తగ్గిన కరెంట్ అకౌంట్ లోటు
2016–17లో 0.7 శాతం
ముంబై: కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ, క్యాడ్) 2016–17 ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే క్యాడ్ 0.7 శాతంగా నమోదయ్యింది. 2015–16లో ఈ రేటు 1.1 శాతంగా ఉంది. విలువ రూపంలో ఇది 130 బిలియన్ డాలర్ల నుంచి 112 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఏ, ఈసీబీ మినహా ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకనిల్వల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్.
జీడీపీలో పోల్చిచూసి, ఎంత తక్కువ ఉంటే, అంత ఆర్థిక వ్యవస్థకు సానుకూలమైనదిగా దీనిని పరిగణిస్తారు. భారత్ ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసమైన వాణిజ్య లోటు తగ్గడం– మొత్తంగా 2016–17లో క్యాడ్ తగ్గడానికి కారణమని ఆర్‌బీఐ గురువారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. కాగా గడచిన ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో మాత్రం క్యాడ్ 0.6% పెరిగింది.