Kiwi
-
కివీ కర్రీ గురించి విన్నారా..!
కివీ పండ్లు రుచే వేరేలెవెల్ అన్నట్లు ఉంటాయి. ఇది ఎంత బాగుంటుందంటే..తింటుంటే పుల్లగా తియ్యగా మరోవైపు దానిలోని గింజలు క్రంచిగా తగులుతు భలే ఉంటాయి. మాములుగా కివీ పండ్లను నేరుగా తినేస్తాం. అంతే తప్ప వాటితో రెసిపీలు తయారు చేయడం గురించి వినలేదు కదా. కానీ శ్రీలంకలో ఈ కివీ పండ్లతో కర్రీ చేస్తారట. టేస్ట్ వారెవ్వా అనేలా ఉంటుదట. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ కివీ పండుని కర్రీలా చేసుకుని తినడం వల్ల ఎలాంటి పోషకాలు నష్టపోమని చెబుతున్నారు శ్రీలంక చెఫ్ మినోలి డి సిల్వా. నిక్షేపంగా కూరగా చేసుకుని తినొచ్చట. కర్రీ ఎలా చేస్తారంటే..ఒక పాన్‌లో కొబ్బరి నూనె వేసి, అందులో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత అందులో కారం పొడి, నల్ల మిరియాలు, గ్రౌండ్ జీలకర్ర, సొంపు పొడి, ధనియాలపొడి వేసి ఓ అరంగంట కలపుతూ ఉండాలి. అందులో టమాటాలు, జీడిపప్పు వేసి ఓ రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత కొబ్బరి నీరు సగం లేదా పూర్తిగా వేసి ఉడికించాలి. చివరగా కివీ పండ్లు వేసి మిగిలిని కొబ్బరి నీరు, కొబ్బరి పాలు జోడించాలి. ఈ రెసిపీలో కివీ పుల్లదనం తెలియాలంటే కొద్దిగా సాస్, ఉప్పుని జోడించాలి. ఈ కర్రీని అన్నం లేదా రోటీలతో తింటే టేస్ట్ అదిరిపోతుందట. అయితే ఈ రెసిపీలో కివీ పండు రుచిని కొబ్బరి పాలు మరింత టేస్టీగా ఉండేలా చేస్తుందట. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి. View this post on Instagram A post shared by Chef Minoli De Silva (@minoli.desilva) (చదవండి: మూడేళ్ల చిన్నారిని రక్షించడంలో డ్రోన్ సాయం..! ఏకంగా దట్టమైన ..) -
ఉత్సాహాన్నిచ్చే పోటాషియం కావాలా? బనానా కివీ స్మూతీ తీస్కో!
కావలసినవి: పాలు – కప్పు, అరటిపండు – ఒకటి, కివి – ఒకటి, తేనె – మూడు టేబుల్ స్పూన్లు, లేత పాలకూర – కప్పు, ఆవకాడో – అర చెక్క, ఐస్‌క్యూబ్స్ – కప్పు. తయారీ: ⇔ అరటిపండు, కివి తొక్కతీసి ముక్కలుగా తరగాలి ⇔ పాలకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ⇔ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అరటిపండు, కివి ముక్కలు వేయాలి. దీనిలోనే పాలకూర, అవకాడోను ముక్కలు తరిగి వేయాలి. వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేయాలి చదవండి👉🏻 అసలే ఎండాకాలం.. చుండ్రు సమస్యా? సులభైన 2 చిట్కాలు మీకోసం ⇔ అన్నీ మెత్తగా నలిగాక పాలు, ఐస్‌క్యూబ్స్ వేసి మరొసారి గ్రైండ్ చేసి ..గ్లాసులో పోసుకోవాలి. దీనిలో తేనె వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ⇔తక్కువ క్యాలరీలు తీసుకోవాలనుకున్నవారికి ఈ స్మూతీ మంచి డ్రింక్ గా పనిచేస్తుంది. దీనిలో క్యాలరీలు, సోడియం తక్కువగా ఉండి పోషకాలు అధికంగా ఉంటాయి. ⇔ విటమిన్ బి, సి, పీచుపదార్థంతోపాటు పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ⇔పొటాషియం జీవనశైలిని మరింత ఉత్సాహపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కండరాలను సంరక్షిస్తుంది. ⇔ అరటి, కివిలలో రెండు రకాల పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి. చదవండి👉🏼 సత్తువ పెంచే సగ్గుబియ్యం -
కివీ పండు- పోషకాలు మెండు
-
Kiwi Fruit Health Benefits: కివీ పండు ఎక్కువగా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్ వల్ల..
మనలో చాలా మందికి ఇష్టంగా మారిన విదేశీ పండు కివి. ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు ఈ పేరు సుపరిచితం. పేరుకే కాదు, నిజంగా కూడా ఇది న్యూజిలాండ్ పండే. వివిధ రంగుల్లో, వివిధ సైజుల్లో లభిస్తుంది. అయితే, సాధారణంగా... వెలిసిపోయిన ఆకుపచ్చ రంగులో అండాకారంలో ఉండే రకానికే ఆదరణ ఎక్కువ. దీనిని చైనీస్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. ఇక మన దగ్గర దొరికేది ఫుజీరకం కివి. పులుపు-తీపి కలగలిపి ఉంటుంది. ఇందులో జామ పండులాగా చిన్న విత్తనాలు ఉంటాయి. ఈ పండును విత్తనాలతో పాటే తినొచ్చు. న్యూజిలాండ్‌తో పాటు.. ఇటలీ, చిలీ, గ్రీస్, ఫ్రాన్స్ దేశాల్లో కూడా దీనిని పండిస్తారు. కివీ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు తెలుసుకుందాం! కివీ పండు- పోషకాలు మెండు విటమిస్ సీ పుష్కలం సాధారణంగా నిమ్మకాయ, ఆరెంజ్‌లో విటమిన్ సీ ఎక్కువగా లభిస్తుంది. అయితే, వీటిలో కంటే కివీలో రెండు రెట్లు ఎక్కువగా లభిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే విటమిన్ సీ అత్యధికంగా కలిగి ఉండే కివీ పండు తినడం వల్ల కాన్సర్ ముప్పు తగ్గుతుంది. మంట, వాపు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిద్రలేమికి చెక్ పెట్టేయొచ్చు! తైపీ మెడికల్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం... నిద్రలేమి సమస్యలకు కివీతో చెక్ పెట్టేయవచ్చు. సెరోటిన్ ఇందుకు దోహదం చేస్తుంది. నిద్రపోవడానికి ఓ గంట ముందు కివీ పండు గనుక తింటే మంచి ఫలితాలు ఉంటాయి. డైటరీ ఫైబర్ అధికం కివీ పండులో డైటరీ ఫైబర్(కార్బోహైడ్రేట్) ఎక్కువ. దీని వల్ల హృద్రోగాల ముప్పు తగ్గుతుంది. ఈ ఎంజైమ్ వల్ల.. బొప్పాయిలో పొపైన్ ఎలాగో.. కివీ పండులో ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ కూడా అలాగే పనిచేస్తుంది. ప్రొటిన్‌ను విడగొడుతుంది. పెద్ద పేగులో సమస్యతో బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తుంది. ఫొలేట్ (విటమిన్- బి- 9) పుష్కలం కివీ పండులో ఫొలేట్ అధికంగా ఉంటుంది. కాబట్టి గర్భిణులు దీనిని తినడం వల్ల... పిండం ఆరోగ్యంగా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు పెరిగే పిల్లలకు కూడా ఇది ఉపయోగకరం. ఖనిజ లవణాల నిధి కివీ పండులో విటమిన్ ఏ, బీ6, బీ12, ఇ ఉంటాయి. అదే విధంగా పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ అధికం. విటమిన్లు, ఖనిజ లవణాల నిధి అయిన కివీని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎముకలు బలపడతాయి. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కివిలో లుటిన్, జియాక్సంత్ ఉండటంతో ఆరోగ్యమైన కంటి చూపును పెంచడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కివీ పండును తినదలచినవారు దీన్ని పొట్టు తీయకుండా తినడం మంచిది. ఈ పొట్టులో యౌవనాన్ని చాలాకాలం పాటు నిలిచేలా చేసే యాంటీ ఆక్సిడెంట్లు, వ్యాధినిరోధకశక్తి పెంచే విటమిన్-సి పుష్కలంగా ఉంటాయని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. అయితే, కచ్చితంగా వాటిని శుభ్రపరిచిన తర్వాతే తినాలి. చదవండి: Pregnancy Planning: మాత్రల రూపంలో అమ్మే ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల.. -
పరదేశీ పండు.. బహుబాగుండు
సాక్షి, సిటీబ్యూరో : అమెరికా స్ట్రాబెర్రీ, న్యూజిలాండ్ కివి, వాషింగ్టన్ యాపిల్, కాలిఫోర్నియ ద్రాక్ష, ఆ్రస్టేలియా ఆరెంజ్, థాయిలాండ్ డ్రాగన్.. ఇలా అనేక రకాల విదేశీ పండ్లు ప్రసుత్తం నగర పండ్ల మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. పండ్ల రుచులను ఆస్వాదించడానికి నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. కరోనా కాలంలో విదేశీ పండ్ల వినియోగం గణనీయంగా పెరిగిందని మార్కెట్ వర్గాల అంచనా. ప్రతి పండు పోషకాల సమ్మేళనం. సీజన్లో వచ్చే పండ్లలను తింటే మేలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రకాల పండ్లు రోగాలను సైతం నయం చేస్తాయని ఆయుర్వేద డాక్టర్లు అంటున్నారు. ►ఇటీవలి కాలంలో నగరంలో విదేశీ పండ్ల దిగుమతులు భారీగా పెరిగాయని గడ్డిఅన్నారం మార్కెట్ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్లో రోజుకు దాదాపు 50–60 టన్నుల విదేశీ పండ్ల విక్రయాలు సాగుతున్నాయి. గతంతో పోలిస్తే విదేశీ పండ్ల విక్రయాలు పెరిగాయని వ్యాపారవర్గాలు పేర్కొన్నాయి. ►గతంలో కేవలం సంపన్నులకే అందుబాటులో ఉండే ఈ పండ్లు ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి ప్రజల దరికి చేరాయి. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ పోషక విలువలు మెండుగా ఉండే పండ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నందున.. ఈ ఫ్రూట్స్ తినేందుకు మొగ్గు చూపుతున్నారు. ►గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు 20 దేశాల నుంచి వివిధ రకాల పండ్లు దిగుమతి అవుతుంటాయి. నగరంలో ఇటీవల ఈ పండ్ల వాడకం గణనీయంగా పెరగడంతో విదేశీ పండ్ల స్వీకరణలో మన నగరం దేశంలోనే మూడో స్థానానికి చేరుకుంది. ►ముంబై, బెంగళూరు తర్వాతి స్థానం హైదరాబాద్‌ది అని ‘వాషింగ్టన్ యాపిల్ కమిషన్’ డేటాలో తేలిందని విదేశీ ఎగుమతి, దిగుమతుల నిపుణుడు పి.రాకేశ్రెడ్టి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో లభించే వివిధ రకాల పండ్లు నగర మార్కెట్లో అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఏ పండు ఎక్కడ నుంచంటే.. యాపిల్: గ్రీన్ యాపిల్‌కు ఇటీవల అదరణ పెరిగింది. నెదర్లాండ్స్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ నుంచి నెలకు దాదాపు 12 వేల పెట్టెలు దిగుమతి అవుతున్నాయి. అమెరికా నుంచి యాపిల్ వాషింగ్టన్, రాయల్ గాల, యాపిల్ చైనా.. ఇక్కడి నుంచే గాకుండా న్యూజిలాండ్ నుంచి చిల్లి, బెల్జియం నుంచి కూడా పండ్లు మన దేశానికి దిగుమతి అవుతున్నాయి. డ్రాగన్‌ఫ్రూట్: క్యాబేజీ రూపంలో గులాబీ రంగులో ఉండే ఈ పండుకు పైన తొన ఉంటుంది. లోపల ఎక్కువగా తెలుపు కొన్ని ఎరుపు రంగులో కనిపిస్తాయి. చిన్న గింజలు ఉంటాయి. విటమిన్ సీ, ఫాస్పరస్, కాల్షియం, ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సీడెంట్లు ఎక్కువ. వ్యాధి నిరోధక శక్తితో పాటు కేన్సర్‌ను నియంత్రిస్తుంది. చెర్రీ: నగరానికి దిగుమతి అవుతున్న పండ్లలో చెర్రీ కూడా ఒకటి. ఇందులో కార్బొహైడ్రేట్లు, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. కివి: న్యూజిలాండ్, ఇటలీ, ఇరాన్, చైనా నుంచి దిగుమతి అవుతాయి. ప్రసుత్తం దేశీయ పండ్ల కంటే విదేశీ కివీకి ఎక్కువ డిమాండ్ . ప్లమ్: ఇదిచిన్న యాపిల్. చిన్న సైజు టమాటలా కనిపిస్తుంది. పెద్ద రేగు పండు సైజులో ఉంటుంది. కాల్షియం, సీ, బీ విటమిన్లు, మెగి్నíÙయంతో పాటు ఇతర పోషకాలు ఈ పండులో అధికంగా ఉన్నాయి. -
‘కివి’తో రోగనిరోధక శక్తి ఖాయం..!
సాక్షి, న్యూఢిల్లీ: శీతాకాలంలో మంచి డైట్లో భాగంగా ఏదైనా తీసుకోవాలంటే కివియే అంటున్నారు నిపుణులు. చూడడానికి సపోటాలా కనిపించే ఈ కివి పండు శీతాకాలంలో మనం తినే ఆహారంలో కచ్చితంగా ఉండాల్సింది. కివి ఇప్పుడు మన దేశంలో విరివిగా దొరుకుతుంది. ఈ పండుని న్యూజిలాండ్‌లో ఎక్కువగా పండిస్తారు. అందుకే ఆ దేశ క్రికెటర్లను కివీస్ అంటుంటాం అనుకుంట.. ఈ పండు తినడం ద్వారా మనకు అనేక పోషక విలువలు, విటమిన్లు, రోగ నిరోధక శక్తి లభిస్తుంది. సి-విటమిన్ మనకు రోగ నిరోధక శక్తి పెంచుతుంది. కివి ఈ పండులో ఇది పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా కివి కాలరీ ఫ్రెండ్లీ ఫ్రూట్, అందుకే డైట్ ప్లాన్ ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రోజూ మనం తినే బ్రేక్ ఫాస్ట్, సలాడ్స్, స్మూతీస్, షేక్స్‌లో వాడవచ్చు. కివి పండు ద్వారా మనకు దాదాపుగా 42 కేలరీలు పొందవచ్చును. మరి కివి ద్వారా మనకు ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం: జీర్ణక్రియ వేగవంతం: కివి పండులో మనకు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అది మన జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా యాంటిఆక్సిడెంట్స్ ఉండటంతో డయేరియా, నాసియా,గ్యాస్,మలబద్దకం వంటి మానసిక వ్వాధులకు నిరోధకంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి : సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. దాని ద్వారా మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సి విటమిన్ అవసరమైన మోతాదులో కావాలంటే దీన్ని డైట్లో భాగంగా తీసుకుంటే సరిపోతుంది. గుండెకు మేలు: కివి పండు గుండెకు ఎంతో మేలు. రక్తపోటును నియంత్రించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా పోషకాహారం కలిగి గుండె సంబంధిత వ్యాధులను ఎక్కువ రాకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఆస్తమాకి మంచిది: ఆస్తమాతో భాదపడుతున్న వారు కివి పండు ద్వారా ప్రయోజనం పొందవచ్చు. యాంటీఆక్సిడెంట్స్, సి-విటమిన్ ఉండటంతో ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచడం ద్వారా అలర్జీలను దగ్గర రానివ్వకుండా సమర్థవంతంగా పనిచేస్తుంది. కంటి చూపు పెంచుతుంది: రోజు డైట్లో కివి పండును తీసుకోవడం ద్వారా కంటిచూపు మందగించకుండా ఉపయోగపడుతుంది. కివిలో లుటిన్, జియాక్సంత్ ఉండటంతో ఆరోగ్యమైన కంటి చూపును పెంచడానికి ఉపయోగపడుతుంది. మీరు మీ రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవడాని ఆహారంలో తీసుకునే ఉత్తమ పండ్లలో కివి ఒకటి. శీతాకాలంలో శరీరం అలర్జీలు ,అనారోగ్యానికి గురయ్యేటప్పుడు, కివి వంటి పండ్లు మంచి ఎంపిక. -
వామ్మో.. ఏంటి ఇది నిజమేనా.?!
సంగీతానికి రాళ్లు కరుగుతాయి... రాతిలో నుంచి కూడా సంగీతం వినిపిస్తుంది అని మనకు తెలుసు. కానీ పండ్ల నుంచి మ్యూజిక్ రావడం ఎప్పుడైనా చూశారా.. కనీసం విన్నారా లేదు కదా. అయితే ఈ వీడియో చూడండి. ఆశ్చర్యంతో మీకు కూడా నోట మాట రాదు. ఎందుకంటే ఓ వ్యక్తి పుచ్చకాయ, కివి పండ్ల ముక్కలను పియానో కీస్లాగా వాయిస్తూ.. వాటి నుంచి సంగీతాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను మాజీ బాస్కెట్ బాల్ ఆటగాడు రెక్స్ చాప్మన్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. ‘బ్రో.. ఇతను పుచ్చకాయలతో వాయిస్తున్నాడు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. (చదవండి: అనుకోని అతిధి రాకతో అద్భుతం..) Bro - he’s playing melons...pic.twitter.com/Q8v93qRG46 — Rex Chapman🏇🏼 (@RexChapman) September 3, 2020 వివరాలు.. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ యువకుడు స్విమ్మింగ్ ఫూల్ వద్ద కూర్చుని ఉన్నాడు. అతని ఎదురుగా బల్లమీద వరుసగా పుచ్చకాయ ముక్కలతో రెండు కివి ముక్కలు కూడా ఉన్నాయి. వాటి నుంచి వైర్లను ఓ మెటల్ బోర్డుకి కనెక్ట్ చేశాడు. దాన్ని ల్యాప్‌టాప్‌కి కలిపాడు. కింద కాలు దగ్గర పెడల్స్ ఉన్న డ్రమ్ కూడా ఉన్నది. ఇక ఆ వ్యక్తి పుచ్చకాయ ముక్కలను సింథసైజర్ కీస్లాగా నొక్కడం ప్రారంభించగానే వాటి నుంచి శబ్దం వస్తుంది. కొన్ని సెకన్ల తర్వాత డ్రమ్‌ని కాలితో వాయిస్తాడు. చివరకు కివి ముక్కలను కూడా నొక్కుతాడు. అవి కూడా శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. మొత్తానికి మాంచి మ్యూజిక్‌ని ప్లే చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా అతడు నిజంగానే పండ్ల ముక్కల నుంచి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నాడా.. లేక వేరే సెటప్ ఉందా అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే వేలాది మంది ఈ వీడియోను చూశారు.. మీరూ ఓ లుక్కేయండి. -
వీసా రూల్స్‌నే మార్చేసిన పండు!
న్యూజిలాండ్ ప్రజల ప్రధాన జీవనాధారమైన కివీ పండు.. ఆ దేశ విదేశాంగ చట్టంలోనే మార్పులకు కారణమైంది తెలుసా? వీసా రూల్స్‌ను మార్చేసేందుకు, పర్యాటక వీసాలపై వచ్చే వారు కూడా దేశంలో పనిచేసి డబ్బు సంపాదించుకునేలా అవకాశం కల్పించేందుకు కారణమైంది. అదెలాగో చూద్దామా.. న్యూజిలాండ్ జాతీయ ఫలం కివీయే. అందుకే ఆ దేశ ప్రజలను కివీస్ అని ముద్దుగా పిలుస్తారు. కివీ పండ్ల ఉత్పత్తిలో తొలి రెండు స్థానాల్లో చైనా, ఇటలీ ఉంటే.. న్యూజిలాండ్ మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఆ దేశ ఆర్థికాభివృద్ధిలోనూ ఈ చిన్ని ఫలానిదే ముఖ్యమైన పాత్ర కావడం విశేషం. 2008–2009 సీజన్లో న్యూజిలాండ్ కివీ ఫ్రూట్ ఎగుమతుల విలువ 1.45 బిలియన్ న్యూజిలాండ్ డాలర్లు. అయితే ఇదే ఇప్పుడు ఆ దేశానికి వచ్చే విజిటర్స్ వీసా రూల్స్‌ని మార్చేసింది. న్యూజిలాండ్‌లో విరగ కాసే కివీ పండ్లను కోసేందుకు కార్మికుల కరువొచ్చిపడింది. విరివిగా కివీ పంట పండుతున్నా అవసరమైన కార్మికులు దొరకక ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయాన్ని ఆ దేశం అధికారికంగా ప్రకటించింది కూడా. గత దశాబ్ద కాలంలో ఇదే సీజనల్ లేబర్ షార్టేజ్ అని కూడా పేర్కొంది. వీసా రూల్స్‌నే మార్చేసి.. అధిక వేతనాలిచ్చినా కార్మికుల కొరత తీరక.. పక్క దేశాల నుంచి కార్మికులను తెప్పించుకోవాలని నిర్ణయించింది న్యూజిలాండ్ ప్రభుత్వం. ఇందుకోసం వీసా నిబంధనలను సరళతరం చేసింది. సాధారణంగా ఉత్పత్తులను దాచుకోవడానికి వీలుంటుంది. కానీ పండ్లను మాత్రం వీలైనంత త్వరగా వాడేయాల్సిందే. లేదంటే కుళ్లిపోతాయి. ఎగుమతి చేయాల్సిన సమయం దాటిపోతే కివీ పండ్లను చెట్లమీదో, తెంపాకో మురిగిపోతుంటే చూడటమే తప్ప చేసేదేమీ ఉండదని ఆ దేశ ప్రధాని జెసిందా ఆర్డెర్న్ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తక్షణమే విదేశీ లేబర్‌ను రప్పించుకోవాలని న్యూజిలాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వీసా నిబంధనలను సవరించి మరీ సులభంగా విదేశీ కార్మికులు వచ్చేలాగా వీలుకల్పించింది. కివీ పండ్లను కోసేందుకూ, ప్యాకింగ్ చేసేందుకు ఈ కార్మికుల సేవలను వినియోగించుకోనుంది. ఈ విభాగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం గంటకు 16.50 న్యూజిలాండ్ డాలర్లుగా కూడా నిర్ణయించింది. పర్యాటక వీసాపైనా పనిచేయొచ్చు.. సాధారణంగా పర్యాటక (విజిటర్) వీసాతో ఏ దేశానికైనా వెళ్లేవారు.. అక్కడ ఉద్యోగం చేసే వీలుండదు. కానీ న్యూజిలాండ్ పర్యాటక వీసాలపై వచ్చే వారు కూడా ఆరు వారాల పాటు పనిచేసుకోవడానికి వీలు కల్పించేలా సీజనల్ వర్క్ పర్మిట్ ఇస్తుండటం గమనార్హం. ప్రత్యేక పరిస్థితుల కారణంగా విజిటర్స్ వీసాపై న్యూజిలాండ్‌లో కార్మికుల కొరత ఉన్న బే ఆఫ్ ప్లెంటీ రీజియన్‌లో ఆరు వారాల పాటు పనిచేసేందుకు అనుమతిస్తున్నట్టు న్యూజిలాండ్ ప్రకటించింది. న్యూజిలాండ్ సామాజికాభివృద్ధి శాఖ.. టాస్మాన్, బే ఆఫ్ ప్లెంటీ ప్రాంతాలను కార్మికుల కొరత ఉన్న ప్రాంతాలుగా ఇప్పటికే ప్రకటించింది. టాస్మాన్లో ఏప్రిల్ 5 నుంచి మే 18 వరకూ, బే ఆఫ్ ప్లెంటీలో మే 7 నుంచి, జూన్ 8 వరకు విజిటర్స్ వీసాపై వర్క్‌పర్మిట్ ఇస్తారు. దీనిపై ఒక్కసారి మాత్రమే ఉపాధికి అవకాశం ఉంటుంది. -
సైకిల్ తో భారత స్వర్ణ చతుర్భుజిని దాటాడు..!
ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లలో తన సైక్లింగ్ ను పూర్తి చేసిన ఓ యువకుడు... ఇప్పుడు తన భారత ప్రయాణంవైపు దృష్టి సారించాడు. సన్నని దారులు, ఇరుకైన ప్రాంతాల్లోని అడ్డంకులను సైతం తప్పించుకొంటూ ప్రయాణించాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే కివి సైకిల్ తో... రికార్డు సాధనే ధ్యేయంగా దూసుకుపోతున్నాడు. భారత ప్రధాన నగరాల్లో పారిశ్రామిక వ్యవసాయ, సాంస్కృతిక కేంద్రాలుగా పనిచేసే రహదారి నెట్వర్క్ స్వర్ణ చతుర్భుజిని దిగ్విజయంగా దాటేశాడు. రెండేళ్ళ క్రితం 24 ఏళ్ళవయసున్న టిమ్ ఛిట్టాక్ తన ఫాస్టెట్ సైక్లింగ్ తో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ పర్యటనలు ముగించుకొని తాజాగా భారత్ లో ప్రవేశించాడు. న్యూజిల్యాండ్ వైకటో విశ్వవిద్యాలయంనుంచి లా అండ్ ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందిన ఛిటాక్... ఫిబ్రవరి 27న ఢిల్లీలో న్యూజిల్యాండ్ ఎంబసీనుంచీ సైకిల్ ప్రయాణం ప్రారంభించాడు. సగటున 250 కిలోమీటర్ల చొప్పున మొత్తం 24 రోజుల్లో 6000 కిలోమీటర్ల దూరం సైకిల్ ప్రయాణం చేస్తూ చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, జైపూర్, కాన్పూర్, పూనే, సూరత్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం మొదలైన నగరాలన్నీ చుట్టేశాడు. తాను సవాలుగా స్వీకరించిన ఈ సైక్లింగ్ తనకు గొప్ప అనుభవాన్నిచ్చిందని ఛిటాక్ చెప్తున్నాడు. సైక్లింగ్ చేయడానికి జాతీయ రహదారులు కొంత సహకరించేవిగానే ఉంటాయని, ఇన్నర్, లింక్ రోడ్లలో ప్రయాణమే పెద్ద ఛాలెంజింగ్ గా ఉంటుందని చెప్పాడు. తాను ప్రయాణంలో ఉన్నపుడు కనీసం రోజుకు మూడుసార్లు షేవింగ్ చేసుకుంటానని చెప్తున్న ఛిటాక్... ఒకసారి ఓ ట్రక్ కింద పడబోయి తృటిలో తప్పించుకున్నట్లు తెలిపాడు. భారత స్వర్ణ చతుర్భుజిపై సైక్లింగ్ చేసి, గిన్నిస్ రికార్డును సాధించే ప్రయత్నంలో ఛిటాక్ రోజుకు 80 కిలోమీటర్ల చొప్పున సైకిల్ తొక్కినట్లు చెప్పున్నాడు. గిన్నిస్ ను సంప్రదించిన అనంతరం ప్రారంభించిన అతడి ప్రయత్నం ఎంతవరకూ సఫలీకృతమౌతుందో తెలియాల్సి ఉంది.