రష్యాను అధిగమించిన భారత్‌..! | India Becomes World 4th Biggest Foreign Exchange Reserves Surpass To Russia | Sakshi
Sakshi News home page

రష్యాను అధిగమించిన భారత్‌..!

Published Mon, Mar 15 2021 1:19 PM | Last Updated on Mon, Mar 15 2021 4:31 PM

 India Becomes World 4th Biggest  Foreign Exchange Reserves Surpass To Russia - Sakshi

న్యూఢిల్లీ: విదేశీ-మారక నిల్వల్లో రష్యాను అధిగమించి ప్రపంచంలో నాలుగో  అతి పెద్ద విదేశీ మారక నిల్వల దేశంగా భారత్‌ అవతరించింది. దక్షిణాసియా దేశాల సెంట్రల్ బ్యాంక్ పెట్టుబడుల ఉపసంహరణ చర్యలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడానికి డాలర్లను నిల్వ చేయడంతో భారత్‌ విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయి.ఈ ఏడాది పెట్టుబడులు  వేగంగా పెరిగిన తరువాత,  ఇరు దేశాల మారక నిల్వలు దాదాపు సమానమయ్యాయి. ఇటీవలి వారాల్లో రష్యా కంపెనీల్లో పెట్టుబడులు  వేగంగా తగ్గడంతో మారక నిల్వల్లో భారత్  ముందుకు వచ్చింది. ఫలితంగా ప్రపంచం విదేశీ మారక నిల్వల్లో భారత్‌ నాలుగో స్థానాన్ని ఆక్రమించింది.

విదేశీ మారక నిల్వల్లో భారత్‌ నాలుగో స్ధానం..
మార్చి 5 నాటికి భారతదేశ విదేశీ కరెన్సీ హోల్డింగ్స్ 4.3 బిలియన్ డాలర్లు తగ్గి 580.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం తెలిపింది. రష్యా 580.1 బిలియన్‌ డాలర్ల మారక నిల్వలు కలిగి ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం విదేశీ మారక నిల్వల్లో మొదటి స్థానంలో చైనా ఉండగా,  తరువాతి స్థానాల్లో వరుసగా జపాన్ , స్విట్జర్లాండ్ ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌ దగ్గర సుమారు 18 నెలల దిగుమతులను చేయడానికి సరిపోయే విదేశీ నిల్వలున్నాయి. అరుదైన కరెంట్-అకౌంట్ మిగులు, స్థానిక స్టాక్ మార్కెట్‌లోకి పెట్టుబడుల పెరుగుదల, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అధికంగా రావడంతో మారక నిల్వలు పెరిగాయి.ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు బలమైన విదేశీ మారక నిల్వలతో  విదేశీ పెట్టుబడిదారులకు,  క్రెడిట్ రేటింగ్ కంపెనీలకు ప్రభుత్వం  రుణ బాధ్యతలను తీర్చగలదని విశ్లేషకులు తెలిపారు.

ఈ తాజా డేటాను విడుదల చేయడానికి ముందే డ్యూయిష్ బ్యాంక్ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ కౌశిక్ దాస్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లలో భారత్‌లో వివిధ  నిల్వలు  గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. ఫారెన్‌ ఎక్సేఛేంజ్‌ నిల్వలు గణనీయంగా పెరగడంతో ఆర్థిక వ్యవస్థకు  ఏదైనా బాహ్య షాక్-ఆధారిత మూలధన-స్టాప్ , రాబోయే కాలంలో పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సులువుగా ఆర్బీఐ డీల్‌ చేయగలదు.సెంట్రల్ బ్యాంక్ డేటా ప్రకారం గత ఏడాది స్పాట్ ఫారెన్‌ ఎక్సేఛేంజ్‌ మార్కెట్లో ఆర్బిఐ 88 బిలియన్ డాలర్లను  నికరంగా కొనుగోలు చేసింది. ఇది గత ఏడాది ఆసియాలోని ప్రధాన కరెన్సీలలో రూపాయి విలువ  చెత్తగా ప్రదర్శించడానికి సహాయపడింది.రూపాయి విలువ సోమవారం 0.1% పెరిగి డాలర్‌కు 72.71 కు చేరుకుంది. ఇటీవలి ఆర్బిఐ నివేదిక-2013 విదేశీ-మారక నిల్వలను మరింత బలోపేతం చేయాలని సిఫారసు చేసింది.

(చదవండి: అదిరిపోయిన కియా ఎలక్ట్రిక్‌ కార్‌ టీజర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement