సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదని.. దాదాపు ఉద్యోగులందరినీ సీఈఓ తొలగించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన మ్యూజిక్ కంపెనీలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఉదయం ఉద్యోగులందరీ సమావేశానికి హాజరుకావాలని కంపెనీ సీఈఓ వెల్లడించారు. కానీ ఈ సమావేశానికి 99 మంది హాజరుకాలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన సీఈఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరందరిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఆ కంపెనీలో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 110 మంది మాత్రమే. 99 మందిని తీసేస్తూ సీఈఓ నిర్ణయం వల్ల ఆ సంస్థలో 11 మంది మాత్రమే మిగిలారు.
ఉద్యోగులను తొలగించడం మాత్రమే కాకుండా.. కంపెనీకి సంబంధించిన వస్తువులు మీ దగ్గర ఏవైనా ఉంటే తిరిగి ఇచ్చేయండి. అన్ని అకౌంట్స్ నుంచి లాగ్ అవుట్ అవ్వండి అంటూ సీఈఓ పేర్కొన్నారు. సమావేశానికి హాజరుకాలేదనే కారణంతో జాబ్ నుంచి తొలగించిన సీఈఓపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని పూర్తి చేయడంలో నిమగ్నం కావడం వల్లనే, సమావేశానికి హాజరు కాలేదని ఉద్యోగులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: భర్తకు తెలియకుండా చేసిన పని.. బెంజ్ కంపెనీ బతికేలా చేసింది
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక్క సమావేశానికి హాజరు కాలేదని సుమారు 90 శాతం మందిని తొలగించడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మిగిలిన 11 మంది ఉద్యోగులను సీఈఓ పీల్చి పిప్పి చేస్తాడు అని అన్నారు. ఇంకొందరు.. ఇలాన్ మస్క్ నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment