
ఆన్లైన్ పేమెంట్ యాప్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన 'గూగుల్ పే' (Google Pay) చాలా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే 2024 జూన్ 4 నుంచి అమెరికాలో గూగుల్ పే సేవలు నిలిపివేసేందుకు గూగుల్ సిద్ధమవుతోంది.
అమెరికాలో ఎక్కువమంది గూగుల్ పే కంటే 'గూగుల్ వాలెట్' ఉపయోగిస్తున్న కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ వాలెట్ ద్వారా పేమెంట్ కార్డులను యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తరువాత షాపింగ్ లేదా ఇతరత్రా ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు ట్యాప్ అండ్ పే పద్దతిలో పని సులభంగా పూర్తయిపోతుంది.
కేవలం ఆన్లైన్ పేమెంట్ కోసం మాత్రమే కాకుండా.. ట్రాన్సిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ఐడీ కార్డ్స్ వంటి డాక్యుమెంట్ కూడా ఇందులో భద్రపరుచుకోవచ్చు. ఈ కారణంగానే అమెరికాలో గూగుల్ పే కంటే గూగుల్ వాలెట్ ఎక్కువ ఆదరణ పొందింది. గూగుల్ పేలో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా గూగుల్ వాలెట్‌లో లభిస్తాయి.
2024 జూన్ 4 వరకు వినియోగదారులు గూగుల్ పే ఉపయోగించుకోవచ్చు, గడువు తీరిన తరువాత అమెరికన్ యూజర్లు అమౌంట్ సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికిగానీ అవకాశం లేదు. కాబట్టి యూఎస్ఏలోని గూగుల్ పే యూజర్స్ దీనిని తప్పకుండా గమనించాలి.
ఇదీ చదవండి: జెరోధా సీఈఓపై మండిపడుతున్న నెటిజెన్స్!.. కారణం ఇదే..
ఇండియా, సింగపూర్ వంటి దేశాల్లో గూగుల్ పే యధావిధిగా సేవలను అందిస్తుంది. అంతే కాకుండా ఆయా దేశాల్లోని యూజర్లకు కావలసిన మరిన్ని సేవలను అందించడానికి సంస్థ ఈ యాప్‌ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. కాబట్టి ఇండియాలోని గూగుల్ పే యూజర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment