న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం డిష్‌మ్యాన్ ఫార్మాకు అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ యూఎస్‌ఎఫ్‌డీఏ బూస్ట్ ఇచ్చింది. కంపెనీకి చెందిన టెసారో మందుకు అనుమతిని మంజూరు చేసింది. కేన్సర్ చికిత్సకు వినియోగించే టెసారో జేజులా క్యాప్సూల్స్ విక్రయానికి యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించినట్లు మార్కెట్ ఫైలింగ్ లో వెల్లడించింది. కంపెనీ భాగస్వామ్య సంస్థ టెసారో ఔషధానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆల్ టైం హైని తాకింది. మంగళవారం నాటి మార్కెట్లో డిష్‌మ్యాన్ ఫార్మా కౌంటర్ 20శాతం దూసుకెళ్లి అప్పర్ సర్య్కూట్‌ని తాకింది.
అమెరికా మార్కెట్లో ఈ ఔషధాన్ని విక్రయించే టెసారో అండాశయ క్యాన్సర్ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించింది. క్యాన్సర్ నిరోధానికి సంబంధించి పరఫరా చేసే రెండు కంపెనీలలో ఒకటిగా డిష్‌మ్యాన్ నిలుస్తుందని ఎనలిస్టుల అంచనా. ఈ డీల్ కంపెనీకి చాలా లాభదాయకంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. సుమారు 40-80 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు డోలట్ కాపిటల్ చెప్పింది. ఇప్పుటివరకు అందుబాటులో ఉన్న పార్ప్(పీఏఆర్‌పీ) నిరోధకంలో మొట్టమొదటి డ్రగ్ మంచి సామర్ధ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. ఈ మందు క్యాన్సర్ సెల్స్‌ను చంపేసి, పార్ప్ అనే ప్రొటీన్ ను గణనీయంగా నిరోధిస్తుందట. తద్వారా డ్యామేజ్ అయిన డీఎన్‌ఏ పునరుద్ధరణుకు సాయం పడుతుంది. కాగా ఈ డ్రగ్ ఏప్రిల్ లో లాంచ్ కానుంది.
డిష్‌మ్యాన్ ఫార్మాకు యూఎస్‌ఎఫ్‌డీఏ బూస్ట్
Published Tue, Mar 28 2017 11:37 AM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM
Advertisement