టెక్ బిలియనీర్ 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే స్టార్‌షిప్ రాకెట్ రూపొందించారు. దీని ద్వారా ప్రపంచంలోని ప్రధాన నగరాలకు చేరుకోవడానికి గంట కంటే తక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు.
నవంబర్ 6న ఎక్స్ యూజర్ అలెక్స్ పోస్ట్ చేసిన వీడియోలో గమనిస్తే.. స్టార్‌షిప్ రాకెట్ ప్రయాణించడం చూడవచ్చు. ఇందులో భూమిపైనా ఎక్కడికైనా కేవలం గంటలోపే.. కొన్ని సంవత్సరాల్లోనే ఇది అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ.. ఇది సాధ్యమవుతుందని మస్క్ ట్వీట్ చేశారు.
సాధారణంగా ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ చేరుకోవడానికి సుమారు 16 గంటల సమయం పడుతుంది. అయితే స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ ద్వారా ఈ గమ్యాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చని వీడియోలో వెల్లడైంది.ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే ఇది రాబోయే రోజుల్లో వినియోగంలోకి కూడా వచ్చేస్తుంది.
ఇదీ చదవండి: మీటింగ్‌కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓ
స్పేస్ఎక్స్ రూపొందిస్తున్న స్టార్‌షిప్ రాకెట్ సాధారణ విమానం మాదిరిగా కాకుండా.. రాకెట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో ఒక్కసారికి 1,000 మంది ప్రయాణించవచ్చని చెబుతున్నాయి. ఇది పూర్తిగా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారై ఉంటుంది. అయితే డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత ఈ ప్రాజెక్టుకు కావలసిన అన్ని అనుమతులను మంజూరు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది వినియోగంలోకి వచ్చిన తరువాత విమానయాన సంస్థలు గట్టి పోటీ ఎదుర్కోవాలి ఉంటుంది.
This is now possible
— Elon Musk (@elonmusk) November 6, 2024
Comments
Please login to add a commentAdd a comment