పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివేనా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..! | Scientists Said Drinking Raw Milk Is Extremely Dangerous | Sakshi
Sakshi News home page

పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివేనా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!

Published Mon, Sep 9 2024 1:08 PM | Last Updated on Mon, Sep 9 2024 1:08 PM

Scientists Said Drinking Raw Milk Is Extremely Dangerous

పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివనే చాలామంది భావిస్తారు. అంతెందుకు పూర్వకాలం మన పెద్దవాళ్లు అప్పుడే పితికిన పాలనే నేరుగా తాగేవారు కూడా. ఇలా తాగితే మంచి పోషకాలు అందుతాయని విశ్వసించేవారు. అయితే శాస్త్రవేత్తుల ఇలా అస్సలు తాగకూడాదని చెబుతున్నారు. దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తయాని చెబుతున్నారు. పచ్చిపాలు తాగడం మంచిదనే భావన కేవలం అపోహే అనే కొట్టిపారేస్తున్నారు. అంతేగాదు  పాశ్చరైజ్డ్ పాలను మాత్రమే తాగాలని పిలుపునిస్తున్నారు. అసలు పచ్చిపాలు ఆరోగ్యానికి ఎందుకు ప్రమాదకరం? శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఏం వెల్లడయ్యిందంటే..

పాశ్చరైజ్‌ చేసిన పాల కంటే పచ్చిపాలే రుచిగా ఉంటాయని చాలామంది ప్రగాఢంగా నమ్ముతారు. దీని వల్ల లాక్టోస్‌ అసహనం ఉండదని, అలెర్జీలకు చికిత్స చేయగలదని చెబుతుంటారు. ముఖ్యంగా గట్‌ ఆరోగ్యానికి తోడ్పడుతుందని వాదనలు వినిపిస్తున​న్నాయి. కానీ శాస్తవేత్తల పరిశోధనల్లో ఇవన్ని నిజం కాదని తేలింది. అంతేగాదు పాశ్చరైజ్డ్ పాలతో పోలిస్తే పచ్చి పాలు తాగడం లేదా సంబంధిత ఉత్పత్తులను తీసుకోవడం చాలా ప్రమాదమని అధ్యయనంలో వెల్లడయ్యింది. అలాగే ఆరోగ్యానికి సురక్షితం కాదని తేలింది. అదే పాశ్చరైజేషన్‌ పాల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం చాలా తక్కువని తెలిపారు. 

ఎందుకు ఆరోగ్యానికి ప్రమాదకరం అంటే..
పచ్చిపాలల్లో సూక్ష్మక్రిములు ఎక్రువగా ఉంటాయి. ఇవి ఆహార విషాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల ఉదర తిమ్మిరి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తయని చెబుతున్నారు. పచ్చిపాలల్లో సాల్మొనెల్లా, ఇ. కోలి, లిస్టేరియా, క్యాంపిలోబాక్టర్‌ వంటి సూక్ష్మక్రిములు ఉంటాయిని, ఇవి అనారోగ్యానికి కారణమవుతాయని చెప్పారు. పాశ్చరైజ్‌ చేయని పాల ఉత్పత్తుల వల్ల 840 రెట్లు అనారోగ్య ప్రమాదం, 45 రెట్లు ఆస్పత్రిలో చేరే ‍అవకాశం ఉంటుందని అన్నారు. పచ్చిపాలు తాగే అలవాటు ఉన్నవాళ్లు ఎవరైనా దీర్ఘకాలంలో కచ్చితంగా అనారోగ్యానికి గురవ్వుతారని వైద్యలు హెచ్చరించారు

ముఖ్యంగా చిన్నారులు, యువకులు, గర్భిణీస్త్రీలు, వృద్ధులు, కేన్సర్‌, మధుమేహం లేదా హెచ్‌ఐవీ లేదా ఎయిడ్స్‌ వంటి పరిస్థితులు ఉన్నవారికి ఈ పాలు మరింత ప్రమాదకరమని చెప్పారు. అంతేగాదు అమెరికాలో పచ్చిపాలను విక్రయించడం చట్టవిరుద్ధం. కొన్ని రాష్ట్రాల్లో ఈ పాల విక్రయానికి షరతులతో కూడిన అనుమతి ఉంది. కేవలం రైతు నేరుగా పచ్చిపాలను విక్రయిస్తేనే అక్కడ ప్రజలు వినియోగించవచ్చు. 

అదీగాక ఇటీవల కాలంలో బర్డ్‌ ఫ్లూ కలకలం పచ్చిపాల వినియోగాన్ని మరింతగా పరిమితం చేసింది. పక్షులు నుంచి పౌల్ట్రీ అలా యూఎస్‌లోని ఆవులకు సైతం ఈ వైరస్‌ వ్యాప్తి చెందడం జరిగింది.  దీని కారంణంగా నలుగురు వ్యక్తులు మరణించారు కూడా. ఈ నేపథ్యంలో పచ్చిపాల వినియోగంపై మరింత ఆందోళనలు వెల్లువెత్తాయి. 

పాశ్చరైజేషన్‌ అంటే..? ఇది పాలను సురక్షితంగా చేస్తుందా..?
పాల భద్రతకు పాశ్చరైజేషన్‌ ముఖ్యం. పాలను 145 డిగ్రీల ఫారెన్‌ హీట్‌కు గురిచేయడం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే  జెర్మ్స్‌, సూక్ష్మజీవులు చనిపోతాయి. అలాగే ఈ ప్రక్రియలో పాలు త్వరతిగతిన చల్లబడిపోతాయి కూడా. పశ్చిపాలల్లో ఉండే పోషలకాలే పాశ్చరైజేషన్‌ పాలల్లో కూడా ఉండటమే కాకుండా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

(చదవండి: కివీ కర్రీ..శ్రీలంక ఫేమస్‌ రెసిపీ..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement