కివీ పండ్లు రుచే వేరేలెవెల్ అన్నట్లు ఉంటాయి. ఇది ఎంత బాగుంటుందంటే..తింటుంటే పుల్లగా తియ్యగా మరోవైపు దానిలోని గింజలు క్రంచిగా తగులుతు భలే ఉంటాయి. మాములుగా కివీ పండ్లను నేరుగా తినేస్తాం. అంతే తప్ప వాటితో రెసిపీలు తయారు చేయడం గురించి వినలేదు కదా. కానీ శ్రీలంకలో ఈ కివీ పండ్లతో కర్రీ చేస్తారట. టేస్ట్ వారెవ్వా అనేలా ఉంటుదట. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ కివీ పండుని కర్రీలా చేసుకుని తినడం వల్ల ఎలాంటి పోషకాలు నష్టపోమని చెబుతున్నారు శ్రీలంక చెఫ్ మినోలి డి సిల్వా. నిక్షేపంగా కూరగా చేసుకుని తినొచ్చట.
కర్రీ ఎలా చేస్తారంటే..
ఒక పాన్‌లో కొబ్బరి నూనె వేసి, అందులో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసి బాగా వేయించాలి.
ఆ తర్వాత అందులో కారం పొడి, నల్ల మిరియాలు, గ్రౌండ్ జీలకర్ర, సొంపు పొడి, ధనియాలపొడి వేసి ఓ అరంగంట కలపుతూ ఉండాలి.
అందులో టమాటాలు, జీడిపప్పు వేసి ఓ రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించాలి.
ఆ తర్వాత కొబ్బరి నీరు సగం లేదా పూర్తిగా వేసి ఉడికించాలి.
చివరగా కివీ పండ్లు వేసి మిగిలిని కొబ్బరి నీరు, కొబ్బరి పాలు జోడించాలి.
ఈ రెసిపీలో కివీ పుల్లదనం తెలియాలంటే కొద్దిగా సాస్, ఉప్పుని జోడించాలి. ఈ కర్రీని అన్నం లేదా రోటీలతో తింటే టేస్ట్ అదిరిపోతుందట. అయితే ఈ రెసిపీలో కివీ పండు రుచిని కొబ్బరి పాలు మరింత టేస్టీగా ఉండేలా చేస్తుందట. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి.
(చదవండి: మూడేళ్ల చిన్నారిని రక్షించడంలో డ్రోన్ సాయం..! ఏకంగా దట్టమైన ..)
Comments
Please login to add a commentAdd a comment