
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ అనుభవాన్ని పెంపొందించడానికి బ్యాంకింగ్ అప్లికేషన్ "యోనో"ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ యాప్‌ను ‘ఓన్లీ యోనో’గా మారుస్తున్నట్లు తెలిపింది. వచ్చే 12 నుంచి 18 నెలలో ఈ మెరుగుపరిచి యాప్‌ను పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా అమల్లోకి తేవాలని ఎస్‌బీఐ యోచిస్తుంది. అంతేకాక ప్రస్తుత ఎస్‌బీఐ యోనో కస్టమర్లను ఓన్లీ యోనోలోకి మార్చనుంది. ఎస్‌బీఐ యోనో 2021లో యాక్టివ్ యూజర్ల పరంగా 35 శాతానికి పైగా వృద్ధిని సాధించింది.
‘ఓన్లీ యోనో’ అనేది తదుపరి తరానికి చెందిన యాప్. ఇది పూర్తి డిజిటల్ బ్యాంకుగా రూపాంతరం చెందనుంది. ఇది పూర్తిగా పర్సనలైజ్డ్ కస్టమర్ సెంట్రిక్ డిజైన్‌లో వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా బ్యాంకులు కూడా డిజిటల్ లావాదేవీల కోసం ప్రత్యేకంగా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో నిర్దిష్ట కస్టమర్ సెగ్మెంట్‌కు తమ సేవలను అందిస్తున్నాయి. అంతకుముందు కంటే ఎక్కువ లక్ష్యంతో కస్టమర్లను చేరుకోనున్నాయి. ఫుల్ స్టాక్ డిజిటల్ బ్యాంకులకు సంబంధించి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి ప్రత్యేక లైసెన్సింగ్ విధానాలు లేవు. కానీ అవసరమైతే అలాంటి ప్రతిపాదనలకు చేసే అవకాశం ఉంది, అందుకని బ్యాంకులు దానికి సిద్ధమై ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 2017లో యోనోను ఎస్‌బీఐ లాంచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment