ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా ఐదు వారాల పెరుగుదల తర్వాత డిసెంబర్ 16తో ముగిసిన వారంలో తగ్గాయి. డిసెంబర్ 9వ తేదీన 564.06 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫారెక్స్ నిల్వలు 16తో ముగిసిన వారానికి 571 మిలియన్ డాలర్లు తగ్గి 563.499 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ తాజా గణాంకాలు వెల్లడించాయి.
అక్టోబర్ 2021లో దేశ విదేశీ మారకపు విలువ 645 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే ప్రపంచ పరిణామాలు, ఒత్తిళ్లు, రూపాయిని రక్షించుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ చర్యలతో గరిష్టం నుంచి దాదాపు 100 బిలియన్ డాలర్లు తగ్గి దాదాపు ఒక దశలో 540 బిలియన్ డాలర్ల వరకూ పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment