ఆల్-టైమ్ గరిష్టంలో నిఫ్టీ ఎంట్రీ
Published Mon, Apr 3 2017 9:46 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
ముంబై: ఆసియన్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు.. ఈ వారంలో జరుగబోతున్న ఆర్బీఐ పాలసీ మీటింగ్.. రాజ్యసభలో జీఎస్టీ బిల్లుల ఆమోదంపై ఆశలు సోమవారం దేశీయ బెంచ్ మార్కు సూచీలకు మంచి ఊపునిచ్చాయి.. నిఫ్టీ రికార్డు స్థాయిలో ఎంట్రీ ఇవ్వగా.. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం 131.26 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ 29,751 వద్ద, 29 పాయింట్ల లాభంలో నిఫ్టీ 9202 వద్ద ట్రేడవుతున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా స్వల్పంగా లాభపడి 64.80 వద్ద ప్రారంభమైంది. జియో ప్రైమ్ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లో దూసుకెళ్తోంది. 2 శాతం పైగా లాభపడుతోంది.
ఇప్పటికీ 7.2కోట్ల మందికి పైగా జియో కస్టమర్లు ప్రైమ్ మెంబర్ షిప్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా, హీరో మోటార్ కార్పొ, ఎస్బీఐ, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్ లాభాల్లో నడుస్తుండగా.. 2 శాతం పైగా పడిపోతూ సెన్సెక్స్ లో అతిపెద్ద లూజర్ గా భారతీ ఎయిర్ టెల్ నష్టాలు గడిస్తోంది. జపాన్, ఆస్ట్రేలియా దేశాల ఎకనామిక్ డేటా, కొత్త త్రైమాసికంలో ఫస్ట్ డే ట్రేడింగ్ తో చాలామటుకు ఆసియన్ షేర్లు లాభాల్లో రన్ అవుతున్నాయి. మరోవైపు గురువారం ఆర్బీఐ పాలసీ ప్రకటను వెలువడనుంది. జీఎస్టీ బిల్లు అమల్లోకి వచ్చినప్పటి నుంచి స్ట్రాంగ్ జీడీపీ వృద్ధి నమోదవుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. లోక్ సభలో ఆమోదం పొందిన జీఎస్టీ అనుబంధ బిల్లులు ప్రస్తుతం రాజ్యసభ ముందుకు రానున్నాయి. దీంతో మార్కెట్ల సెంటిమెంట్ బలపడింది. కాగ శ్రీరామనవమి సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్కు సెలవు. గురువారం ఆర్బీఐ పాలసీ వెలువడనుంది.
Advertisement
Advertisement