all-time high
-
ఎన్ఎస్ఈ నిఫ్టీ.. భళా
మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 58 పాయింట్లు బలపడి 23,323 వద్ద నిలిచింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఇంట్రాడేలోనూ 177 పాయింట్లు పురోగమించి 23,442 వద్ద సరికొత్త రికార్డును సాధించింది. ఇక ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో తొలి సెషన్లో సెన్సెక్స్ 594 పాయింట్లు జంప్ చేసింది. ఇంట్రాడే రికార్డ్ 77,079కు చేరువగా 77,050ను అధిగమించింది. చివరికి 150 పాయింట్లు జమ చేసుకుని 76,607 వద్ద ముగిసింది. ముంబై: ఎంపిక చేసిన బ్లూచిప్ షేర్లకు డిమాండ్ నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు మళ్లీ జోరందుకున్నాయి. రోజంతా ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ఆసక్తి చూపడంతో లాభాలమధ్యే కదిలాయి. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) మరోసారి కొత్త రికార్డును లిఖించింది. రూ. 429.32 లక్షల కోట్లను(5.14 ట్రిలియన్ డాలర్లు) అధిగమించింది. కాగా.. ఎన్ఎస్ఈలో మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, హెల్త్‌కేర్ రంగాలు 2–1 శాతం మధ్య పుంజుకున్నాయి. చిన్న షేర్లు జూమ్ బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతానికిపైగా బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,518 లాభపడితే.. 1,376 మాత్రమే డీలాపడ్డాయి. నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 427 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 234 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. ఫెడ్‌పై దృష్టి దేశీయంగా జీడీపీ పురోగతిపై ఆర్బీఐ ఆశావహ అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకురానున్న తుది బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇవికాకుండా యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు బలహీనపడినట్లు తెలియజేశారు. విదేశీ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 83 డాలర్లకు చేరగా, డాలరుతో మారకంలో రూపాయి నామమాత్రంగా 3 పైసలు బలపడి 83.56(ప్రొవిజినల్) వద్ద ముగిసింది. ఇక్సిగో ఐపీవో బంపర్ సక్సెస్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఇక్సిగో మాతృ సంస్థలే ట్రావెన్యూస్ టెక్నాలజీ చేపట్టిన పబ్లిక్ ఇష్యూ సూపర్ సక్సెస్‌ను సాధించింది. షేరుకి రూ. 88–93 ధరలో బుధవారం ముగిసిన ఇష్యూ 98 రెట్లు అధిక సబ్‌్రస్కిప్షన్‌ను అందుకుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 740 కోట్లు సమీకరించింది.డీ డెవలప్మెంట్ @ రూ. 193–203పైపింగ్ సొల్యూషన్స్ కంపెనీ డీ డెవలప్మెంట్ ఇంజనీర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 193–203 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవో ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 418 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఈ నిధులను వినియోగించుకోవాలన్నది సంస్థ ప్రణాళిక. -
రికార్డు స్ధాయి దిశగా ఫారెక్స్ నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వల పరిమాణం రికార్డుల స్థాయిగా కదులుతోంది. జనవరి 12వ తేదీతో ముగిసిన వారంలో నిల్వలు 1.63 బిలియన్ డాలర్లు పెరిగి 618.9 బిలియన్ డాలర్లకు ఎగశాయి. 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 645 బిలియన్ డాలర్లకు ఎగశాయి. రూపాయి పటిష్టతను కాపాడడం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 100 బిలియన్ డాలర్లకుపైగా తగ్గినప్పటికీ తిరిగి కొంత ఒడిదుడుకులతో ఎగువదిశగా ఫారెక్స్ నిల్వలు ఎగశాయి. ప్రస్తుత దేశ ఫారెక్స్ నిల్వలు 13 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. ► మొత్తం నిల్వల్లో ప్రధాన భాగంగా ఉన్న డాలర్ల రూపంలోని ఫారిన్ కరెన్సీ అసెట్స్ 1.859 బిలియన్ డాలర్లు ఎగసి 548.508 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► పసిడి నిల్వల విలువ 242 మిలియన్ డాలర్ల పెరిగి 47.247 బిలియన్ డాలర్లకు ఎగసింది. ► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)– స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) విలువ 12 మిలియన్ డాలర్లు పెరిగి 18.31 బిలియన్ డాలర్లకు చేరింది. ► ఐఎంఎఫ్ వద్ద భారత్ నిల్వల 6 మిలియన్ డాలర్లు పెరిగి 4.872 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
ఇళ్ల విక్రయాలు ఆల్‌టైమ్ హై రికార్డ్.. హైదరాబాద్‌లో అత్యధికం
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ కాలంలో ఇళ్ల విక్రయాలు భారీగా పెరిగి ఆల్‌టైమ్ హై రికార్డ్‌ను నమోదు చేశాయి. స్థిరమైన తనఖా రేటు మధ్య బలమైన డిమాండ్‌తో జూలై-సెప్టెంబర్ కాలంలో ఏడు ప్రధాన నగరాల్లో గృహాల విక్రయాలు గతేడాది కంటే 36 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 1,20,280 యూనిట్లకు చేరుకున్నట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ (Anarock) నివేదిక పేర్కొంది. (ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త.. రూ.60 వేల కోట్లతో కొత్త పథకం!) హైదరాబాద్‌లో అత్యధికం అనరాక్ నివేదిక ప్రకారం.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గత ఏడాది కాలంలో గృహాల విక్రయాలు 88,230 యూనిట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ కాలంలో ఏడు నగరాల్లో సగటు గృహాల ధరలు ఏటా 11 శాతం పెరిగాయి. హైదరాబాద్‌లో ఏటా జులై-సెప్టెంబర్ కాలంలో ఇళ్ల ధరల సగటు పెరుగుదల అత్యధికంగా 18 శాతం ఉంది. (అపార్ట్మెంట్ బదులు భూములు కొంటే 10 రెట్ల లాభం! ఎలాగో తెలుసా?) ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో త్రైమాసిక విక్రయాలు ఆల్‌టైమ్ హైని తాకినట్లు అనరాక్ హైలైట్ చేసింది. అయితే ఈ నివేదికలో అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ ఫ్లోర్ల విక్రయాలను చేర్చారు. ప్లాట్లు(ఖాళీ స్థలాలు)ను మాత్రం ఇందులో చేర్చలేదు. ఏడు నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఇలా.. ఢిల్లీ-ఎన్సీఆర్లో గృహాల విక్రయాలు 2023 జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో 14,970 యూనిట్ల నుంచి 6 శాతం పెరిగి 15,865 యూనిట్లకు చేరుకున్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఈ కాలంలో ఇళ్ల విక్రయాలు అత్యధికంగా 46 శాతం పెరిగి 26,400 యూనిట్ల నుంచి 38,500 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో గృహాల విక్రయాలు గత ఏడాది ఇదే కాలంలో 12,690 యూనిట్ల నుంచి ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో 29 శాతం పెరిగి 16,395 యూనిట్లకు చేరుకున్నాయి. పుణెలో ఇళ్ల అమ్మకాలు గరిష్టంగా 63 శాతం పెరిగి 14,080 యూనిట్ల నుంచి 22,885 యూనిట్లకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో నివాస గృహాల విక్రయాలు 41 శాతం పెరిగి 11,650 యూనిట్ల నుంచి 16,375 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నైలో ఇళ్ల విక్రయాలు 42 శాతం పెరిగి 3,490 యూనిట్ల నుంచి 4,940 యూనిట్లకు చేరుకున్నాయి. కోల్‌కతాలో గృహాల అమ్మకాలు జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో 4,950 యూనిట్ల నుంచి 7 శాతం పెరిగి 5,320 యూనిట్లకు చేరుకున్నాయి. -
పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ రూ.330
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచింది. లీటర్ పెట్రోల్‌పై రూ.26.02, డీజిల్‌పై రూ.17.34 పెంచుతున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధర గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి రూ.330కు చేరుకుంది. ద్రవ్యోల్బణం 27.4 శాతానికి చేరడంతో ఈ చర్య అనివార్యమయినట్లు ప్రభుత్వం చెబుతోంది. శనివారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 296.41 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. ఈ నెల ఒకటో తేదీన కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.14 చొప్పున పెంచింది. -
ఆగస్ట్‌లో ఆల్‌టైమ్ ‘రయ్’!
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఆగస్టులో ఆల్‌టైం గరిష్టానికి చేరుకున్నాయి. ఎస్యూవీ(స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్)లకు డిమాండ్ కొనసాగడం, పండుగ సీజన్ మొదలవడంతో గిరాకీ పుంజుకుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మారుతీ సుజుకీ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపింది. మొత్తం 1,89,082 వాహనాలు విక్రయించింది. గతేడాది ఇదే నెల అమ్మకాలు 1,65,173 యూనిట్లతో పోలిస్తే 14% అధికం. హ్యుందాయ్, ఎంఅండ్ఎం, టయోటా కిర్లోస్కర్ కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. టాటా మోటార్స్, హోండా కార్స్ విక్రయాల్లో స్వల్ప క్షీణత నమోదైంది. ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్ ఆటో విక్రయాలు 15% తగ్గాయి. హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 6%, 4% పెరిగాయి. వాణిజ్య వాహనాలు, ట్రాకర్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. -
గరిష్టానికి విద్యుత్ డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్‌కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆర్థిక కార్యకలాపాలు బలంగా సాగుతుండడం, తయారీ రంగానికి కేంద్రం పెద్ద ఎత్తున మద్దతునిస్తూ ఉండడం, ప్రజల ఖర్చు చేసే ఆదాయంలో పెరుగుదల కలసి విద్యుత్ వినియోగాన్ని ఏటేటా ఆల్‌టైమ్ గరిష్టానికి తీసుకెళుతున్నాయి. దీంతో డిమాండ్‌ను చేరుకునేందుకు విద్యుత్ తయారీ సంస్థలు (పవర్ ప్లాంట్లు), బొగ్గు గనుల కంపెనీలు పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జవవరిలో విద్యుత్ వినియోగం, క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 13.5 బిలియన్ కిలోవాటర్ హవర్గా ఉంది. ఇది 12 శాతం వృద్ధికి సమానం. గ్రిడ్ ఇండియా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. జనవరిలో గరిష్ట డిమాండ్ 211 గిగావాట్లుగా నమోదైంది. 2021 జనవరి నెలతో పోలిస్తే 10 శాతం ఎక్కువ. థర్మల్ ప్లాంట్లు 16 బిలియన్ కిలోవాటర్ హవర్ మేర ఉత్పత్తిని అదనంగా చేశాయి. ఇది క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 18 శాతం అధికం కావడం గమనించాలి. ఏటేటా పెరుగుదల.. దేశంలో విద్యుత్‌కు డిమాండ్ ఉష్ణోగ్రతల ఆధారితం కాకుండా, నిర్మాణాత్మకంగానే పెరుగుతూ వస్తోంది. 2022 సంవత్సరం విద్యుత్‌కు డిమాండ్ 6 శాతానికి పైన పెరిగింది. కానీ, గడిచిన దశాబ్ద కాలంలో వార్షికంగా విద్యుత్ సగటు పెరుగుదల 4%గానే ఉండడం గమనించాలి. దేశంలో వ్యాపార కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నట్టు ‘పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్’ సర్వే గణాంకాలు తెలియజేస్తున్నాయి. తయారీలో 55.4గా ఉంటే సేవల పీఎంఐ 57.2గా జనవరి నెలకు నమోదయ్యాయి. కంపెనీలకు సమస్యలు దేశీయంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు సరిపడా బొగ్గును సరఫరా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కోల్ ఇండియా ఒక్కటే 90% అవసరా లు తీరుస్తున్న విషయం తెలిసిందే. గతేడాది 12% అధికంగా బొగ్గు సరఫరా జరిగింది. కానీ, విద్యుదుత్పత్తి సంస్థల వాస్తవ అవసరాల కంటే ఇది తక్కువ కావడం గమనించాలి. అందుకే 10% వరకు విదేశీ బొగ్గును దిగుమతి చేసి వాడుకోవాలంటూ కేంద్రం సూచనలు సైతం చేసింది. రైల్వే శాఖ ఫిబ్రవరిలో రోజువారీగా 271 గూడ్స్ రైళ్లను బొగ్గు సరఫరా కోసం నడిపించింది. కానీ, వాస్తవ లక్ష్యమైన రోజు వారీ 313 రైళ్ల కంటే తక్కువేనని తెలుస్తోంది. ముఖ్యంగా ప్లాంట్లకు కావాల్సినంత బొగ్గును సరఫరా చేయడంలో రైల్వే వైపు నుంచి కొరత ఉంది. ప్రస్తుతం కంపెనీల వద్ద 12 రోజుల విద్యుత్ తయా రీ అవసరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో 9 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. 2021లో 15 రోజులు, 20 20లో 28 రోజులు, 2019లో 18 రోజులతో పోలిస్తే బొగ్గు నిల్వలు తక్కువ రోజులకే ఉన్నట్టు తెలుస్తోంది. సరఫరా పెంచేందుకు చర్యలు.. బొగ్గు సరఫరా పెంచేందుకు గాను విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటూ జెన్కోలను కేంద్ర ప్రభుత్వం కోరింది. దేశీ బొగ్గుతో కలిపి తయారీకి వినియోగించుకోవాలని సూచించింది. దిగుమతి చేసుకునే బొగ్గుతో నడిచే ప్రైవేటు సంస్థలను సైతం గరిష్ట స్థాయిలో విద్యుత్ తయారీ చేయాలని ఆదేశించింది. పునరుత్పాదక విద్యుత్ తయారీని పెంచేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు కొంత వరకు ఉపశమనం కల్పించాయి. కానీ, బొగ్గు ఆధారిత సామర్థ్యంతో పోలిస్తే పునరుత్పాదక తయారీ సామర్థ్యం చాలా తక్కువగానే ఉంది. దీంతో ఇప్పటికీ థర్మల్ ప్లాంట్లపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఫిబ్రవరిలో నమోదైన మొత్తం సరఫరాలో బొగ్గు ఆధారిత విద్యుత్ 76 శాతం స్థాయిలో ఉంది. ఈ ఏడాది జనవరి నెలలో పునరుత్పాదక ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ తయారీ 15 శాతం పెరిగింది. విండ్ ద్వారా 50 శాతం పెరగ్గా, సోలార్ ద్వారా 37 శాతం పెరుగుదల ఉంది. మధ్యకాలానికి పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, దాంతో బొగ్గుపై ఆధారపడడం తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. -
జీఎస్టీ వసూళ్లు.. రికార్డ్
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మార్చి నెల్లో ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదుచేశాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం రూ.1.42 లక్షల కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 15 శాతం పురోగతి నమోదయ్యింది. ఎకానమీ రికవరీ, పటిష్ట అమ్మకాలను గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. దీనికితోడు పన్ను ఎగవేతల నిరోధానానికి కేంద్రం తీసుకున్న పలు చర్యలూ తగిన ఫలితాలు ఇస్తున్నాయి. కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2022లో జనవరిలో నమోదయిన వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లు ఇప్పటి వరకూ రికార్డుగా ఉన్నాయి. తాజా గణాంకాలు ఈ అంకెలను అధిగమించాయి. ► మొత్తం రూ.1,42,095 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.25,830 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ.32,378 కోట్లు ఇంటిగ్రేటెడ్ (రెండూ కలిసి) వాటా రూ.74,470 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలయిన రూ.39,131 కోట్లుసహా). సెస్ రూ.9,417 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలయిన రూ.981 కోట్లుసహా). ► 2022 మార్చిలో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 25 శాతం అధికం. దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ఆదాయాలు 11 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. ► 2022 ఫిబ్రవరిలో మొత్తం ఈ–వే బిల్లుల సంఖ్య 6.91 కోట్లు. ఇది వ్యాపార కార్యకలాపాల వేగవంతమైన రికవరీని సూచిస్తోంది. ► గత ఆర్థిక సంవత్సరం రూ. లక్ష కోట్లపైన జీఎస్టీ వసూళ్లు ఇది వరుసగా తొమ్మిదవ నెల. మే, జూన్ మినహా మిగిలిన పది నెలల్లో వసూళ్లు రూ.లక్ష కోట్లను అధిగమించాయి. ఇక వసూళ్లు రూ.1.30 లక్షల కోట్లను దాటడం ఆర్థిక సంవత్సరంలో ఆరవసారి. -
ఎల్ఐసీ.. షంషేర్!
కరోనా కల్లోలం ఆర్థిక స్థితిగతులను అతలాకుతలం చేసింది. కానీ ఎల్ఐసీకి మాత్రం స్టాక్ మార్కెట్లో లాభాల పంట పండించింది. మార్చిలో కనిష్ట స్థాయికి పడిపోయిన స్టాక్ మార్కెట్ మెల్లమెల్లగా రికవరీ అయి ప్రస్తుతం జీవిత కాల గరిష్ట స్థాయి రికార్డ్‌లు సృష్టిస్తోంది. మార్కెట్ పతన సమయంలో కొని, పెరుగుతున్నప్పుడు విక్రయించే ‘కాంట్రా’ వ్యూహాన్ని అమలు చేసే ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ కూడా జీవిత కాల గరిష్ట స్థాయికి చేరాయి. కల్లోల కంపెనీల నుంచి వైదొలగడం, వృద్ధి బాటన ఉన్న కంపెనీల్లో వాటాలను పెంచుకోవడం ద్వారా ఎల్ఐసీ మంచి లాభాలు కళ్లజూస్తోంది. ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్‌కు సంబంధించి సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... భారత్‌లో అతి పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ ఎల్ఐసీనే. ఈ జీవిత బీమా దిగ్గజం ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఈ ఆర్థిక సంవత్సరంలో జోరుగా పెరిగి రికార్డ్ స్థాయికి చేరింది. భారత్‌లోని టాప్ 200 కంపెనీల్లో ఎల్‌ఐసీకున్న వాటాల విలువ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 7,700 కోట్ల డాలర్లకు ఎగసిందని అంచనా. సెప్టెంబర్ నుంచి చూస్తే, మార్కెట్ 12 శాతం మేర పెరిగింది. దీంతో ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ కూడా ఆ రేంజ్‌లోనే పెరిగాయి. వీటి విలువ ప్రస్తుతం 8,600 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.6.45 లక్షల కోట్లు) పెరిగి ఉండొచ్చని అంచనా. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. దీంతో 2018 మార్చినాటి 8,400 కోట్ల డా లర్ల అత్యధిక ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ రికార్డ్ బ్రేక్ అయినట్లే. ఆర్నెల్లలో 40 శాతం అప్... కరోనా కల్లోలం కారణంగా ఈ ఏడాది మార్చిలో స్టాక్ మార్కెట్ బాగా నష్టపోయింది. దీంతో ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ 5,500 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఆశాజనక వార్తలు రావడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటుండటంతో స్టాక్ మార్కెట్ రికవరీ బాట పట్టింది. ప్రస్తుతం స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ హైల వద్ద ట్రేడవుతున్నాయి. స్టాక్ మార్కెట్ రికవరీ కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌నాటికి ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ 40 శాతం (2,200 కోట్ల డాలర్లు–లక్షన్నర కోట్లకు మించి)ఎగసి 7,700 కోట్ల డాలర్లకు(రూ.5.7 లక్షల కోట్లకు )చేరింది. కంపెనీల్లో ఎల్ఐసీ వాటా పెరగడం, కంపెనీల్లో ఉన్న ఎల్ఐసీ వాటాల విలువ కూడా పెరగడం దీనికి ప్రధాన కారణాలు. జూన్ 30 నాటికి ఎల్ఐసీకి దాదాపు 329 కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ఎల్ఐసీ ఇన్వెస్ట్ చేసిన మొత్తం షేర్లలో 96 శాతం సానుకూల రాబడులనిచ్చాయి. ఎల్ఐసీ...మంచి కాంట్రా ప్లేయర్! ఈ ఏడాది ఏప్రిల్ నుంచి షేర్లలో ఇప్పటివరకూ రూ.55,000 కోట్లు ఇన్వెస్ట్ చేశామని ఎల్ఐసీ ఉన్నతాధికారొకరు చెప్పారు. గత ఏడాది ఇదే కాలానికి రూ. 32,800 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఎల్ఐసీకి మంచి కాంట్రా ప్లేయర్ అనే పేరు ఉంది. అంటే మార్కెట్ పతనసమయంలో ఇన్వెస్ట్ చేసి మార్కెట్ పెరుగుతున్న సమయంలో అమ్మేసి లాభాలు చేసుకుంటుంది. ఈ ఏడాది స్టాక్ మార్కెట్ 40% పతనం కావడం, వెంటనే రికవరీ కావడం కూడా ఎల్ఐసీకి కలసివచ్చింది. ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి చూస్తే రూ.10,000 కోట్ల లాభం ఆర్జించామని ఎల్ఐసీ చైర్మన్ ఎమ్ఆర్ కుమార్ ఈ ఏడాది ఆగస్టులోనే వెల్లడించారు. ఇక ఇప్పుడు స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ హైల వద్ద ట్రేడవుతుండటంతో ఎల్ఐసీకి భారీ లాభాలు వచ్చి ఉంటాయని నిపుణుల అంచనా. బీమా కంపెనీలకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కీలకమని నిపుణుల అభిప్రాయం. అందుకే నాణ్యత గల షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎల్ఐసీ మంచి లాభాలు కళ్లజూస్తోందని వారంటున్నారు. తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల నుంచి ఎల్ఐసీ తన వాటాలను తగ్గించుకుంటోంది. అధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతోంది. 1 శాతం కంటే తక్కువ వాటా ఉన్న 33 కంపెనీల నుంచి వైదొలగింది. గతంలో యస్‌బ్యాంక్‌లో ఎల్ఐసీ వాటా 8 శాతంగా ఉంది. ఎప్పుడైతే ఈ బ్యాంక్‌కు సంబంధించిన సమస్యలు వెలుగులోకి రావడం ఆరంభమైందో, ఆ బ్యాంక్‌లో తన వాటాను ఎల్ఐసీ 1.64%కి తగ్గించుకుంది. యస్‌బ్యాంక్‌లో ఎస్బీఐతో సహా మరిన్ని ప్రభుత్వ బ్యాంక్‌లు పెట్టుబడులు పెట్టడంతో మళ్లీ యస్‌బ్యాంక్‌లో వాటాను 4.99%కి పెంచుకుంది. మరోవైపు మంచి ఫలితాలు సాధిస్తున్న కంపెనీల్లో తన వాటాలను పెంచుకుంటోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్సూమర్, శ్రీ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్‌ల్లో తన వాటాను మరింతగా పెంచుకుంది. మెగా ఐపీఓకు రంగం సిద్ధం... భారత జీవిత బీమా మార్కెట్లో ఎల్ఐసీ వాటా దాదాపు 76%. త్వరలో ఎల్ఐసీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తోన్న విషయం తెలిసిందే. భారత్‌లో ఇదే అతి పెద్ద ఐపీఓ కానున్నది. ఎల్ఐసీ ఐపీఓ సైజు రూ.80,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఎల్ఐసీ విలువ రూ.10 లక్షల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్ల రేంజ్లో ఉం డొచ్చని భావిస్తున్నారు. -
కొనసాగుతున్న పసిడి పరుగు
న్యూఢిల్లీ: దేశీంగా బంగారం ధర జోరుమీద కొనసాగుతోంది. గతకొద్ది రోజులుగా జీవితకాల గరిష్టస్థాయిలను తిరగరాస్తూ.. తాజాగా మరో రికార్డు స్థాయిని నమోదుచేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల (బిస్కెట్ గోల్డ్) బంగారం ధర రూ.38,770 చేరుకుంది. ప్రాంతీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ క్రమంగా పెరిగిన కారణంగా ఇక్కడి ధర ఒక్క రోజులోనే రూ.200 పెరిగి ఆల్ టైం రికార్డు హైకి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నందున ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపునకు మళ్లడమే డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా విశ్లేషించింది. మరోవైపు మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఒక దశలో 1,496.60 డాలర్లకు తగ్గింది. శుక్రవారం జాక్సన్ హోల్ ఎకనామిక్ పాలసీ సదస్సులో అమెరికా ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం, ఎఫ్ఓఎంసీ జూలై సమావేశ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1,500 డాలర్ల స్థాయిలోనే ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ కమోడిటీ విభాగం హెడ్ హరీష్ అన్నారు. శాంతించిన వెండి.. దేశ రాజధానిలో వెండి ధరలు మంగళవారం తగ్గాయి. ఇండస్ట్రీ, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గిన కారణంగా స్పాట్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,100 తగ్గి రూ.43,900 చేరుకుంది. బంగారు నగలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి! అందరితో చర్చించి నిర్ణయం బీఐఎస్ డైరెక్టర్ జనరల్ వెల్లడి కోల్‌కతా: బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలన్న తన ప్రతిపాదనను కేంద్రం మళ్లీ వెలుగులోకి తెచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)నోటిఫై చేయడం కోసం వారం రోజుల్లోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) డైరెక్టర్ జనరల్ సురైనా రాజన్ పేర్కొన్నారు. దీనితో సంబంధమున్న ముఖ్యంగా పుత్తడి వర్తకులతో సంప్రదింపులు అనంతరమే ఈ ప్రక్రియ కార్యరూపం దాలుస్తుందని ఆమె వివరించారు. గోల్డ్ హాల్‌మార్కింగ్‌కు సంబంధించి డిజిటైజేషన్ కార్యక్రమాన్ని ఐఐటీ–ముంబై అమలు చేస్తోందని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది పడుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా హాల్‌మార్కింగ్ సెంటర్లను బీఐఎస్ కంట్రోల్‌తో అనుసంధానం చేస్తామని, పూర్తి స్థాయిలో ఈ వ్యవస్థ సిద్ధమైన తర్వాతనే హాల్‌మార్కింగ్ కోడ్ జనరేట్ అవుతుందని వివరించారు. ప్రస్తుతం దేశంలో 800 హాల్‌మార్కింగ్ సెంటర్లు ఉన్నాయని, మొత్తం బంగారు ఆభరణాల్లో 40 శాతానికి మాత్రమే హాల్‌మార్కింగ్ ఉందని తెలిపారు. -
మళ్లీ 11,000 పైకి నిఫ్టీ
కీలక రేట్ల విషయమై ఆర్బీఐ విధానం మారవచ్చనే అంచనాలతో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. వడ్డీ రేట్ల ప్రభావిత రంగ షేర్లతో పాటు ఇతర రంగాల షేర్లలో కూడా కొనుగోళ్లు జోరుగా సాగాయి. స్టాక్ సూచీలు వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్లోనూ లాభపడ్డాయి. స్టాక్ సూచీలు రెండూ ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 11,000 పాయింట్లపైకి ఎగబాకగా, బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 37,000 పాయింట్లపైకి చేరింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటంతో ఐటీ, లోహ, ఆర్థిక, ఇంధన, ఫార్మా రంగ షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 358 పాయింట్లు పెరిగి 36,975 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 11,062 పాయింట్ల వద్ద ముగిశాయి. నేడు ఆర్బీఐ పాలసీ.. మంగళవారం ప్రారంభమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నేడు (గురువారం) ముగియనుంది. కీలక రేట్లపై నిర్ణయాన్ని ఆర్బీఐ నేడు వెల్లడిస్తుంది. రేట్ల కోత ఉండకపోవచ్చని, అయితే ద్రవ్యోల్బణం దిగివస్తుండటంతో రేట్ల విషయమై ఆర్బీఐ వైఖరి ‘తటస్థ’ విధానానికి మారవచ్చని అంచనాలున్నాయి. బాండ్ల రాబడులు తగ్గడం, రూపాయి స్వల్పంగా బలపడటం ఈ అంచనాలకు మరింత బలాన్నిచ్చాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముడి చమురు ధరలు తగ్గడం, ఈ నెలలో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,624 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరపడం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం వృద్ధి సాధించగలమని కేంద్రం పేర్కొనడం... సానుకూల ప్రభావం చూపించాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 388 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. జపాన్ మార్కెట్ స్వల్పంగా పెరగ్గా, చైనా, దక్షిణ కొరియా మార్కెట్లు చాంద్రమాన కొత్త సంవత్సరాది కారణంగా పనిచేయలేదు. యూరప్ మార్కెట్లు బలహీనంగా ఆరంభమై, స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆల్‌టైమ్ హైకి టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఈ క్యూ3లో నికర లాభం 28 శాతం పెరగడంతో టెక్ మహీంద్రా షేర్ భారీగా లాభపడింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.814ను తాకిన ఈ షేర్ చివరకు 8 శాతం లాభంతో రూ.811 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5,995 కోట్లు పెరిగి రూ.79,588 కోట్లకు ఎగసింది. ఈ షేర్‌తో పాటు ఇన్ఫోసిస్, దివీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, బాటా ఇండియా తదితర షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఆగని అనిల్ షేర్ల పతనం... అనిల్ అంబానీ షేర్ల పతనం కొనసాగింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ ఇంట్రాడేలో 38 శాతం క్షీణించి రూ.142ను తాకింది. చివరకు 32 శాతం నష్టంతో రూ.154 వద్ద ముగిసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్ ఇంట్రాడేలో 11 శాతం తగ్గి ముఖ విలువ రూ.5 కంటే దిగువకు, రూ.4.85ను తాకింది. చివరకు 1 శాతం లాభంతో రూ.5.48 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇతర గ్రూప్ కంపెనీలు–రిలయన్స్ పవర్ 14 శాతం, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 12 శాతం, రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్ 11 శాతం చొప్పున నష్టపోయాయి. గత మూడు రోజుల్లో రిలయన్స్ నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్ షేర్ మినహా అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన ఆరు షేర్లు 22 శాతం నుంచి 53 శాతం రేంజ్లో పడిపోయాయి. మూడు సెన్సెక్స్ షేర్లకే నష్టాలు 31 సెన్సెక్స్ షేర్లలో కేవలం మూడు– యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ.. మాత్రమే నష్టపోగా మిగిలిన 29 షేర్లు లాభపడ్డాయి. స్టాక్ సూచీలు భారీగా లాభపడినప్పటికీ, దాదాపు 400 షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అరవింద్, ఏబీజీ షిప్‌యార్డ్, ఇక్రా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
రికార్డు స్థాయికి ఇన్ఫోసిస్ షేర్లు
న్యూఢిల్లీ : దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం దూసుకెళ్లాయి. 5 శాతానికి పైగా ర్యాలీ జరిపి ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. ఇన్ఫీ తన తొలి త్రైమాసిక ఫలితాల్లో బోనస్‌లు జారీ చేయడంతో ఆ కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 1:1 రేషియోలో ఈక్విటీ షేర్లపై బోనస్‌ను జారీ చేసింది. ఇన్ఫీ షేరు స్టాక్ మార్కెట్లో నమోదై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాటాదార్లకు రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై మరో బోనస్ షేరు(1:1 నిష్పత్తి)ను ఇచ్చేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో ఈరోజు ఉదయం ఇన్ఫీ షేరు ధర 52 వారాల గరిష్ఠానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ మార్కెట్ విలువ తొలిసారిగా రూ.3 లక్షల కోట్లను చేరింది. బీఎస్ఈ ఇంట్రాడేలో ఇన్ఫీ షేరు ధర 5.75శాతం పెరిగి రూ.1384.4 వద్ద ఆల్-టైమ్ గరిష్టాన్ని చేరుకున్న సమయంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ మేర పెరిగింది. ఇక ఎన్ఎస్ఈలో ఆ కంపెనీ షేర్ ధర 5శాతం పెరిగి ఏడాది గరిష్ఠానికి చేరింది. ఆ అనంతరం చివరికి 1.41 శాతం లాభంలో రూ.1,336 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్ అతిపెద్ద గెయినర్‌గా నిలిచింది. మొత్తం 1.29 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లు, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ట్రేడయ్యాయి. సోమవారం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్కు రూ.17,114 కోట్లు జతయ్యాయి. శుక్రవారం ముగింపు రోజు ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,85,924 కోట్లగా ఉన్న సంగతి తెలిసిందే. 2019 టాప్ పర్ఫార్మెర్స్లో ఇన్ఫోసిస్‌లో ఒకటి. కాగ, గత వారం విడుదలైన ఇన్ఫీ క్వార్టర్ ఫలితాలు స్ట్రీట్ అంచనాలకు అనుగుణంగానే నమోదైన విషయం తెలిసిందే. ఏప్రిల్-జూన్‌లో ఇన్ఫీ ఏకీకృత నికర లాభం 3.7శాతం వృద్ధి చెంది రూ.3,612కోట్లకు చేరింది. ఇక మొత్తం కార్యకలాపాల ఆదాయం 12% పెరిగి రూ.17,078కోట్ల నుంచి రూ.19,128కోట్లకు చేరింది. -
బీఎస్ఈ మార్కెట్ క్యాప్:@136 ట్రిలియన్లు
సాక్షి, ముంబై: బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ (బిఎస్ఇ) ఆల్ టైం హైని నమోదు చేసింది. విస్తృతమైన మార్కెట్లో కీలక లాభాల నేపథ్యంలో మంగళవారం మార్కెట్ విలువ రూ .135.83 ట్రిలియన్లకు చేరుకుంది. మొత్తం అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ సహాయంతో బీఎస్ఈ ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .13,583,958 కోట్లగా నమోదైంది. ప్రపంచ మార్కెట్లో నిరంతర వృద్ధిరేటు కారణంగా దేశీయ మార్కెట్ స్థిరమైన స్థితిలోకి వచ్చిందని ఎనలిస్టులు విశ్లేషించారు. మెటల్, ఆటో షేర్లలో పుంజకున్న డిమాండ్ కారణంగా నెలకొన్న కొనుగోళ్లతో మార్కెట్ ఊపందుకుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ పరిశోధనా విభాగం అధిపతి వినోద్ నాయర్ అన్నారు. మెటల్, ఆటోకు తోడు రియల్టీ , హెల్త్ ఇండెక్స్, చమురు, గ్యాస్, ఎఫ్ఎంసిజిలు లాభాలు బీఎస్సీకి జోష్‌నిచ్చాయి. ఇందులో టాటా గ్రూపు లాభాలు కీలక మద్దతుపలకాయి. సన్‌ఫార్మా, హెచ్‌యుఎల్ తదితర షేర్లలో 30 షేర్లలో 25 స్టాక్స్ లాభపడ్డాయి. కాగా మంగళవారం సెన్సెక్స్ 276 పాయింట్ల లాభంతో ముగిసింది. అలాగే కీలకమైన 32వేలకు పైన స్థిరంగా ముగిసింది. తిరిగి బుధవారం నాటి ట్రేడింగ్‌లో కూడా సెన్సెక్స్ కొత్త రికార్డులపైపు సాగుతోంది. ఆరంభంలో ఫ్లాట్గాఉన్నా క్రమంగా పుంజుకుని 83 పాయింట్ల లాభంతో 32, 242 వద్ద కొనసాగుతోంది. -
మార్కెట్లు ఆల్‌టైమ్ రికార్డ్స్...
ముంబై : ఈక్విటీ బెంచ్‌మార్కు సూచీలు వరుసగా మూడో రోజు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిల్లో ముగిశాయి. సెన్సెక్స్ 57.73 పాయింట్ల లాభంలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయి 31,804.82 వద్ద ముగియగా.. నిఫ్టీ 30.05 పాయింట్ల లాభంలో మొట్టమొదటిసారి 9,800కి పైన 9809.60 వద్ద క్లోజైంది. నేటి మార్కెట్లో బయోకాన్ షేర్లు 14 శాతం మేర లాభాల వర్షం కురిపించాయి. ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఓఎన్జీసీలు కూడా 1-2 శాతం లాభాలు పండించాయి. అయితే జూన్ క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేర్లు 1 శాతం డౌన్ అవ్వగా.. ఎం అండ్ ఎం కూడా నష్టాలు గడించింది. జియో కొత్త టారిఫ్ ప్లాన్లను ప్రకటించిన అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఇంట్రాడేలో 2 శాతం మేర ర్యాలీ జరిపి, మార్కెట్ క్యాపిటలైజేషన్లో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. 2008 జనవరి 17 తర్వాత అత్యంత గరిష్టస్థాయి రూ.1,524.50ను తాకింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 64.55గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పలాభాలను నమోదుచేశాయి. 44 రూపాయల లాభంలో 27,870గా ముగిశాయి. -
ఆల్-టైమ్ హైలో సెన్సెక్స్ సెలబ్రేషన్స్
ముంబై: ట్రేడింగ్ ప్రారంభంలో 100 పాయింట్లకు పైగా జంప్ చేసిన సెన్సెక్స్, ఆల్-టైమ్ గరిష్టంలో దూసుకుపోతుంది. 230 పాయింట్లకు పైగా జంప్ చేసిన బీఎస్ఈ సెన్సెక్స్ 31,500 మార్కును చేధించింది. బ్యాంకు నిఫ్టీ సైతం 23,895.35ను తాకింది. నిఫ్టీ 62 పాయింట్ల లాభంలో 9700కు చేరువలో జోరు కొనసాగిస్తోంది. నాస్కామ్ గైడెన్స్ తో టెక్నాలజీ స్టాక్స్ భారీగా లాభపడుతున్నాయి. ఇన్ఫోసిస్ 2.35శాతం పైకి ఎగిసింది. గైడెన్స్ ప్రకటించడాన్ని ఫిబ్రవరిలో వాయిదా వేసిన ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ గైడెన్స్ రేంజ్ ను ప్రకటించేసింది. ఎక్స్ పోర్టు గ్రోత్ గైడెన్స్ 7-8శాతం ఉంటుందని నాస్కామ్ అంచనావేసింది. అంతేకాక దేశీయంగా రెవెన్యూ కూడా 10-11శాతం ఉంటుందని తెలిపింది. అనిశ్చితిగా ఉన్న టెక్నాలజీ పరిశ్రమకు ఇది సానుకూలంగా ఉండటంతో, మార్కెట్లో ఈ షేర్లు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాయి. నిఫ్టీ ఐటీ ఇంట్రాడే హైలో కొనసాగుతోంది. కాగ, త్వరలోనే ట్రంప్ తో మోదీ భేటీ కాబోతున్నారు. పెట్టుబడులను మరింత ఆకట్టుకోవడానికి సెబీ తీసుకుంటున్న చర్యలు మార్కెట్లకు గట్టి మద్దతిచ్చాయి. స్ట్రెస్డ్ ఆస్తులతో సతమతమవుతున్న లిస్టెడ్ కంపెనీలను పునర్వ్యస్థీకరించడానికి టేక్ఓవర్ నిబంధనలను సెబీ సడలించింది. అంతేకాక అంతర్జాతీయంగా వస్తున్న పాజిటివ్ సంకేతాలతో మార్నింగ్ నుంచి మార్కెట్లు లాభాలు పండిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ టాప్ గెయినర్ గా 1.60శాతం లాభాల్లో కొనసాగుతోంది. హెచ్డీఎఫ్సీ తో పాటు పవర్ గ్రిడ్, ఏసియన్ పేయింట్స్, టాటా మోటార్స్, టాటామోటార్స్ డీవీఆర్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంకులు కూడా 1.37 శాతం పైకి జంప్ చేశాయి. -
దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు
దలాల్ స్ట్రీట్ లో మార్కెట్లు దుమ్మురేపాయి. మంచి రుతుపవనాల అంచనాలతో సరికొత్త ఆల్ టైమ్ గరిష్టంలో మార్కెట్లు ముగిశాయి. 314.92 పాయింట్లు ర్యాలీ జరిపిన సెన్సెక్స్, 30,248.17 వద్ద క్లోజైంది. అదేవిధంగా నిఫ్టీ సైతం మొదటిసారి 9400 మార్కును అధిగమించి 9407.30 వద్ద రికార్డైంది. నేటి మార్కెట్లు భారతీ ఎయిర్ టెల్ స్టాక్ ఆఫ్ ది డేగా నిలిచి, 10 శాతం లాభాలు పండించింది. భారతీ ఎయిర్ టెల్ తో పాటు హిందూస్తాన్ యూనిలివర్ కూడా గరిష్ట స్థాయిలను తాకింది. క్లోజింగ్ కు ముందు సెన్సెక్స్ , నిఫ్టీలు నేటి ట్రేడింగ్ లో 30,272 మార్కును, 9414.75 మార్కును తాకాయి. మంగళవారం వెల్లడించిన మంచి రుతుపవనాల అంచనాలు మార్కెట్ల సెంటిమెంట్ ను బలపర్చాయని ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్, సెక్యురిటీస్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ తెలిపారు. ఎల్ నిలో భయాందోళనలు కొంత తగ్గుముఖం పట్టాయని సాధారణంతో పోలిస్తే 50 శాతం అధికంగా వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ ఆఫీసు చీఫ్ అంచనావేశారు. అటు రుతుపవనాల అంచనాలతో పాటు ఇటు మంగళవారం సెషన్లో 330 కోట్ల విలువైన షేర్లను ఫారిన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడం కూడా మార్కెట్లకు బూస్ట్ నిచ్చింది. మంచి కొనుగోళ్ల పర్వంతో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం పైకి ఎగిశాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 32 పైసలు బలహీనపడి 64.63గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 112 రూపాయల లాభంతో 28,083గా రికార్డయ్యాయి. -
ఆల్-టైమ్ గరిష్టంలో నిఫ్టీ ఎంట్రీ
ముంబై: ఆసియన్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు.. ఈ వారంలో జరుగబోతున్న ఆర్బీఐ పాలసీ మీటింగ్.. రాజ్యసభలో జీఎస్టీ బిల్లుల ఆమోదంపై ఆశలు సోమవారం దేశీయ బెంచ్ మార్కు సూచీలకు మంచి ఊపునిచ్చాయి.. నిఫ్టీ రికార్డు స్థాయిలో ఎంట్రీ ఇవ్వగా.. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం 131.26 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ 29,751 వద్ద, 29 పాయింట్ల లాభంలో నిఫ్టీ 9202 వద్ద ట్రేడవుతున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా స్వల్పంగా లాభపడి 64.80 వద్ద ప్రారంభమైంది. జియో ప్రైమ్ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లో దూసుకెళ్తోంది. 2 శాతం పైగా లాభపడుతోంది. ఇప్పటికీ 7.2కోట్ల మందికి పైగా జియో కస్టమర్లు ప్రైమ్ మెంబర్ షిప్ ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా, హీరో మోటార్ కార్పొ, ఎస్బీఐ, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్ లాభాల్లో నడుస్తుండగా.. 2 శాతం పైగా పడిపోతూ సెన్సెక్స్ లో అతిపెద్ద లూజర్ గా భారతీ ఎయిర్ టెల్ నష్టాలు గడిస్తోంది. జపాన్, ఆస్ట్రేలియా దేశాల ఎకనామిక్ డేటా, కొత్త త్రైమాసికంలో ఫస్ట్ డే ట్రేడింగ్ తో చాలామటుకు ఆసియన్ షేర్లు లాభాల్లో రన్ అవుతున్నాయి. మరోవైపు గురువారం ఆర్బీఐ పాలసీ ప్రకటను వెలువడనుంది. జీఎస్టీ బిల్లు అమల్లోకి వచ్చినప్పటి నుంచి స్ట్రాంగ్ జీడీపీ వృద్ధి నమోదవుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. లోక్ సభలో ఆమోదం పొందిన జీఎస్టీ అనుబంధ బిల్లులు ప్రస్తుతం రాజ్యసభ ముందుకు రానున్నాయి. దీంతో మార్కెట్ల సెంటిమెంట్ బలపడింది. కాగ శ్రీరామనవమి సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు. గురువారం ఆర్బీఐ పాలసీ వెలువడనుంది. -
డిష్‌మ్యాన్ ఫార్మాకు యూఎస్ఎఫ్డీఏ బూస్ట్
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం డిష్‌మ్యాన్ ఫార్మాకు అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ యూఎస్ఎఫ్డీఏ బూస్ట్ ఇచ్చింది. కంపెనీకి చెందిన టెసారో మందుకు అనుమతిని మంజూరు చేసింది. కేన్సర్ చికిత్సకు వినియోగించే టెసారో జేజులా క్యాప్సూల్స్ విక్రయానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించినట్లు మార్కెట్ ఫైలింగ్ లో వెల్లడించింది. కంపెనీ భాగస్వామ్య సంస్థ టెసారో ఔషధానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆల్ టైం హైని తాకింది. మంగళవారం నాటి మార్కెట్లో డిష్‌మ్యాన్ ఫార్మా కౌంటర్ 20శాతం దూసుకెళ్లి అప్పర్ సర్య్కూట్ని తాకింది. అమెరికా మార్కెట్లో ఈ ఔషధాన్ని విక్రయించే టెసారో అండాశయ క్యాన్సర్ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించింది. క్యాన్సర్ నిరోధానికి సంబంధించి పరఫరా చేసే రెండు కంపెనీలలో ఒకటిగా డిష్‌మ్యాన్ నిలుస్తుందని ఎనలిస్టుల అంచనా. ఈ డీల్ కంపెనీకి చాలా లాభదాయకంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. సుమారు 40-80 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు డోలట్ కాపిటల్ చెప్పింది. ఇప్పుటివరకు అందుబాటులో ఉన్న పార్ప్(పీఏఆర్‌పీ) నిరోధకంలో మొట్టమొదటి డ్రగ్ మంచి సామర్ధ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. ఈ మందు క్యాన్సర్ సెల్స్‌ను చంపేసి, పార్ప్ అనే ప్రొటీన్ ను గణనీయంగా నిరోధిస్తుందట. తద్వారా డ్యామేజ్ అయిన డీఎన్ఏ పునరుద్ధరణుకు సాయం పడుతుంది. కాగా ఈ డ్రగ్ ఏప్రిల్ లో లాంచ్ కానుంది. -
ఏకంగా ఆ స్టాక్ ధర రూ.60వేలకు ఎగిసింది!
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ సోమవారం మార్కెట్లో మెరుపులు మెరిపించింది. ఒక్కసారిగా ఆ స్టాక్ ధర రూ.60వేల మార్కును కొల్లగొట్టింది. సోమవారం మధ్యాహ్న ట్రేడింగ్ లో మొదటిసారి ఆ స్టాక్ ధర రూ.60వేల క్రాస్ చేసినట్టు వెల్లడైంది. ఈ కంపెనీ షేరు ధర రూ.59,250 వద్ద ప్రారంభమైంది. అనంతరం ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలోకి రూ.60,140కు చేరుకుంది. చివరికి 1.21 శాతం లాభంతో ఈ కంపెనీ షేరు ధర రూ.59,900 వద్ద ముగిసింది. విలువ పరంగా చూసుకుంటే, ఎంఆర్ఎఫ్ ఎక్కువ ఖరీదైన దేశీ స్టాక్. దీని తర్వాత ఐషర్ మోటార్స్(రూ.24,322), బోస్ (రూ.22,988), శ్రీ సిమెంట్(రూ.16,460), పేజ్ ఇండస్ట్రీస్(రూ.14,803), 3ఎం ఇండియా(రూ.11,080) లు ఉంటాయి. ఈ దశాబ్దం ప్రారంభమైనప్పటి నుంచి ఎంఆర్ఎఫ్ షేరు ధర 4,759 శాతం పైకి ఎగిసినట్టు తెలిసింది. అంటే 50 సార్లు అన్నమాట. మార్చి 24 నాటికి ఇది రూ.59,184కు చేరుకుంది. ఎంఆర్ఎఫ్ రెవెన్యూలు, ఈబీఐడీటీఏ, ప్యాట్లు 2017-18 ఆర్థిక సంవత్సరంలో 16, 17, 18 శాతం పైకి ఎగుస్తాయని ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ ఆనంద్ రతి ఫిబ్రవరిలోనే చెప్పారు. మార్కెట్ నిపుణుల ప్రకారం రబ్బర్ ధరలు ఫిబ్రవరి నుంచి 25 శాతం తగ్గాయని తెలిసింది. రబ్బర్ ధరలు తగ్గడం అపోలో టైర్స్, ఎంఆర్ఎఫ్ వంటి టైర్ల తయారీ సంస్థలకు అనుకూలిస్తుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. స్వల్పకాల వ్యవధిలో ఈ కంపెనీల రెవెన్యూలు, మార్జిన్లు పెరుగుతాయని అంచనావేస్తున్నారు. 2016 డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు రూ.288.08 కోట్లగా నమోదయ్యాయి. ఇతర మేజర్ టైర్ల కంపెనీలు అపోలో కూడా మధ్యాహ్నం ట్రేడింగ్ లో లాభపడినట్టు తెలిసింది.