కొత్తగా బ్యాంక్ ఖాతా తీసుకోవాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు అందించింది. ఖాతాదారుల కోసం కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొని వచ్చింది. వీడియో కేవైసీ ఆధారిత అకౌంట్ ఓపెనింగ్ సర్వీసు లాంచ్ చేసింది. ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో యాప్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త సేవల వల్ల ఖాతాదారులు శాఖకు వెళ్లకుండానే సేవింగ్స్ అకౌంట్ తీసుకోవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు అని ఎస్‌బీఐ వివరించింది.
ప్రస్తుత కోవిడ్ 19 పరిస్థితుల్లో ఆన్‌లైన్ అకౌంట్ ఓపెనింగ్ సర్వీసులు అత్యవసరమని ఎస్‌బీఐ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. ఎస్‌బీఐలో బ్యాంక్ ఖాతా తెరవాలని భావించే వారు ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ఖాతా తెరవాలంటే యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత న్యూ టు ఎస్‌బీఐ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత ఇన్‌స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ ఓకే చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ వివరాలు సమర్పించాలి. ఆధార్ అథంటికేషన్ పూర్తైన తర్వాత వ్యక్తిగత వివరాలు అందించాలి. వీడియో కాల్ కేవైసీ పూర్తైన తర్వాత కొత్త అకౌంట్ ఓపెన్ అవుతుంది. 2017 నవంబర్ లో యోనో యాప్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చింది.
చదవండి: పది నిమిషాల్లో ఈ-పాన్ కార్డ్!
Comments
Please login to add a commentAdd a comment