భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా ఏడు వారాలపాటు స్థిరమైన పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో విదేశీ మారకద్రవ్య నిల్వలు మొదటిసారి 12.588 బిలియన్ డాలర్లు పెరిగి.. 700 బిలియన్స్ దాటినట్లు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద పెరుగుదలలో ఇది ఒకటని ఆర్‌బీఐ పేర్కొంది.
విదేశీ మార్కద్యవ్య నిల్వలు 700 బిలియన్ డాలర్లు దాటడంతో.. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తరువాత ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. రీవాల్యుయేషన్ లాభాలు, స్పాట్ మార్కెట్ డాలర్ కొనుగోళ్ల కారణంగా విదేశీ కరెన్సీ ఆస్తులు 10.46 బిలియన్లు పెరిగాయి.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అవిరల్ జైన్
గత వారం (సెప్టెంబర్ 20) విదేశీ మారకద్రవ్య నిల్వలు 2.84 బిలియన్ డాలర్లు పెరి 692.29 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ తరువాత మారకద్రవ్య నిల్వలు మొదటిసారి 12.588 బిలియన్ డాలర్లు పెరిగి 704.885 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సెప్టెంబర్ 20న బంగారం నిల్వలు కూడా 2.18 బిలియన్ డాలర్లు పెరిగి 65.79 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment