
స్టార్ ప్లస్‌లో మంచి ఫేమస్ అయిన షో సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా. ఇది పాకకళకు సంబంధించిన రియాలటీ షో. ఈ ఈవెంట్‌లో ప్రముఖ సినీ సెలబ్రిటీలు, మాస్టర్ చెఫ్‌ల సమక్షంలో కంటెస్టెంట్‌లు తమ పాక కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. దగ్గర దగ్గర 12 నుంచి 15 మంది దాక పోటీదారులు పాల్గొంటారు. అయితే ఈ సారి మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్ 1లో ఓ వైరైటీ వంటకం ఆ షో న్యాయనిర్ణేతలని కట్టిపడేసింది. తప్పనిసరిగా ఆ డెజర్ట్‌ని తమ భోజనంలో భాగంలో చేసుకుంటామని అన్నారు. అదేంటో చూసేద్దామా..:
తన పాక నైపుణ్యంతో న్యాయనిర్ణేతను ఫిదా చేసింది అర్చన గౌతమ్ అనే పోటీదారురాలు. ఆమె ఈ సీజన్ పోటీలో జడ్జీలను తన పాక కళతో అమితంగా జడ్జీలను ఆకట్టుకుంది. వండిన విధానమే గాక సర్వ్ చేసే తీరు హైలెట్‌గా నిలిచింది. అయితే ఆమె ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో చేసిన వంటకంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.
ఆ షో న్యాయనిర్ణేతలు కూడా ఆ వంటకం చేసిన తీరు, ప్రెజెంట్ చేసిన విధానానికి ఫిదా అయ్యి ప్రశంసలతో ముంచెత్తారు. మరీ ఆ కంటెస్టెంట్ తయారు చేసిన వంటకం ఏంటంటే..
కివి ఐస్ క్రీం:
ఆ షోలో ఆమె కివి ఐస్‌క్రీంని తయారు చేసింది. ఆకృతిపరంగానే కాకుండా తయారు చేసిన విధానం కూడా వేరెలెవెల్. కివిని పచ్చిపాలతో కలపి, అల్లం, పుదీనా, మిరపకాయలతో అత్యద్భుతంగా తయారుచేసింది. దాన్ని క్యాండీ ఫ్లాస్‌తో అందంగా సర్వ్ చేసింది. చూడటానికి ఏదో కళాత్మక ఖండంతో కలగలిసిన వంటకంల ఆకర్షణీయంగా ఉంది.
ఇక ఆ షోలో సెటబ్రిటీలు ఫరా ఖాన్, రణవీర్ బ్రార్ , ప్రముఖ చెఫ్ ఈ వంటకాన్ని ఎంతో బాగుందంటూ ప్రశంసించారు. అంతేగాదు తాము ఇక నుంచి తమ భోజనంలో ఈ వంటకం ఉండేలా చూసుకుంటామని అన్నారు. కొన్ని వంటకాల తయారీ మనలో దాగున్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికి తీస్తాయంటే ఇదే కదూ. అందులోనూ ఆ కంటెస్టెంట్ ఆరోగ్యకరమైన వాటితోనే రుచికరమైన డెజర్ట్ చేసి మరిన్ని ఎపిసోడ్‌లు కొనసాగేలా అర్హత పొందింది.
(చదవండి: కృత్రిమ గుండెతో వంద రోజులకు పైగా బతికిన తొలి వ్యక్తి..!)
Comments
Please login to add a commentAdd a comment