Current account
-
అకౌంట్లో ఇంతకు మించి క్యాష్ జమైతే అంతే..
మనలో చాలా మంది బ్యాంకు ఖాతాల ఆధారంగా లావాదేవీలు చేస్తూంటారు. ఎఫ్డీలో డబ్బు దాచుకుంటారు. సేల్ డీడ్ ద్వారా చెల్లింపులు చేస్తూంటారు. బిజినెస్ చేస్తున్నవారు కరెంట్ అకౌంట్ ద్వారా లావాదేవీలు చేస్తుంటారు. అయితే ఏ ఖాతాకైనా లావాదేవీల పరంగా నిబంధనల ప్రకారం కొన్ని అవధులుంటాయి. వాటిని పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఆదాయపన్ను అధికారుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏయే ఖాతాలకు నిబంధనల ప్రకారం ఎంతమొత్తంలో లిమిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.సేవింగ్స్, కరెంట్ ఖాతాలో లావాదేవీలుభారతీయ ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం పొదుపు ఖాతాలో జమ చేసే నగదు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకు మించితే ఐటీ శాఖకు తెలియజేయాలి. అదే కరెంట్ అకౌంట్ల విషయంలో ఈ పరిమితి ప్రాథమికంగా రూ.50 లక్షలు ఉంటుంది. కొన్నిసార్లు కరెంట్ అకౌంట్‌కు సంబంధించి లేవాదేవీలు ఆయా బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. ఈ డిపాజిట్లు తక్షణ పన్నుకు లోబడి ఉండనప్పటికీ, పరిమితులను మించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి.నగదు ఉపసంహరణనగదు ఉపసంహరణల విషయానికి వస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్లో టీడీఎస్ నిబంధనలు ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ.1 కోటికి మించితే 2% టీడీఎస్ చెల్లించాలి. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయని వ్యక్తులకు విత్‌డ్రావల్స్ రూ.20 లక్షలు దాటితే 2% టీడీఎస్ వర్తిస్తుంది. అదే రూ.1 కోటికి మించితే 5% టీడీఎస్ అమలవుతుంది.నగదు బహుమతినగదు బహుమతులపై ఆదాయపు పన్నుశాఖ నిబంధనలు విధించింది. పన్ను విధించదగిన ఆదాయాన్ని దాచిపెట్టి పన్నులను ఎగవేసేందుకు ప్రయత్నిస్తుంటారు. నగదు బహుమతులకు సంబంధించి దీన్ని నిరోధించడానికి కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. సంబంధీకులు కానివారి నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 లేదా అంతకంటే తక్కువ మొత్తంలో నగదు బహుమతులు స్వీకరించినట్లయితే ఎటువంటి గిఫ్ట్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోబుట్టువులు, అత్తమామలతో సహా ఇతర బంధువుల నుంచి బహుమతులను స్వీకరిస్తే పన్ను మినహాయింపు ఉంటుంది.ఫిక్స్డ్ డిపాజిట్ పరిమితిఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందాలనుకుంటే కనీసం రూ.100 నుంచి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాలి. ఆపై చేసిన ఎఫ్డీపై ట్యాక్స్ ఉంటుంది. అయితే ఎఫ్‌డీల్లో రూ.రెండు కోట్లు కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఉంటే బల్క్ డిపాజిట్ల రూపంలోకి మారుతాయి. ఎఫ్డీపై వచ్చే వడ్డీ ఏటా రూ.10 వేలు దాటితో టీడీఎస్ 10 శాతం కట్ అవుతుంది.‘రియల్’ లావాదేవీలుపూర్తి నగదును ఉపయోగించి స్థలం లేదా, ఇల్లు కొనుగోలు చేసేందుకు నిబంధనలు అనుమతించవు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు నగదు లావాదేవీల పరిమితికి లోబడి ఉంటాయి. నగదు రూపంలో రూ.2,00,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేయకూడదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్ఎస్ ప్రకారం నగదు రూపంలో రూ.రెండు లక్షల కంటే ఎక్కువ చెల్లింపులు స్వీకరిస్తే విక్రేత 100% పెనాల్టీ రుసుమును చెల్లించవలసి ఉంటుంది.ఇదీ చదవండి: పాన్ కార్డ్‌తో గేమ్స్ వద్దుసేల్ డీడ్‌లో నగదు చెల్లింపులను రికార్డ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రిజిస్టర్డ్ టైటిల్ డీడ్‌లో రుజువులు రికార్డు చేసే క్రమంలో రూ.రెండు లక్షలు గరిష్ట పరిమితి మాత్రమే ఉండాలి. అది కూడా బ్యాంకు డ్రాఫ్ట్, చెక్, ఈసీఎస్ వంటి ఎలక్ట్రానిక్ రూపంలో ఉండడం మేలు. -
భారీగా తగ్గిన కరెంట్ అకౌంట్ లోటు
ముంబై: నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చి–పోయే విదేశీ మారక ద్రవ్యం నికర వ్యత్యాలను ప్రతిబింబించే భారత్ కరెంట్ అకౌంట్.. తాజా అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతికి అద్దం పడుతోంది. భారత్ కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ– క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం జూలై–సెపె్టంబర్ కాలంలో భారీగా ఒక శాతానికి (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ విలువలతో పోల్చి) పరిమితమైంది. విలువల్లో ఇది 8.3 బిలియన్ డాలర్లు. సమీక్షా కాలంలో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు తగ్గడం, సేవల రంగం ఎగుమతుల్లో పెరుగుదల దీనికి కారణం. 2022 ఇదే కాలంలో కరెంట్ అకౌంట్ లోటు 3.8 శాతంగా (విలువలో 30.9 బిలియన్ డాలర్లు) నమోదయ్యింది. ఆర్బీఐ తాజా ఈ తాజా గణాంకాలను విడుదల చేసింది. తాజా ముఖ్య గణాంకాలను పరిశీలిస్తే.. ► 2022–23 జూలై–సెపె్టంబర్ నెలల్లో వస్తు ఎగుమతుల విలువ 78.3 బిలియన్ డాలర్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ 61.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. ► సేవల ఎగుమతులు 4 శాతం ఎగశాయి. సాఫ్ట్వేర్ ఎగుమతులు పెరగడం, వ్యాపార, పర్యాటక సేవలు మెరుగుపడ్డాయి. ఎగుమతుల ఒడిదుడుకులు... అంతర్జాతీయ తీవ్ర అనిశ్చితి పరిస్థితులకు భారత్ వస్తు ఎగుమతులు అద్దం పడుతున్నాయి. అక్టోబర్‌లో ‘ప్లస్’లోకి వచి్చన ఎగుమతులు తిరిగి నవంబర్‌లో మైనస్‌లోకి జారిపోయాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెప్టెంబర్‌లో 2.6 శాతం క్షీణించాయి. అక్టోబర్‌లో సానుకూల ఫలితం వెలువడింది. మరుసటి నెల– నవంబర్లోనే మళ్లీ క్షీణరేటు నమోదయ్యింది. ఇక దిగుమతుల విషయానికి వస్తే.. 10 నెలల తర్వాత అక్టోబర్‌లో ఎగువబాటకు చేరిన దిగుమతులు నవంబర్‌లో మళ్లీ క్షీణతలోకి జారాయి. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 6.51 శాతం క్షీణించి 278.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.67 శాతం క్షీణించి 445.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు– ఈ ఏడు నెలల్లో 166.36 బిలియన్ డాలర్లుగా ఉంది. -
ఎన్ఆర్ఐలకు ఎస్బీఐ గుడ్ న్యూస్: యోనో యాప్‌తో ఈజీగా
NRIs SBI YONO app: దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది. యోనో యాప్‌ద్వారా నాన్-రెసిడెంట్ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ), నాన్-రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ)లు సేవింగ్స్, కరెంట్ ఖాతాలు రెండూ సులభంగా తెరవడానికి డిజిటల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు కొత్త ఖాతాదారులకు ఉద్దేశించిందని ఎస్బీఐ ప్రకటించింది. ఈ సదుపాయం భారతదేశంలో ఖాతాలను తెరవడానికి, నిర్వహించడానికి సులభమైన విధానాన్ని కోరుకునే ఎన్ఆర్ఐ క్లయింట్ల నుంచి దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిష్కరిస్తుంది. (వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు) తాజా అప్డేట్ ప్రకారం ఎన్ఆర్ఐలు భారతదేశంలోని సంబంధిత బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండానే తమ ఇళ్లలో కూర్చొని తమ ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ ఖాతాలను తెరవచ్చు. దీంతో అకౌంట్ ను ఓపెనింగ్ ప్రక్రియ ఎన్ఆర్ఐ కస్టమర్లకు వేగం మరింత సులభతరమవుతుంది. అలాగే డిజిటల్ సేవల ద్వారా లావాదేవీలు మరింత ఈజీ కానున్నాయని డిఎండి & హెడ్ (డిజిటల్ బ్యాంకింగ్ & ట్రాన్స్ఫర్మేషన్) నితిన్ చుగ్ తెలిపారు.అంతేకాదు మూడే మూడు స్టెప్స్‌లో ఖాతాను తెరిచే ప్రక్రియను పూర్తి చేయవచ్చు కూడా. (భారీ తగ్గింపు: రూ. 48,900లకే ఐఫోన్ 15 దక్కించుకునే చాన్స్) ముచ్చటగా మూడు స్టెప్స్ ►యోనో ఎస్బీఐ బ్యాంకింగ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. ►హోమ్‌పేజీలో ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ ఖాతాతెరిచే ఆప్షన్ ఎంచుకోవాలి ► ఇది పూర్తి అయిన తరువాత కేవైసీ వివరాలను సబ్మిట్ చేయాలి. ఇండియాలోతాము ఖాతా ఓపెన్ చేయాలనుకుంటున్న ఎస్బీఐ బ్రాంచ్‌కు కేవైసీ డాక్యుమెంట్స్‌ను అందించవచ్చు. లేదా కేవైసీ డాక్యుమెంట్స్‌ను నోటరీ, హై కమీషన్, ఎస్బీఐ ఫారిన్ ఆఫీస్, ఇండియన్ ఎంబసీ, రిప్రజెంటేటివ్ ఆఫీస్, కోర్ట్ మేజిస్ట్రేట్ లేదా జడ్జితో అటెస్ట్ చేసి తదుపరి ప్రాసెసింగ్ కోసం సంబంధిత బ్రాంచ్‌కి మెయిల్ చేయాలి. అలాగే కస్టమర్లు తమ అప్లికేషన్ స్టేటస్‌ను కూడా ట్రాక్ చేయవచ్చు. -
ఎకానమీకి కరెంట్ అకౌంట్ సవాళ్లు!
ముంబై: భారత్ ఎకానమీకి కరెంట్ అకౌంట్ కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనావేస్తోంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కరెంట్ అకౌంట్లో తీవ్ర లోటు (క్యాడ్) నమోదుకావచ్చని, ఇది ఏకంగా 36 నెలల గరిష్ట స్థాయిలో 3.4 శాతంగా (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ విలువలో) ఉండే వీలుందని తన తాజా నివేదికలో అంచనావేసింది. విలువలో ఇది 28.4 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో కరెంట్ అకౌంట్లో లోటులేకపోగా 0.9 శాతం మిగులు (6.6 బిలియన్ డాలర్లు) నెలకొంది. గత ఆర్థిక సంవత్సరం చివరి మార్చి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ లోటు 1.5 శాతం (13.4 బిలియన్ డాలర్లు). అయితే తదుపరి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఇది ఏకంగా 3.4 శాతానికి చేరుతుందన్న అంచనాలు నెలకొనడం గమనార్హం. ఇప్పటికే ఇక్రా హెచ్చరికలు... భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) సీఏడీ– క్యాడ్ సవాళ్లు తప్పవని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఇప్పటికే వెలువరించిన నివేదికలో అంచనావేసింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ లోటు అదే కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 5 శాతానికి చేరే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. అదే విధంగా 2022–23లో 3.5 శాతంగా (120 బిలియన్ డాలర్లు) ఉండే వీలుందని అంచనావేసింది. దేశం నుంచి ఎగుమతులు తగ్గుతుండడం, దిగుమతుల పెరుగుదల, దీనితో భారీగా పెరగనున్న వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) వంటి అంశాలు క్యాడ్ ఆందోళనకు కారణమని ఇక్రా విశ్లేషించింది. జూలై, ఆగస్టు నెలల్లో దేశంలోకి భారీ దిగుమతులు జరగ్గా, ఎగుమతులు నామమాత్రపు వృద్ధిని నమోదుచేసుకుంటున్నాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్య లోటు భారీగా పెరిగిపోతోంది. ఫారెక్స్ దన్ను... అయితే దేశానికి ప్రస్తుతం ఫారెక్స్ విలువ దన్ను పటిష్టంగా ఉంది. 2021 సెప్టెంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. భారత్ వద్ద ప్రస్తుతం (26 ఆగస్టు నాటికి 561 బిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకోడానికి దోహదపడతాయి. కరెంట్ అకౌంట్... అంటే! ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
దేశానికి కరెంట్ అకౌంట్ లోటు కష్టాలు
ముంబై: భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ– క్యాడ్) కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తోంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ లోటు అదే కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 5 శాతానికి చేరే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. అదే విధంగా 2022–23లో 3.5 శాతంగా ఉండే వీలుందని అంచనావేసింది. దేశం నుంచి ఎగుమతులు తగ్గుతుండడం, దిగుమతుల పెరుగుదల, దీనితో భారీగా పెరగనున్న వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) వంటి అంశాలు క్యాడ్ ఆందోళనకు కారణమని ఇక్రా విశ్లేషించింది. నివేదికకు సంబంధించి ముఖ్యాంశాలు... ►ఒక్క ఆగస్టును తీసుకుంటే వాణిజ్య లోటు రెట్టింపై 28.7 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్ ఎగుమతులు 20 నెల్లో మొదటిసారి ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా 1.15 శాతం మేర క్షీణించడం, (విలువలో 33 బిలియన్ డాలర్లు) దిగుమతులు 37 శాతం పెరిగి, 61.68 బిలియన్ డాలర్లుగా నమోదవడం దీనికి కారణం. ఎగుమతుల ద్వారా ఆదాయం తగ్గడం క్యాడ్‌పై ప్రభావం చూపింది. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో క్యాడ్ విలువ ఆల్‌టైమ్ హై 41 బిలియన్ డాలర్ల నుంచి 43 బిలియన్ డాలర్ల శ్రేణిలో (జీడీపీ విలువ అంచనాలో దాదాపు 5 శాతం) నమోదుకావచ్చు. 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఈ విలువ 30 బిలియన్ డాలర్లుగా ఉంది. ►అయితే ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో (అక్టోబర్–మార్చి) క్యాడ్ 2.7 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. దీనివల్ల ఆర్థిక సంవత్సరం మొత్తంలో క్యాడ్ 3.5 శాతానికి పరిమితం కావచ్చు. కమోడిటీల బిల్లు తగ్గే అవకాశాలు, సీజనల్‌గా ఎగుమతులు కొంచెం మెరుగుపడే పరిస్థితులు దీనికి కారణం. అయితే దిగ్గజ ఎకనామీల్లో మాంద్యం పరిస్థితుల వల్ల దేశం వస్తు, సేవల ఎగుమతులు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ►ఆర్థిక సంవత్సరం (2022–23)లో క్యాడ్ 120 బిలియన్ డాలర్లు (జీడీపీలో 3.5 శాతం)గా ఉండే వీలుంది. 2021–22లో ఈ విలువ కేవలం 38.7 బిలియన్ డాలర్లు. అంటే జీడీపీలో 1.2%. ►ఇక రూపాయి విషయానికి వస్తే, 2022 రానున్న కాలంలో డాలర్ మారకంలో రూపాయి విలువ 78.5–81 శ్రేణిలో తిరిగే వీలుంది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ఈక్విటీ ఇన్‌ఫ్లోస్ పెరగవచ్చు. ►2021 సెప్టెంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. భారత్ వద్ద ప్రస్తుతం (26 ఆగస్టు నాటికి 561 బిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకోడానికి దోహదపడతాయి. రూపాయి తీవ్ర ఒడిదుడుకులను నివారిస్తాయి. క్యాడ్ అంటే... ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
పాతాళానికి రూపాయి, మరింత పతనం తప్పదా?
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో మరోసారి పాతాళానికి పడిపోయింది. డాలరుతో పోలిస్తే తొలిసారి 80కి చేరుకుంది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 79.9863 వద్ద ప్రారంభమై తర్వాత యుఎస్ డాలర్‌తో రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 80.05 నమోదు చేసింది. ఇంట్రా-డే రికార్డు కనిష్ట స్థాయి 80.0175ని తాకింది. సోమవారం 79.97 వద్ద ముగిసింది. పలు కేంద్ర బ్యాంకుల సమాశాలు, ముఖ్యంగా యూఎస్ పెడ్ రిజర్వ్ ట్రేడర్లు దృష్టి పెట్టారు. ఫలితంగా డాలరు బలం పుంజుకోవడంతో రూపాయి వరుసగా ఏడో సెషన్లో రికార్డు స్థాయికి చేరింది. ఈ స్థాయిలో మరింత క్షీణత తప్పదనే ఆందోళన ట్రేడర్లలో నెలకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు దేశీయ ఈక్విటీల నుండి రికార్డు మొత్తంలో దాదాపు 30 బిలియన్ల డాలర్లు పెట్టుబడులను విదేశీ మదుపర్లు వెనక్కి తీసుకున్నారు. దీనికి తోడు చమురు ధరలు, క్షీణిస్తున్న కరెంట్-ఖాతా లోటుపై ఆందోళనలు కరెన్సీకి బలహీనతకు కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా బలహీనంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఏకంగా 700 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ నేడు ఆరంభంలో సుమారు 200 పాయింట్లు క్షీణించింది. ప్రస్తుతం సూచీలు రెండూ ఫ్టాట్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు డిసెంబర్ 31, 2014 నుండి భారత రూపాయి దాదాపు 25 శాతం క్షీణించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభకు చెప్పారు. రూపాయి విలువ 63.33 నుండి జూలై 11, 2022 నాటికి 79.41కి తగ్గిందని ఆర్బిఐ డేటాను ఉటంకిస్తూ లోక్సభకిచ్చిన ఒక రాతపూర్వక సమాధానంలో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడి చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినతరం లాంటి గ్లోబల్ కారకాలు అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడటానికి ప్రధాన కారణాలని ఆమె చెప్పారు. ఇది కూడా చదవండి: లాభాలు పాయే, ఫ్లాట్‌గా సూచీలు -
కరోనా కాలంలోనూ కరెంట్ ఖాతా మిగులు
ముంబై: దేశం కరోనా సవాళ్లను ఎదుర్కొన్న 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్ 0.9 శాతం (స్థూల దేశీయోత్పత్తి విలువలో) కరెంట్ అకౌంట్ మిగులును నమోదు చేసుకుందని ఆర్బీఐ బుధవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. విలువలో ఇది 102.2 బిలియన్ డాలర్లు(7,62,616.4 కోట్లు). గత 17 ఏళ్లలో మొదటిసారి ఎఫ్వై 21లో కరెంట్ అకౌంట్ మిగులు సాధించింది. ఒక దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. వచ్చిన దానికన్నా చెల్లింపులు అధికంగా ఉండే పరిస్థితి ‘కరెంట్ అకౌంట్ లోటు’. చెల్లింపులకన్నా దేశంలోకి వచ్చిన మొత్తాలు అధికంగా ఉంటే అది కరెంట్ అకౌంట్ మిగులు. ఇక 2019-20లో 0.9 శాతం కరెంట్ అకౌంట్ లోటును నమోదుచేసుకుంది. విలువలో ఇది 157.5 బిలియన్ డాలర్లు. గణాంకాల ప్రకారం.. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 44 బిలియన్ డాలర్లు. 2019-20లో ఈ పరిమాణం 43 బిలియన్ డాలర్లే కావడం గమనార్హం. నికర విదేశీ ఫోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కూడా ఇదే కాలంలో 1.4 బిలియన్ డాలర్ల నుంచి 36.1 బిలియన్ డాలర్లకు ఎగశాయి. మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ కార్పొరేట్ల విదేశీ వాణిజ్య రుణాలు మాత్రం 21.7 బిలియన్ డాలర్ల నుంచి 0.2 బిలియన్ డాలర్లకు తగ్గాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలకు అదనంగా మరో 87.3 బిలియన్ డాలర్లు తోడయ్యాయి. ప్రస్తుత విలువ దాదాపు 600 బిలియన్డాలర్ల పైన రికార్డు స్థాయిల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్న నేపథ్యంలో 2020-21లో కరెంట్ అకౌంట్ ‘లోటు’లోనే ఉంటుందని అంచనా. చదవండి: ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌లో రాబోయే ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు -
కరెంట్ అకౌంట్ మిగులు @ 20 బిలియన్ డాలర్లు
ముంబై: కరెంట్ అకౌంట్ లావాదేవీల విషయంలో 2020 వరుసగా రెండవ త్రైమాసికం ఏప్రిల్–జూన్‌లోనూ భారత్ మిగులను నమోదు చేసుకుంది. ఈ మొత్తం 19.8 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. సంబంధిత త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 3.9 శాతం. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా కరెంట్ అకౌంట్ మిగులు 0.6 బిలియన్ డాలర్లు (0.1 శాతం) నమోదయ్యింది. అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ ప్రతిబింబిస్తుంది. వస్తువులు, సేవలకు సంబంధించి ఒక దేశం ఎగుమతులు–దిగుమతుల లావాదావీల వ్యయాలు, విదేశీ ఇన్వెస్టర్లకు చేసిన చెల్లింపులు, వారి నుంచి వచ్చిన నిధులు, ఆయా పరిమాణాల వ్యత్యాసాలు అన్నీ కరెంట్ అకౌంట్లోకి వస్తాయి. సహజంగా భారత్ కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్)ను కలిగి ఉంటుంది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో దిగుమతులు భారీగా పడిపోవడంతో కరెంట్ అకౌంట్ మిగులు నమోదవుతోంది. 2019–20లో కరెంట్ అకౌంట్ లోటు 24.6 బిలియన్ డాలర్లు. జీడీపీలో ఇది 0.9 శాతం. 2020–2021లో 30 బిలియన్ డాలర్ల కరెంట్ అకౌంట్ ‘మిగులు’ ఉంటుందని ఇక్రా అంచనా. -
విద్యుత్తు బిల్లు రూ.లక్ష దాటితే రిటర్న్‌లు!
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ వర్గాలు దాఖలు చేయాల్సిన రిటర్నుల పత్రాలను (ఐటీఆర్ ఫామ్) నోటిఫై చేసింది. సహజ్ (ఐటీఆర్–1), ఐటీఆర్–2, ఐటీఆర్–3, సుగమ్ (ఐటీఆర్–4), ఐటీఆర్–5, ఐటీఆర్–6, ఐటీఆర్–7 నోటిఫై చేసిన వాటిల్లో ఉన్నాయి. అధిక విలువ కలిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను వీటిల్లో తెలియజేయాల్సి ఉంటుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టం చేసింది. కరెంటు ఖాతాలో డిపాజిట్లు రూ.కోటికి మించి ఉంటే, విదేశీ ప్రయాణం కోసం రూ.2 లక్షలకు మించి ఖర్చు చేసి ఉంటే, విద్యుత్తు బిల్లు రూ.లక్షకు మించితే రిటర్నుల్లో తెలియజేయాల్సి ఉంటుంది. -
0.9 శాతానికి తగ్గిన కరెంటు ఖాతా లోటు
ముంబై: జీడీపీలో కరెంటు ఖాతా లోటు (క్యాడ్) సెప్టెంబర్ త్రైమాసికంలో 0.9 శాతానికి (6.3 బిలియన్ డాలర్లు) తగ్గినట్టు ఆర్బీఐ తెలిపింది. 2018–19 ఆరి్థక సంవత్సరంలో ఇదే కాలానికి క్యాడ్ 2.9 శాతంగా ఉండడం గమనార్హం. విదేశీ మారకం రూపంలో నిధుల రాక, పోకల మధ్య అంతరాన్ని క్యాడ్‌గా పేర్కొంటారు. వాణిజ్య లోటు తక్కువగా 38.1 బిలియన్ డాలర్లుగా ఉండడమే క్యాడ్ తగ్గేందుకు తోడ్పడినట్టు ఆర్బీఐ తెలిపింది. మరి క్రితం ఏడాది ఇదే కాలానికి వాణిజ్య లోటు 50 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆరి్థక సంవత్సరం తొలి అర్ధ భాగానికి (ఏప్రిల్–సెపె్టంబర్) క్యాడ్ జీడీపీలో 1.5 శాతంగా నమోదైంది. అంతక్రితం ఇదే కాలంలో 2.6 శాతంగా ఉంది. నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) సెపె్టంబర్ క్వార్టర్లో 7.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం తొలి ఆరు నెలల్లో నికర ఎఫ్‌డీఐలు 21.2 బిలియన్ డాలర్లుగా, పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు 7.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
నెఫ్ట్ లావాదేవీలు ఇక 24/7
ముంబై: నేషనల్ ఎల్రక్టానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్/ఎన్ఈఎఫ్టీ) వ్యవస్థ మరింత సౌలభ్యంగా మారనుంది. రోజులో 24 గంటలు, వారంలో అన్ని రోజులూ (ఆదివారం, అన్ని సెలవుదినాల్లోనూ) నెఫ్ట్ లావాదేవీలను అనుమతించనున్నట్టు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తన నోటిఫికేషన్లో పేర్కొంది. డిసెంబర్ 16న (డిసెంబర్ 15 అర్ధరాత్రి) 00.30 గంటలకు మొదటి నెఫ్ట్ సెటిల్మెంట్ జరుగుతుంది. లావాదేవీలు సాఫీగా సాగిపోయేందుకు వీలుగా బ్యాంకులు ఆర్బీఐ వద్ద తమ కరెంటు ఖాతాల్లో తగినంత నిధుల లభ్యత ఉండేలా చూసుకోవాలని, అవసరమైన ఏర్పాట్లను కూడా చేసుకోవాలని కేంద్ర బ్యాంకు కోరింది. రెండు గంటల్లోపు లావాదేవీ మొత్తం స్వీకర్త ఖాతాలో జమ చేయడం లేదా పంపిన వ్యక్తిన ఖాతాకు వెనక్కి జమ చేయడం ఇక ముందూ కొనసాగనుంది. నెఫ్ట్ లావాదేవీల ప్రోత్సాహానికి గాను వీటిపై చార్జీలను ఆర్బీఐ లోగడే ఎత్తివేసింది. నెఫ్ట్ లావాదేవీలను గంటకోసారి ఒక బ్యాంచ్ కింద క్లియర్ చేస్తుండడం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు.. మొదటి, మూడో శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాసెస్ చేస్తున్నారు. -
తగ్గిన కరెంట్ అకౌంట్ లోటు
2016–17లో 0.7 శాతం ముంబై: కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ, క్యాడ్) 2016–17 ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే క్యాడ్ 0.7 శాతంగా నమోదయ్యింది. 2015–16లో ఈ రేటు 1.1 శాతంగా ఉంది. విలువ రూపంలో ఇది 130 బిలియన్ డాలర్ల నుంచి 112 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఏ, ఈసీబీ మినహా ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకనిల్వల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. జీడీపీలో పోల్చిచూసి, ఎంత తక్కువ ఉంటే, అంత ఆర్థిక వ్యవస్థకు సానుకూలమైనదిగా దీనిని పరిగణిస్తారు. భారత్ ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసమైన వాణిజ్య లోటు తగ్గడం– మొత్తంగా 2016–17లో క్యాడ్ తగ్గడానికి కారణమని ఆర్బీఐ గురువారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. కాగా గడచిన ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో మాత్రం క్యాడ్ 0.6% పెరిగింది. -
హెచ్చుతగ్గుల మార్కెట్, ముగింపులో లాభాలు
ముంబై: సానుకూలమైన అంతర్జాతీయ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు ఈ వారంలో మొదటి సారి లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరంట్ అకౌంట్ లోటు జీడీపీలో 1 శాతానికే పరిమితమవ్వచ్చన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆశాభావం తదితర అంశాలు ప్రభావం చూపాయి. చాలా షేర్లు కనిష్ట స్థాయిల్లో లభ్యమవుతుండటంతో కొనుగోళ్లు జరిగి స్టాక్ మార్కెట్ ముగింపులో పెరిగిందని విశ్లేషకులంటున్నారు. అయితే ఆద్యంతం ట్రేడింగ్ ఒడిదుడుకులమయంగా సాగింది. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 299 పాయింట్ల, నిఫ్టీ 90 పాయింట్లు చొప్పున పెరిగాయి. ఫెడ్ రిలీఫ్... సోమవారం ముగింపు(28,438 పాయింట్లు)తో పోల్చితే లాభాల్లోనే బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభమైంది. గత వారం భయపడినట్లుగా కాక ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను అనుకున్న విధంగానే జూన్ నుంచి పెంచుతుందన్న అంచనాలు స్టాక్ మార్కెట్ ప్రారంభ లాభాలకు తోడ్పడ్డాయి. సెన్సెక్స్ 345 పాయింట్లు లాభపడింది. అయితేమధ్యాహ్నాం కల్లా ఆ లాభాలన్నింటినీ కోల్పోయింది. 28,435 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరల్లో కోలుకొని 297 పాయింట్ల లాభంతో 28,736 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 90 పాయింట్లు(1.04 శాతం) లాభంతో 8,723కు చేరింది. ఫార్మా, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, కన్సూమర్ డ్యూరబుల్స్, రిఫైనరీ, లోహ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. కొన్ని ఐటీ, టెక్నాలజీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. పన్నెండు బీఎస్ఈ రంగాల వారీ సూచీల్లో పది లాభాల్లోనే ముగిశాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు లాభపడ్డాయి. 1,432 షేర్లు నష్టాల్లో, 1,381 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ ఎన్ఎస్ఈలో రూ.19,139 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,99,037 కోట్లుగా నమోదైంది. క్యాపిటల్ మార్కెట్లో లావాదేవీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ ట్రేడింగ్ విభాగం తేదీ కొనుగోలు అమ్మకం నికర విలువ డీఐఐ : 17-03 1,371 1,614 - 244 16-03 1,469 1,311 159 ఎఫ్ఐఐ: 17-03 5,123 4,858 266 16-03 4,583 5,345 - 763 (విలువలు రూ.కోట్లలో) 2018 నాటికి 54,000కు సెన్సెక్స్ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అంచనా ప్రస్తుతం 28,736 పాయింట్లుగా ఉన్న బీఎస్ఈ సెన్సెక్స్ మూడేళ్లలో 2018 నాటికి 54,000 పాయింట్లకు చేరుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అంచనా వేస్తోంది. అయితే సమీప భవిష్యత్తులో అంతర్జాతీయ పరిణామాలకనుగుణంగా మార్కెట్ సూచీలు కొంత కరెక్షన్కు గురువుతాయని పేర్కొంది. రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగాల్లో పెట్టుబడి వ్యయం పెరుతుందని, ఇది స్టాక్ మార్కెట్‌కు అది పెద్ద సానుకూల చర్య అని వివరించింది. దీంతో సెన్సెక్స్ మూడేళ్లలో మరో 25 వేల పాయింట్లు లాభపడి 54,000 పాయింట్లకు చేరుతుందని మెరిల్ లించ్ తన నివేదికలో పేర్కొంది. వాహన, బ్యాంక్, సిమెంట్, చమురు, ఫార్మా షేర్లు రాణిస్తాయని వివరించింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ రెట్టింపు... న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రెట్టింపై రూ.3 లక్షల కోట్లకు పెరిగింది. స్టాక్ మార్కెట్ మంచి రాబడులను ఇస్తున్న నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ స్కీమ్‌ల్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తుండడమే దీనికి కారణం. 2014, ఫిబ్రవరి నాటికి రూ.1.57 లక్షల కోట్లుగా ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల నిర్వహణ ఆస్తుల విలువ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.3.07 కోట్లకు పెరిగిందని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలానికి బీఎస్ఈ సెన్సెక్స్ 31 శాతం వృద్ధిని సాధించింది. -
కరెంటు ఖాతా లోటు రెట్టింపు
ముంబై: కరెంటు ఖాతా లోటు (క్యాడ్) అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు రెట్టింపయ్యింది. రిజర్వ్ బ్యాంక్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే.. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.6 శాతానికి ఎగిసి 8.2 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే, సీక్వెన్షియల్ ప్రాతిపదికన మాత్రం (సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే) క్యాడ్ తగ్గింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది జీడీపీలో 2 శాతంగా (సుమారు 10.1 బిలియన్ డాలర్లు) ఉంది. దేశంలోకి వచ్చే, వెళ్లే విదేశీ మారకం మధ్య వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. ఇది గతేడాది అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో 4.2 బిలియన్ డాలర్లుగా (జీడీపీలో 0.9 శాతం) నమోదైంది. సర్వీసుల ఎగుమతులు పెరగడం, ట్రావెల్.. సాఫ్ట్వేర్ సేవల ద్వారా వచ్చే ఆదాయాలు మెరుగుపడటం, డివిడెండ్లు.. వడ్డీలు మొదలైన వాటి రూపంలో దేశం వెలుపలికి వెళ్లే నిధుల పరిమాణం తగ్గడం తదితర అంశాలు సీక్వెన్షియల్‌గా చూస్తే క్యాడ్ తగ్గుదలకు దోహదపడ్డాయని ఆర్బీఐ తెలిపింది. ఇతరత్రా వాణిజ్యపరమైన లోటు 39.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఎగుమతులు 7.3 శాతం తగ్గడంతో పాటు దిగుమతులు 4.5 శాతం తగ్గాయి. ఇక ఏప్రిల్-డిసెంబర్ మధ్యన ఉత్పత్తుల ఎగుమతులు భారీగా ఎగియడం, దిగుమతులు మాత్రం స్వల్పంగానే పెరగడంతో చెల్లింపుల సమతౌల్యం (బీవోపీ) గణనీయంగా మెరుగుపడిందని ఆర్బీఐ వెల్లడించింది. క్యాడ్ మెరుగుపడుతుంది: విశ్లేషకులు ముడిచమురు, ఇతర కమోడిటీల ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో మార్చి క్వార్టర్లో క్యాడ్ మెరుగుపడగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. లోటు భర్తీ అయిపోయి 1.5 శాతం మేర మిగులు ఉండగలదని తెలిపారు. 2007 మార్చి క్వార్టర్ తర్వాత ఇలా మిగులులోకి మళ్లడం ఇదే ప్రథమం కాగలదని పలువురు అనలిస్టులు వివరించారు. -
ఎకానమీ రికవరీ మొదలైంది
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గుదల తోడ్పాటుతో కరెంటు అకౌంటు లోటును ప్రభుత్వం ఒక మోస్తరు స్థాయికి తేగలిగిందని, దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ వృద్ధి బాట పట్టడం మొదలైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. బడ్జెట్ ముం దస్తు సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆర్థికవేత్తలతో భేటీ అయిన సందర్భంగా జైట్లీ ఈ విషయాలు చెప్పారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌కి చెందిన రోహిణి సోమనాథన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్‌కి చెందిన సవ్యసాచి కర్, అహ్మదాబాద్ ఐఐఎంకి చెం దిన ఎరోల్ డిసౌజా తదితర ఆర్థికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు కూడా చేశారు. వ్యవసాయంలోనూ, ఇన్‌ఫ్రాలోనూ పెట్టుబడులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
2018కల్లా 5 లక్షల కోట్ల వ్యాపార లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ విజయా బ్యాంక్ వ్యాపార విస్తరణపై ప్రధానంగా దృష్టిసారించింది. ఇందుకోసం భారీ ఎత్తున కొత్త శాఖలను ఏర్పాటు చేయడంతో పాటు, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ (కాసా)పై దృష్టిసారిస్తున్నట్లు విజయా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.ఎస్.రామారావు తెలిపారు. హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన 1,550 శాఖను రామారావు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ వచ్చే నాలుగు నెల్లో మరో 150 శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా మార్చి నాటికి మొత్తం శాఖల సంఖ్యను 1,700కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రస్తుతం 135 శాఖలు ఉండగా, వచ్చే 16 నెలల్లో కొత్తగా 65 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో రూ. 15,000 కోట్లుగా ఉన్న వ్యాపారం ఈ ఏడాది చివరి నాటికి రూ. 17,000 కోట్లకు చేరుతుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న శాఖలు, సగటున ఏటా పదవీ విరమణ చేస్తున్న 600 మందిని దృష్టిలో పెట్టుకుంటే 1500 నుంచి 2,000 మంది కొత్త సిబ్బందిని తీసుకోవాల్సి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మూలధన ఇబ్బందులు లేవు బాసెల్ 3 నిబంధనల ప్రకారం మూలధనానికి ఎటువంటి ఇబ్బందులు లేవని, త్వరలోనే టైర్-1, టైర్-2 క్యాపిటల్ కింద రూ.1,100 కోట్లు సమీకరించనున్నట్లు రామారావు తెలిపారు. బాగా పతనమైన షేరు ధర కొద్దిగా పెరిగిన తర్వాత క్విప్ ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. గత నెలలో టైర్ 2 బాండ్స్ కింద రూ. 500 కోట్లు సేకరించింది. కిందటి నెలలో బ్యాంకులో ప్రభుత్వ వాటా 74 శాతం ఉంటే టైర్-2 బాండ్స్ ఇష్యూ తర్వాత 68 శాతానికి తగ్గిందని, ఇది క్విప్ ఇష్యూ తర్వాత 58 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించుకోనున్నట్లు ప్రకటించడంతో, వారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఫాలోఆన్ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గినా ఆర్బీఐ వెంటనే వడ్డీరేట్లు తగ్గిస్తుందని భావించడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించడం, కాసా అకౌంట్లపై దృష్టిపెట్టడం ద్వారా లాభదాయకతను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 19 శాతంగా ఉన్న కాసా డిపాజిట్లు మార్చి, 2015 నాటికి 22 శాతానికి చేరుకుంటుందన్నారు. పీఎస్‌యూ బ్యాంకుల్లోనే అత్యల్ప ఎన్పీఏలు కలిగి ఉన్న బ్యాంకుగా విజయాబ్యాంకు రికార్డులకు ఎక్కిందని, ప్రస్తుతం రూ. 2,239 (2.85%) కోట్లుగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులను ఈ ఆర్థిక ఏడాది చివరి నాటికి రూ. 2,100 కోట్లకు తగ్గుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కింద అందరికీ బ్యాంక్ అకౌంట్లను కల్పించడంపై దృష్టిసారించడంతో పీఎస్‌యూ బ్యాంకుల మధ్య విలీనాలకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. -
పసిడి దిగుమతులపై ఆంక్షలు మరికొంత కాలం
న్యూఢిల్లీ: ఇరాక్, కొన్ని ఇతర దేశాల్లోని పరిణామాలు కరెంటు అకౌంటు లోటు (క్యాడ్)పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున బంగారం దిగుమతులపై ఆంక్షలను ఇప్పుడే సడలించలేమని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. క్యాడ్ సమస్య అదుపులోకి వచ్చినప్పటికీ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ ఆదివారం మీడియాతో చెప్పారు. ‘ఇరాక్, మధ్య ప్రాచ్య దేశాల్లో సంఘర్షణలతో చమురు ధరలు ఎగిసి దిగుమతుల బిల్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. తద్వారా క్యాడ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. విదేశీ మారక ప్రవాహం స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే పుత్తడి దిగుమతులపై ఆంక్షల సడలింపుపై దృష్టిసారించగలం’ అని వివరించారు. బంగారం, పెట్రోలియం దిగుమతులు పెరిగిపోవడంతో 2012-13లో కరెంటు అకౌంటు లోటు రికార్డు స్థాయిలో 8,800 కోట్ల డాలర్లకు (స్థూల జాతీయోత్పత్తిలో 4.7 శాతం) చేరింది. తర్వాత బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించడంతో గతేడాది ఇది 3,240 కోట్ల డాలర్లకు(జీడీపీలో 1.7%) దిగివచ్చింది. కాగా స్విట్జర్లాండ్ జూన్‌లో భారత్‌కు రూ. 11,000 కోట్ల విలువైన బంగారం, వెండిలను ఎగుమతి చేసింది. స్విట్జర్లాండ్ మొత్తం ఎగుమతుల్లో (రూ.26,000 కోట్లు) ఇది 42 శాతానికి సమానమని స్విస్ ప్రభుత్వం వెల్లడించింది. ఇది మే దిగుమతులతో పోల్చితే 33 శాతం అధికమని పేర్కొంది. ఈ ఏడాది మొత్తానికి చూస్తే భారత్‌కు స్విట్జర్లాండ్ రూ.50 వేల కోట్ల విలువైన బంగారం, వెండిలను ఎగుమతి చేసింది. -
ఆ వెబ్సైట్ నకిలీది: ఆర్బీఐ
ముంబై: గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఆర్బీఐ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తమ దృష్టికి వచ్చిందని రిజర్వు బ్యాంకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. http://www.rbiinonline.org/ savings.htm పేరుతో ఉన్న ఆ వెబ్సైట్ ఆఫరు చేస్తున్న సేవింగ్స్ అకౌంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు సూచించింది. ఈ వెబ్సైట్ ఆఫర్లకు ఆకర్షితులై మోసపోవద్దని కోరింది. సేవింగ్స్ అకౌంటు, కరెంటు అకౌంటు, క్రెడిట్ కార్డుల వంటి వాణిజ్య బ్యాంకింగ్ సేవలను తాము అందించడం లేదని తెలిపింది. నకిలీ వెబ్‌సైట్‌కు సంబంధించి తాము గతంలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలను తమ అధికారిక వెబ్సైట్ rbi.org.inలో చూడవచ్చని రిజర్వు బ్యాంకు తెలిపింది. -
బంగారం దిగుమతి టారిఫ్ పెంపు
న్యూఢిల్లీ: దేశంలో బంగారం దిగుమతికి సంబంధించిన టారిఫ్ విలువ పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాములకు 433 డాలర్లుగా ఉన్న టారిఫ్‌ను 445 డాలర్లకు పెంచుతున్నట్లు కేంద్రీయ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ బోర్డు(సీబీఈసీ) నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రధానంగా దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుం టుంది. తద్వారా విలువను తక్కువచేసి చూపేందుకు(అండర్ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే ప్రధానోద్దేశం. అంతర్జాతీయంగా బంగారం ధరల ధోరణికి అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఈ టారిఫ్ విలువలో మార్పులను ప్రభుత్వం చేపడుతుంది. కాగా, వెండి దిగుమతి టారిఫ్ విలువను మాత్రం కేజీకి ఇప్పుడున్న 699 డాలర్ల నుంచి 694 డాలర్లకు తగ్గించారు. దేశంలో బంగారం దిగుమతులను అడ్డుకట్టకోసం కస్టమ్స్ సుంకాన్ని 10 శాతానికి పెంచడం, ఇతరత్రా ఆంక్షలు విధించడం తెలిసిందే. వీటి ఫలితంగా 2013-14లో పుత్తడి దిగుమతులు 550 టన్నులకు మించబోవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. క్రితం ఏడాది దిగుతులు 845 టన్నులు. -
క్యాడ్‌కు ఇంజనీరింగ్ పరికరాల దిగుమతుల ఆజ్యం
న్యూఢిల్లీ: భారత్‌లో కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఎగబాకడానికి పసిడి, ముడిచమురు దిగుమతులు దూసుకెళ్లడంతోపాటు ఇంజనీరింగ్ పరికరాల దిగుమతులు భారీగా పెరగడం కూడా ఆజ్యం పోస్తోంది. దేశం నుంచి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల కంటే దిగుమతులే అధికంగా ఉంటున్నాయి. దీంతో వ్యత్యాసం గత ఏడాది 17 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్-జూలై మధ్య కూడా సంబంధిత ఎగుమతులు 5.77 శాతం తగ్గినట్లు ఇంజనీరింగ్ ఎగుమతుల సంస్థల అసోసియేషన్ ఈఈపీసీ ఇండియా పేర్కొంది. పెరుగుతున్న వాణిజ్య లోటుతో క్యాడ్ కూడా ఎగబాకుతోంది. గతేడాది(2012-13) క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(4.8%-90 బిలియన్ డాలర్లు) దూసుకెళ్లింది.