
యూపీఐ విభాగంలో పలు సేవలను అందించాలనే గూగుల్ ప్రణాళిక ఆదిలోనే నిలిచిపోయింది. గతంలో గూగుల్ పే యూజర్లకు ఫ్లెక్స్ సర్వీసులను అందించాలని గూగుల్ భావించింది. ఫ్లెక్స్ సర్వీసెస్ సహాయంతో గూగుల్ పే యాప్ ద్వారా డిజిటల్ బ్యాంక్ ఖాతాలను అందించే ప్రయత్నాలపై గూగుల్ వెనుకడుగు వేసింది. గూగుల్ పే ద్వారా యూజర్ నిర్వహించే వివిధ రకాల సంప్రదాయ బ్యాంకులు అందించే చెకింగ్ లేదా సేవింగ్స్ ఖాతాల కోసం సైన్ అప్ చేయడానికి ఫ్లెక్స్ సర్వీసెస్ ద్వారా వినియోగదారులకు అందించాలని గూగుల్ భావించింది.
చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్
బ్యాంకులకు నష్టమే..!
గూగుల్ ప్లెక్స్ సర్వీసులతో యూజర్లు బ్యాంకు సేవలనుంచి దృష్టిమరల్చే అవకాశం ఉంది. గూగుల్ తేస్తోన్న ప్లెక్స్ సర్వీసులు పలు బ్యాంకులతో ప్రత్యక్షపోటీలో ఉండే అవకాశం ఉంటుందని బ్యాంకింగ్ నిపుణులు భావిస్తున్నారు. యూజర్లకు నెలవారీ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ ఫీజులు లేకుండా, కనీస నిల్వలు లేకుండా ఖాతాలను అందించే అనేక రకాల ఆర్థిక సంస్థలతో భాగస్వామిగా ఉండటానికి ప్రణాళిక చేసింది. ఇది పలు బ్యాంకులకు నష్టాలను కల్గించే విధంగా ఉండొచ్చును.
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం...ఫ్లెక్స్ ప్రాజెక్ట్ తరుచూ వాయిదాలు పడటంతో, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కంపెనీ నుంచి వెళ్లి పోవడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిన్నట్లు తెలుస్తోంది. ఈ సేవలకోసం ఇప్పటికే 4 లక్షల మంది రిజిస్టర్ ఐనట్లు వాల్‌స్ట్రీట్ పేర్కొంది.
చదవండి: సడన్‌గా కాల్ డిస్‌కనెక్ట్ అవుతోందా..! ఇలా చేయండి..!
Comments
Please login to add a commentAdd a comment