సంగీతానికి రాళ్లు కరుగుతాయి... రాతిలో నుంచి కూడా సంగీతం వినిపిస్తుంది అని మనకు తెలుసు. కానీ పండ్ల నుంచి మ్యూజిక్ రావడం ఎప్పుడైనా చూశారా.. కనీసం విన్నారా లేదు కదా. అయితే ఈ వీడియో చూడండి. ఆశ్చర్యంతో మీకు కూడా నోట మాట రాదు. ఎందుకంటే ఓ వ్యక్తి పుచ్చకాయ, కివి పండ్ల ముక్కలను పియానో కీస్‌లాగా వాయిస్తూ.. వాటి నుంచి సంగీతాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను మాజీ బాస్కెట్ బాల్ ఆటగాడు రెక్స్ చాప్మన్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘బ్రో.. ఇతను పుచ్చకాయలతో వాయిస్తున్నాడు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. (చదవండి: అనుకోని అతిధి రాకతో అద్భుతం..)
Bro - he’s playing melons...pic.twitter.com/Q8v93qRG46
— Rex Chapman🏇🏼 (@RexChapman) September 3, 2020
వివరాలు.. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ యువకుడు స్విమ్మింగ్ ఫూల్ వద్ద కూర్చుని ఉన్నాడు. అతని ఎదురుగా బల్లమీద వరుసగా పుచ్చకాయ ముక్కలతో రెండు కివి ముక్కలు కూడా ఉన్నాయి. వాటి నుంచి వైర్లను ఓ మెటల్ బోర్డుకి కనెక్ట్ చేశాడు. దాన్ని ల్యాప్‌టాప్‌కి కలిపాడు. కింద కాలు దగ్గర పెడల్స్ ఉన్న డ్రమ్ కూడా ఉన్నది. ఇక ఆ వ్యక్తి పుచ్చకాయ ముక్కలను సింథసైజర్ కీస్‌లాగా నొక్కడం ప్రారంభించగానే వాటి నుంచి శబ్దం వస్తుంది. కొన్ని సెకన్ల తర్వాత డ్రమ్‌ని కాలితో వాయిస్తాడు. చివరకు కివి ముక్కలను కూడా నొక్కుతాడు. అవి కూడా శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. మొత్తానికి మాంచి మ్యూజిక్‌ని ప్లే చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా అతడు నిజంగానే పండ్ల ముక్కల నుంచి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నాడా.. లేక వేరే సెటప్ ఉందా అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే వేలాది మంది ఈ వీడియోను చూశారు.. మీరూ ఓ లుక్కేయండి.
Comments
Please login to add a commentAdd a comment