NRIs SBI YONO app: దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది. యోనో యాప్‌ద్వారా నాన్-రెసిడెంట్ఎక్స్‌టర్నల్ (ఎన్‌ఆర్‌ఈ), నాన్-రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్‌ఆర్‌ఓ)లు సేవింగ్స్, కరెంట్ ఖాతాలు రెండూ సులభంగా తెరవడానికి డిజిటల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు కొత్త ఖాతాదారులకు ఉద్దేశించిందని ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ సదుపాయం భారతదేశంలో ఖాతాలను తెరవడానికి, నిర్వహించడానికి సులభమైన విధానాన్ని కోరుకునే ఎన్‌ఆర్‌ఐ క్లయింట్‌ల నుంచి దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిష్కరిస్తుంది. (వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు)
తాజా అప్‌డేట్ ప్రకారం ఎన్‌ఆర్‌ఐలు భారతదేశంలోని సంబంధిత బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండానే తమ ఇళ్లలో కూర్చొని తమ ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌ఓ ఖాతాలను తెరవచ్చు. దీంతో అకౌంట్ ను ఓపెనింగ్ ప్రక్రియ ఎన్‌ఆర్‌ఐ కస్టమర్లకు వేగం మరింత సులభతరమవుతుంది. అలాగే డిజిటల్ సేవల ద్వారా లావాదేవీలు మరింత ఈజీ కానున్నాయని డిఎండి & హెడ్ (డిజిటల్ బ్యాంకింగ్ & ట్రాన్స్‌ఫర్మేషన్) నితిన్ చుగ్ తెలిపారు.అంతేకాదు మూడే మూడు స్టెప్స్‌లో ఖాతాను తెరిచే ప్రక్రియను పూర్తి చేయవచ్చు కూడా. (భారీ తగ్గింపు: రూ. 48,900లకే ఐఫోన్ 15 దక్కించుకునే చాన్స్)
ముచ్చటగా మూడు స్టెప్స్
►యోనో ఎస్‌బీఐ బ్యాంకింగ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
►హోమ్‌పేజీలో ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌ఓ ఖాతాతెరిచే ఆప్షన్ ఎంచుకోవాలి
► ఇది పూర్తి అయిన తరువాత కేవైసీ వివరాలను సబ్మిట్ చేయాలి.
ఇండియాలోతాము ఖాతా ఓపెన్ చేయాలనుకుంటున్న ఎస్‌బీఐ బ్రాంచ్‌కు కేవైసీ డాక్యుమెంట్స్‌ను అందించవచ్చు. లేదా కేవైసీ డాక్యుమెంట్స్‌ను నోటరీ, హై కమీషన్, ఎస్‌బీఐ ఫారిన్ ఆఫీస్, ఇండియన్ ఎంబసీ, రిప్రజెంటేటివ్ ఆఫీస్, కోర్ట్ మేజిస్ట్రేట్ లేదా జడ్జితో అటెస్ట్ చేసి తదుపరి ప్రాసెసింగ్ కోసం సంబంధిత బ్రాంచ్‌కి మెయిల్ చేయాలి. అలాగే కస్టమర్‌లు తమ అప్లికేషన్ స్టేటస్‌ను కూడా ట్రాక్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment