జంతువుల్లో ప్రాణాంతకమైన బర్డ్‌ఫ్లూ వైరస్ అమెరికాలో మనిషికి సోకడం భయాందోళన కలిగిస్తోంది. వైరస్ ఆనవాళ్లు మనుషులు తాగే ఆవు పాలలో కనిపించడంతో అందరూ భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు కీలక విషయం చెప్పారు.
యూఎస్ స్టోర్లలో విక్రయిస్తున్న పాలు బర్డ్ ఫ్లూ నుండి సురక్షితమైనవని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఎందుకంటే ఈ పాలను పాశ్చరైజేషన్ చేస్తారని, పాశ్చరైజేషన్ వ్యాధిని ప్రభావవంతంగా చంపుతుందని పేర్కొన్నారు.
అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్‌ఫ్లుయంజా (HPAI) వ్యాప్తి దేశవ్యాప్తంగా పాడి పశువుల మందల ద్వారా వ్యాపించింది. తేలికపాటి లక్షణాలతో ఒక వ్యక్తికి సోకింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని పాల విక్రయ సంస్థల నుంచి నమూనాలను ఎఫ్‌డీఏ పరీక్షించింది. ఇందులో ప్రతి ఐదు శాంపిల్స్‌లో ఒక దాంట్లో వైరస్ ఆనవాళ్లు కనిపించాయని ఎఫ్‌డీఏ పేర్కొంది.
అయితే పాశ్చరైజేషన్ ప్రక్రియ కారణంగా వైరస్ పాల ద్వారా ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం లేదని ఎఫ్‌డీఏ ప్రకటించింది. దీనిపై మరిన్ని పరీక్షలు అవసరమని పేర్కొంది. హెచ్‌పీఏఐని నిష్క్రియం చేయడంలో పాశ్చరైజేషన్ ప్రభావవంతంగా ఉంటుందిని ప్రాథమిక ఫలితాల్లో గుర్తించినట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది. ఇంతకుముందు బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు పచ్చి పాలలో కనుగొనడంతో ఆరోగ్య అధికారులు పచ్చి పాలను తాగొద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment