
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు (ఫారెక్స్) జూన్ 16వ తేదీతో ముగిసిన వారంలో 596.098 బిలియన్ డాలర్లకు చేరాయి. జూన్ 9వ తేదీతో ముగిసిన వారంలో పోలి్చతే 2.35 బిలియన్ డాలర్లు ఎగశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం రికార్డు స్థాయికి మరో 50 బిలియన్ డాలర్ల దూరానికి ఫారెక్స్ నిల్వలు చేరాయి.
2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైమ్ రికార్డు 645 బిలియన్ డాలర్లను తాకాయి. రూపాయి పతన నివారణకు చర్యలుసహా ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆర్‌బీఐ తీసుకున్న పలు చర్యల నేపథ్యంలో రికార్డు స్థాయి నుంచి 100 బిలియన్ డాలర్లు కిందకు దిగాయి. తిరిగి మళ్లీ పురోగమన బాటన పయనిస్తున్నాయి. ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు దేశ దాదాపు 12 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment