని అనుబంధ మార్గాల ద్వారా సర్వీసులను అందిస్తాయని తెలిపింది. ఇవి పూర్తి స్థాయి బ్యాంకుల్లాగే డిపాజిట్లు స్వీకరిస్తాయని, రుణాలు అందించడంతో పాటు ఇతరత్రా సర్వీసులు కూడా అందించగలవని పేర్కొంది. ఈ విధానాన్ని రెండంచెలుగా అమలు చేయొచ్చని సూచించింది. ముందుగా డిజిటల్ బిజినెస్ బ్యాంక్ లైసెన్సులు ఇవ్వాలని ఆ తర్వాత దాన్నుంచి నేర్చుకున్న అనుభవాలతో యూనివర్సల్ బ్యాంక్ లైసెన్సు జారీ చేయొచ్చని నీతి ఆయోగ్ తెలిపింది. -
పీఎన్బీ ఖాతాదారులకు షాక్... 18 కోట్ల మంది డేటా లీక్ ?
Punjab National Bank server exposed customer data : ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్వర్‌లోని (పీఎన్బీ) ఒక లోపం కారణంగా సుమారు 18 కోట్ల మంది కస్టమర్ల వ్యక్తిగత, ఆర్థిక వివరాలు బహిర్గతమయ్యే పరిస్థితి ఏర్పడిందని సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ఎక్స్9 వెల్లడించింది. సుమారు ఏడు నెలల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగిందని వివరించింది. అడ్మినిస్ట్రేషన్ అధికారాలతో పీఎన్బీకి చెందిన మొత్తం డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను బైటి వ్యక్తులు అందుబాటులోకి తెచ్చుకునేందుకు దోహదపడేలా ఈ లోపం ఉందని పేర్కొంది. దీన్ని తాము గుర్తించి సైబర్ సెక్యూరిటీ ప్రాధికార సంస్థలు సీఈఆర్టీ–ఇన్, ఎన్సీఐఐపీసీ ద్వారా హెచ్చరించిన తర్వాత, పీఎన్బీ లోపాన్ని సరిదిద్దిందని సైబర్ఎక్స్9 వ్యవస్థాపకుడు హిమాంశు పాఠక్ తెలిపారు. మరోవైపు, లోపం ఉన్న మాట వాస్తవమేనని నిర్ధారించినప్పటికీ దీని వల్ల కీలకమైన డేటా ఏదీ బైటికి పోలేదని బ్యాంక్ తెలిపింది. - న్యూఢిల్లీ -
గూగుల్ పేలో ఆ సేవలు కష్టమే..!
యూపీఐ విభాగంలో పలు సేవలను అందించాలనే గూగుల్ ప్రణాళిక ఆదిలోనే నిలిచిపోయింది. గతంలో గూగుల్ పే యూజర్లకు ఫ్లెక్స్ సర్వీసులను అందించాలని గూగుల్ భావించింది. ఫ్లెక్స్ సర్వీసెస్ సహాయంతో గూగుల్ పే యాప్ ద్వారా డిజిటల్ బ్యాంక్ ఖాతాలను అందించే ప్రయత్నాలపై గూగుల్ వెనుకడుగు వేసింది. గూగుల్ పే ద్వారా యూజర్ నిర్వహించే వివిధ రకాల సంప్రదాయ బ్యాంకులు అందించే చెకింగ్ లేదా సేవింగ్స్ ఖాతాల కోసం సైన్ అప్ చేయడానికి ఫ్లెక్స్ సర్వీసెస్ ద్వారా వినియోగదారులకు అందించాలని గూగుల్ భావించింది. చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ బ్యాంకులకు నష్టమే..! గూగుల్ ప్లెక్స్ సర్వీసులతో యూజర్లు బ్యాంకు సేవలనుంచి దృష్టిమరల్చే అవకాశం ఉంది. గూగుల్ తేస్తోన్న ప్లెక్స్ సర్వీసులు పలు బ్యాంకులతో ప్రత్యక్షపోటీలో ఉండే అవకాశం ఉంటుందని బ్యాంకింగ్ నిపుణులు భావిస్తున్నారు. యూజర్లకు నెలవారీ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ ఫీజులు లేకుండా, కనీస నిల్వలు లేకుండా ఖాతాలను అందించే అనేక రకాల ఆర్థిక సంస్థలతో భాగస్వామిగా ఉండటానికి ప్రణాళిక చేసింది. ఇది పలు బ్యాంకులకు నష్టాలను కల్గించే విధంగా ఉండొచ్చును. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం...ఫ్లెక్స్ ప్రాజెక్ట్ తరుచూ వాయిదాలు పడటంతో, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కంపెనీ నుంచి వెళ్లి పోవడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిన్నట్లు తెలుస్తోంది. ఈ సేవలకోసం ఇప్పటికే 4 లక్షల మంది రిజిస్టర్ ఐనట్లు వాల్‌స్ట్రీట్ పేర్కొంది. చదవండి: సడన్‌గా కాల్ డిస్కనెక్ట్ అవుతోందా..! ఇలా చేయండి..! -
రూటు మార్చిన మోసగాళ్లు.. జర జాగ్రత్త!
ముంబై: ఆర్థిక కార్యకలాపాల పునప్రారంభంతో యాత్రలు, ఆతిథ్యం, ఆన్లైన్ ఫోరమ్స్, సరుకు రవాణా వంటి రంగాలను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్‌యూనియన్ నివేదిక వెల్లడించింది. 40,000 పైచిలుకు వెబ్‌సైట్స్, యాప్స్‌ను విశ్లేషించి ట్రాన్ ఈ నివేదిక రూపొందించింది. టార్గెట్ ఇవే ట్రాన్స్ నివేదిక ప్రకారం.. ‘డిజిటల్ వేదికగా మోసం చేసేందుకు జరిగిన ప్రయత్నాలు భారత్‌లో గతేడాదితో పోలిస్తే 2021లో.. యాత్రలు, ఆతిథ్య రంగంలో 269 శాతం, డేటింగ్ యాప్స్ వంటి ఆన్లైన్ ఫోరమ్స్‌లో 267శాతం, సరుకు రవాణా రంగంలో 94 శాతం అధికం అయ్యాయి. ఏప్రిల్–జూన్‌లో లాక్డౌన్లు ఎత్తివేశాక యాత్రలు, ఆతిథ్య కార్యకలాపాలు మరింత ప్రధాన స్రవంతిగా మారడంతో మోసగాళ్లు ఈ పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్నారు’ అని వివరించింది. జాగ్రత్తలు తప్పనిసరి గతంలో సైబర్ నేరగాళ్లు బ్యాంకు లావాదేవీల ఆధారంగా ఎక్కువగా మోసాలకు పాల్పడేవారు. ఇప్పుడు టూరిజం సెక్టార్‌ని లక్ష్యంగా చేసుకోవడంతో పర్యటనల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండటం మేలని ట్రాయ్ సూచించింది. కొత్త ప్రదేశాల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది. చదవండి : మీరు వాడే క్రోమ్ బ్రౌజర్ సెక్యూర్‌గా ఉందో లేదో ఇలా చెక్ చేయండి.. -
నయా బ్యాం‘కింగ్’.. బ్యాంకు సేవలన్నీ డిజిటల్‌గానే..
ఆధునిక, డిజిటల్ యుగంలో ఆన్లైన్ బ్యాంకింగ్ పాత్ర చెప్పలేనంత పెద్దది. అది ఫోన్‌బ్యాంకింగ్ కావొచ్చు.. నెట్ బ్యాంకింగ్ కావచ్చు. డీమోనిటైజేషన్ తర్వాత నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత కరోనా వచ్చి డిజిటల్‌ను మరింత వేగవంతం చేసింది. దీంతో నేడు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోయింది. ఫలితంగా సంప్రదాయ బ్యాంకులకు.. నియో బ్యాంకులకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకుం డా పోయింది. ఈ పరిణామాలు నియో బ్యాంకుల విస్తరణకు అవకాశాలను విస్తృతం చేసిందని చెప్పుకోవాలి. నేటి యవతరానికి బ్యాంకు శాఖలు, ఏటీఎంల వద్ద ‘క్యూ’లను చూస్తే చిరాకు. లెక్కలేనన్ని పత్రాలతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా వారికి నచ్చదు. సమయం వృథాకాకుండా.. ఉన్న చోట నుంచే బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు వారికి నచ్చింది. పెద్దవయసులోని వారు సైతం డిజిటల్ బ్యాంకు లావాదేవీలకు అలవాటు చేసుకుంటూ ఉండడం కొత్త ధోరణికి అద్దం పడుతోంది. కొంచెం ప్రత్యేకంగా.. నియో బ్యాంకులకు ప్రత్యేకమైన నిర్వచనం ఏదీ లేదు. భౌతికంగా ఎటువంటి శాఖలను కలిగి ఉండవు. ఇప్పటికే విస్తరించి ఉన్న సంప్రదాయ బ్యాంకులతో (లైసెన్స్ కలిగిన) ఇవి భాగస్వామ్యం కుదుర్చుకుని.. బ్యాంకింగ్ సేవలను అందిస్తుంటాయి. బ్యాంకు సేవలను వినియోగదారులకు మరింత సౌకర్యంగా అందించడం వీటి ప్రత్యేకత. వీటివల్ల బ్యాంకులకూ ప్రయోజనం ఉంది. కొత్త కస్టమర్లను సంపాదించేందుకు పెద్దగా అవి శ్రమపడాల్సిన పని తప్పుతుంది. నియోబ్యాంకుల రూపంలో కొత్త కస్టమర్లు వాటికి సులభంగా వచ్చి చేరుతుంటారు. బ్యాంకులకు కొత్త కస్టమర్లను తీసుకొచ్చినందుకు.. కస్టమర్ యాక్విజిషన్ ఫీ పేరుతో నియోబ్యాంకులకు కొంత మొత్తం ముడుతుంటుంది. అంతేకాదు.. బ్యాంకు తరఫున కస్టమర్లకు అందించే ప్రతీ సేవలపైనా ఎంతో కొంత ఆదాయం నియోబ్యాంకులకు లభిస్తుంది. కస్టమర్లకు సౌకర్యం.. సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే నియో బ్యాంకుల వల్ల కస్టమర్లకు కొన్ని సౌలభ్యాలున్నాయి. బ్యాంకుకు వెళ్లకుండానే బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. వినియోగానికి సౌకర్యంగా ఉండే ప్లాట్‌ఫామ్‌లను నియోబ్యాంకులు డిజైన్ చేసుకుంటాయి. నిధుల విషయంలో ఎటువంటి అభద్రతా భావం, ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే నియోబ్యాంకులు మధ్యవర్తిత్వ పాత్రే పోషిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. అకౌంట్లు, డిపాజిట్లు అన్నీ కూడా సంప్రదాయ బ్యాంకులవద్దే ఉంటాయి. వీటిల్లో ఖాతాను వేగంగా ప్రారంభించుకోవచ్చు. ఆన్లైన్లోనే కేవైసీ వివరాలను పూర్తి చేయవచ్చు. ఆధార్, పాన్‌తోపాటు కొన్ని ప్రాథమిక వివరాలను ఇస్తే చాలు. పైగా ఇవన్నీ కూడా సున్నా బ్యాలన్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అంటే ఖాతాదారులు రూపాయి కూడా ఉంచాల్సిన అవసరం లేకుండానే బ్యాంకు సేవలను పొందే వెసులుబాటు ఉంది. వార్షిక నిర్వహణ చార్జీలు కూడా లేవు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల భాగస్వామ్యం కలిగిన నియో బ్యాంకులు డిపాజిట్లపై అధిక రేటును ఆఫర్ (7 శాతం వరకు) చేస్తున్నాయి. నియో బ్యాంకులు కొన్ని సేవింగ్స్ ఆధారిత సేవలకే పరిమితం అవుతుంటే.. కొన్ని రుణ ఆధారిత సేవలను కూడా అందిస్తున్నాయి. సేవింగ్స్ ఆధారిత నియో బ్యాంకులు పెట్టుబడులు, నగదు బదిలీలు, ఫారెక్స్ చెల్లింపుల వంటి సేవలకు పరిమితమైతే.. మరో రకం రుణ కార్యకలాపాలకు పరిమితం అవుతుంటాయి. సేవింగ్స్ ఆధారితం.. సేవింగ్స్ ఖాతా సేవలకు పరిమితమయ్యే నియో బ్యాంకులు ప్రధానంగా ఆయా సేవలను డిజిటల్‌గా ఆఫర్ చేస్తుంటాయి. ఐఎంపీఎస్/నెఫ్ట్/ఆర్టీజీఎస్/యూపీఐ తదితర చెల్లింపులు, చెక్ బుక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, అకౌంట్ స్టేట్మెంట్లు, ఖాతాలకు నామినీని నమోదు చేసుకోవడం ఇత్యాది సేవలన్నీ అందిస్తాయి. సేవింగ్స్ ఖాతాకు అనుసంధానంగా సంప్రదాయ బ్యాంకులు ఆఫర్ చేసే అన్ని రకాల సేవలను నియో బ్యాంకుల ద్వారా డిజిటల్‌గానే పొందొచ్చు. లావాదేవీల పూర్తి వివరాలను సైతం ఎప్పటికప్పుడు పొందొచ్చు. నియోబ్యాంకులు కో బ్రాండెడ్ డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులను సైతం బ్యాంకుల భాగస్వామ్యంతో అందిస్తున్నాయి. నగదు ఉపసంహరించుకోవాలన్నా, నగదును డిపాజిట్ చేసుకోవాలన్నా.. అప్పుడు కస్టమర్లు నియో బ్యాంకు మంజూరు చేసిన ఏటీఎం కార్డును వినియోగించుకోవచ్చు. ఏ బ్యాంకు భాగస్వామ్యంతో కార్డు ఇచ్చిందో ఆయా బ్యాంకు ఏటీఎంలో లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. నగదు జమ కోసం అవసరమైతే భాగస్వామ్య బ్యాంకు శాఖకు వెళ్లి పనిచేసుకోవచ్చు. ఏటీఎం యంత్రాల్లోనూ క్యాష్ డిపాజిట్ అవకాశం ఉంటున్న విషయం తెలిసిందే. కస్టమర్ల వినియోగానికి తగ్గట్టు.. నియోబ్యాంకు ప్లాట్‌ఫామ్‌లు కస్టమర్ల వినియోగాన్ని ట్రాక్ చేస్తుంటాయి. వారి అవసరాలకు అనుకూలమైన ఉత్పత్తులను ఆఫర్ చేస్తాయి. ఉదాహరణకు ఫెడరల్ బ్యాంకు సహకారంతో గూగుల్ పే ‘ఎఫ్ఐ మనీ’ని ఆరంభించింది. ఇది కూడా ఒక నియోబ్యాంకే. ఇది ఒక ఆటోమేటెడ్ బోట్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటు చేసింది. దీంతో కస్టమర్ స్విగ్గీ లేదా అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ప్రతీ సందర్భంలోనూ రూ.50–100 వరకు పొదుపు చేయమని సూచిస్తుంటుంది. మరో నియోబ్యాంకు ‘జూపిటర్ మనీ’ మనీ మేనేజ్మెంట్ సదుపాయాలను ఏర్పాటు చేసింది. తమ భవిష్యత్తు లక్ష్యాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. సేవింగ్స్ ఖాతాలోనే ఖాతాదారు నిర్దేశించిన మొత్తాన్ని ప్రత్యేక భాగంగా జూపిటర్ మనీ నిర్వహిస్తుంటుంది. కొన్ని నియో బ్యాంకులు అయితే వెల్త్ మేనేజ్మెంట్ (సంపద నిర్వహణ) సేవలను కూడా ఆఫర్ చేస్తున్నాయి. నియోక్స్ అనే నియోబ్యాంకు మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో (మధ్యవర్తి ప్రమేయం లేని) ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉంటే చాలు. ఫిన్‌టెక్ కంపెనీ కలీదో ప్లాట్‌ఫామ్‌కు చెందిన కలీదో క్యాష్.. మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీలు, ఆర్డీలు, ఇన్సూరెన్స్ ఉత్పత్తులను సైతం అందిస్తోంది. వీటిలో కొన్ని బ్యాంకులు బీటా వెర్షన్లోనే ఉన్నాయి. అంటే ఇంకా ఆరంభ దశలోనే ఉన్నట్టు. బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన ఇబ్బంది లేదు. మొబైల్ ఫోన్ నుంచే బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. అన్ని లావాదేవీలనూ డిజిటల్‌గానే పూర్తి చేసుకోవచ్చు. ఆఖరుకు రుణాలను కూడా డిజిటల్ వేదికగా వేగంగా తీసుకోవచ్చు. ఈ తరహా సేవలతో నియో బ్యాంకులు విస్తరించుకుంటూ వెళుతున్నాయి. ఎటువంటి భౌతిక శాఖల్లేకుండా.. ఆన్లైన్ ఆర్థిక సేవలను అందిస్తున్న ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లనే నియోబ్యాంకులుగా పేర్కొంటున్నారు. ఈ సంస్థల సేవలపై వివరాలతో కూడిన ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది... రుణ ఉత్పత్తులు.. కొన్ని నియో బ్యాంకులు రుణ ఉత్పత్తులకే ఎక్కువగా పరిమితం అవుతున్నాయి. ఇవి సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే రుణ దరఖాస్తులను చాలా వేగంగా ప్రాసెస్ చేస్తుంటాయి. ఆన్లైన్లోనే ప్రక్రియ అంతా పూర్తవుతుంది. ఫొటో ఐడీ, ఆధార్ నంబర్, ఒక సెల్ఫీ కాపీలను బ్యాంకుకు ఆన్లైన్లో సమర్పిస్తే చాలు. ఫ్రియోకు చెందిన మనీట్రాప్.. రూ.3,000 నుంచి రూ.5 లక్షల వరకు కస్టమర్ల రుణ చరిత్ర ఆధారంగా వేగంగా రుణాలను మంజూరు చేస్తోంది. నెలసరి వేతనం రూ.30,000, ఆపైన ఉన్న ఉద్యోగులకు 13 శాతం వడ్డీ రేటుపైనే మూడు నెలల నుంచి 36 నెలల కాలానికి మంజూరు చేస్తోంది. ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి సేవలను ఫ్రియోపే పేరుతో అందిస్తోంది. రూ.500–3,000 వరకు క్రెడిట్‌ను స్థానిక దుకాణాల్లో కొనుగోళ్లకు వాడుకోవచ్చు. ఈ మొత్తాన్ని నిర్ణీత తేదీలోపు చెల్లిస్తే చాలు. రూపాయి కూడా వడ్డీ ఉండదు. నియో బ్యాంకులు రుణ ఉత్పత్తులను ఎన్బీఎఫ్సీలు లేదా బ్యాంకుల భాగస్వామ్యంతో అందించొచ్చు. సేవింగ్స్ ఖాతా సేవలను అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్న బ్యాంకు నుంచే రుణ ఉత్పత్తులను ఆఫర్ చేయాలని లేదు. ఉదాహరణకు ఫ్రియో సంస్థ సేవింగ్స్ ఖాతా సేవలను ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సహకారంతో అందిస్తోంది. కానీ ఇదే ఫ్రియో తన మనీట్రాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా రుణ ఉత్పత్తులను అందించేందుకు హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, డీఎం ఫైనాన్స్, అపోలో ఫిన్వెస్ట్ ఇండియాతో ఒప్పందాలు చేసుకుంది. అలాగే, ఆర్బీఎల్ బ్యాంకుతో టైఅప్ అయ్యి క్రెడిట్ కార్డులను సైతం అందిస్తోంది. సరైన క్రెడిట్ స్కోర్ లేని వారి గురించి మరింత తెలుసుకునేందుకు వీలుగా నియో బ్యాంకులు.. కస్టమర్ల మొబైల్లోని కాంటాక్ట్‌లు, గ్యాలరీ, ఇతర యాప్‌ల సమాచారం తీసుకునేందుకు అనుమతి కోరుతున్నాయి. నియంత్రణలు, ఫిర్యాదుల పరిష్కారం నియో బ్యాంకులపై ఆర్బీఐ పర్యవేక్షణ ఉండదు. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని బ్యాం కుల సాయంతోనే బ్యాంకింగ్ సేవలను ఇవి అందిస్తున్నాయని గమనించాలి. డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులను అందించే సంస్థలు భౌతికంగానూ శాఖలను కలిగి ఉండాలని ఆర్బీఐ తప్పనిసరి చేసింది. కనుక నియోబ్యాంకులు భౌతికంగా శాఖలు కలిగిన బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో ఒప్పందాలు చేసుకుని సేవలను అందిస్తున్నాయి. కనుక నియో బ్యాంకు అందిస్తున్న డిపాజిట్, సేవింగ్స్ ఖాతా సేవల విషయంలో ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే ఈ ఖాతాల్లోని కస్టమర్ల డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం ఉంటుంది. కాకపోతే నియోబ్యాంకు ఒప్పందం చేసుకున్న బ్యాంకు ఏదన్నది తెలుసుకోవడం మంచిది. ఫిర్యాదులను నియో బ్యాంకు లేదా ఆ బ్యాంకుతో ఒప్పందం కలిగిన సంప్రదాయ బ్యాంకుల వద్ద దాఖలు చేసుకోవచ్చు. సకాలంలో పరిష్కారం రానట్టయితే ఆర్బీఐ సాచెట్ వెబ్సైట్లోనూ నమోదు చేసుకోవచ్చు. అనుకూలమేనా..? వినియోగానికి సౌకర్యంగా ఉండే ప్లాట్‌ఫామ్, లావాదేవీలను సైతం సౌకర్యంగా నిర్వహించుకోగల వెసులుబాటు నియో బ్యాంకుల్లో ఉంటుంది. కాకపోతే అన్నింటినీ ఒకే కోణం నుంచి చూడకూడదు. కొన్ని నియో బ్యాంకుల్లో బ్యాలన్స్ వెంటనే అప్డేట్ కావడం లేదని.. కస్టమర్ సేవలు బాగోలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. కనుక ఎంపిక చేసుకున్న నియోబ్యాంకు సేవలు మెరుగ్గా లేకపోతే వాటిల్లో కొనసాగడం ఆశించిన ప్రయోజనాలను ఇవ్వదు. సైబర్ భద్రతా రిస్క్ అంతా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లే కావడంతో సైబర్ భద్రతా రిస్క్ ఉంటుంది. అలాగే, ఫోన్లో వ్యక్తిగత సమాచారం పొందేందుకు అనుమతి అడుగుతున్నందున ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిందే. మెరుగైన, సులభతరమైన బ్యాంకు సేవల కోసంనియో బ్యాంకులను ఆశ్రయిస్తున్నట్టయితే.. ఆశించిన మేర సేవల నాణ్యత ఉందేమో పరిశీలించుకోవాలి. ఇప్పటికే సంప్రదాయ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా కలిగిన వారు.. మెరుగైన సేవల కోసం రెండో ఖాతాను నియో బ్యాంకుల్లో తెరవడాన్ని పరిశీలించొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అదే విధంగా.. నియో బ్యాంకుల మాదిరే అన్ని రకాల సేవలను ఆఫర్ చేస్తున్న ఎస్బీఐ యోనో, కోటక్ 811 ప్లాట్‌ఫామ్‌లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని సూచిస్తున్నారు. నియో బ్యాంకులకు ఇవి మెరుగైన ప్రత్యామ్నాయంగా వారు పేర్కొంటున్నారు. పరిమితులు సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే నియో బ్యాంకుల విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆటో డెబిట్ (ఖాతా నుంచి ఉపసంహరించుకునేందుకు అనుమతి) కోసం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం అన్ని నియో బ్యాంకుల్లోనూ లేదు. అలాగే, పీపీఎఫ్ ఖాతా తెరిచేందుకు కూడా అవకాశం లేదు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ యాక్సిస్ సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ. 730 టార్గెట్: రూ. 870 ఎందుకంటే: గతేడాది(2020–21)కల్లా 8.4 శాతం వాటా కలిగిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ దేశీ బ్రోకింగ్ బిజినెస్‌లో నాలుగో ర్యాంకులో నిలుస్తోంది. ఎన్ఎస్ఈలో యాక్టివ్ క్లయింట్ల విషయంలో డిస్కౌంట్ బ్రోకర్ల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీలోనూ కంపెనీ పురోభివృద్ధి సాధిస్తోంది. కంపెనీకి గల పటిష్ట డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. క్లయింట్లకు వివిధ దశల్లో అవసరమయ్యే పెట్టుబడులు, రక్షణ, రుణాలు తదితర లైఫ్‌సైకిల్ సొల్యూషన్స్‌ను పూర్తిస్థాయిలో అందిస్తోంది. కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను పీడిస్తున్న కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో క్యాపిటల్ మార్కెట్ల పెట్టుబడుల్లో అవకాశాలు భారీగా పెరిగాయి. ఇవి దేశీ బ్రోకింగ్ పరిశ్రమలో డిజిటల్ సేవలు, అతిపెద్ద సంస్థల కన్సాలిడేషన్‌కు దారి చూపుతున్నాయి. అతిపెద్ద కంపెనీగా ఐ–సెక్ సర్వీసులకు ఇకపై మరింత డిమాండు కనిపించే వీలుంది. కస్టమర్ల వ్యాలెట్ షేర్ల మానిటైజేషన్ తదితర డైవర్సిఫైడ్ ప్రొడక్టులతో కూడిన సేవల ద్వారా నిలకడైన ఆదాయాన్ని సాధించనుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవడం ద్వారా కస్టమర్లను పొందడంలో ముందుంటోంది. వ్యయాల క్రమబద్ధీకరణతో లబ్ధి పొందనుంది. టీసీపీఎల్ ప్యాకేజింగ్ వెంచురా సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ. 532 టార్గెట్: రూ. 961 ఎందుకంటే: గత దశాబ్దన్నర కాలంగా కంపెనీ నిలకడైన వృద్ధిని సాధిస్తోంది. వార్షిక ప్రాతిపదికన 17.7 శాతం పురోగతిని చూపుతోంది. సుమారు 6,000 లిస్టెడ్ కంపెనీలలో గత పదేళ్లుగా ఆదాయంలో వృద్ధిని సాధిస్తున్న 105 కంపెనీలలో ఒకటిగా జాబితాలో చేరింది. మడిచే వీలున్న అట్టపెట్టెలు(ఫోల్డింగ్ కార్టన్స్), మార్పిడికి వీలయ్యే స్టాండెలోన్ పేపర్ బోర్డుల తయారీలో అతిపెద్ద సంస్థగా నిలుస్తోంది. వెరసి ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌లో నిలకడైన, ప్రాధాన్యత కలిగిన కంపెనీగా పలు పరిశ్రమలకు చెందిన దిగ్గజ క్లయింట్ల నుంచి గుర్తింపును పొందింది. అంతర్జాతీయంగా రక్షణాత్మక ప్యాకేజింగ్ మార్కెట్ వార్షికంగా 6.7 శాతం వృద్ధితో 281 బిలియన్ డాలర్ల నుంచి 469 బిలియన్ డాలర్లకు జంప్చేయగలదని అంచనా. ఈ రంగంలో పట్టున్న కంపెనీగా టీసీపీఎల్‌కు భారీ అవకాశాలు లభించే వీలుంది. పర్యావరణ అనుకూల టెక్నాలజీస్‌కు ప్రాధాన్యత పెరుగుతున్నందున రానున్న దశాబ్ద కాలంలో కన్సాలిడేషన్ జరగనుంది. తద్వారా పోటీ తగ్గనుంది. ఈ ఏడాది రెండో తయారీ లైన్ ప్రారంభం కానుండటంతో కంపెనీ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ సామర్థ్యం రెట్టింపుకానుంది. అనుబంధ సంస్థ ద్వారా చేపట్టనున్న పాలీఎథిలీన్ బ్లోన్ఫిల్మ్ తయారీ ఇందుకు తోడ్పాటునివ్వనుంది. -
పెరిగిన డిజిటల్ లావాదేవీలు, గ్రామీణ ప్రాంతాలే కీలకం
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో గడిచిన 18 నెలల్లో డిజిటల్ లావాదేవీలు అనూహ్యంగా పెరిగినప్పటికీ.. ఆయా ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు ఇక ముందూ కీలక పాత్ర పోషిస్తాయని బ్యాంకర్లు పేర్కొన్నారు. ‘‘గ్రామీణ ప్రాంతాలు కూడా డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నాయి. కానీ, భౌతిక పరమైన సేవల అవసరం కూడా ఉంటుంది. భౌతికంగా అక్కడ శాఖల నిర్వహణ ఉండాల్సిందే’’ అని ఇండస్ ఇండ్ బ్యాంకు ఎండీ, సీఈవో సుమంత్ కత్పాలియా అభిప్రాయపడ్డారు. గ్రామీణ భారతానికి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అన్న అంశంపై ఆయన మాట్లాడారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కోటక్ మహీంద్రా బ్యాంకు జాయింట్ ఎండీ దీపక్‌గుప్తా.. రిటైల్ కస్టమర్లు భౌతిక, డిజిటల్ నమూనాలను అనుసరిస్తున్నా.. ఇతర కస్టమర్లు ఇప్పటికీ నగదు పరమైన లావాదేవీలే ఎక్కువగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి భౌతిక, డిజిటల్‌తో కూడిన ఫిజిటల్ నమూనా అవసరమని ఎన్పీసీఐ ఎండీ, సీఈవో దీలీప్ ఆస్బే అన్నారు. చదవండి : నీ లుక్ అదిరే సెడాన్, మెర్సిడెస్ నుంచి రెండు లగ్జరీ కార్లు -
మిస్టరీ అకౌంట్.. అదృష్టం అంటే ఇదే!
వెబ్‌డెస్క్: రెండువారాల క్రితం క్రిప్టోకరెన్సీ డోజ్కాయిన్ విలువ అమాంతం పడిపోయింది. చైనా క్రిప్టోకరెన్సీని బ్యాన్ చేయడంతోనే ఇది జరిగింది. అయితే ఈ క్రాష్‌ను కూడా తట్టుకుని ఈ ఏడాది ప్రారంభ నికర విలువ కంటే మెరుగ్గానే కొనసాగుతోంది డోజ్కాయిన్. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తరచూ డోజ్‌కాయిన్‌ను సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేస్తుండడమే ఇందుకు ఒక కారణం. అయితే మిస్టరీ అకౌంట్ ఒకటి రికార్డు స్థాయిలో విలువ చేసే డోజ్‌కాయిన్లను కలిగి ఉండడం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. డోజ్కాయిన్ ‘వేల్’ అకౌంట్ ఒకటి తన ఖాతాలో వేల కోట్లు చేసే ఈ మీమ్ కరెన్సీని కలిగినట్లు ఉన్నట్లు బయటపడింది. దగ్గరదగ్గర 12 బిలియన్ల డాలర్లు విలువ చేసే కాయిన్స్ (మన కరెన్సీలో 8, 752 కోట్ల రూపాయల విలువైన) ఆ అకౌంట్ పేరిట ఉన్నాయి. ఇటీవల క్రిప్టోకరెన్సీ మార్కెట్లో వచ్చిన కుదుపులను తట్టుకుని మరీ ఈ అకౌంట్ అంత విలువైన కరెన్సీని కలిగి ఉండడం విశేషం. మరోవైపు డిజిటల్ కరెన్సీ చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. వహ్.. మేజర్ షేర్ బిట్ఇన్ఫోఛార్ట్స్ ప్రకారం.. ది డోజ్ కాయిన్ వేల్ అకౌంట్ DH5yaieqoZN36fDVciNyRueRGvGLR3mr7L అడ్రస్ మీద 2019, ఫిబ్రవరి 6న ఫస్ట్ కొనుగోలు చేసింది. ఆ టైంలో కాయిన్ విలువ మన కరెన్సీపరంగా పదమూడు పైసలుగా ఉంది. అయితే ప్రస్తుతం ఆ ఇన్వెస్టర్ దగ్గర 3,671 కోట్ల డోజ్కాయిన్స్ ఉన్నాయి. వాటి మొత్తం విలువ 12 బిలియన్ల డాలర్లుగా తేలింది. ఈ విలువ ఇప్పుడున్న క్రిప్టోకరెన్సీలో 28 శాతంగా ఉండడం విశేషం. అయితే రెండువారాల క్రితం క్రాష్ కాకముందు ఈ అకౌంట్ క్రిప్టోకరెన్సీ విలువ 22 బిలియన్ల డాలర్లు(16వేలకోట్ల రూపాయలకుపైనే) ఉండిందట. ప్రస్తుతం కాయిన్మార్కెట్కాప్లో డోజ్కాయిన్ విలువ డాలర్లో మూడో వంతు (సుమారు23 రూపాయలుగా) ఉంది. అయితే ఈ మిస్టరీ అకౌంట్ బహుశా ఎలన్ మస్క్‌దే అయ్యి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జోక్‌గా మొదలై.. డోజ్కాయిన్ మీద ఫోకస్ ఎక్కువ కావడంతో.. ఈ ఏడాది మొదటి నుంచి ఆ కాయిన్స్‌కు గడ్డుకాలం నడుస్తోంది. షిబ ఇను అనే కుక్క బొమ్మతో డోజ్కాయిన్ 2013లో లాంఛ్ అయ్యింది. బిల్లీ మర్కస్, జాక్సన్ పామర్ అనే ఇద్దరు టెక్కీలు వీటిని స్టార్ట్ చేశారు. ట్రెడిషనల్ బ్యాంకింగ్ ఫీజును ఎగతాళి చేస్తూ జోక్‌గా ప్రారంభించిన డోజ్కాయిన్ ప్రయత్నం.. ఇప్పుడు లక్షల కోట్ల బిజినెస్‌కు చేరుకుంది. ఇక బ్లాక్‌యెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీలు పనిచేస్తాయి. సతోషి నకమోటో అనే వ్యక్తి 2008 అక్టోబర్‌లో బిట్ కాయిన్ని కనుగొన్నట్లు చెప్తుంటారు. -
బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా దేశీ బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ లావాదేవీలలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో పలువురు నిపుణులు ఈ అంశాలపై దృష్టి సారించారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) డిజిటల్ లావాదేవీలకు ఇటీవల అంతరాయాలు ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో తాత్కాలిక ప్రాతిపదికన కొత్త క్రెడిట్ కార్డుల జారీని నిలిపివేయమంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది కూడా. గత రెండేళ్లలో మూడుసార్లు డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలలో కస్టమర్లకు సమస్యలు ఎదురుకావడంతో ఆర్బీఐ ఆంక్షలు విధించింది. సాంకేతిక సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టమంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సూచించింది. ఇక మరోపక్క ఇటీవల ఎస్బీఐ డిజిటల్ విభాగం యోనో యాప్‌లోనూ రెండు రోజులపాటు సమస్యలు ఎదురయ్యాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎదురయ్యే డిజిటల్ సమస్యలకు ప్రధానంగా నాలుగు అంశాలు కారణంకావచ్చునంటూ సాంకేతిక నిపుణులు ప్రస్తావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. కోవిడ్-19 ఎఫెక్ట్ కొద్ది నెలల క్రితం కరోనా వైరస్ తలెత్తిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డవున్‌లకు తెరలేచింది. దీంతో ఇటీవల వేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ లావాదేవీలు మరింత జోరందుకున్నాయి. లాక్‌డవున్ ప్రభావంతో సీనియర్ సిటిజన్లు సైతం డిజిటల్ లావాదేవీలవైపు మొగ్గు చూపినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా బ్యాంకుల ఆన్లైన్ లావాదేవీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉదాహరణకు రోజుకి 10 లక్షల లావాదేవీలు నమోదయ్యే కొన్ని బ్యాంకులలో గత నెలలో ఈ సంఖ్య 13 లక్షలకు చేరినట్లు ఇండస్వన్ బిజినెస్ సొల్యూషన్స్ డైరెక్టర్ శరత్ వర్ఘీస్ పేర్కొన్నారు. స్వల్ప కాలంలో పెరిగిన ఈ డిజిటల్ ట్రాఫిక్‌ను బ్యాంకులు అంచనా వేయలేకపోయి ఉండవచ్చునంటున్నారు పరీఖ్ కన్సల్టింగ్ నిపుణులు పరీఖ్ జైన్. అదనపు సర్వర్లు కోవిడ్-19 కారనంగా ఉన్నట్టుండి పెరిగిన ఆన్లైన్ ట్రాఫిక్‌ను తట్టుకునేందుకు బ్యాంకులు అదనపు సర్వర్లను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. సుమారు రెండు గంటల సమయంలో ఇందుకు వీలున్నప్పటికీ ఇతర సమస్యలుంటాయి. అయితే సర్వర్ల ఏర్పాటు అవసరం, ఇందుకు అనుమతులు, ఆదేశాల వంటి ప్రాసెస్‌కు నెల రోజులవరకూ సమయం పట్టవచ్చునంటున్నారు శరత్. ఇలాంటి సమస్యలను బ్యాంకులు తప్పించుకోలేకపోవచ్చు. సర్వర్ల నిర్వహణ బ్యాంకులకు సంబంధించిన డేటాను నిల్వ(స్టోర్) చేసే సర్వర్లను థర్డ్ పార్టీ సంస్థలు నిర్వహిస్తుంటాయి. సర్వర్ల ఆధారంగానే రోజువారీ కార్యకలాపాలు జరుగుతుంటాయి. సాధారణంగా ఈ సర్వర్ల నిర్వహణ విషయంలో బ్యాంకులకు నియంత్రణలు ఉండవు. ఇటీవల బ్యాంకింగ్ రంగానికి ఎదురవుతున్న క్లిష్ట పరిస్ఙతుల నేపథ్యంలో వ్యయాల తగ్గింపుపై బ్యాంకులు దృష్టిపెట్టాయి. దీంతో సర్వర్ల సామర్థ్యం, నిర్వహణ వంటి అంశాల విషయంలో థర్డ్ పార్టీ సేవలు సైతం కొంతమేర సవాళ్లను ఎదుర్కొంటూ ఉండవచ్చు. సర్వర్లను పర్యవేక్షించే వారి సంఖ్య తగ్గడం, షిఫ్టుల వంటి సమస్యలు తలెత్తే అవకాశముందంటున్నారు శరత్. చదవండి: (5జీ టెక్నాలజీను వెంటనే అనుమతించండి) అనలిటిక్స్ కీలకం బ్యాంకులు బిజినెస్‌ను పెంచుకునేందుకు పలు కార్యక్రమాలు చేపడుతుంటాయి. ఇదేవిధంగా పండుగల వంటి సీజన్లు వీటికి జత కలుస్తుంటాయి. అయితే పెరుగుతున్న కస్టమర్లు, డిజిటల్ లావాదేవీల వంటివి అంచనా వేసేందుకు బ్యాంకులు డేటా అనలిటిక్స్ వంటి టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. తద్వారా ఏ సమయంలో ట్రాఫిక్ పెరుగుతున్నదీ లేదా తగ్గుతున్నదీ వంటి అంశాలపై అంచనాలకు అవకాశముంటుంది. దీంతో సిబ్బంది, ఇతర వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునే ప్రణాళికలకు వీలుంటుందని బ్యాంకులకు సాంకేతిక సేవలు అందించే టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలియజేశారు. అయితే కొన్ని సందర్భాలలో ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అంచనాలు తప్పే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. దీంతో బ్యాంకులకు సమస్యలు ఎదురుకావచ్చని పేర్కొన్నారు. వేగంగా కొన్ని నివేదికల ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రస్తుతం రోజువారీ 10 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. వీటి విలువ రూ. 5 లక్షల కోట్లుగా అంచనా. డిజిటల్ లావాదేవీలలో ఇటీవల కనిపిస్తున్న స్పీడ్ ప్రకారం రానున్న ఐదేళ్లలో లావాదేవీలు 150 కోట్లకు చేరే అవకాశముంది. విలువలో రూ. 15 ట్రిలియన్లను తాకవచ్చని అంచనా. ఈ స్థాయిలో లావాదేవీలను నిర్వహించాలంటే.. బ్యాంకింగ్, ఐటీ మౌలిక సదుపాయాలను భారీగా పెంపొందించుకోవలసి ఉంటుంది. డేటా సెంటర్లు, క్లౌడ్ తదితర సేవలు, ఏఐ వంటి సౌకర్యాలను మెరుగుపరచుకోవలసి ఉంటుంది. తద్వారా లావాదేవీల నిర్వహణలో కస్టమర్లతోపాటు.. బ్యాంకులకూ భద్రత, ప్రమాణాలు, నిలకడ, అవసరానికి తగ్గ నిర్వహణకు వీలుంటుందని సాంకేతిక నిపుణులు వివరించారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్
ముంబై, సాక్షి: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు తాజాగా రిజర్వ్ బ్యాంక్ షాకిచ్చింది. ఆన్లైన్ సర్వీసులలో అంతరాయాల నేపథ్యంలో డిజిటల్, క్రెడిట్ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేయమంటూ ఆదేశించింది. గత రెండేళ్లలో మూడుసార్లు ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో సమస్యకు తొలుత పరిష్కారాన్ని వెదకమంటూ ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. డిజిటల్-2లో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రవేశపెట్టనున్న అన్ని డిజిటల్ సంబంధ కార్యక్రమాలనూ తాత్కాలికంగా నిలిపివేయవలసిందిగా ఆర్బీఐ ఆంక్షలు విధించింది. వీటిలో భాగంగా కొత్తగా క్రెడిట్ కార్డుల జారీని సైతం నిలిపివేయవలసి ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. సర్వీసులకు ఇబ్బంది లేదు నిబంధనలకు అనుగుణంగా లోపాలను సవరించిన వెంటనే ఆర్బీఐ విధించిన తాజా ఆంక్షలను ఎత్తి వేయనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలు బ్యాంకు రోజువారీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావమూ చూపవని తెలియజేసింది. ప్రస్తుత కస్టమర్లకు అన్ని సేవలూ యథావిధిగా అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ప్రైమరీ డేటా సెంటర్లో విద్యుత్ ప్రసారంలో వైఫల్యాలు సర్వీసులలో అంతరాయాలకు కారణమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత నెల 21న.. ఇటీవల గత నెల 21న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్, ఆన్లైన్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడటంతో ఆర్బీఐ వివరాలు దాఖలు చేయమంటూ ఆదేశించింది. గతేడాది డిసెంబర్లో తలెత్తిన అంతరాయం కారణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లు తొలిసారి రెండు రోజులపాటు మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలను పొందలేకపోయారు. గత రెండేళ్లుగా ఐటీ వ్యవస్థల పటిష్టానికి పలు చర్యలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలియజేసింది. కాగా..ప్రస్తుత క్రెడిట్ కార్డుల వినియోగదారుల సేవలు, డిజిటల్ బ్యాంకింగ్ తదితర సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని హెచ్డీఎఫ్సీ బ్యాంకు వివరించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 15,292 ఏటీఎంలున్నాయి. 14.9 మిలియన్ క్రెడిట్ కార్డులు, 33.8 మిలియన్ డెబిట్ కార్డులను కస్టమర్లకు బ్యాంక్ జారీ చేసింది. -
గూగుల్ పే యూజర్లకు డెబిట్ కార్డులు
గూగుల్ పే యూజర్లకు ఓ వెసులుబాటు కలగబోతోంది. తరచూ రివార్డ్ ప్రోగ్రామ్‌ల ద్వారా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది గూగుల్ పే యాప్. తాజాగా గూగుల్ పే వినియోగదారుల కోసం సరికొత్త యాప్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది గూగుల్. గూగుల్ అంతర్జాతీయ మార్కెట్ల కోసం పే యాప్ లో కొత్త అప్డేట్ ని తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ అప్డేట్ లో భాగంగా కో బ్రాండెడ్ డెబిట్ కార్డులను కూడా వినియోగదారులకు అందించబోతోంది. గూగుల్ పే ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా గూగుల్ తన గూగుల్ పే ద్వారా డిజిటల్ బ్యాంక్ అకౌంట్ సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశమున్నట్లు వినిపిస్తుంది. ఈ సర్వీసులు ముందుగా అమెరికాలో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ అందించనున్నట్లు సమాచారం. ఈ డిజిటల్ బ్యాంక్ అకౌంట్ సర్వీసులను ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు తీసుకురానుంది. -
కాంటాక్ట్‌లెస్ పేమెంట్లకే మొగ్గు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 విస్తృతి కారణంగా దేశంలో డిజిటల్ బ్యాంకింగ్, కాంటాక్ట్‌లెస్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. నగదుకు బదులుగా డిజిటల్, కాంటాక్ట్ రహిత చెల్లింపులకే కస్టమర్లు మొగ్గుచూపుతున్నారని ఫైనాన్షియల్ సర్వీసెస్ టెక్నాలజీ కంపెనీ ఎఫ్ఐఎస్ సర్వేలో తేలింది. పేస్ పల్స్ పేరుతో చేపట్టిన ఈ సర్వేలో 2,000 మంది పాలుపంచుకున్నారు. 68 శాతం మంది ఆన్లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ విధానంలో లావాదేవీలు జరుపుతున్నారు. మహమ్మారి తదనంతరం కూడా ఈ విధానాన్నే అనుసరిస్తామని 51 శాతం మంది స్పష్టం చేశారు. భవిష్యత్తులో క్యాష్, కార్డ్స్‌కు బదులుగా కాంటాక్ట్‌లెస్ పేమెంట్లను జరుపుతామని 48 శాతం మంది వెల్లyì ంచారు. మొబైల్ వాలెట్లతో.. భారత్‌లో మొబైల్ పేమెంట్ వాలెట్ల వినియోగమూ అంతకంతకూ పెరుగుతోందని నివేదిక వెల్లడించింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2020 ఫిబ్రవరిలో మొబైల్ వాలెట్ల ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 124.3 కోట్లు. మే నాటికి ఇది రెండింతలకుపైగా చేరి 253.2 కోట్లకు ఎగసింది. లావాదేవీల విలువ ఇదే కాలంలో రూ.2,836 కోట్ల నుంచి రూ.11,080 కోట్లకు చేరింది. సర్వేలో పాలుపంచుకున్న వారిలో 93 శాతం మందికిపైగా మొబైల్ వాలెట్లను వాడుతున్నారు. వీరిలో 24–39 ఏళ్ల వయసున్నవారే అధికం. చెల్లింపు అభిరుచులు రానున్న రోజుల్లో ఇదే విధంగా ఉంటాయని ఎఫ్ఐఎస్ ఎండీ మహేశ్ రామమూర్తి తెలిపారు. ఈ మార్పులకు తగ్గట్టుగా ఫైనాన్షియల్ సంస్థలు, విక్రయదారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా కరోన ప్రభావం.. ప్రజలపై కరోన ఆర్థికంగానూ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉపాధికి సంబంధించిన సమస్యలను 70 శాతం మంది ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా తమ జీతాల్లో కోత పడిందని 49 శాతం మంది తెలిపారు. ఉద్యోగాలు తాత్కాలికంగా కోల్పోయామని 20 శాతం, శాశ్వతంగా పోయిందని 10 శాతం మంది చెప్పారు. 20 శాతం మందికి పదోన్నతి, 18 శాతం మందికి వేతనం పెంపు, 23 శాతం మందికి బోనస్ వాయిదా పడిందని వివరించారు. ఆదాయం తగ్గితే ఆర్థికంగా మూడు నెలలకు మించి భారాన్ని తట్టుకోలేమని 48 శాతం మంది వెల్లడించారు. ఆర్థిక ముప్పు అధికంగా యువ జంటలకే ఉందని సర్వే తేల్చి చెప్పింది. మహిళలపైనా ఈ ప్రభావం ఉందని పేర్కొంది. -
‘యోనో’ విలువ... రూ.3 లక్షల కోట్ల పైమాటే
ముంబై: ఆరంభించిన మూడేళ్ల కాలంలోనే ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ ‘యోనో’ 40 బిలియన్ డాలర్లకు పైగా వ్యాల్యూషన్‌తో అతిపెద్ద స్టార్టప్‌గా అవతరించినట్టు బ్యాంకు చైర్మన్ రజనీష్‌కుమార్ తెలిపారు. వ్యాపారుల నుంచి వ్యాపారుల మధ్య వాణిజ్య బిల్లులు చెల్లింపులకు గాను ‘భారత్ డ్రాఫ్ట్’ పేరుతో ఒక బిజినెస్ టు బిజినెస్ (బీటూబీ) ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. 2017 నవంబర్‌లో ఎస్బీఐ యోనో యాప్, వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఎస్బీఐ కస్టమర్లు బ్యాంకింగ్ సేవలను, పెట్టుబడులను, షాపింగ్‌ను ఒకే వేదికగా చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రజనీష్ కుమార్ మాట్లాడుతూ.. యోనో లాభదాయక ప్లాట్‌ఫామ్ అని, ఎస్బీఐలో భాగంగా ఉన్నందున దీని విలువ ఎవరికీ తెలియదన్నారు. ‘‘ఒకవేళ బ్యాంకు వెలుపల ఉండి ఉంటే దీని విలువ ఎంత లేదన్నా 40–50 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. ప్రతిరోజూ 70 వేల మంది కస్టమర్లను ఈ ప్లాట్‌ఫామ్‌పైకి చేర్చుకుంటున్నాము. గత 6 నెలల్లోనే 2.7 కోట్ల మంది యూజర్లు ఇందులో చేరారు. మెకిన్సే, ఐబీఎం సాయంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశాం. రోజూ యోనో వేదికగా రూ.70 కోట్ల రుణాలను మంజూరు చేస్తున్నాము’’ అంటూ రజనీష్ వివరించారు. సైబర్ భద్రత, మోసాల నివారణ విషయంలో కొన్ని స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. -
పేటీఎంకు రివర్స్ పంచ్ ఇచ్చిన ఫోన్‌పే
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ మారిటోరియం విధించి, ఒక్కో వినియోగదారుడు నెలకు రూ.50వేలు మాత్రమే ఉపసంహరించుకోవచ్చని ఆంక్షలు విధించింది. ఈ నిబంధన వల్ల ఆ బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాం ఫోన్‌పే ఇబ్బందుల్లో పడింది. ఆంక్షల నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకొని పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ ఫోన్‌ఫేను తన యూపీఐ ప్లాట్ఫామ్లోకి ఆహ్వానిస్తు.. తన సేవలను వినియోగించుకోవాలని, ఫోన్‌పే అవసరాలకు అనుగుణంగా తమ సేవలను విస్తరించగలమంటూ పేటీఎమ్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు దీటుగా ఫోన్‌పే బదులిస్తు మీరు చెబుతున్నట్టు మీ సేవల సామర్థ్యాన్ని విస్తరించడం సాధ్యమనుకుంటే ముందుగానే మీమ్మల్ని సంప్రదించే వాళ్లమని పేటీఎమ్‌కు గట్టి పంచ్ ఇచ్చింది. ఫార్మ్ అనేది శాశ్వతం కాదని..కానీ క్లాస్ అనేది ఎప్పటికి శాశ్వతం అని ఫోన్‌పేకు పేటీఎమ్ దీటుగా తమ వాదన వినిపించింది. Dear @PhonePe_ , Inviting you to @PaytmBank #UPI platform. It already has huge adoption and can seamlessly scale manifold to handle your business. Let’s get you back up, fast! — Paytm Payments Bank (@PaytmBank) March 6, 2020 Dear @PaytmBank Inviting you to consider that if your #UPI platform was so 'seamlessly scalable', we'd have called you ourselves. No point getting back up faster, if we have to desert our long term partners when they're down. Form is temporary, class is permanent. — PhonePe (@PhonePe_) March 6, 2020 -
ఏటీఎంలకు తాళం..!
ముంబై: పట్టణ ప్రాంతాల్లో ఖాతాదారులు బ్యాంకింగ్ లావాదేవీల కోసం డిజిటల్ విధానాలవైపు మళ్లుతుండటంతో ఏటీఎంలు, బ్యాంకు శాఖల అవసరం క్రమంగా తగ్గుతోంది. దీంతో పభ్రుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కూడా వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా వీటిని తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఏటీఎంలు, శాఖల ఏర్పాటు, నిర్వహణ భారం తడిసి మోపెడవుతుండటం ఇందుకు కారణం. గడిచిన ఏడాది కాలంలో టాప్ 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 5,500 ఏటీఎంలు, 600 పైచిలుకు శాఖలను మూసివేసినట్లు ఆయా బ్యాంకుల త్రైమాసిక ఆర్థిక ఫలితాల నివేదికల ద్వారా తెలుస్తోంది. ఓవైపు పెరిగిపోతున్న మొండిబాకీలు, మరోవైపు రుణ వృద్ధి లేకపోవడం వంటి అంశాలతో లాభాలు సాధించడానికి పీఎస్‌బీలు నానా తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా ఎస్బీఐ.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాŠంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్య కాలంలో 420 శాఖలు, 768 ఏటీఎంలను మూసివేసింది. ఇక విలీనమైన బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా, దేనా బ్యాంక్‌లు ఇదే వ్యవధిలో మొత్తం 40 శాఖలు, 274 ఏటీఎంలను మూసివేశాయి. ఇలా బ్రాంచీలను, ఏటీఎంలను తగ్గించుకున్న పీఎస్బీల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ మొదలైనవి కూడా ఉన్నాయి. పది బ్యాంకుల్లో తొమ్మిది బ్యాంకులు ఏటీఎంలను తగ్గించుకోగా, ఆరు బ్యాంకులు శాఖలను కూడా తగ్గించుకున్నాయి. ఈ వ్యవధిలో ఒక్క ఇండియన్ బ్యాంక్ మాత్రమే ఏటీఎంలు, శాఖల నెట్‌వర్క్‌ను పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా..నగరాల్లోనే...: మూసివేతల ధోరణి ఎక్కువగా నగరాల్లోనే కనిపిస్తోంది. పెద్ద పట్టణాలు, నగరాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్ విస్తృతంగా ఉండటం, ఖాతాదారులు కూడా డిజిటల్ లావాదేవీల నిర్వహణకు అలవాటు పడుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలు, శాఖల మూసివేత ఎక్కువగా మెట్రో నగరాల్లోనే ఉంటోందే తప్ప గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇలాంటి ధోరణులు లేవు‘ అని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ పల్లవ్ మహాపాత్ర తెలిపారు. ‘ఇది డిమాండ్‌పరమైన అంశం. తీవ్రమైన పోటీ ఉన్న మెట్రోల్లోనే అసంఖ్యాకంగా శాఖలు, ఏటీఎంలు ఎందుకు ఏర్పాటు చేయాలి. మెట్రో నగరాల్లో ఏదైనా ఏటీఎం వినియోగం చాలా తక్కువగా ఉంటే దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏం ఉంది‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇది లాభదాయకతతో ముడిపడి ఉన్న విషయంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ ఎన్ దామోదరన్ పేర్కొన్నారు. ‘ఏటీఎంలు, శాఖల మూసివేత అన్నది ఎక్కువగా వ్యాపారపరమైన లాభదాయకత అంశానికి సంబంధించినది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా శాఖలు, ఏటీఎంల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతుంది‘ అని ఇటీవల బ్యాంకు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన తెలిపారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది 36 శాఖలు, 1,269 ఏటీఎంలను మూసివేసింది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. క్రమంగా కస్టమర్లు డిజిటల్ మాధ్యమాల ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలకు అలవాటుపడే కొద్దీ ఏటీఎంలు, శాఖల అవసరం చాలా మటుకు తగ్గిపోతుందని ప్రభుత్వ రంగ బ్యాంకుకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొన్నాళ్లు పోతే గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారులు కూడా డిజిటల్ బాట పడితే.. ఆయా ప్రాంతాల్లో కూడా శాఖలు, ఏటీఎంలపరమైన వ్యయాలను బ్యాంకులు తగ్గించుకుంటాయని పేర్కొన్నారు. డిజిటల్ మాధ్యమంతో పోలిస్తే వీటిపై పెట్టుబడుల భారం భారీగా ఉంటోంది కాబట్టి ఖాతాదారుల బ్యాంకింగ్ అలవాట్లు మారే కొద్దీ .. ఇలాంటి మూసివేతలు సాధారణ ట్రెండ్‌గా మారే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రైవేట్ విస్తరణ.. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఏటీఎంలు, శాఖలను మూసివేస్తుండగా .. మరోవైపు ప్రైవేట్ బ్యాంకులు మాత్రం క్రమంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాయి. గత ఏడాది వ్యవధిలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజాలన్నీ తమ బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించాయి. అయితే, రిజర్వ్ బ్యాంక్ గణాంకాల చూస్తే ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రధాన నగరాల్లోనే ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే విషయంలో ఈ బ్యాంకుల ఏటీఎంలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ అయిదు ఏటీఎంలలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఏటీఎం ఒకటి ఉంటుండగా, ప్రైవేట్ రంగ బ్యాంకుల విషయం తీసుకుంటే ప్రతి పదింటిలో ఒకటి మాత్రమే ఉంటోంది. -
ప్రభుత్వ బ్యాంకుల్లో లక్షకు పైగా ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగవకాశాలు లభించనున్నాయి. అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సహా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లక్షలాదిమందిని నియమించుకోనున్నాయని తాజా రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా వెల్త్ మేనేజ్మెంట్, ఎనలిటిక్స్, స్ట్రాటజీ, డిజిటల్ బ్యాంకింగ్, కస్టమర్స్ సర్వీసెస్ విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని సమాచారం. టీమ్ లీజ్ అంచనాల ప్రకారం గత రెండేళ్లో చేపట్టిన నియమాకాల కంటే రెట్టింపు కన్నా ఎక్కువే. గత రెండు సంవత్సరాలలో బ్యాంకులు గుమస్తా, మేనేజ్మెంట్ ట్రైనీలు, ప్రొబేషనరీ ఆఫీసర్ల కేటగిరీలో దాదాపు 95వేల మందిని నియమించుకున్నాయి. మొండి బకాయిలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇపుడు అభివృద్ధిలో పోటీపడుతున్నాయి. ఆర్థిక సేవల నిర్వహణా తీరును, కల్చర్‌ను మార్చుకుంటున్నాయనీ, డిజిటల్ మార్కెటింగ్, మొండి బకాయిల వసూళ్లపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అంతేకాదు ప్రైవేటు/ బహుళజాతి బ్యాంకులకు ధీటుగా వీరికి వేతనాలను ఆఫర్ చేయనున్నాయని సిండికేట్ బ్యాంక్ సీఈవో మృత్యుంజయ్ మహాపాత్ర వ్యాఖ్యలను ఉటింకిస్తూ మీడియా రిపోర్టు చేసింది. ఈ నేపథ్యంలో సిండికేట్ బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరంలో 500మందిని నియమించుకోనుంది. -
పోస్టాఫీసు ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు
న్యూఢిల్లీ: పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాదారులు 34 కోట్ల మందికి త్వరలోనే డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఖాతాలను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ఏ ఇతర బ్యాంకు ఖాతాలకు అయినా నగదు బదిలీ చేసుకోవచ్చని తపాలా శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది మే నాటికి అనుసంధానించుకునే అవకాశాన్ని ఖాతా దారులకు కల్పిస్తామని చెప్పారు. ఖాతాదారులు ఆమోదం తెలియజేస్తేనే అనుసంధానించడం చేస్తామన్నారు. పోస్టాఫీసు 34 కోట్ల సేవింగ్స్ ఖాతాల్లో 17 కోట్ల ఖాతాలు మంత్లీ ఇన్కమ్ స్కీమ్, రికరింగ్ డిపాజిట్లకు సంబంధించినవి కాగా, మిగిలినవి రెగ్యులర్ ఖాతాలు. దేశవ్యాప్తంగా తపాలా శాఖకు 1.55 లక్షల బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిని పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో అనుసంధానించనుంది. ఖాతాలను పోస్ట్‌పేమెంట్స్ బ్యాంకుతో అనుసంధానించిన తర్వాత ఇతర బ్యాంకుల మాదిరే అన్ని నగదు బదిలీ సేవలు వినియోగించుకోవడం వీలవుతుందని తపాలా శాఖ వర్గాలు తెలిపాయి. తపాలా శాఖ లోగడ జారీ చేసిన ప్రకటన మేరకు, ఈ నెలాఖరు నాటికి పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించి 650 శాఖలు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. -
వడ్డీరేట్లు అరశాతం మించి తగ్గవు!
పెద్ద నోట్ల రద్దు వల్ల బ్యాంకులకు తక్కువ వడ్డీరేటుకు లభించే కాసా డిపాజిట్లు భారీగా పెరగడమే కాకుండా, ఇదే సమయంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు వేగం అందుకున్నాయంటోంది ప్రభుత్వరంగ విజయా బ్యాంక్. దేశీయ బ్యాంకింగ్ రంగం భారీగా పెరిగిన నిరర్థక ఆస్తులు, వాటికి అధికంగా నిధుల కేటాయింపులు వంటి సమస్యలతో సతమతవుతున్నప్పటికీ... ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండటంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్.ఏ శంకర్ నారాయణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పర్యటనకు వచ్చిన నారాయణ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు... వచ్చే నెలతో పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తవుతోంది. నోట్ల రద్దు వల్ల బ్యాంకులు ఎదుర్కొన్న కష్టాలు ముగిసినట్లేనా. ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారు? పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రారంభంలో ప్రజలు ఇబ్బందులు పడినప్పటికీ మొత్తం మీద బ్యాంకులకు మేలే జరిగిందని చెప్పొచ్చు. తక్కువ వడ్డీరేటు ఉండే కాసా (కరెంట్, సేవింగ్స్) డిపాజిట్లు భారీగా పెరిగాయి. సగటున ప్రతీ బ్యాంక్ కాసా డిపాజిట్లు 10 శాతం చొప్పున పెరిగాయి. పెద్ద నోట్ల రద్దుకు ముందు విజయా బ్యాంకు మొత్తం డిపాజట్లలో కాసా డిపాజిట్లు 19 శాతంగా ఉంటే నోట్లరద్దు తర్వాత అది 29 శాతానికి చేరింది. అలాగే డిజిటల్ లావాదేవీలు కూడా భారీగా పెరిగాయి. గతంలో చాలా తక్కువగా ఉండే డిజిటల్ లావాదేవీలు ఇప్పుడు 32 శాతానికి చేరుకున్నాయి. దక్షిణాది ప్రభుత్వరంగ బ్యాంకుల డిజిటల్ లావాదేవీల్లో మేము అగ్రస్థానంలో ఉన్నాం. డిమోనిటైజేషన్, జీఎస్టీవల్ల ఆర్థిక వ్యవస్థ మందగించిన తరుణంలో రుణాలకు డిమాండ్ ఏ విధంగా ఉంది? ఇప్పుడిప్పుడే కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పెరుగుతోంది. కానీ ఇదే సమయంలో రిటైల్ రుణాల్లో భారీ వృద్ధి నమోదవుతోంది. మా బ్యాంక్ విషయానికి వస్తే మొత్తం రుణాల్లో ఈ ఏడాది 15 శాతం వృద్ధికి అవకాశం ఉండగా, రిటైల్ రుణాల్లో మాత్రం 28–30 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా హౌసింగ్, రెంటల్, ఎడ్యుకేషన్, ఎంఎస్ఎంఈ రుణ పథకాలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇదే సమయంలో డిపాజిట్లలో కూడా 15 శాతం వృద్ధి నమోదు అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం రూ.2.28 లక్షల కోట్లుగా ఉన్న వ్యాపారం వచ్చే మార్చి నాటికి 2.55 లక్షల కోట్లకు చేరుతుందని భావిస్తున్నాం. పెరిగిన నిరర్థక ఆస్తులు, వాటికి నిధుల కేటాయింపులు వల్ల ప్రభుత్వరంగ బ్యాంకులు మూలధనం కోసం ఇబ్బందులు పడుతున్నాయి. ఈ తరుణంలో విజయా బ్యాంక్‌కు ఎంత మూలధనం అవసరం ఉంది? ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం నుంచి నిరర్ధక ఆస్తులు పెరగడం కొద్దిగా నెమ్మదించడం ఆశావహం. గడిచిన త్రైమాసికంతో పాటు వచ్చే త్రైమాసికాల్లో కూడా మా బ్యాంకు నిరర్ధక ఆస్తులు తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. అక్టోబర్ 26న ఫలితాలు ఉండటంతో వివరాలు పూర్తిగా చెప్పలేను. కానీ, ప్రస్తుతం మా బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 7 శాతం, నికర నిరర్థక ఆస్తులు 5 శాతం లోపు ఉన్నాయి. ఇతర ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉన్నాం. క్యాపిటల్ అడెక్వసీ రేషియో 13.5 శాతంగా ఉండటంతో అదనంగా ఎటువంటి మూలధనం అవసరం లేదు. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాల గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది? ఆ దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయా? వివిధ రకాల ప్రచారం జరుగుతున్నా... అధికారికంగా ఆ దిశగా ప్రభుత్వంలో కానీ, బ్యాంకుల మధ్య కానీ ఎటువంటి చర్చలు జరగడం లేదు. ఆర్థిక మూలాల పరంగా చూస్తే చిన్న బ్యాంకుల్లో మేము మొదటి స్థానంలో ఉండగా, పెద్ద బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా తర్వాత మూడోస్థానం మాదే. కాబట్టి విలీనాలకు సంబంధించి చర్చలు జరిపే స్థాయిలో ఉన్నాం. ఇప్పటికే వడ్డీరేట్లు కనిష్ట స్థాయికి చేరుకున్న తరుణంలో ఇవి ఇంకా దిగి వచ్చే అవకాశం ఉందా? ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో ఉండటంతో వడ్డీరేట్లు మరికాస్త తగ్గే అవకాశాలున్నాయి. వచ్చే పరపతి సమీక్షలో వడ్డీరేట్లు తగ్గుతాయో లేవో చెప్పలేం కానీ.. వచ్చే 12 నెలల కాలంలో మరో అరశాతం తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి ఎటువంటి ఆర్థిక సాయం చేద్దామనుకుంటున్నారు? రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాం. ఈ అంశం మీదే మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో చర్చలు జరిపాం. రాజధానిలో ఏర్పాటు చేయనున్న వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం రూ.5,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం – సాక్షి, అమరావతి -
బ్యాంకు ‘నెట్’లోకి వెళ్లాల్సిందే!
► ఇక బ్రాంచిలో జరిపే లావాదేవీలకు పరిమితులు ► నెలకు నాలుగైదు దాటితే ప్రతి లావాదేవీకి భారీ చార్జీలు ► డిజిటల్ బ్యాంకింగ్‌ను తప్పనిసరి చేస్తున్న బ్యాంకులు ► ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్‌లో నగదు బదిలీకి పలు మార్గాలు ► నెఫ్ట్ నుంచి యూపీఐ దాకా... అన్నిటికీ చార్జీలు; వాటి మధ్య తేడాలు రెండ్రోజుల కిందట హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఒక ప్రకటన చేసింది. ‘మీరు బ్యాంకు బ్రాంచికి వచ్చి గనక లావాదేవీలు జరిపితే... నెలకు నాలుగు మాత్రమే ఉచితం. అది దాటితే లావాదేవీకి రూ.150 చొప్పున వసూలు చేస్తాం’ అనేది దాని సారాంశం. అంటే బ్యాంకుకు నగదు డిపాజిట్ చెయ్యటానికి వెళ్లినా, విత్‌డ్రా చెయ్యటానికి వెళ్లినా... ఇవన్నీ లావాదేవీలే కనక నెలకు నాలుగు మాత్రమే ఉచితం. అది దాటితే బాదుడే. దీనర్థం ఒక్కటే. ‘‘మీరు బ్యాంకుకు రాకండి. కావాలంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో ఎన్ని లావాదేవీలైనా చేసుకోండి’’ అంతే. కేంద్ర ప్రభుత్వం మెల్లగా క్యాష్‌లెస్... అంటూ అందరినీ డిజిటల్ వైపు మళ్లిస్తోంది. దానికి అనుగుణంగా బ్యాంకులు బలవంతంగా అందరినీ డిజిటల్ వైపు నడిపించటానికి కంకణం కట్టుకున్నట్లున్నాయి. ఈ ప్రకటనను కూడా దాన్లో భాగంగానే భావించాలి. సరే! మరి ఇంటర్నెట్ బ్యాంకింగో, మొబైల్ బ్యాంకింగో చెయ్యాలంటే కావాల్సిందేంటి? అసలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఒక ఖాతా నుంచి వేరొకరి ఖాతాకు నగదు బదిలీ చేయటానికి ఏఏ పద్ధతులున్నాయి? ఇంకా ప్రభుత్వం తెచ్చిన భీమ్ యాప్ వంటివి ఎలా పనిచేస్తాయి? ఇలా బదిలీ చేసేటపుడు చార్జీలేమైనా వసూలు చేస్తారా? ఇవన్నీ తెలియజేసేదే ఈ ప్రత్యేక కథనం.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ చేయటానికి మొట్టమొదట కావాల్సింది నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్ వర్డ్. దీనికోసం మీ బ్యాంకు బ్రాంచిని సంప్రదిస్తే యూజర్ ఐడీ వారే ఇస్తారు. పాస్‌వర్డ్‌ను కొన్ని పోస్టల్లో పంపిస్తుండగా... మీ పుట్టినతేదీ, ఓటీపీ సాయంతో మీ పాస్‌వర్డ్‌ను మీరే ఏర్పాటు చేసుకునే సౌలభ్యాన్ని మరికొన్ని బ్యాంకులిస్తున్నాయి. దీనికోసం మీ మొబైల్ నంబర్‌ను మీ ఖాతాతో బ్యాంకు ద్వారా అనుసంధానం చేయటం మాత్రం తప్పనిసరి. మున్ముందు మీ ఆధార్‌ను బ్యాంకులో అనుసంధానం చేసి... మొబైల్, నెట్ బ్యాంకింగ్ ఏవీ లేకున్నా కూడా వేలిముద్ర సాయంతో చెల్లింపులు జరిపే అవకాశం కూడా రాబోతోంది. అయితే దీనికి ముందుగా మీ ఆధార్‌ను మీ బ్యాంకుతో అనుసంధానం చేయటం తప్పనిసరి. ఇక వేరొకరి ఖాతాలోకి ఆన్లైన్లో నగదు బదిలీ చేయటానికిపుడు రకరకాల పద్ధతులున్నాయి. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, యూపీఐ, భీమ్ యాప్ వంటివన్నీ నేరుగా బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీకి వీలు కల్పించేవే. కాకపోతే చార్జీల విషయంలో తేడాలతో పాటు దేని పరిమితులు దానికున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఐఎంపీఎస్ ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) అనేది వారంలో అన్ని రోజులూ, రోజులో 24 గంటలూ అందుబాటులో ఉండే విధానం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ దీన్ని 2010లో ఆవిష్కరించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ విధానంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ మాదిరిగానే ఇదీ. ఈ సౌకర్యానికి బ్యాంకు వద్ద పత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన పనిలేదు. నెట్ బ్యాంకింగ్‌లో నగదు బదిలీ చేసే చోటే ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఆప్షన్లు కనిపిస్తాయి. ఏది కావాలన్నది ఖాతాదారుడి ఇష్టం. లావాదేవీ ఇలా... ఐఎంపీఎస్ విధానంలో బెనిఫీషియరీకి నగ దు పంపించాలనుకుంటే సంబంధిత వ్యక్తి ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్ కోడ్, బ్యాంకు శాఖ వివరాలతో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ బ్యాంకింగ్‌కు మాత్రం ఈ ఇబ్బంది లేదు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఐఎంపీఎస్ విధానంలో నగదు పంపాలనుకుంటే బెనిఫీషియరీ నంబర్, మొబైల్ మనీ ఐడెంటిఫయర్ (ఎంఎంఐడీ) కోడ్ ఉంటే సరిపోతుంది. రూ.లక్ష వరకు లావాదేవీలపై రూ.5 చార్జీ ఉంటుంది. ఆపై రూ.2 లక్షల వరకు చార్జీ రూ.15 ఉంటుంది. దీనికి సర్వీస్ ట్యాక్స్ అదనం. ఈ చార్జీలు కూడా బ్యాంకులను బట్టి మారుతుంటాయి. ఈ విధానంలో గరిష్టంగా రూ.2 లక్షల వరకే నగదు బదిలీకి వీలుంటుంది. ఆర్టీజీఎస్ రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) అనేది అధిక విలువ గల లావాదేవీలకు ఉద్దేశించిన విధానం. కనీ సం రూ.2 లక్షలు ఆపైనే నగదు బదిలీ చేసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు. లావాదేవీ పూర్తయిన అరగంటలోపు బెనిఫిషియరీ ఖాతాకు జమ అయిపోతుంది. పనిదినాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 వరకు, శనివారాలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఆర్టీజీఎస్ విండో తెరిచి ఉంటుంది. ఈ సమయం తర్వాత చేసిన లావాదేవీ మరుసటి పని దినం ప్రారంభ సమయంలో పూర్తవుతుంది. మిగతా ప్రక్రియంతా ఎన్ఈఎఫ్టీ మాదిరే ఉంటుంది. లావాదేవీ చార్జీలు బ్యాంకులను బట్టి మారుతాయి. రూ. 2–5 లక్షల వరకు రూ.30, రూ.5 లక్షల పైన రూ.55 వరకు చార్జీ ఉంది. పరిమితులు లావాదేవీకి గాను నగదు పంపే వ్యక్తి, అందుకునే వ్యక్తి బ్యాంకు శాఖల్లో ఆర్టీజీఎస్ సదుపాయం ఉండాలి. ఆర్టీజీఎస్ సదుపాయం ఉన్న శాఖల వివరాలను ఆర్బీఐ వెబ్సైట్లో చూడొచ్చు. సెలవు రోజులు, ఆదివారాల్లో ఈ సదుపాయం ఉండదు. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) అనేది ఈ మధ్య అందుబాటులోకి వచ్చిన సరికొత్త విధానం. ఇప్పుడంతా స్మార్ట్ఫోన్ల యుగం కనకే దీన్ని తేవటం జరిగింది. స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ ఆధారిత బ్యాంకు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సులభంగా, సత్వరమే నగదు చెల్లింపులు, నగదు బదిలీ చేసుకోవచ్చు. ఏడాది పొడవునా, రోజులో అన్ని వేళలా ఈ విధానం పనిచేస్తుంది. బ్యాంకు పేరు, ఖాతాదారుడి పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఇలాంటి వివరాలేం అవసరం లేదు. యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక లాగిన్ అవ్వాలి. ఖాతా నంబర్ ఇవ్వడం ద్వారా వర్చువల్ పేమెంట్ అడ్రస్‌ను క్రియేట్ చేసుకోవాలి. వర్చువల్ పేమెంట్ అడ్రస్ అంటే ఉదాహరణకు టటజీఃటbజీ ఇలా. నగదు బదిలీ యూపీఐ ద్వారా నగదు బదిలీ చేయాలనుకుంటే యాప్‌ను ఓపెన్ చేశాక ఆరు అంకెల పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. తర్వాత యూపీఐ ఆప్షన్ ఎంచుకుని ‘పే టూ వర్చువల్ పేమెంట్ అడ్రస్’ను క్లిక్ చేయాలి. నగదు అందుకోవాల్సిన వ్యక్తి వర్చువల్ ఐడీ ఒక్కటి ఉంటే చాలు అర నిమిషం లోపే నగదు పంపించేయవచ్చు. బెనిఫీషియరీ వర్చువల్ ఐడీని ఎంటర్ చేసి, ఎంత మొత్తం పంపదలిచినదీ నమోదు చేయాలి. ఓకే చేసిన తర్వాత అవే వివరాలను మరోసారి ధ్రువీకరించటం ఆలస్యం... లావాదేవీ జరిగిపోతుంది. దుకాణదారుడికి నగదు చెల్లించాలన్నా, వ్యక్తులకు నగదు బదిలీ చేయాలన్నా ఇలానే. యూపీఐ యాప్ ద్వారా వ్యక్తుల మధ్య జరిగే నగదు బదిలీ సేవలపై చార్జీల్లేవు. దుకాణాల్లో చెల్లింపులపై మాత్రం రూ.15 వరకు చార్జీ ఉంటుంది. దీన్ని కూడా వ్యాపారే చెల్లించాలి. డీమోనిటైజేషన్ తర్వాత ఈ ఛార్జీల్ని కూడా రద్దు చేశారు. పరిమితులు యూపీఐ మార్గదర్శకాల ప్రకారమైతే రోజుకు రూ.లక్ష వరకు నగదు బదిలీ లేదా చెల్లింపుల పరిమితి ఉంది. కొన్ని బ్యాంకులు సొంతంగా పరిమితులు విధిస్తున్నాయి. ఎన్ఈఎఫ్టీ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. చాన్నాళ్లుగా అందుబాటులో ఉంది. డిఫర్డ్ సెటిల్మెంట్ విధానంలో పనిచేస్తుంది. అంటే లావాదేవీలు తక్షణమే పూర్తి కావు. బ్యాచ్‌ల వారీగా నిర్ణీత సమయానికి ఓసారి జరుగుతాయి. సోమవారం– శుక్రవారం మధ్య రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 సెటిల్మెంట్లు... శనివారం మాత్రం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆరు సెటిల్మెంట్లు జరుగుతాయి. నగదు బదిలీపై పరిమితి లేదు. కొన్ని బ్యాంకులు మాత్రం పరిమితులు విధించాయి. ఉదాహరణకు ఎస్బీఐ రిటైల్ బ్యాంకింగ్ ఖాతాదారులకు ఎన్ఈఎఫ్టీ గరిష్ఠ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది. లావాదేవీ జరిపేదిలా... నెట్ బ్యాంకింగ్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఉండాలి. మొబైల్ నంబర్‌ను బ్యాంకులో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. ఎవరికైతే నగదు పంపాలని అనుకుంటున్నామో సంబంధిత వ్యక్తి పేరు, ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ లేదా బ్యాంకు శాఖ పేరును ముందుగానే తెలుసుకుని ‘పేయీ’గా యాడ్ చేసుకోవాలి. పేయీ వివరాల్ని బ్యాంకు ధ్రువపరచి, యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేషన్‌కు ఎంత సమయం పడుతుందన్నది బ్యాంకును బట్టి మారుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు అయితే బెనిఫీషియరీని యాడ్ చేసిన అర గంటకు నగదు పంపుకునేందుకు అనుమతిస్తోంది. ఎస్బీఐ అయితే నాలుగు గంటలు. అదీ కూడా పని వేళల్లోనే ఈ సమయపాలన వర్తిస్తుంది. వివరాల్ని బ్యాంకు ధ్రువపరిచాక నెట్‌బ్యాంకింగ్‌లో లాగిన్ అయి... ట్రాన్స్ఫర్ ఫండ్స్ ఆప్షన్ ఎం చుకోవాలి. పేయీని ఓకే చేసి, ఎంత నగదు పంపాలంటే అంత పంపొచ్చు. మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తదుపరి సెటిల్మెంట్లో నగదు బెనిఫీషియరీ ఖాతాకు జమ అయిపోతుంది. లావాదేవీ చార్జీ రూ.2.50 నుంచి రూ.25 వరకు, అదనంగా సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. ప్రతికూలతలు నగదు బదిలీ సత్వరమే జరగదు. సెలవుదినాల్లో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయి. పనిదినం వరకు వేచి చూడాల్సిందే. యూఎస్ఎస్డీ 99# అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (యూఎస్ఎస్డీ) సాధారణ మొబైల్ ఫోన్ల సాయంతో నగదు బదిలీలకు వీలు కల్పించే సులభ విధానమిది. మొబైల్ కీప్యాడ్‌పై ూ99# డయల్ చేసి నగదు బదిలీ, నగదు నిల్వల సమాచారం, మినీ స్టేట్మెంట్ వంటి సేవలు ఏడాది పొడవునా రోజులో ఎప్పుడైనా పొందొచ్చు. జీఎస్ఎం ఫోన్ ఉండి, మొబైల్ నంబర్‌ను బ్యాంకులో నమోదు చేసుకుని ఉంటే చాలు. అలాగే, బ్యాంకు జారీ చేసే ఏడంకెల ఎంఎంఐడీ కోడ్ కూడా అవసరం. నగదు అందుకోవాలనుకునే వ్యక్తి ఐఎఫ్ఎస్సీ కోడ్, ఖాతా నంబర్ తెలుసుకోవాలి. లేదా ఆధార్ నంబర్ ఉన్నా సరిపోతుంది. యూఎస్ఎస్డీ ఇలా... మొబైల్ నుంచి 99# డయల్ చేయాలి. తర్వాత వచ్చే వెల్కమ్ స్క్రీన్‌లో బ్యాంకు పేరులోని మొదటి మూడు అక్షరాలు లేదా బ్యాంకు శాఖ ఐఎఫ్ఎస్సీ నంబర్లోని మొదటి నాలుగు అంకెలు నమోదు చేయాలి. ఆ తర్వాత సేవల చిట్టా కనిపిస్తుంది. ఖాతాలో నగదు బ్యాలన్స్ తెలుసుకునేందుకు (1), మినీ స్టేట్మెంట్ (2), ఎంఎంఐడీ, మొబైల్ నంబర్ ద్వారా నగదు బదిలీకి (3), ఐఎఫ్ఎస్సీ, ఖాతా నంబర్‌తో నగదు బదిలీకి(4), బెనిఫీషియరీ ఆధార్ నంబర్ సాయంతో నగదు బదిలీకి(5), ఎంఎంఐడీ తెలుసుకునేందుకు(6) ఇలా ఆప్షన్ ఎంపిక చేసుకుని సంబంధిత సేవలను పొందవచ్చు. చార్జీలు ఒక లావాదేవీకి గరిష్టంగా రూ.1.50 పరిమితిని ట్రాయ్ విధించింది. ఆపరేటర్‌ను బట్టి ఇది కొంచెం మారొచ్చు. ఇతరత్రా ఎటువంటి చార్జీల్లేవు. రోమింగ్‌లో ఈ సేవను వాడుకున్నా అదనపు చార్జీలు ఉండవు. పరిమితులు నెట్వర్క్ సిగ్నల్ అందుబాటులో ఉండాలి. రోజుకు రూ.5వేలకు మించి పంపేందుకు అవకాశం లేదు. భీమ్ యాప్ నేషనల్పేమెంట్స్ కార్పొరేషన్ ఆవిష్కరించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ను ఆధారం చేసుకుని భీమ్(భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ)యాప్ పనిచేస్తుంది. డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు ప్రభుత్వం డీమోనిటైజేషన్ తరవాత దీన్ని తీసుకొచ్చింది. మొబైల్ వాలెట్ మాదిరిగా పనిచేస్తుంది కానీ, వ్యాలెట్ కాదు. నేరుగా బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. ఈ యాప్ సాయంతో రెండు బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీలు, దుకాణాల్లో చెల్లింపులు చేసుకోవచ్చు. ఐఎఫ్ఎస్సీ కోడ్, ఎంఎంఐడీ కోడ్, క్యూఆర్ మార్గాల్లోనూ నగదు చెల్లింపులు చేయవచ్చు. మీ కంటూ క్యూఆర్ కోడ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. దుకాణంలో నగదు చెల్లించాలనుకున్నప్పుడు ఈ క్యూఆర్ కోడ్ చూపించినట్టయితే దాన్ని స్కాన్ చేసుకుంటారు. అనంతరం మీ ఖాతా నుంచి దుకాణదారుడి ఖాతాకు నగదు వెళ్లిపోతుంది. దాదాపు అన్ని బ్యాంకులు భీమ్ యాప్‌ను సపోర్ట్ చేస్తున్నాయి. యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాక ఫోన్ నంబర్ ఇవ్వడం ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ప్రక్రియ ముగిశాక నాలుగంకెల పాస్ కోడ్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఖాతా కలిగిన బ్యాంకును ఎంపిక చేసుకోవాలి. దాంతో యాప్ తనంతట తానే మొబైల్ నంబర్ ఆధారంగా ఖాతా వివరాలను సేకరిస్తుంది. అన్ని లావాదేవీలకు ప్రైమరీ ఖాతా ఏదన్నది పేర్కొనాలి. సెండ్, రిక్వెస్ట్, స్కాన్/పే అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఎవరికైనా నగదు పంపాలనుకుంటే వారి ఫోన్ నంబర్, నగదు మొత్తాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత ఎం–పిన్ ఇవ్వడం ఆలస్యం లావాదేవీ జరుగుతుంది. ఖాతాకు యూపీఐ యాక్టివేషన్ అయి ఉండకపోతే డెబిట్ కార్డు వివరాలను ఇవ్వడం ద్వారా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. యూపీఐ యాప్‌లో వర్చువల్ ఐడీ క్రియేట్ చేసుకుంటే అది ఇందులోనూ ఉపయోగపడుతుంది. చెల్లింపుదారుడికి యూపీఐ సదుపాయం లేకపోతే యాప్‌లో సెండ్ మనీ ఆప్షన్ పై భాగంలో మూడు డాట్లను ట్యాప్ చేస్తే అకౌంట్+ఐఎఫ్ఎస్సీ ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా నగదు పంపుకోవచ్చు. ప్రస్తుతానికైతే భీమ్ యాప్ ద్వారా చేసే లావాదేవీలపై చార్జీల్లేవు. అయితే, యూపీఐ, ఐఎంపీఎస్ లావాదేవీలపై బ్యాంకులు స్వల్ప చార్జీలు విధించొచ్చు. ప్రతికూలతలు ప్రస్తుతానికి ఈ యాప్‌లో ఒక మొబైల్ నంబర్‌పై ఒక్క ఖాతా అనుసంధానానికే వీలుంది. ఒకవేళ మీ నంబర్ రెండు ఖాతాలకు అనుసంధానమై ఉంటే ఒకదాన్ని యాప్‌లో డిసేబుల్ చేసుకోవాలి. రోజులో రూ.20వేల వరకే గరిష్టంగా నగదు బదిలీకి వీలుంది. ఒక లావాదేవీ విలువ గరిష్ట పరిమితి రూ.10వేలు మాత్రమే. ఏది అనుకూలం...? స్మార్ట్‌ఫోన్ ఉన్న వారికి యూపీఐ యాప్ ద్వారా నగదు బదిలీ చాలా సులభం. రోజులో, సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా లావాదేవీ చేసుకోవచ్చు. దుకాణాల్లోనూ చెల్లింపులను నేరుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లించొచ్చు. డెబిట్ కార్డులు అవసరం లేదు. చెల్లింపులకే మాత్రమే అనుకుంటే భీమ్ అనుకూలంగానే ఉంటుంది. వ్యాపార సంస్థలైతే పెద్ద మొత్తాల్లో నగదు బదిలీలకు ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ విధానాలు అనుకూలం. -
కేంద్రాన్ని తిడితే నష్టపోతాం
‘ఏపీ పర్స్’ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, అమరావతి: ఇతర ప్రత్యామ్నాయాలు లేకుండా అత్యధిక శాతం చలామణిలో ఉన్న నగదును ఉపసంహరించడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అలా అని కేంద్రాన్ని తిడుతూ కూర్చుంటే మనమే ఎక్కువ నష్టపోతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అందుకే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. చిన్న నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.2,000 నోట్లను అత్యధికంగా సరఫరా చేస్తుండటం వల్ల సమస్య మరింత జఠిలంగా మారిందన్నారు. మంగళవారం రాత్రి విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ‘ఏపీ పర్స్’ మొబైల్ యాప్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలంటే వ్యవస్థలో పూర్తిగా నగదు చలామణి లేకుండా చేయడం కాదని, సాధ్యమైనంత వరకు తగ్గించడమే దీని ఉద్దేశమన్నారు. జేబులో మొబైల్ ఫోన్, కార్డుతో పాటు తక్కువ మొత్తంలో నగదు ఉంటే చాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు 16 శాతానికి చేరాయని, ఇవి మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. -
ఇకపై నగదు రహిత లావాదేవీలు
- బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు - పింఛన్లు సహా లావాదేవీలన్నీ కార్డుల ద్వారానే - రాబోయే రోజుల్లో మొబైల్ బ్యాంకింగ్‌కు మళ్లాలి సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దీనికోసం విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, నరేగా సూపర్వైజర్లను వినియోగించుకోవాలన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలను పెంచేందుకు ఆర్బీఐకి, కేంద్రానికి ఐదు సూచనలతో లేఖ రాయనున్నట్లు తెలిపారు. స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ (ఎస్ఎల్బీసీ)తో సోమవారం సీఎం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ బ్యాంకు అధికారుల నుంచి వాస్తవ సమాచారం రావడం లేదన్నారు. ఆన్లైన్, కార్డులపై వసూలు చేస్తున్న సర్వీసు చార్జీలను డిసెంబర్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకులే చార్జీలు తగ్గించాలన్నారు. ఫిజికల్ కరెన్సీ కంటే డిజిటల్ కరెన్సీ వినియోగంపై చార్జీలు తక్కువ ఉండాలని, ఇందుకు అనుగుణంగా బ్యాంకులు, సర్వీసు ప్రొవైడర్లు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే నెల నుంచి ఖాతాల్లోనే పెన్షన్లు వచ్చే నెల నుంచి వృద్ధాప్య, వింతతు పెన్షన్లను నేరుగా బ్యాంకు ఖాతాలకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందరికీ రూపే కార్డులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. త్వరలో రైతుబజార్లు, పెట్రోల్‌బంకులు, సినిమాహాళ్లు వంటి వాటిల్లో కూడా కార్డుల ద్వారానే లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి మరింత నగదు వస్తుందన్న నమ్మకం లేదని.. ఇదే పరిస్థితి కొనసాగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోతారని సీఎం అన్నారు. మొబైల్ బ్యాంకింగ్‌వైపు మళ్లండి రాబోయే రోజుల్లో ప్రజలు మొబైల్ బ్యాంకింగ్‌వైపు మొగ్గుచూపాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పోలవరం కుడి కాలువ గట్టుపై ఏపీ జెన్కో నెలకొల్పిన ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.2 వేల నోటు వల్ల ప్రయోజనం లేదన్నారు. వ్యవసాయంవల్ల ఎక్కువ ఆదాయం రాదని, అందువల్ల అనుబంధ పరిశ్రమలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మద్యం దుకాణాల్లో స్వైప్ యంత్రాలు.. రాష్ట్రంలో మద్యం దుకాణాల్లోనూ స్వైప్ యంత్రాలను అందుబాటులో ఉంచుతామని బాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన ఆయన.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు ఇబ్బందులు ఎదుర్కొనేందుకు క్యాష్, రూపీ, మొబైల్ బ్యాంకింగ్ వంటి మూడు విధానాలను అమలు చేస్తున్నామన్నారు. డిసెంబర్ 10న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీటు పనులను ప్రారంభించనున్నామని చెప్పారు. కాగా, బ్యాంకుల పరిమితులు, ఏటీఎంలలో నగదు లేక జనం ఇబ్బంది పడుతుంటే.. పింఛన్లు సహా అన్ని లావాదేవీలు బ్యాంకుల ద్వారా నిర్వహిస్తామని సీఎం చెప్పడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
మార్చి నాటికి...100 డిజిటల్ గ్రామాలు
అభివృద్ధికి సహకారం... • ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డిజిటల్ బ్యాంకింగ్ సేవలను విస్తృతం చేసే దిశగా వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికల్లా 100 డిజిటల్ గ్రామాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణలో మూడింటితో పాటు దేశవ్యాప్తంగా 21 గ్రామాలను ఈ విధంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ తరహా గ్రామాల్లో ఉచిత వై-ఫై నెట్వర్క్ సదుపాయం, టెక్నాలజీ, బ్యాంకింగ్ సేవల తీరుతెన్నులపై గ్రామస్తుకు శిక్షణనివ్వడం తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆమె తెలిపారు. ఈ గ్రామాల్లో టెలిమెడిసిన్, విద్యా సంబంధ మెటీరియల్ సదుపాయాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నేత్ర పరీక్షల పరికరాలు, ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు తదితర అవసరాల కోసం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి ఎస్బీఐ రూ. 1.15 కోట్లు విరాళంగా అందించిన సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో అరుంధతీ భట్టాచార్య పాల్గొన్నారు. సాధారణంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యకలాపాలకు సంస్థలు లాభాల్లో 2 శాతం కేటాయించాల్సి ఉన్నప్పటికీ .. బ్యాంకింగ్ రంగంలో ఒత్తిళ్ల నేపథ్యంలో తమ బ్యాంకు 1 శాతానికే పరిమితం అయ్యిందని అరుంధతీ భట్టాచార్య చెప్పారు. దీన్ని క్రమంగా రెండు శాతానికి పెంచుతామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సీఎస్ఆర్ కింద రూ. 144 కోట్లు వెచ్చించినట్లు అరుంధతీ భట్టాచార్య తెలిపారు. అనుబంధ బ్యాంక్‌ల విలీనంపై అడిగిన ప్రశ్నకు స్పందించడానికి నిరాకరించారు. మరోవైపు కంప్యూటర్ అక్షరాస్యతపై అవగాహన పెంచే దిశగా ఐటీ సంస్థ ఒరాకిల్‌తో కలసి ‘టీ-చేంజ్’ కార్యక్రమం కింద స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. పైలట్ ప్రాతిపదికన ఆగస్టు 6న తొలుత హైదరాబాద్, బెంగళూరులో వీటిని ప్రారంభిస్తున్నట్లు.. అటుపైన వీటి సంఖ్యను దేశవ్యాప్తంగా వందకు పెంచుకోనున్నట్లు అరుంధతీ భట్టాచార్య వివరించారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి చైర్మన్ గుళ్లపల్లి ఎన్ రావు, ఎస్బీఐ సీజీఎం హరిదయాళ్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పేమెంట్ బ్యాంకులతో...మీకేంటి లాభం?
గ్రామీణులకూ అందనున్న డిజిటల్ బ్యాంకింగ్ జీరో బ్యాలెన్స్ ఖాతాలు నిర్వహించుకునే వెసులుబాటు నిర్వాహకులైన కార్పొరేట్ల నుంచి రాయితీలొచ్చే అవకాశం ప్రభుత్వ బ్యాంకుల కాసా డిపాజిట్లపై మాత్రం ఒత్తిడి!! పేమెంట్ బ్యాంకులు వచ్చేస్తున్నాయి. చెల్లింపు బ్యాంకులు ఆరంభం కాబోతున్నాయి. కార్పొరేట్లన్నీ బ్యాంకర్ల అవతారం ఎత్తబోతున్నాయి. ఇదీ తాజా ట్రెండ్. సరే! మరి మనకేంటి? బ్యాంకింగ్ కోసమైతే మనకిపుడు బ్యాంకులన్నీ అందుబాటులోనే ఉన్నాయిగా...? మరి ఈ కొత్త బ్యాంకులు రావటం వల్ల మనకు లాభమా? మున్ముందు ఒరిగేదేంటి? జరిగేదేంటి? సామాన్యుల్ని తొలుస్తున్న ఈ ప్రశ్నల విశ్లేషణే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం.. - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం పేమెంట్ బ్యాంకులు మనకు ఇప్పటిదాకా పరిచయం లేవు. వివిధ రకాల చెల్లింపులకు ఉపయోగపడే ఈ తరహా 11 బ్యాంకులకు ఇటీవలే ఆర్బీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ అనుమతులు పొందిన వాటిలో పోస్టాఫీసును మినహాయిస్తే మిగి లినవన్నీ భారీ కార్పొరేట్ సంస్థలే. నిజానికి 1990లలో ప్రైవేటు బ్యాంకులకు అనుమతి మం జూరు చేశాక ఇప్పటిదాకా బ్యాంకింగ్‌లో ప్రభుత్వ పరంగా కీలక సంస్కరణలైతే ఏమీ లేవు. కానీ ఇపుడు ఏకంగా 11 సంస్థలకు పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేయడానికి అనుమతివ్వటంతో పాటు త్వరలో చిన్నస్థాయి బ్యాంకులకు కూడా అనుమతి ఇవ్వనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ పేమెంట్ బ్యాంకులతో గ్రామీణులకూ బ్యాంకింగ్ కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయని కొందరు భావిస్తుండగా... అసలు దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థకే ముప్పు వస్తుందని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రుణాలు తప్ప అన్నీ చేస్తాయి... పేరుకు ఇవి చెల్లింపుల బ్యాంకులే. కానీ రుణాలివ్వడం మినహా బ్యాంకులు చేసే అన్నిపనులూ చేస్తాయి. వీటిద్వారా అన్ని బిల్లులూ చెల్లించొచ్చు. ఇవి రూ.లక్ష లోపు విలువైన డిపాజిట్లు స్వీకరించటంతో పాటు డెబిట్/ఏటీఎం కార్డులు, చెక్బుక్లనూ జారీ చేస్తాయి. కాకపోతే ఈ డిపాజిట్లపై సేవింగ్ ఖాతాపై ఎంత వడ్డీ ఇస్తాయో అదే ఇవ్వాలి. చాలా బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుండగా పేమెంట్ బ్యాంకులు దీన్ని పెంచే అవకాశం ఉంది. కరెంటు, టెలిఫోన్, మున్సిపాల్టీ, క్రెడిట్‌కార్డు వంటి ఇతర బిల్లులతో పాటు, బీమా, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే సదుపాయాన్నీ ఇవి కల్పిస్తాయి. పూర్తిగా మొబైల్ టెక్నాలజీపై ఆధారపడి ఇవి పనిచేస్తాయి. ఇప్పటికే ‘మనీ’ పేరుతో ఎయిర్టెల్, ‘ఎం-పెసా’ పేరుతో వొడాఫోన్ మొబైల్ మనీ వ్యాలెట్ సర్వీసులు అందిస్తున్నాయి. కొత్త పేమెంట్ బ్యాంకులూ ఇలాంటివే. కాకపోతే వీటిద్వారా ఇప్పటిదాకా చెల్లింపులు మాత్రమే చేయగలిగేవాళ్లు. ఇప్పుడు ఈ రెండు సంస్థలకు పేమెంట్ బ్యాంక్ లెసైన్స్ రావడంతో ఏటీఎంలు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి కార్డుల జారీ, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నగదు బదిలీ వంటివి కూడా నిర్వహించే వెసులుబాటు కలుగుతుంది. ఈ పేమెంట్ బ్యాంకులు ఫారెక్స్, ట్రావెలర్స్, గిఫ్ట్ కార్డులను కూడా జారీ చేయొచ్చు. ముఖ్యంగా చిన్న వ్యాపారస్తుల చెల్లింపులకు ఇవి బాగా ఉపయోగపడతాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బ్యాంకులూ ఇవే చేస్తున్నాయి కదా? ఇప్పుడు చాలా బ్యాంకులు ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా బిల్లు చెల్లింపుల దగ్గర నుంచి నగదు బదిలీ వరకు అన్ని సేవలనూ అందిస్తున్నపుడు ఈ కొత్త పేమెంట్ బ్యాంకుల వల్ల లాభం ఏంటన్నది చాలా మందిలో మెదిలే ప్రశ్న. ఇది వాస్తవమే అయినా... ఈ లావాదేవీలు సామాన్యులకు అందుబాటులో లేవని ఆర్బీఐ భావిస్తోంది. చాలా వాణిజ్య బ్యాంకుల్లో ఈ సేవలు పొందాలంటే మీ ఖాతాలో మూడు నెలల కనీస నిల్వ సగటున రూ. 25,000 వరకు ఉంచాల్సి ఉంటుంది. అదే ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ మినిమమ్ బ్యాలెన్స్ రూ.5,000 నుంచి రూ. 10,000 వరకు ఉంది. దీన్ని మెయింటెన్ చేస్తున్న వారికి మా త్రమే బ్యాంకులు అన్ని రకాల సేవలను అందిస్తున్నాయి. అదే పేమెంట్ బ్యాం కులు విషయానికొస్తే మినిమమ్ బ్యాలెన్స్ అనేదే ఉండదు. చెల్లింపులకు అవసరమైన నగదును వేసుకొని ఇంటి దగ్గర నుంచి మీ మొబైల్ ఫోన్ నుంచే లావాదేవీలు జరుపుకోవచ్చు. ఫోన్ ద్వారానే అన్ని లావాదేవీలు జరుపుకునే వెసులుబాటు ఉండటంతో గ్రామీణులు ఈ పేమెంట్ బ్యాంక్‌లను ఆదరిస్తారని ఆర్బీఐ భావన. ఆఫ్రికాలో కెన్యా వంటి చిన్న దేశంలో వొడాఫోన్ ప్రవేశపెట్టిన ‘ఎం-పెసా’కు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చక్కటి ఆదరణ లభించడమే పేమెంట్ బ్యాంకులకు ప్రేరణగా కనిపిస్తోంది. వ్యతిరేకత ఇందుకే...! బ్యాంకులు నమోదు చేస్తున్న లాభాల్లో కీలక పాత్ర చౌక వడ్డీరేటున్న కాసా (కరెంట్, సేవింగ్స్) డిపాజిట్లదే. చాలామంది ఖాతాదారులు నెలవారీ చెల్లింపుల కోసం సేవింగ్స్ ఖాతాల్లో భారీ మొత్తాన్ని ఉంచుతారు. కానీ ఇప్పుడు పేమెంట్ బ్యాంక్‌లు వస్తే కాసా డిపాజిట్లపై ఒత్తిడి పెరుగుతుందని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. అలాగే చాలా బ్యాంకులు, నగదు బదిలీ, బిల్లు చెల్లింపులపై ఫీజుల రూపంలో ఆదాయం పొందుతున్నాయి. ఇప్పుడు పేమెంట్ బ్యాంకులు వస్తే పోటీ పెరిగి ఇటువంటి ఇతర ఆదాయాలకు గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త బ్యాంకులివీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా నువో, వొడాఫోన్ ఎం-పెసా, ఎయిర్టెల్ ఎం కామర్స్ చోళమండలం డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, టెక్ మహీంద్రా, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీ ఎల్), ఫినో పేటెక్ సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఇవీ ప్రయోజనాలు ►గరిష్టంగా లక్ష రూపాయల డిపాజిట్లు స్వీకరించొచ్చు. ఈ డిపాజిట్లపై సేవింగ్స్ ఖాతా వడ్డీరేటును అందిస్తాయి. ► సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటు 4 శాతం నుంచి పెరిగే అవకాశం ఉంది. ► మొబైల్ ఫోన్ ద్వారానే ఇతర ఖాతాలకు నగదు సులభంగా బదిలీ చేసుకోవచ్చు ►ఖాతాల్లో ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. ►ఆఫీసులకు వెళ్లకుండానే ఆటోమేటిక్‌గా అన్ని రకాల బిల్లులను చెల్లించుకోవచ్చు. ►క్రెడిట్ కార్డులు తప్ప ఏటీఎం, డెబిట్, ఫారెక్స్, ట్రావెల్ కార్డులను జారీ చేస్తాయి ►ఈ బ్యాంకులన్నీ కార్పొరేట్ల చేతిలోనే ఉన్నాయి కనక వాటి ఉత్పత్తులపై రాయితీలిచ్చే అవకాశం