ముంబై: నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చి–పోయే విదేశీ మారక ద్రవ్యం నికర వ్యత్యాలను ప్రతిబింబించే భారత్ కరెంట్ అకౌంట్.. తాజా అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతికి అద్దం పడుతోంది. భారత్ కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ– క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం జూలై–సెపె్టంబర్ కాలంలో భారీగా ఒక శాతానికి (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ విలువలతో పోల్చి) పరిమితమైంది.
విలువల్లో ఇది 8.3 బిలియన్ డాలర్లు. సమీక్షా కాలంలో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు తగ్గడం, సేవల రంగం ఎగుమతుల్లో పెరుగుదల దీనికి కారణం. 2022 ఇదే కాలంలో కరెంట్ అకౌంట్ లోటు 3.8 శాతంగా (విలువలో 30.9 బిలియన్ డాలర్లు) నమోదయ్యింది. ఆర్‌బీఐ తాజా ఈ తాజా గణాంకాలను విడుదల చేసింది. తాజా ముఖ్య గణాంకాలను పరిశీలిస్తే..
► 2022–23 జూలై–సెపె్టంబర్ నెలల్లో వస్తు ఎగుమతుల విలువ 78.3 బిలియన్ డాలర్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ 61.9 బిలియన్ డాలర్లకు తగ్గింది.
► సేవల ఎగుమతులు 4 శాతం ఎగశాయి. సాఫ్ట్‌వేర్ ఎగుమతులు పెరగడం, వ్యాపార, పర్యాటక సేవలు మెరుగుపడ్డాయి.
ఎగుమతుల ఒడిదుడుకులు...
అంతర్జాతీయ తీవ్ర అనిశ్చితి పరిస్థితులకు భారత్ వస్తు ఎగుమతులు అద్దం పడుతున్నాయి. అక్టోబర్‌లో ‘ప్లస్’లోకి వచి్చన ఎగుమతులు తిరిగి నవంబర్‌లో మైనస్‌లోకి జారిపోయాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెప్టెంబర్‌లో 2.6 శాతం క్షీణించాయి.
అక్టోబర్‌లో సానుకూల ఫలితం వెలువడింది. మరుసటి నెల– నవంబర్‌లోనే మళ్లీ క్షీణరేటు నమోదయ్యింది. ఇక దిగుమతుల విషయానికి వస్తే.. 10 నెలల తర్వాత అక్టోబర్‌లో ఎగువబాటకు చేరిన దిగుమతులు నవంబర్‌లో మళ్లీ క్షీణతలోకి జారాయి. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 6.51 శాతం క్షీణించి 278.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.67 శాతం క్షీణించి 445.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు– ఈ ఏడు నెలల్లో 166.36 బిలియన్ డాలర్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment