
ముంబై: భారత్ విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వల పరిమాణం రికార్డుల స్థాయిగా కదులుతోంది. జనవరి 12వ తేదీతో ముగిసిన వారంలో నిల్వలు 1.63 బిలియన్ డాలర్లు పెరిగి 618.9 బిలియన్ డాలర్లకు ఎగశాయి. 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 645 బిలియన్ డాలర్లకు ఎగశాయి. రూపాయి పటిష్టతను కాపాడడం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 100 బిలియన్ డాలర్లకుపైగా తగ్గినప్పటికీ తిరిగి కొంత ఒడిదుడుకులతో ఎగువదిశగా ఫారెక్స్ నిల్వలు ఎగశాయి. ప్రస్తుత దేశ ఫారెక్స్ నిల్వలు 13 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా.
► మొత్తం నిల్వల్లో ప్రధాన భాగంగా ఉన్న డాలర్ల రూపంలోని ఫారిన్ కరెన్సీ అసెట్స్ 1.859 బిలియన్ డాలర్లు ఎగసి 548.508 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
► పసిడి నిల్వల విలువ 242 మిలియన్ డాలర్ల పెరిగి 47.247 బిలియన్ డాలర్లకు ఎగసింది.
► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)– స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) విలువ 12 మిలియన్ డాలర్లు పెరిగి 18.31 బిలియన్ డాలర్లకు చేరింది.
► ఐఎంఎఫ్ వద్ద భారత్ నిల్వల 6 మిలియన్ డాలర్లు పెరిగి 4.872 బిలియన్ డాలర్లకు
ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment