సాక్షి, ముంబై: బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ (బిఎస్ఇ) ఆల్ టైం హైని నమోదు చేసింది. విస్తృతమైన మార్కెట్లో కీలక లాభాల నేపథ్యంలో మంగళవారం మార్కెట్ విలువ రూ .135.83 ట్రిలియన్లకు చేరుకుంది. మొత్తం అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ సహాయంతో బీఎస్‌ఈ ఆల్ టైం గరిష్టాన్ని తాకింది.
మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .13,583,958 కోట్లగా నమోదైంది. ప్రపంచ మార్కెట్లో నిరంతర వృద్ధిరేటు కారణంగా దేశీయ మార్కెట్ స్థిరమైన స్థితిలోకి వచ్చిందని ఎనలిస్టులు విశ్లేషించారు. మెటల్, ఆటో షేర్లలో పుంజకున్న డిమాండ్ కారణంగా నెలకొన్న కొనుగోళ్లతో మార్కెట్ ఊపందుకుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ పరిశోధనా విభాగం అధిపతి వినోద్ నాయర్ అన్నారు. మెటల్, ఆటోకు తోడు రియల్టీ , హెల్త్ ఇండెక్స్, చమురు, గ్యాస్, ఎఫ్ఎంసిజిలు లాభాలు బీఎస్‌సీకి జోష్‌నిచ్చాయి. ఇందులో టాటా గ్రూపు లాభాలు కీలక మద్దతుపలకాయి. సన్‌ఫార్మా, హెచ్యుఎల్ తదితర షేర్లలో 30 షేర్లలో 25 స్టాక్స్ లాభపడ్డాయి.
కాగా మంగళవారం సెన్సెక్స్ 276 పాయింట్ల లాభంతో ముగిసింది. అలాగే కీలకమైన 32వేలకు పైన స్థిరంగా ముగిసింది. తిరిగి బుధవారం నాటి ట్రేడింగ్‌లో కూడా సెన్సెక్స్ కొత్త రికార్డులపైపు సాగుతోంది. ఆరంభంలో ఫ్లాట్‌గాఉన్నా క్రమంగా పుంజుకుని 83 పాయింట్ల లాభంతో 32, 242 వద్ద కొనసాగుతోంది.