యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ).. గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ బ్రౌజర్‌ను విక్రయించేలా దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌పై ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ వెల్లడిస్తూ.. గూగుల్ సెర్చింజన్ మార్కెట్‌పై చట్ట విరుద్ధంగా ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తోందని ఆగస్టులో ఒక న్యాయమూర్తి రూలింగ్ కూడా ఇచ్చారు. అదే జడ్జి ముందు డీఓజే ఈ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ఏఐ, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన చర్యలు తీసుకోవాలి ఇందులో పేర్కొన్నట్లు సమాచారం.
గూగుల్ క్రోమ్‌ను విక్రయించమని.. గూగిల్ ప్లే నుంచి ఆండ్రాయిడ్‌ను వేరు చేయమని అడగడంతో పాటు, ప్రకటనదారులతో మరింత డేటా.. సమాచారాన్ని భాగస్వామ్యం చేయమని న్యాయమూర్తి గూగుల్‌ను అడగవచ్చు. అయితే దీనిపైన డీఓజే వ్యాఖ్యానించలేదు.
గూగుల్ రెగ్యులేటరీ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ లీ అన్నే ముల్హోలాండ్ స్పందిస్తూ.. డీఓజే ఒక ర్యాడికల్ అజెండాను ముందుకు తెస్తోందని అన్నారు. ఇది వినియోగదారులకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.
ఈ విషయం మీద న్యాయమూర్తి చివరికి ఏమి తీర్పు ఇస్తారో చూడాల్సి ఉంది. గూగుల్ గుత్తాధిపత్యం నిజమే అని పరిగణలోకి తీర్పు ఇస్తే.. గూగుల్ తప్పకుండా క్రోమ్‌ను వదులుకోవాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు. యూఎస్ ఎన్నికల ప్రచార సమయం గూగుల్ ఏక పక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి: 30 నిమిషాల్లో.. ఢిల్లీ నుంచి అమెరికాకు: సాధ్యమే అంటున్న మస్క్
గూగుల్ కేసుకు సంబంధించిన తీర్పును అమెరికన్ కోర్టు వచ్చే ఏడాది ఇచ్చే అవకాశం ఉంది. అంతకంటే ముందే కంపెనీ.. క్రోమ్‌ను విక్రయించకుండా ఉండటానికి కావలసిన ఏర్పాట్లను చేసుకునే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి గూగుల్ క్రోమ్ ఈ సమస్య నుంచి బయటపడుతుందా? లేదా? అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment