ఆన్లైన్ పేమెంట్ యాప్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన 'గూగుల్ పే' (Google Pay) చాలా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే ఈ సర్వీస్ (గూగుల్ పే) జూన్ నాలుగు తరువాత నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్ గతంలోనే వెల్లడించింది.
ఇండియా, సింగపూర్ మినహా జూన్ 4 తరువాత గూగుల్ పే సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. దీని స్థానంలో గూగుల్ వాలెట్ వస్తుంది. అమెరికాలో గూగుల్ పే కంటే 'గూగుల్ వాలెట్' ఎక్కువమంది ఉపయోగిస్తున్న కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సేవలు భారత్, సింగపూర్ దేశాల్లో యధివిధాగా కొనసాగుతాయి. కాబట్టి గూగుల్ పే ఉపయోగించే భారతీయ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
2024 జూన్ 4 వరకు వినియోగదారులు గూగుల్ పే ఉపయోగించుకోవచ్చు, గడువు తీరిన తరువాత అమెరికన్ యూజర్లు అమౌంట్ సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికిగానీ అవకాశం లేదు. కాబట్టి యూఎస్ఏలోని గూగుల్ పే యూజర్స్ దీనిని తప్పకుండా గమనించాలి.
అమెరికాలోని గూగుల్ పే యూజర్లను గూగుల్ వాలెట్‌కి మారాలని కంపెనీ కోరింది. గూగుల్.. తన గూగుల్ వాలెట్‌ను చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'గూగుల్ పే'ను కంపెనీ సుమారు 180 దేశాల్లో గూగుల్ వాలెట్‌తో రీప్లేస్ చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment