YONO
-
SBI YONO: నిలిచిపోయిన ఎస్బీఐ యోనో సేవలు
భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI)కు చెందిన యోనో (YONO) యాప్ సేవలు బుధవారం కొద్దిసేపు నిలిచిపోయాయి. జనవరి 10న ఉదయం 10:30 గంటల వరకు యోనో యాప్ సేవలు అందుబాటులో ఉండవని ఎస్బీఐ స్వయంగా కస్టమర్లకు తెలియజేసింది. ఈ మేరకు ఎస్బీఐ ‘ఎక్స్’ (ట్విటర్)లో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఓ పోస్టు చేసింది. "సాంకేతిక సమస్యల కారణంగా, యోనో సేవలు 2024 జనవరి 10న ఉదయం 10:30 గంటల వరకు అందుబాటులో ఉండవు. ఈ సమయంలో యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి మా ఇతర డిజిటల్ ఛానెల్‌లు అందుబాటులో ఉంటాయి" అని ఎస్బీఐ పేర్కొంది. కాగా బుధవారం ఉదయం 10.30 గంటల తర్వాత ఎస్బీఐ యోనో యాప్ సేవలు తిరిగి పునరుద్ధరించినట్లుగా తెలిసింది. pic.twitter.com/zKuerGTPo6 — State Bank of India (@TheOfficialSBI) January 10, 2024 -
ఎన్ఆర్ఐలకు ఎస్బీఐ గుడ్ న్యూస్: యోనో యాప్‌తో ఈజీగా
NRIs SBI YONO app: దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది. యోనో యాప్‌ద్వారా నాన్-రెసిడెంట్ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ), నాన్-రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ)లు సేవింగ్స్, కరెంట్ ఖాతాలు రెండూ సులభంగా తెరవడానికి డిజిటల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు కొత్త ఖాతాదారులకు ఉద్దేశించిందని ఎస్బీఐ ప్రకటించింది. ఈ సదుపాయం భారతదేశంలో ఖాతాలను తెరవడానికి, నిర్వహించడానికి సులభమైన విధానాన్ని కోరుకునే ఎన్ఆర్ఐ క్లయింట్ల నుంచి దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిష్కరిస్తుంది. (వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు) తాజా అప్డేట్ ప్రకారం ఎన్ఆర్ఐలు భారతదేశంలోని సంబంధిత బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండానే తమ ఇళ్లలో కూర్చొని తమ ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ ఖాతాలను తెరవచ్చు. దీంతో అకౌంట్ ను ఓపెనింగ్ ప్రక్రియ ఎన్ఆర్ఐ కస్టమర్లకు వేగం మరింత సులభతరమవుతుంది. అలాగే డిజిటల్ సేవల ద్వారా లావాదేవీలు మరింత ఈజీ కానున్నాయని డిఎండి & హెడ్ (డిజిటల్ బ్యాంకింగ్ & ట్రాన్స్ఫర్మేషన్) నితిన్ చుగ్ తెలిపారు.అంతేకాదు మూడే మూడు స్టెప్స్‌లో ఖాతాను తెరిచే ప్రక్రియను పూర్తి చేయవచ్చు కూడా. (భారీ తగ్గింపు: రూ. 48,900లకే ఐఫోన్ 15 దక్కించుకునే చాన్స్) ముచ్చటగా మూడు స్టెప్స్ ►యోనో ఎస్బీఐ బ్యాంకింగ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. ►హోమ్‌పేజీలో ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ ఖాతాతెరిచే ఆప్షన్ ఎంచుకోవాలి ► ఇది పూర్తి అయిన తరువాత కేవైసీ వివరాలను సబ్మిట్ చేయాలి. ఇండియాలోతాము ఖాతా ఓపెన్ చేయాలనుకుంటున్న ఎస్బీఐ బ్రాంచ్‌కు కేవైసీ డాక్యుమెంట్స్‌ను అందించవచ్చు. లేదా కేవైసీ డాక్యుమెంట్స్‌ను నోటరీ, హై కమీషన్, ఎస్బీఐ ఫారిన్ ఆఫీస్, ఇండియన్ ఎంబసీ, రిప్రజెంటేటివ్ ఆఫీస్, కోర్ట్ మేజిస్ట్రేట్ లేదా జడ్జితో అటెస్ట్ చేసి తదుపరి ప్రాసెసింగ్ కోసం సంబంధిత బ్రాంచ్‌కి మెయిల్ చేయాలి. అలాగే కస్టమర్లు తమ అప్లికేషన్ స్టేటస్‌ను కూడా ట్రాక్ చేయవచ్చు. -
‘ఎస్బీఐ యోనో’ ఇక అందరిది.. ఆ యూపీఐ యాప్‌లకు గట్టిపోటీ!
SBI YONO App: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ యోనో మొబైల్ యాప్ సేవలను మరింత విస్తృతం చేసింది. ఇకపై ఈ యాప్‌ను ఎస్బీఐ కస్టమర్లు మాత్రమే కాకుండా ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఎస్బీఐ అకౌంట్ లేని వారు కూడా ఎస్బీఐ యోనో మొబైల్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని స్టేట్ బ్యాంక్ కల్పించింది. తమ డిజిటల్ బ్యాంకింగ్ యాప్ సేవలను ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ను ఎస్బీఐ తీసుకొచ్చినట్లు చెబుతోంది. ‘యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్’ చొరవ ద్వారా స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి యూపీఐ సేవలను ఏ బ్యాంక్ కస్టమర్ అయినా పొందవచ్చని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. యూపీఐ సేవలతో పాటు కార్డ్ లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సౌకర్యాన్ని కూడా ఎస్బీఐ కల్పించింది. ఐసీసీడబ్ల్యూ సౌకర్యం ఉన్న ఏటీఎంలలో ఏ బ్యాంక్ కస్టమర్ అయినా ఎస్బీఐ యోనో యాప్‌లోని ‘యూపీఐ క్యూఆర్ క్యాష్’ అనే ఆప్షన్ ద్వారా ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ అకౌంట్ లేనివారికి కూడా యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఎస్బీఐ యోనో యాప్.. ఇప్పుడున్న ఫేన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇతర బ్యాంక్ కస్టమర్లు యోనో యాప్‌ను ఉపయోగించండిలా.. ఎస్బీఐ యోన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ‘న్యూ టు ఎస్బీఐ’ను క్లిక్ చేసి ‘రిజిస్టర్ నౌ’పై నమోదు చేసుకోండి. మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను ధ్రువీకరించి యూపీఐ చెల్లింపులకు నమోదు చేసుకోండి యూపీఐ ఐడీని సృష్టించడానికి మీ బ్యాంక్‌ని ఎంచుకోండి ఎస్బీఐ పే కోసం రిజిస్ట్రేషన్‌ని నిర్ధారిస్తూ ఒక మెసేజ్ మీ మొబైల్‌కు వస్తుంది అందించిన ఆప్షన్ల నుంచి ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా ఎస్బీఐ యూపీఐ హ్యాండిల్‌ను సృష్టించండి లాగిన్ చేయడానికి, చెల్లింపులు చేయడానికి ఆరు అంకెల శాశ్వత ఎంపిన్‌ను సెట్ చేసుకోండి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం, కాంటాక్ట్స్‌కు డబ్బు పంపడం, ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేసుకోవడం వంటివి ప్రారంభించండి ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. కార్డ్ లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు -
ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. చేతిలో ఫోనుంటే చాలు
దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వినియోగదారుల కార్యకలాపాల్ని మరింత సులభతరం చేసేందుకు యోనో యాప్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. తాజాగా యోనో యాప్‌లో యూపీఐ కార్యకలాపాలు నిర్వహించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో కస్టమర్లు స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. అంతేకాదు చేతిలో ఏటీఎం కార్డ్ లేకుండా యోనో యాప్‌లో క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ 68వ వార్షికోత్సవం సందర్భంగా తాజాగా ఈ అప్డేట్లు చేసింది. ఇతర బ్యాంకుల కస్టమర్లు కూడా యోనో యాప్ ద్వారా సేవలు పొందొచ్చు. ఎస్బీఐ ఇంటర్ ఆపరేబుల్ కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. ఈ కొత్త క్యాష్ విత్ డ్రాయల్ సర్వీసుల ద్వారా ఇతర బ్యాంకుల కస్టమర్లు సైతం బెనిఫిట్ పొందవచ్చు. వీటితో పాటు ట్రాన్సాక్షన్లు, షాపింగ్‌లు ఇతర చెల్లింపులు సైతం ఈ యోనో యాప్‌లో చేసుకునే వెసలు బాటు కల్పిస్తున్నట్లు ఎస్బీఐ అధికారికంగా ప్రకటించింది. మరి యూపీఐ వినియోగంతో ఎంత సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి : ‘జీవితాంతం రుణ పడి ఉంటా’.. ఆనంద్ మహీంద్రా భావోద్వేగం! -
ఎస్బీఐ అకౌంట్ బ్రాంచ్ మార్చుకోవాలా? ఇదిగో ఇలా సింపుల్‌గా
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో మీకు అకౌంట్ ఉందా. ఎస్బీఐ ఖాతాను ఒక శాఖ నుండి మరొక శాఖకు బదిలీ చేయాలనుకుంటున్నారా? బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేకుండానే డిజిటల్‌గా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. వివరాలు ఇలా.. ముఖ్యంగా ఎస్బీఐలో ఖాతాదారు ఫోన్ నంబరు రిజిస్టర్ అయి ఉండాలి. YONO యాప్ లేదా YONO Lite ద్వారా కూడా బ్రాంచ్ని మార్చుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఎస్బీ బ్యాంక్ ఖాతా ఒక శాఖ నుండి మరొక శాఖకు ఎలా బదిలీ చేయాలి. ఎస్బీఐ అధికారిక పెర్సనల్ బ్యాంకింగ్ వెబ్యాంకింగ్ విభాగంలోకి వెళ్లి యూజర్ నేమ్, పాస్వర్డ్ నమోదు చేయాలి. తర్వాత ఈ-సర్వీస్ కేటగిరీని ఎంచుకోవాలి. అందులో ట్రాన్స్ఫర్ సేవింగ్స్ అకౌంట్‌పై ఆప్షన్‌పై క్లిక్ చేసి మీరు మార్చుకోవాలనుకుంటున్న బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎంటర్ చేయాలి. అన్ని వివరాలు నమోదు చేశాక రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కొద్దిరోజుల్లో మీ అకౌంట్ సంబంధిత శాఖకు బదిలీ అవుతుంది. యోనో యాప్‌లో కూడా దాదాపు ఇదే పద్దతిలో బ్రాంచ్‌ను మార్చుకోవచచ్చు. (Nokia C22: నోకియా సీ22 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర) ఎస్బీఐ యోనో యాప్ ద్వారా అయితే యోనో యాప్‌లో లాగిన్ అయ్యి 'సర్వీసెస్'ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ ‘ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి కొత్త బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్‌తో పాటు బదిలీ చేయాలనుకుంటున్న ఖాతావివరాలివ్వాలి. గెట్ బ్రాంచ్ నేమ్ క్లిక్ చేయాలి. కొత్త బ్రాంచ్ పేరు ఫ్లాష్ అవుతుంది. అది సరియైనది అని నిర్దారించుకున్నాక, సబ్మిట్ 'సమర్పించు' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. -
‘ప్రియమైన ఎస్బీఐ వినియోదారు డా! మీ ఖాతా బ్లాక్ అవుతుంది...
పార్వతీపురంటౌన్: భారతీయ స్టేట్ బ్యాంక్ వినియోదారులపై సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. ముఖ్యంగా ఎస్బీఐ యోనో యాప్ వాడుతున్న వారిని టార్గెట్ చేస్తున్నారని వినియోదారులు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన స్థానిక డీఎస్పీ కార్యాలయంలో స్టేట్ బ్యాంక్ మేనేజర్ రవిశంకర్‌తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోనో విషయంలో వచ్చే సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ‘ప్రియమైన ఎస్బీఐ వినియోదారు డా! మీ ఖాతా బ్లాక్ అవుతుంది. పాన్ నంబరును అప్డేట్ చేసుకోవడానికి ఈ కింద లింక్‌ను క్లిక్ చేయండి’ అంటూ మోసపూరిత సందేశాలను పంపుతూ ఎస్బీఐ వినియోగదారులను సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారని వాటిని నమ్మవద్దని స్పష్టం చేశారు. ఇటువంటి సందేశాలు, ఈమెయిల్స్‌కు స్పందించవద్దన్నారు. సైబర్ నేరగాళ్లు పంపే ఈ సందేశాల్లోని లింక్స్ ఓపెన్ చేస్తే ఖాతాలో డబ్బులు మాయమవుతాయని తెలిపారు. ఇటువంటి సందేశాలు వస్తే వెంటనే ’రిపోర్ట్.ిపిషింగ్ ఎట్ ఎస్బీఐ కో.ఇన్’లో రిపోర్ట్ చేయాలని ప్రజలకు సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఖాతానంబర్, పాస్వర్డ్, ఓటీపీ సహా ఇతర సున్నిత, వ్యక్తిగత సమాచారాన్ని మెసేజ్ రూపంలో పంపవద్దన్నారు. సైబర్ నేరగాళ్లు తమ లింక్స్ ద్వారా ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మోసం చేస్తారని, ఏదైనా సైబర్ నేరం గురించి నేరుగా ఫిర్యాదు చేయాలంటే 1930 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చని సూచించారు. -
పాన్ లింక్ చేయకపోతే ఎస్బీఐ యోనో అకౌంట్ బ్లాక్ అవుతుందా?
పాన్ నంబర్ అప్డేట్ చేయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) యోనో అకౌంట్లు బ్లాక్ అవుతాయని, వెంటనే అప్డేట్ చేసుకోవాలంటూ లింక్‌తో కూడిన మెసేజ్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని ఎస్బీఐ ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఇవి పూర్తిగా ఫేక్ అని తేల్చింది. ఒక వేళ అకౌంట్లను అప్డేట్ చేసుకోవాల్సి ఉన్నా ఎస్బీఐ అలాంటి లింక్‌లను పంపదని పేర్కొంది. ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలను సులభతరం చేయడానికి ఎస్బీఐ అనేక సౌకర్యాలను అందిస్తోంది. ఇందులో భాగంగా యోనో మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ వినియోగం ఇటీవల బాగా పెరిగింది. దీని ద్వారా కస్టమర్లు బ్యాంకుకు వెళ్లకుండానే మొబైల్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను చేసుకోవచ్చు. అయితే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ నంబర్లు, ఆధార్ నంబర్లు, పాన్ కార్డ్ నంబర్లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ నంబర్లు, ఓటీపీలు వంటి వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ షేర్ చేయకూడదని కస్టమర్లను బ్యాంక్ హెచ్చరించింది. సైబర్ నేరాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, వ్యక్తిగత సమాచార భద్రత గురించి ఎస్బీఐ కస్టమర్లను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది. మెసేజ్‌లు లేదా ఈ-మెయిల్ల ద్వారా పంపిన లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దని, తెలియని కాల్స్ లేదా మెసేజ్‌లకు స్పందించి ఎలాంటి వ్యక్తిగత వివరాలను షేర్ చేయకూడదని సూచించింది. తాజాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్‌ను నమ్మొద్దని, ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఖాతా వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. (ఇదీ చదవండి: అంబానీ సోదరి రూ.68 వేల కోట్ల కంపెనీకి అధిపతి.. ఈమె గురించి తెలుసా?) -
ఖాతాదారులకు భారీ షాక్, రుణాలపై స్పందించిన ఎస్బీఐ చైర్మన్ ఖారా!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల (అర శాతం) వరకూ పెంచింది. దీంతో రుణగ్రహీతలు నెలవారీగా చెల్లించే వాయిదాల (ఈఎంఐ) భారం మరింత పెరగనుంది. కొత్త రేట్లు ఆగస్టు 15 నుంచి వర్తిస్తాయని బ్యాంకు వెల్లడించింది. ఈ సందర్భంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ రిటైల్, కార్పొరేట్ లోన్లకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం మేర రుణ వృద్ధిని సాధించగలమని అంచనా వేస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో రుణాల వృద్ధి గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే రూ.25,23,793 కోట్ల నుంచి 14.93 శాతం పెరిగి రూ.29,00,636 కోట్లకు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో రిటైల్ రుణాలు సుమారు 19 శాతం, కార్పొరేట్ రుణాలు 11 శాతం మేర పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ రుణాలు రూ.2.5–3 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందని, చిన్న.. మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) నుంచి కూడా రుణాలకు డిమాండ్ నెలకొందని ఖరా వివరించారు. త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లతో యోనో 2.0 యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు విశ్లేషకులతో సమావేశంలో ఆయన తెలిపారు. యోనోలో ఇప్పటివరకూ నమోదు చేసుకున్న వారి సంఖ్య 5.25 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. కొత్త సేవింగ్స్ ఖాతాల్లో 65 శాతం అకౌంట్లను యోనో ద్వారానే తెరుస్తున్నట్లు ఖారా వివరించారు. ప్రభుత్వాలు భారీగా టీకాల కార్యక్రమం నిర్వహించడంతో కరోనా మహమ్మారి చాలా మటుకు అదుపులోకి వచ్చిందని..ఆంక్షల తొలగింపుతో ఎకానమీ మెరుగుపడుతోందని ఆయన చెప్పారు. చదవండి👉 ఎస్బీఐ:'హాయ్' చెప్పండి..వాట్సాప్‌లో బ్యాంక్ సేవల్ని పొందండి! -
దేశంలో స్తంభించిన ఎస్బీఐ సేవలు..
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం నుంచి యోనో యాప్, యూపీఐ సేవలు నిలిచిపోయాయి. ఆన్లైన్ బ్యాంకింగ్, ఫండ్ ట్రాన్స్ఫర్ విషయంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. ఏటీఎం సెంటర్లో కూడా నగదు ఉపసంహరణ జరగడం లేదని వాపోతున్నారు. ఎస్బీఐ బ్యాంక్ సేవలు పనిచేయకపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు సేవలు ఎప్పుడు పునరద్ధరిస్తామనేది కూడా ఎస్బీఐ అధికారులు చెప్పలేకపోతున్నారు. అంతేగాక నెలాఖరు కావడంతో జీతాలు పడే వేళ ఇలా బ్యాంక్ సేవలు స్తంభించడంపై ఎస్బీఐ శాలరీ అకౌంట్లు ఉన్న ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్!
ఎస్బీఐ తన ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. తమ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించే బ్యాంక్ సిస్టమ్‌ను అప్డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకునే వారికి మరిన్ని ఫీచర్లు జోడించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మార్చి 20న రాత్రి 11:30 గంటల నుంచి మార్చి 21 2:00 గంటల మధ్య కాలంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ టెక్నాలజీని అప్డేట్ చేస్తున్నట్లు ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో సిస్టమ్‌ను అప్డేట్ చేస్తోంది. ఈ కారణంగా రేపు రెండున్నర గంటలపాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్/యోనో/యోనో లైట్ సేవలు ఈ రెండున్నర గంటల పాటు అందుబాటులో ఉండవని ఎస్బీఐ తెలిపింది. ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఖాతాదారులు గుర్తించాలని ట్వీట్ చేశారు. మరి ఈ సమయాల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేవారు ముందుగానే జాగ్రత్త పడండి. We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience. pic.twitter.com/t1GGRRxWjx — State Bank of India (@TheOfficialSBI) March 20, 2022 (చదవండి: రూ.53 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓలా కంటే ఎక్కువ రేంజ్!) -
పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా ఎస్బీఐ యోనో యాప్..!
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ అనుభవాన్ని పెంపొందించడానికి బ్యాంకింగ్ అప్లికేషన్ "యోనో"ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ యాప్‌ను ‘ఓన్లీ యోనో’గా మారుస్తున్నట్లు తెలిపింది. వచ్చే 12 నుంచి 18 నెలలో ఈ మెరుగుపరిచి యాప్‌ను పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా అమల్లోకి తేవాలని ఎస్బీఐ యోచిస్తుంది. అంతేకాక ప్రస్తుత ఎస్బీఐ యోనో కస్టమర్లను ఓన్లీ యోనోలోకి మార్చనుంది. ఎస్బీఐ యోనో 2021లో యాక్టివ్ యూజర్ల పరంగా 35 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. ‘ఓన్లీ యోనో’ అనేది తదుపరి తరానికి చెందిన యాప్. ఇది పూర్తి డిజిటల్ బ్యాంకుగా రూపాంతరం చెందనుంది. ఇది పూర్తిగా పర్సనలైజ్డ్ కస్టమర్ సెంట్రిక్ డిజైన్‌లో వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా బ్యాంకులు కూడా డిజిటల్ లావాదేవీల కోసం ప్రత్యేకంగా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో నిర్దిష్ట కస్టమర్ సెగ్మెంట్‌కు తమ సేవలను అందిస్తున్నాయి. అంతకుముందు కంటే ఎక్కువ లక్ష్యంతో కస్టమర్లను చేరుకోనున్నాయి. ఫుల్ స్టాక్ డిజిటల్ బ్యాంకులకు సంబంధించి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి ప్రత్యేక లైసెన్సింగ్ విధానాలు లేవు. కానీ అవసరమైతే అలాంటి ప్రతిపాదనలకు చేసే అవకాశం ఉంది, అందుకని బ్యాంకులు దానికి సిద్ధమై ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 2017లో యోనోను ఎస్బీఐ లాంచ్ చేసింది. (చదవండి: ఆ రంగానికి కలిసొస్తున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం..!) -
రైతులకు ఎస్బీఐ తీపికబురు.. తక్కువ వడ్డీకే రుణాలు!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రైతులకు తీపికబురు అందించింది. రైతులకు తక్కువ వడ్డీకే అగ్రి గోల్డ్ రుణాలను అందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఆసక్తి గల వ్యక్తులు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణాన్ని పొందవచ్చు. ఈ వియాన్ని ఎస్బీఐ ట్విట్టర్లో వెల్లడించింది. ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణాల పేరుతో రైతులకు రుణాలను అందిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ 7 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. యోనో యాప్ ద్వారా అప్లై చేసే రుణాలు వేగంగా మంజూరవుతాయి. రీపేమెంట్ ఆప్షన్ కూడా రైతులు తమకు కావాల్సినట్టుగా ఎంచుకోవచ్చు. ఈ ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణం మాత్రం కేవలం బంగారు నగలపై మాత్రమే లభిస్తుంది. 24 క్యారట్, 22 క్యారట్, 20 క్యారట్, 18 క్యారట్ స్వచ్ఛత గల నగలు, ఆభరణాలపై రుణాలు తీసుకోవచ్చు. 50 గ్రాముల వరకు బ్యాంక్ గోల్డ్ కాయిన్స్ పైనా రుణాలు లభిస్తాయి. గోల్డ్ బార్స్ పై ఈ రుణాలు వర్తించవు. కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణాలు తీసుకోవచ్చు. డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, పిగ్గరీ, గొర్రెల పెంపకం లాంటి వాటికీ ఈ రుణాలు వర్తిస్తాయి. యంత్రాల కొనుగోలు, వ్యవసాయం, హార్టీకల్చర్, ట్రాన్స్‌పోర్టేషన్ లాంటి అవసరాలకు ఈ రుణాలను ఉపయోగించుకోవచ్చు. Avail SBI's Agri gold loan at lowest interest rate through YONO. #SBIAgriGoldLoan #SBI #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/jawDwSzWsH — State Bank of India (@TheOfficialSBI) December 21, 2021 (చదవండి: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. రూ.1.44 లక్షల కోట్లు రీఫండ్..!) -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ సేవలకు అంతరాయం!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిసెంబర్ 11, 12 తేదీల్లో 5 గంటలు పాటు ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. "మేము 11 డిసెంబర్ 2021న 23:30 గంటల నుంచి 12 డిసెంబర్ 04:30 గంటల(120 నిమిషాలు) మధ్య కాలంలో చేపట్టే మెయింటెనెన్స్ కారణంగా ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు పేర్కొంది. మీకు జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము" అని ఎస్బీఐ తెలిపింది. ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యాలను అంధించడం కోసం కృషి చేస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ సమయంలో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ సర్వీసులేవీ పని చేయవని పేర్కొంది. గత నెల నవంబర్ 27న అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ పెనాల్టీ విధించింది. నియంత్రణపరమైన నిబంధనలు పాటించనందుకు ఎస్బీఐకు రూ.కోటి జరిమానా విధించినట్లు ప్రకటించింది. We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience. pic.twitter.com/LZsuqO2B0D — State Bank of India (@TheOfficialSBI) December 10, 2021 (చదవండి: రూ.60 వేల కోట్లను దాటనున్న సాఫ్ట్వేర్ ఆదాయం!) -
ఎస్బీఐ ఆఫర్.. యోనో యాప్ ద్వారా రూ.3 లక్షల దాకా రుణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యోనో యాప్ ద్వారా ద్విచక్ర వాహనం కొనుగోలుకు రూ.3 లక్షల వరకు ముందుగా అనుమతించబడిన (ప్రీ–అప్రూవ్డ్) రుణం ఇవ్వనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. అర్హతగల వినియోగదార్లు బ్యాంక్ శాఖను సంప్రదించకుండానే యాప్ ద్వారా రుణం పొందవచ్చు. కనీస రుణ మొత్తం రూ.20,000. కాల పరిమితి గరిష్టంగా నాలుగేళ్లు. వడ్డీ సాలీనా 10.5 శాతం నుంచి ప్రారంభం. వాహనం ఆన్‌రోడ్ ధరపై 85 శాతం దాకా రుణం తీసుకోవచ్చు. రూ.1 లక్ష లోన్ తీసుకుంటే నెల వాయిదా సగటున రూ.2,560 చెల్లించాల్సి ఉంటుంది. -
ద్విచక్ర వాహనాలు కొనేవారికి ఎస్బీఐ తీపికబురు
SBI Easy Ride: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ద్విచక్ర వాహనాలు కొనేవారికి తీపికబురు అందించింది. ఎస్బీఐ యోనో ఫ్లాట్ ఫారం ద్వారా సులభంగా ద్విచక్ర వాహనా రుణాలను పొందవచ్చు అని తెలిపింది. ద్విచక్ర వాహనా రుణాల కోసం ఎస్బీఐ "ఈజీ రైడ్" పేరుతో మరో ఆప్షన్ తీసుకొనివచ్చింది. అర్హత కలిగిన ఎస్బీఐ కస్టమర్లు బ్యాంకు బ్రాంచీని సందర్శించకుండానే యోనో యాప్ ద్వారా క్షణాలలో ద్విచక్ర వాహన రుణాలను పొందవచ్చు అని తెలిపింది. "కస్టమర్లు గరిష్టంగా 4 సంవత్సరాల వరకు సంవత్సరానికి 10.5% వడ్డీరేటుతో రూ.3 లక్షల వరకు ఈజీ రైడ్ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస రుణ మొత్తాన్ని రూ.20,000గా నిర్ణయించారు' అని బ్యాంకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కస్టమర్ పొందిన రుణం నేరుగా డీలర్ ఖాతాలోకి జమ కానుంది. ఈ పథకం కింద వాహనం ఆన్-రోడ్ ధరలో 85% వరకు రుణాలను పొందవచ్చని ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీ ఛైర్మన్ దినేష్ ఖారా మాట్లాడుతూ.. 'ఎస్బీఐ ఈజీ రైడ్' రుణ పథకం మా కస్టమర్లకు అంతరాయం లేని అనుభవాన్ని అందిస్తుందని మేం ఆశిస్తున్నాం అని అన్నారు. (చదవండి: ఎలక్ట్రిక్ కారు రేసులోకి టొయోటా.. రేంజ్ కూడా అదుర్స్!) -
టాక్స్ పేయర్లకు ఎస్బీఐ గుడ్‌న్యూస్...!
పన్ను చెల్లింపుదారులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ గుడ్‌న్యూస్‌ను అందించింది. ఐటీఆర్ ఫైలింగ్ చేసే వారి కోసం ఎస్బీఐ సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. ఎస్బీఐ యోనో యాప్‌లోని ట్యాక్స్2విన్ ఆప్షన్‌ను ఉపయోగించి ఆదాయపు పన్ను దాఖలు చేసే సౌకర్యాన్ని ఎస్బీఐ తీసుకొచ్చింది. టాక్స్ పేయర్లకు ఇకపై ఎస్బీఐ ఖాతాదారులకు ఐటీఆర్ ఫైలింగ్ మరింత ఈజీ కానుంది. ఈ సదుపాయంతో టాక్స్ పేయర్స్ ఉచితంగానే ఆదాయపు పన్ను దాఖలు చేయవచ్చును. యోనో యాప్ ద్వారా ఐటీఆర్ దాఖలుకు కావలసిన పత్రాలు ఇవే...! 1. పాన్ కార్డ్ 2. ఆధార్ కార్డ్ 3. ఫారం-16 4. పన్ను మినహాయింపు వివరాలు 5. ఇంట్రస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు 6. ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్ ఫర్ టాక్స్ సేవింగ్ ఐటీఆర్ ఫైలింగ్ యోనో యాప్‌లో ఇలా చేయండి.. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎస్బీఐ యోనో యాప్‌లో లాగిన్ అవ్వాలి. తరువాత ‘షాప్స్ అండ్ ఆర్డర్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ‘ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్’ సెలక్ట్ చేయాలి. అక్కడ మీకు కనిపించే ‘ట్యాక్స్2విన్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ ఐటీఆర్‌కు సంబంధించిన సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది. ఆయా స్టెప్స్‌ను ఫాలో అవుతూ ఐటీఆర్ సులభంగా దాఖలు చేయొచ్చు. చదవండి: 11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? ఫేస్బుక్ డిలీట్ అంటూ కవర్ పేజీ -
SBI: మూడు గంటలపాటు డిజిటల్ సేవలకు అంతరాయం
తన ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 4, 5 తేదీల మధ్య మూడు గంటలపాటు అన్ని డిజిటల్ సర్వీసులకు విఘాతం కలగనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 4వ తేదీ(ఇవాళ రాత్రి) రాత్రి 10.35 నుంచి అర్ధరాత్రి దాటాక 1గం.30ని. వరకు డిజిటల్ సర్వీసులు పని చేయవని తెలిపింది ఎస్బీఐ. ఈ మూడు గంటలపాటు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ సర్వీసులేవీ పని చేయవని తెలిపింది. మెరుగైన సేవలు అందించడం కోసం చేసే మెయింటెనెన్స్ కారణంగానే అంతరాయం కలగనుందని, యూజర్లు ఇది గమనించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ ద్వారా విషయం వెల్లడించిన స్టేట్‌బ్యాంక్.. ఈ ఉదయం మరోసారి కస్టమర్లను అప్రమత్తం చేసింది. We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/GXu3UCTSCu — State Bank of India (@TheOfficialSBI) September 3, 2021 గత కొంతకాలంగా ఎస్బీఐ సర్వీసులపై ఖాతాదారుల్లో, డిజిటల్‌సేవలపై యూజర్లలో అసహనం నెలకొంటోంది. యోనో యాప్ సరిగా పని చేయకపోవడంతో ఫిర్యాదులతో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఖాతాదారులకు క్షమాపణలు చెబుతూనే.. యూజర్లకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రయత్నిస్తున్నామని, ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఫీడ్‌బ్యాక్ రూపంలో వివరంగా ఇవ్వొచ్చని చెబుతోంది ఎస్బీఐ. చదవండి: రిటైల్ సర్వీస్, ప్రాసెసింగ్ చార్జీల ఎత్తివేత -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్...!
న్యూ ఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఖాతాదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎస్బీఐ యోనో, యోనో లైట్లో 'సిమ్ బైండింగ్' అనే కొత్త మెరుగైన భద్రతా ఫీచర్‌ను ప్రారంభించింది. సిమ్ బైండింగ్ ఫీచర్‌తో కొత్త యోనో, యోనో లైట్ యాప్‌లను ఉపయోగించే ఖాతాదారులను వివిధ డిజిటల్ మోసాల నుంచి రక్షించనుంది. సిమ్ బైండింగ్ ఫీచర్‌తో కేవలం బ్యాంక్‌లో నమోదైన మొబైల్ నంబర్ల సిమ్ ఉన్న ఫోన్లలో మాత్రమే యోనో, యోనో లైట్ యాప్‌లు పనిచేస్తాయి. అయితే, ఖాతాదారులు బ్యాంకుతో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ సిమ్ ఉపయోగించి ఒకే మొబైల్ పరికరంలో యోనో, యోనో లైట్ యాప్ రెండింటినీ ఉపయోగించవచ్చు. ఒకవేళ కస్టమర్ బ్యాంక్‌లో నమోదు చేయని మొబైల్ నంబర్‌ను ఉపయోగిస్తుంటే, యోనో, యోనో లైట్లో నమోదు ప్రక్రియను పూర్తి చేయలేరు. ఈ సందర్భంగా ఎస్బీఐ డీఎమ్డీ (స్ట్రాటజీ) & చీఫ్ డిజిటల్ ఆఫీసర్ రాణా అశుతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..యోనో, యోనో లైట్ యాప్‌లు అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాట్‌ఫాంగా నిలిచాయని పేర్కొన్నారు. ఎస్బీఐ తెచ్చిన కొత్త ఫీచర్‌తో ఖాతాదారులందరికీ మెరుగైన భద్రతను అందిస్తోంది. అంతేకాకుండా కస్లమర్లను ఎల్లప్పుడూ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను నిర్వహించడానికి ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. సిమ్ బైండింగ్ ఫీచర్‌ను ఇలా యాక్సెస్ చేయండి...! మెరుగైన భద్రతా ఫీచర్లతో వచ్చిన యోనో, యోనో లైట్ యాప్‌ల కొత్త వెర్షన్‌ను యాక్సెస్ చేయడానికి ఖాతాదారులు తమ మొబైల్ యాప్‌ని అప్డేట్ చేసుకోవాలి. అంతేకాకుండా యోనో, యోనో లైట్ యాప్‌లలో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా బ్యాంకులో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ సిమ్‌ను బ్యాంకు ధృవీకరిస్తుంది. కస్టమర్లు రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్ సిమ్ ఉన్న మొబైల్లో తమను తము నమోదు చేసుకున్నారని నిర్ధారించుకోవాలి. -
అలర్ట్: యోనో యాప్ వినియోగిస్తున్నారా?! ఇది మీకోసమే
కరోనా కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) యాప్ యోనోలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు విపరీతంగా పెరిగాయి. అయితే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లను పెంచి, వినియోగదారుల అకౌంట్లను సురక్షితంగా ఉంచేందుకు ఎస్బీఐ యోనో యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్లు చేస్తుంది.తాజాగా వినియోగదారుల భద్రతే లక్ష్యంగా యోనోలైట్ యాప్‌లో 'సిమ్ బైండింగ్' ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. Now online banking is more secure than ever with SBI! Download the latest YONO Lite app now: https://t.co/uP7JXenNsP #YONOLite #YONO #OnlineBanking #SafeBanking #BeSafe pic.twitter.com/lsLluyYXoq — State Bank of India (@TheOfficialSBI) July 27, 2021 'ఇప్పుడు ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ గతంలో కంటే మరింత సురక్షితం! సరికొత్త యోనో లైట్ యాప్‌ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి' అంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. సిమ్ బైండింగ్ ఫీచర్ వల్ల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తో ఒక యూజర్‌కి మాత్రమే అనుమతి ఉంది. యూజర్లు రిజిస్టర్ మొబైల్ నెంబర్‌తో కాకుండా వేరే నెంబర్‌ను ఉపయోగించి లాగిన్ చేసి లావాదేవీలను నిర్వహించేందుకు అనుమతి లేదు. యోనో లైట్ యాప్‌లో రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌ను ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం ►ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్ నుండి ఎస్బీఐ యోనో లైట్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి ►యాప్ ఓపెన్ చేసిన తరువాత ఎస్బిఐలో సిమ్ 1 లేదా సిమ్ 2 ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఒకే సిమ్ ఉంటే సిమ్ సెలక్షన్ అవసరం లేదు. ► అనంతరం మొబైల్ నంబర్ కన్ఫాం కోసం ఓటీపీ అడుగుతుంది. ►ఓటీపీ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది ►ఓటీపీని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ఆప్షన్లో మీ ఐడీ, పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేయాలి. ►అనంతరం కండీషన్స్‌కు ఓకే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ►దీంతో మరో సారి మీ నెంబర్‌కు యాక్టివేషన్ ఓటీపీ వస్తుంది. ►ఆ ఓటీపీని ఎంటర్ చేసి యోనోలైట్ యాప్‌ను వినియోగించుకోవచ్చు. చదవండి: Cryptocurrency: మేం ఎవరి డేటా కలెక్ట్ చేయడం లేదు -
ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక!
ఎస్బీఐ తన ఖాతాదారులకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కొత్త నిబందనలు తీసుకువచ్చింది. ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లతో పాటు ఆన్లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ యోనో వినియోగదారులు అనుసరించాల్సిన కఠినమైన నిబంధనలతో ఈ సారి ముందుకు వచ్చింది. ఆన్లైన్ లో అనేక మోసాల కారణంగా చాలా మంది డబ్బు నష్టపోతున్నట్లు పేర్కొంది. తమ ఖాతాదారులను సురక్షితంగా ఉంచడం కొరకు బ్యాంకు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. కొత్త నిబంధనలను పాటించనట్లయితే ఖాతాదారులను వారి ఖాతాల నుంచి స్తంభింపజేస్తుంది. ఎస్బీఐ యోనో యాప్ లోకి లాగిన్ కావడానికి ముందు ఎస్బీఐ అకౌంట్ ఖాతాదారులు బ్యాంకుతో లింకు చేసిన మొబైల్ ఫోన్ నెంబరు గల మొబైల్ ద్వారానే ఎస్బీఐ యోనో యాప్ లో లాగిన్ చేయాలి. ఒకవేళ వేరే నెంబరుతో లాగిన్ చేయడానికి ప్రయత్నించినట్లయితే ఖాతాదారులు ఎలాంటి లావాదేవీ చేయడానికి ఎస్బీఐ యోనో అనుమతించదు. ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించింది. "యోనో ఎస్బీఐతో బ్యాంక్ సురక్షితంగా ఉంది! యోనో ఎస్బీఐ తన భద్రతా ఫీచర్లను మెరుగు పరుస్తుంది. కొత్త అప్డేట్ లో భాగంగా బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబరు గల ఫోన్ నుంచి మాత్రమే యోనో ఎస్బీఐని యాక్సెస్ చేసుకోవడానికి అనుమతిస్తుంది" అని తెలిపింది. Bank Securely with YONO SBI! YONO SBI is leveling up its security features. The new upgrade will allow access to YONO SBI only from the phone which has the mobile number registered with the bank. #YONOSBI #YONO #Banking #Upgrade pic.twitter.com/WtV86zQVfF — State Bank of India (@TheOfficialSBI) July 25, 2021 -
ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. ఆన్ లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యుపీఐ, యోనో, యోనో లైట్ సేవలు శుక్రవారం రాత్రి 150 నిమిషాల పాటు నిలిచిపోనున్నట్లు పేర్కొంది. "మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడానికి మేము కృషి చేస్తున్నాము, గౌరవనీయ ఖాతాదారులు మాకు సహకరించగలరని అభ్యర్థిస్తున్నాము" అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఎస్బీఐ కస్టమర్లు జూలై 16 రాత్రి 10:45 నుంచి జూలై 17 ఉదయం 1.15 గంటల వరకు 150 నిమిషాలపాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యుపిఐ, యోనో మరియు యోనో లైట్ సర్వీసులను యాక్సెస్ చేసుకోలేరని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక "ముఖ్యమైన నోటీసు"లో తెలిపింది. ఈ సమయంలో ఎటువంటి లావాదేవీలు చేయకపోవడం మంచిది. -
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 50 శాతం తగ్గింపు!
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులకు శుభవార్త అందించింది. ఈ కామర్స్ వ్యాపార సంస్థలకు దీటుగా ప్రత్యేకంగా 'యోనో సూపర్ సేవింగ్ డేస్' పేరుతో సరికొత్త సేల్ తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఈ సేల్ జూలై 4న నుంచి జూలై 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. 'యోనో సూపర్ సేవింగ్ డేస్' సేల్‌లో భాగంగా టైటన్‌పేపై 20 శాతం తగ్గింపు పొందే అవకాశం లభిస్తుంది. అలాగే అపోలో 24/7లో 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈజీమైట్రిప్‌లో 10 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. ఇక ఓయో ద్వారా ఏకంగా 50 శాతం తగ్గింపు పొందే అవకాశం ఎస్బీఐ మీకు కల్పిస్తోంది. టాటా క్లిక్‌లో అయితే రూ.300 వరకు బెనిఫిట్ పొందవచ్చు అని తెలిపింది. వేదాంతులో 50 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. అయితే ఎస్బీఐ యోనో యాప్ ద్వారా జరిపే చెల్లింపులకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది. "తన వినియోగదారులకు అంతిమ షాపింగ్ ఆనందాన్ని అందించడానికి యోనో వేదాంతు, అపోలో 24ఐ7, ఈస్ మైట్రిప్, ఓయో వంటి అగ్ర శ్రేణి వ్యాపారులతో భాగస్వామ్యం కలిగి ఉంది" అని ఎస్బీఐ తెలిపింది. Super deals. Super savings. Upto 50% off* on big brands like Titan Pay, Apollo 24|7, EaseMyTrip, OYO, Tata CLiQ & Vedantu. Download now: https://t.co/YibUVRB2OS#SuperSavingDays #YONOSBI #YONO #Shopping #Saving pic.twitter.com/JuvUreadRO — State Bank of India (@TheOfficialSBI) July 4, 2021 -
ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది. ఆదివారం జులై 4 న రోజున ఉదయం 3.25am గంటల నుంచి 5.50am వరకు డిజిటల్ లావాదేవీలు నిలిచిపోనున్నాయి. దీంతో ఖాతాదారులకు డిజిటల్ సేవల నిర్వహణకు ఆటంకం ఏర్పడనుంది. ఎస్బీఐ తమ సేవలను అప్ గ్రేడ్ చేసే క్రమంలో డిజిటల్ సేవలు నిలిచిపోనున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ తదితర సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఎస్బీఐ జూలై ఒకటి నుంచి కొత్త నిబందనలను అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎటిఎమ్ నుంచి నగదు విత్ డ్రా, బ్రాంచీ నుంచి నగదు విత్ డ్రా, చెక్ బుక్ వంటి అంశాలకు సంబంధించిన చార్జీల విషయంలో మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడి) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయి. We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/l7dsyoQcsu — State Bank of India (@TheOfficialSBI) July 2, 2021 -
Sate Bank Day: డిస్కౌంట్ ఆఫర్
సాక్షి, ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా తన కస్టమర్లకు మంచి ఆఫర్ ప్రకటించింది. టైటన్ వాచెస్ పై 20 శాతం తగ్గింపును ప్రకటించింది. పరిమిత కాల ఆఫర్‌గా తీసుకొచ్చిన ఈ తగ్గింపు ధరలు ఈ నెల 7 వ తేదీవరకు అందుబాటులో ఉంటాయి. తన యోనో యాప్ ద్వారా కాంటాక్ట్ లెస్ కొనుగోళ్లు చేయాలని కస్టమర్లకు పిలుపునిచ్చింది. కాగా ఎస్బీఐ నేడు ఫౌండేషన్ డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన అద్భుతమైన ప్రస్తానాన్ని గుర్తు చేసుకుంటూ ఒకవీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. అలాగే తమకు అండగా నిలిచిన వినియోగదారులకు శుభాకాంక్షలు తెలిపింది. దీంతోపాటు పీఎం కేర్స్ ఫండ్ కు 62.62 కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. (State Bank Day: హ్యపీ, ఇన్క్రెడిబుల్ జర్నీ) Get Flat 20% OFF* on all TITAN PAY watches through YONO. Make fast, contactless and secure transactions via Titan Pay. Download now: https://t.co/FpPOSnsD5V #StateBankDay #TitanPay #Titan #ContactlessPayment #TitanWatch #Watch #YONOSBI pic.twitter.com/gTDf05Ndqr — State Bank of India (@TheOfficialSBI) July 1, 2021 -
SBI ఖాతాదారులూ ముఖ్య గమనిక!
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలపై వినియోగదారులను అలర్ట్ చేసింది. ఎస్బీఐ ఆన్లైన్, యోనో యాప్ సేవలు రెండు గంటల పాటు నిలిచిపోనున్నాయని తెలిపింది. ఈ విషయాన్ని గమనించాలంటూ ట్విటర్ ద్వారా ఎస్బీఐ ఖాతాదారులకు వివరాలను షేర్ చేసింది. రేపు (జూన్ 17, గురువారం) అర్థరాత్రి 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు రెండు గంటల పాటు ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్ని నిలిపియనున్నట్టు తెలిపింది. మెయింటనెన్స్ కార్యకలాపాల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఫలితంగా ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో, యోనో లైట్ లాంటి సేవలు అందుబాటులో ఉండవనీ, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లావాదేవీలపై అప్రత్తమంగా ఉండాలని కస్టమర్లకు సూచించింది. (మాకెంజీ దాతృత్వం : రూ. 20 వేల కోట్ల భారీ విరాళం) We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/Nk3crZQ2PG — State Bank of India (@TheOfficialSBI) June 16, 2021