సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ 'విజ్' (Wiz)ను కొనుగోలు చేయడానికి గూగుల్ 23 మిలియన్ డాలర్లు (రూ. 2 లక్షల కోట్లు) ఆఫర్ చేసింది. ఈ భారీ ఆఫర్‌ను విజ్ సున్నితంగా తిరస్కరించింది. ఈ ఆఫర్‌ను తిరస్కరించడానికి గల కారణాన్ని కంపెనీ కో ఫౌండర్ 'అసాఫ్ రాపాపోర్ట్' మెమోలో వెల్లడించారు.
గూగుల్ ఇచ్చిన ఈ భారీ ఆఫర్‌ను తిరస్కరించడం కష్టమే.. కానీ కంపెనీ ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం, యాన్యువల్ రికావరింగ్ రెవెన్యూలో 1 బిలియన్ డాలర్లను సాధించాలని విజ్ కో-ఫౌండర్ అసాఫ్ రాపాపోర్ట్ మెమోలో వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ డీల్ గురించి గూగుల్ కంపెనీగానీ, విజ్ గానీ అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.
విజ్ కంపెనీ ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆసియా, ఇజ్రాయెల్ దేశాల్లో 900 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా మోర్గాన్ స్టాన్లీ, డాక్యుసైన్‌తో సహా ప్రముఖ క్లయింట్‌లను కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. ఈ కంపెనీ ప్రస్తుతం ఫార్చ్యూన్ 100 కంపెనీలలో 40 శాతం వాటాను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment