ఓ చిన్న వెబ్‌సైట్ మీద గూగుల్ కంపెనీ చూపిన నిర్లక్ష్యం భారీ జరిమానా చెల్లించేలా చేసింది. 2006లో యూకేకు చెందిన శివన్, ఆడమ్ రాఫ్ అనే దంపతులు ప్రైస్ కంపారిజన్ వెబ్‌సైట్ 'ఫౌండమ్' ప్రారంభించారు. కానీ దీనిని వినియోగంలోకి తీసుకువచ్చిన తరువాత గూగుల్‌లో విజిబిలిటీ తగ్గడం మొదలైంది. ప్రజలు కీ వర్డ్ ఉపయోగించి సెర్చ్ చేసినప్పటికీ.. వెబ్‌సైట్ కనిపించకపోవడాన్ని ఫౌండర్స్ కనిపెట్టారు.
తమ వెబ్‌సైట్ గూగుల్‌కు చెందిన ఆటోమేటెడ్ స్పామ్ ఫిల్టర్స్ విధించిన పెనాల్టీ కారణంగా పడిపోతుండటం గమనించిన.. ఆ వ్యవస్థాపకులు గూగుల్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న గూగుల్ రెండేళ్ళైనా పెనాల్టీ తొలగించలేదు. ఇక చేసేదేమీ లేక ఆ దంపతులు యూరోపియన్ కమిషన్‌ను 2010లో సంప్రదించారు.
ఫౌండమ్ వ్యవస్థాపకులు ఫిర్యాదును కమిషన్ అధికారులు దర్యాప్తు చేసి.. గూగుల్ కంపెనీ తన షాపింగ్ సర్వీసును ప్రమోట్ చేసుకోవడానికే వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవరించి అన్యాయం చేసిందని గుర్తించింది. గూగుల్ చేసిన ఈ అన్యాయానికి 2.4 బిలియన్ ఫౌండ్స్ (సుమారు రూ. 26వేల కోట్లు) జరిమానా విధిస్తూ కమిషన్ 2017లో తీర్పునిచ్చింది.
ఇదీ చదవండి: డిజిటల్ కామ్‌డోమ్: ఇదెలా పనిచేస్తుందంటే..
యూరోపియన్ కమిషన్ తీర్పు ఇచ్చిన తరువాత గూగుల్ అప్పీల్‌కు వెళ్ళింది. సుమారు ఏడేళ్ల తరువాత కమిషన్ ఇచ్చిన తీర్పును 2024లో యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సమర్థించింది. తీర్పు చాలా ఆలస్యమైందని శివన్, ఆడమ్ రాఫ్ స్పందించారు. ఆలస్యమైనా.. పోరాటానికి ఫలితం దక్కిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment