Watermelon
-
National Watermelon Day: ప్రయోజనాలే కాదు.. చరిత్ర కూడా గొప్పదే..
జాతీయ పుచ్చకాయ(వాటర్ మిలన్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 3న జరుపుకుంటారు. పుచ్చకాయలో 92శాతం మేరకు నీరు ఉంటుంది. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి పుచ్చకాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పంట సాగు 2000 బీసీ నుండి కొనసాగుతోంది. పుచ్చకాయ చరిత్రపుచ్చకాయ మొదటి పంటను సుమారు 5,000 సంవత్సరాల క్రితం ఈజిప్టులో పండిచారని చరిత్ర చెబుతోంది. 12వ ఈజిప్షియన్ రాజవంశీయులు తిరుగాడిన ప్రదేశాలలో పుచ్చకాయ, దాని గింజల జాడలను కనుగొన్నారు. కింగ్ టుటన్‌ఖామెన్ సమాధిలోనూ పుచ్చకాయ ఆనవాళ్లు కనిపించాయి. పురాతన ఈజిప్షియన్ శాసనాలలో వివిధ రకాల పుచ్చకాయల పెయింటింగ్‌లు కనిపించాయి.ఆఫ్రికాలోని కలహరి ఎడారిలో ప్రయాణించే వ్యాపారులకు పుచ్చకాయ విత్తనాలను విక్రయించినట్లు తెలుస్తోంది. పుచ్చకాయ సాగు ఆఫ్రికా అంతటా చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత ఇది మధ్యధరా దేశాలకు, ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. తొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి, చైనాతో పాటు మిగిలిన ఆసియా దేశాలలో పుచ్చకాయను విరివిగా సాగు చేయడం మొదలుపెట్టారు.జాన్ మరియాని రాసిన ‘ది డిక్షనరీ ఆఫ్ అమెరికన్ ఫుడ్ అండ్ డ్రింక్’ లోని వివరాల ప్రకారం పుచ్చకాయ అనే పదం 1615లో ఆంగ్ల నిఘంటువులో కనిపించింది. యునైటెడ్ స్టేట్స్లో 300కు మించిన రకాల పుచ్చకాయలను పండిస్తున్నారు.ఆరోగ్య ప్రయోజనాలుపుచ్చకాయలో 92శాతం మేరకు నీరు ఉంటుంది . కేలరీలు తక్కువ పరిణామంలో ఉంటాయి. ఈ పండు నిర్జలీకరణాన్ని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో ఈ జ్యూసీ ఫ్రూట్‌ని చేర్చుకోవాలి. పుచ్చకాయ గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. పుచ్చకాయలో హీట్ స్ట్రోక్‌ను నిరోధించే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. -
బరువు తగ్గడంలో పుచ్చకాయ గింజలు ఎలా ఉపయోగపడతాయో తెలుసా..!
పుచ్చకాయ గింజలతో బరువుకి చెక్ పెట్టొచ్చట. సమ్మర్లో దాహార్తిని తీర్చే ఈ పుచ్చకాయతో బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అద్భుతమైన హైడ్రేటింగ్ పండు మాత్రమే గాక దీనిలో ఉండే చిన్న విత్తనాలు బరువుని తగ్గించడంలో ఎంతో పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇందులో దాదాపు 92% నీరు ఉంటుంది. ఇందులో ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వేసవిలో మంచి రిఫ్రెష్‌ని ఇచ్చే జ్యూసీ పండు ఇది.అయితే దీనిలో ఉండే విత్తనాలను పారేస్తామే గానీ వినియోగించం. వీటిలో కూడా అవసరమైన పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయట. అవి బరువు తగ్గించడంలో ప్రభావవంతగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ని అని చెబుతున్నారు. ఈ పుచ్చకాయ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో సవివరంగా చూద్ధామా..!అధిక ప్రోటీన్: పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది కండరాలను బలోపేతం చేయడానికి అవసరం. ఇందులో ఉండే ప్రొటీన్ ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతిని పొందడంలో సహాయపడుతుంది. అల్పాహారం చేయాలనే కోరికను తగ్గించి, బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఈ విత్తనాలలో కొన్ని మాత్రమే రోజువారీ ప్రోటీన్‌లో గణనీయమైన మొత్తాన్ని అందించగలవు.ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి: ఈ గింజల్లో ఒమేగా-6 తో సహా ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. ఇవి శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కొవ్వులు తక్షణ శక్తిని అందిస్తాయి. చురుకుగా ఉండటానికి, రోజంతా ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడతాయి.ఫైబర్ కంటెంట్: పుచ్చకాయ గింజలు ఫైబర్ మూలం. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. సంపూర్ణత్వ భావనను ప్రోత్సహిస్తుంది. ఇది అతిగా తినడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. పైగా మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది.జీవక్రియను పెంచుతుంది: పుచ్చకాయ గింజలలో లభించే మెగ్నీషియం జీవక్రియకు సంబంధించిన శక్తి ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సమర్థవంతమైన బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన జీవక్రియ అవసరం. ఎందుకంటే ఇది శరీరంలో కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలో అదనపు కిలోలను తగ్గించడంలో సహాయపడుతుంది.కేలరీలు తక్కువ: అనేక ఇతర చిరుతిండి ఎంపికలతో పోలిస్తే పుచ్చకాయ గింజలు చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి పోషకమైన సంతృప్తికరమైన ఎంపికగా మారుస్తుంది.ఎలా చేర్చుకోవాలంటే..వేయించిన పుచ్చకాయ గింజలు భోజనానంతరం స్నాక్‌గా తీసుకోవడం సరైనది. ఆరోగ్యకరమైన స్నాకింగ్ తినాలనుకుంటే చిటికెడు ఉప్పు, కొంచెం ఆలివ్ నూనెతో వేయించండి. అలాగే ప్రోటీన్లు, అవసరమైన పోషకాల కోసం స్మూతీస్‌లో కూడా జోడించండి. ముఖ్యంగా సలాడ్ల పైన వేయించిన పచ్చి పుచ్చకాయ గింజలను చిలకరించడం వల్ల క్రంచి క్రంచి వగరు రుచిని ఆస్వాదించవచ్చు. (చదవండి: కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి సెంచరీ కొట్టిన తాత! ఎలాగంటే..) -
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
సాధారణంగా ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. అలాంటి వాటిలో ఒకటివేసవిలో ఎక్కువగా లభించే పుచ్చకాయ. సాధారణంగా పుచ్చకాయ కోసి తినే సమయంలో వాటి గింజలను పారేస్తుంటారు. నిజానికి పుచ్చకాయ గింజల్లోని గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఈసారి గింజల్ని అపురూపంగా చూసుకుంటారు. పుచ్చకాయ గింజల వలన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి!పుచ్చకాయ అద్భుతమైన హైడ్రేటింగ్ ఫ్రూట్. ఇందులో 92శాతం నీరే ఉంటుంది. ఇంకా ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి అలాగేదీని గింజలు వివిధ రకాల పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు, జింక్, మెగ్నీషియం, పొటాషియం మొదలైన సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. పుచ్చకాయ గింజలు రోగనిరోధక శక్తిని,గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ గింజల్లోని మిథనాలిక్ సారం అల్సర్లకు వ్యతిరేకంగా అద్భుతంగా పని చేస్తుందని ఎలుకలపై చేసిన అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.తక్కువ కేలరీలుపుచ్చకాయ గింజల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. 4 గ్రాముల బరువున్న కొన్ని విత్తనాలలో 23 కేలరీలు మాత్రమే ఉంటాయి.మెగ్నీషియంజీవక్రియ కార్యకలాపాలకు అవసరమైన పోషకం మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహిస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, మన శరీరానికి ప్రతిరోజూ 420 గ్రాముల మెగ్నీషియం అవసరం.జింక్ఇందులోని జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియ, కణాల పెరుగుదలలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇనుముఇనుము ఎక్కువగా లభిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, ఒక వ్యక్తికి రోజువారీ 18 mg ఇనుము అవసరం. మంచి కొవ్వులుగుడ్ కొలెస్ట్రాల్(మంచి కొవ్వు) మోనోఅన్‌శాచురేటెడ్ , పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్‌ను నివారించడానికి ఉపయోగపడుతుంది . కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నాలుగు గ్రాముల పుచ్చకాయ గింజలు 0.3 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను , 1.1 గ్రాముల పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి. -
మరో అందమైన సాయంత్రం: సింగర్ సునీత, వీడియో వైరల్
టాలీవుడ్ పాపులర్ అండ్ సీనియర్ సింగర్ సునీత ఉపద్రష్ట పరిచయం అవసరం లేని పేరు. గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమై స్థానం సంపాదించుకుంది సునీత. ఒకపక్క కరియర్‌ను నిర్మించుకుంటూనే, సింగిల్ మదర్‌గా పిల్లల్ని తీర్చి దిద్దుకుంది. అంతేకాదు వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లిచేసుకోని తన జీవితానికి కొత్త బాటలు వేసుకున్న ఈ సింగర్ ఇపుడు తన బిడ్డల్ని కూడా ప్రయోజకుల్ని పనిలో బిజీగా ఉంది. అనేక టీవీ షోలు, కన్సర్ట్లతో లైమ్లైట్ లో ఉండటమే కాదు, తన వ్యక్తిగత జీవిత విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా పచ్చని పుచ్చతోటలో విహరిస్తూ ఒకవీడియోను పెట్టింది.దీంతో ఫ్యాన్స్‌తో లైక్స్, కమెంట్స్‌తో సందడి చేస్తున్నారు. కాగా ఇటీవల సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయయ్యాడు. 'సర్కారు నౌకరి' అనే మూవీలో పాత్రకు తగ్గట్లు నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
అమెరికాలో అసలేం జరుగుతుంది?బాంబుల్లా పేలుతున్న పుచ్చకాయలు
పుచ్చకాయలు పేలడం గురించి మీకు తెలుసా? ఇదేం విచిత్రం.. సాధారణంగా గట్టిగా నేలకేసి కొట్టినా పుచ్చకాయ పగలదు కదా అంటారా.. కానీ అమెరికాలో మాత్రం ఈమధ్య పుచ్చకాయలు బాంబుల్లా పేలిపోతున్నాయి. దీంతో అక్కడి వారు పుచ్చకాయలు కొనాలంటేనే హడలిపోతున్నారట. ఇలా ఎందుకు జరగుతుంది? అసలు పుచ్చకాయలు పేలిపోవడానికి గల కారణాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. అమెరికాలో లీలా ఫాడెల్ అనే మహిళ.. మర్కెట్‌కు వెళ్లి పుచ్చకాయ తెచ్చుకున్నానని, ఇంటికెళ్లి కిచెన్‌లో పెట్టగానే అది పేలిపోయిందని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇలా లీలా ఫాడెల్ మాత్రమే కాదు.. అమెరికాలో చాలామందికి ఈ మధ్య ఇలాంటి సంఘటనలే ఎదురయ్యాయి. పుచ్చకాయలు ఇలా సడెన్‌గా పేలిపోతున్నాయని ఇదేం విచిత్రం అంటూ నివ్వెరపోతున్నారు. బాంబుల్లా పేలిపోతున్న పుచ్చకాయలు అంటూ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. దీంతో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అన్నదానిపై రీసెర్చ్ మొదలైంది. అమెరికాలో జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం.. పుచ్చకాయలో ఒక నిర్ధిష్ట రకమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతోందని దానివల్ల సహజ చక్కెర, ఈస్ట్ అనే పదార్థాలు ఉత్పన్నం అవుతాయని తేలింది. పుచ్చకాయలు పేలడానికి ఫార్మెంటేషన్ మాత్రమే కారణం కాదని బ్యాక్టీరియా లేదా ఫంగల్ వ్యాధి కూడా కారణం కావచ్చని కార్నెల్‌లోని స్కూల్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ ప్లాంట్ సైన్స్ హార్టికల్చర్ ప్రొఫెసర్ డాక్టర్ స్టీవ్ రీనర్స్ అన్నారు. పంట త్వరగా చేతికి రావాలని కొందరు రసాయనాలు కలుపుతున్నారని, ఇవి పుచ్చకాయల్లో ఉండే నేచురల్ షుగర్‌తో కలిసిపోయి పేలిపోతున్నట్లు రీసెర్చ్‌లో వెల్లడైంది. అంతేకాకుండా వీటిని ఒకేసారి అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట పెట్టడం కూడా ఈ పేలుళ్లకు కారణం కావచ్చని తెలియజేశారు. -
లాభాలు కురిపిస్తున్న ఎల్లో వాటర్ మిలాన్..
-
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ.. ఏందుకంత స్పెషల్?
పుచ్చకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో 95 శాతం నీరు ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా పుచ్చకాయను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్ బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు. రక్తప్రసరణను మెరుగుపరిచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని పదిల పరిచే పుచ్చకాయను ఏ సీజన్లో అయినా తినేందుకు ఇష్టపడతారు. కానీ ఓ పుచ్చకాయ ధర 5లక్షల రూపాయలంటే నమ్మగలరా? జపాన్‌లో పండే ఈ అరుదైన పుచ్చకాయ అక్కడ చాలా ఫేమస్. ఎందుకంత కాస్ట్లీ? అసలు ఏంటీ దాని స్పెషాలిటీ ఇప్పుడు చూద్దాం. జపాన్ దేశంలో అత్యంత ఖరీదైన పండ్లను పండిస్తారు. వాటిలో ఒకటి డెన్సుకే పుచ్చకాయ. దీన్ని పండించేందుకు అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తారు. ఈ పుచ్చకాయల్ని అత్యంత జాగ్రత్తగా పండిస్తారు. ప్రతీ పుచ్చకాయ బరువు దాదాపు 6 నుంచి 7 కేజీల దాకా ఉంటుంది. అంతేకాకుండా దీని రుచి కూడా చాలా బాగుంటుందంట. తియ్యగా కరకరలాడుతూ, రవ్వ రవ్వగా ఉంటుంది. ఏడాది మొత్తంలో కేవలం 100 డెన్సుకే పుచ్చకాయలు మాత్రమే పండుతాయి. పైగా ఇవి సాధాసీదా మార్కెట్లలో లభించవు. వీటిని ప్రత్యేకంగా వేలం పాట ద్వారా విక్రయిస్తారు. దీన్ని జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాలనే పట్టుదలతో ఉండేవారు ఈ వేలం పాటలో పాల్గొంటారు. ఈ పుచ్చకాయ ధర ప్రతి ఏటా పెరుగుతుంది. ప్రస్తుతం దీని ధర మార్కెట్లో సుమారు రూ. 5 లక్షలు ఉంది. మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఈ పుచ్చకాయలను తినడానికి కొనరంట..ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి ఎక్కువగా కొనుగోలు చేస్తారట. అయినా అంద ధర పెట్టి పుచ్చకాయ కొనడం, తినడం రెండూ విడ్డూరమే కదూ.. -
వెరైటీ పుచ్చకాయలు
-
పుచ్చకాయలివ్వండి..కొత్త ఇల్లు సొంతం చేసుకోండి!
బీజింగ్: కరోనా వైరస్ మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా యుద్దం కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభంతో అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా చైనాలో భారీ ఉద్యోగాలను అందించే రియల్ ఎస్టేట్ కుప్పకూలి పోవటం ఆందోళనకు దారి తీసింది. దీంతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు బిల్డర్లు కొత్త ఆఫర్లను ఆందిస్తున్నారు. పుచ్చకాయలు, పీచెస్ పళ్లు, వెల్లుల్లి, గోధుమలులాంటి ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు తక్కువ రేటుకే ఇళ్లను విక్రయిస్తున్నారు. ఒకవైపు కొనుగోలుదారులేక, మరోవైపు ఇప్పటికే గృహాలను కొనుగోలుచేసిన వారు డబ్బులు చెల్లించక పోవడంతో ప్రాపర్టీ వలపర్లను కష్టాల్లోకి నెట్టేసింది. దీంతో పుచ్చకాయలు, పీచెస్, వెల్లుల్లి, గోధుమలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను స్వీకరిస్తున్నారని స్థానిక మీడియా నివేదించింది. కస్టమర్ల నుంచి డబ్బులకు బదులు పుచ్చకాయలు, గోధుమలు, వెల్లుల్లి వంటి వాటిని అంగీకరిస్తున్నారు. టైర్ 3, 4 నగరాల్లోని రియల్టర్లు ఈ విధంగా ప్రాపర్టీ కొనుగోళ్లలో రైతులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. చైనా హౌసింగ్ మార్కెట్ మందగమనానికి తోడు ప్రాజెక్ట్‌లను ప్రారంభించే ముందు బిల్డర్లు డిపాజిట్లు తీసుకోవడంపై ప్రభుత్వ నిషేధం విధించింది. దీంతో తూర్పు నగరమైన నాన్ జింగ్‌లోని ఒక డెవలపర్ స్థానిక రైతుల నుండి డౌన్‌పేమెంట్‌గా 100,000 యువాన్ల వరకు విలువైన ట్రక్కుల పుచ్చకాయలను స్వీకరిస్తున్నారట. 100,000 యువాన్ల విలువను 5000 కిలోల పుచ్చకాయలుగా లెక్కిస్తున్నారు. మరో చిన్న పట్టణమైన వుక్సీలో, మరొక డెవలపర్ పీచెస్ పళ్లను తీసుకుంటున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. దీంతో సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ప్రధాన వెల్లుల్లి ఉత్పత్తి ప్రాంతమైన క్వి కౌంటీలోని గృహ కొనుగోలుదారులు తమ డౌన్ పేమెంట్‌లో కొంత భాగాన్ని మార్కెట్ ధర కంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు తమ ఉత్పత్తులను మార్పిడి చేసుకుంటున్నారు. కొత్త వెల్లుల్లి సీజన్ సందర్భంగా, క్వి కౌంటీలోని వెల్లుల్లి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని హోమ్‌బిల్డర్ సెంట్రల్ చైనా మేనేజ్మెంట్ మే చివరిలో సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారంతో అమ్మకాలు పెరిగాయట. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకునేందుకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గృహ రుణాలపై కనీస వడ్డీ రేటును కూడా తగ్గించింది. 4.6 శాతం నుంచి 4.4 శాతం వరకు కోత పెట్టింది. ప్రస్తుతం చైనా గృహ రుణాల విలువ 10 ట్రిలియన్లకు డాలర్లకు చేరింది. చైనాలో దాదాపు 27 శాతం బ్యాంకు రుణాలు రియల్ ఎస్టేట్‌తో ముడిపడి ఉన్నాయని థింక్ ట్యాంక్, పాలసీ రీసెర్చ్ గ్రూప్ నివేదించింది. కాగా అధికారిక డేటా ప్రకారం చైనాలో గృహ విక్రయాలు వరుసగా 11 నెలలోనూ క్షీణతను నమోదు చేశాయి. గత ఏడాదితో పోలిస్తే మేలో 31.5 శాతం తగ్గాయి. కోవిడ్ మహమ్మారి విలయంతో చైనాతోపాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కూడా సంక్షోభంలో కూరుకుపోయాయి. దీనికి తోడు ఉక్రెయిన్-రష్యా వార్ తోడవ్వడంతో గ్లోబల్‌గా నిత్యావసరాలు, ఇంధనం, గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. తీవ్ర ఆహార కొరత వేధిస్తోంది. -
Summer Drinks: వేసవిలో పుచ్చకాయ, యాపిల్ జ్యూస్ కలిపి తాగితే!
వేసవిలో పుచ్చకాయ యాపిల్ జ్యూస్ మంచి రుచికరమైన రిఫ్రెషింగ్ డ్రింక్. పుచ్చకాయలోని నీరు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. యాపిల్‌లో ఉన్న పోషకాలు శరీరానికి అంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ రెండింటినీ కలిపి తాగడం వల్ల దాహం తీరడంతో పాటు, శరీరానికి కావాల్సిన అనేక ఖనిజ పోషకాలు అందుతాయి. పుచ్చకాయ యాపిల్ జ్యూస్ తయారీకి కావాల్సినవి: ►గింజలు తీసిన పుచ్చకాయ ముక్కలు- రెండు కప్పులు ►పంచదార- రెండు టేబుల్ స్పూన్లు ►యాపిల్- పెద్దది ఒకటి ►రాక్‌సాల్ట్- టీస్పూను ►జీలకర్ర పొడి- అర టీ స్పూను ►ఐస్ క్యూబ్స్- అరకప్పు ►పుదీనా ఆకులు- ఐదు తయారీ: ►పుచ్చకాయ ముక్కల్ని బ్లెండర్లో వేయాలి. ►ముక్కలతో పాటు పంచదార, రాక్‌సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ►ఇవన్నీ నలిగాక జీలకర్ర పొడి, ఐస్‌క్యూబ్స్ వేసి మరోసారి గ్రైండ్ చేయాలి ►గ్రైండ్ అయిన జ్యూస్‌ను ఒక పాత్రలో తీసుకోవాలి ►ఇప్పుడు యాపిల్ తొక్కతీసి గ్రేటర్‌తో సన్నగా తురిమి జ్యూస్‌లో వేసి చక్కగా కలుపుకోవాలి. ►జ్యూస్‌ను గ్లాస్లో పోసి, సన్నగా తరిగిన పుదీనా ఆకులను వేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Carrot Apple Juice Health Benefits: రోజుకొక గ్లాసు ఈ జ్యూస్ తాగారంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు Mango Mastani: మ్యాంగో మస్తానీ తాగుతున్నారా.. ఇందులోని సెలీనియం వల్ల! -
Health Tips: వేసవిలో ఈ ‘డ్రింక్’ తాగారంటే..
Summer Care- Health Tips: వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి చాలా మంది కూల్డ్రింకులు, ఐస్‌క్రీములు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి అప్పటికప్పుడు దాహార్తిని తీర్చిన ఫీలింగ్ కలిగించినా దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి సహజసిద్ధంగానే ఇంట్లోనే కూల్‌కూల్‌గా.. అదే సమయంలో తక్షణ శక్తిని అందించే ఇలాంటి పవర్ బూస్టర్లు తయారు చేసుకోవడం ఉత్తమం. పైనాపిల్, పుచ్చకాయ, క్యారెట్లతో డ్రింక్‌ను తయారు చేసుకుని చల్లచల్లగా తాగితే ఎండ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎలా తయారు చేసుకోవాలంటే.. పావు కప్పు పైనాపిల్ ముక్కలు, పావు కప్పు పుచ్చకాయ ముక్కలు, రెండు క్యారట్లు, రెండు రెమ్మలు కొత్తిమీర తరుగు, రెండు అంగుళాల అల్లం ముక్క (ముక్కలు తరగాలి)ను తీసుకోవాలి. వీటన్నింటిని జ్యూసర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. వడగట్టి అవసరాన్ని బట్టి రెండు మూడు ఐస్ ముక్కలను వేసుకోని తాగాలి. ఇది ఆటలు ఆడేవారికి తక్షణ శక్తినందించే సహజసిద్ధమైన డ్రింక్‌లా పనిచేస్తుంది. శరీరానికి కావాల్సిన మొత్తంలో కార్బొహైడ్రేట్స్‌ను అందిస్తుంది. పుచ్చకాయ, క్యారట్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కొత్తిమీరలో సోడియం, పైనాపిల్ లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫైటో న్యూట్రియంట్స్, విటమిన్ బీ ఉండడం వల్ల మంచి రిఫ్రెష్మెంట్ డ్రింక్‌గా పనిచేస్తుంది. చదవండి: తల తిరగడం కూడా గుండె వైఫల్యానికి సంకేతమే! -
Summer Tips: ఎండలో బయలుదేరే ముందు పుచ్చకాయ ముక్కలు తిన్నారంటే..
ప్రపంచవ్యాప్తంగా దొరికే పుచ్చకాయలు వేసవితాపాన్ని తీర్చుకోవడానికి బాగా పనికొస్తాయి. ఏ వేళలోనైనా తీసుకోవడానికి అనువుగా ఉంటాయి. పుచ్చకాయలు దాదాపు సంవత్సరమంతా దొరికేవే అయినా, వేసవిలో వీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండలో బయలుదేరే ముందు కాసిని పుచ్చకాయ ముక్కలు తిన్నట్లయితే వడదెబ్బ నుంచి రక్షణగా ఉంటుంది. పుచ్చకాయల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ►ఎండ వల్ల కమిలిపోయిన చర్మానికి పుచ్చకాయ గుజ్జు పట్టిస్తే త్వరగా మానుతుంది. ►మిగిలిన పండ్ల కంటే పుచ్చకాయల్లో నీటిశాతం చాలా ఎక్కువ కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఫలహారంగా పనికొస్తాయి. ►పుచ్చకాయల్లో పుష్కలంగా ఉండే బీటాకెరోటిన్లు కంటిచూపు సమస్యలను నివారిస్తాయి. ►ఇందులోని విటమిన్లు, ఖనిజలవణాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ►పుచ్చకాయ ముక్కలను తీసుకున్నా, పుచ్చకాయ రసాన్ని తీసుకున్నా మంచిదే. చదవండి: Ragi Java Health Benefits: రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగే అలవాటు ఉందా.. అయితే -
పాలిచ్చే తల్లులు తినాల్సినవి..!
-
ఆ పంట వేశా.. ఆకారం వినూత్నంగా ఉండడంతో ఎగబడి కొంటున్న జనం!
వీణవంక(హుజూరాబాద్): ఏళ్లుగా వరి సాగు చేయడంతో భూసారం దెబ్బతింటుంది. దీనికి తోడు ధాన్యం విక్రయించడం భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో పుచ్చ సాగును ఎంచుకున్నాడు. కొత్తరకం వంగడాలను తీసుకొచ్చి సిరులు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన రైతు కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి. తనకున్న ఆరెకరాల్లో నాలుగెకరాలు సాగు చేశాడు. ప్రస్తుతం రెండెకరాల్లో కోత పూర్తయింది. మరో రెండెకరాలు పూత దశలో ఉంది. ఏప్రిల్‌లో కోతకు రానుంది. ఒకే సారి నాలుగెకరాల్లో పంట వేస్తే కోత ఒకేసారి వస్తుంది. దీంతో కాయలకు డిమాండ్ తగ్గుతుందనే ఆలోచనతో ఈ విధంగా సాగు చేశాడు. మరో ఎకరంలో మిర్చి, మిగిలిన ఎకరంలో వరి సాగు చేశాడు. రెండేళ్లుగా సాగు.. తనకున్న ఆరెకరాల్లో 20ఏళ్లుగా వరి సాగు చేస్తున్నాడు. ఒకే రకమైన పంట ఏళ్లుగా వేస్తుండడంతో దిగుబడి తగ్గి పెట్టుబడి పెరిగింది. దీంతో డ్రిప్, మల్చింగ్ పద్ధతిలో పుచ్చ సాగు చేయగా గతేడాది 100టన్నుల దిగుబడి వచ్చింది. ఖర్చులు పోనూ రూ.2లక్షల ఆదాయం సమకూరింది. కలుపు నివారణకు మల్చింగ్ పద్ధతిని ఎంచుకున్నాడు. నీటి తడులు తగ్గించేందుకు డ్రిప్ ఏర్పాటు చేశాడు. ‘ఎల్లో’ పుచ్చకు డిమాండ్ గతేడాది తెల్లపుచ్చ సాగు చేయగా ఈసారి ‘ఎల్లో’పుచ్చను రెండెకరాల్లో సాగు చేశాడు. రిలయన్స్ కంపెనీకి 10టన్నుల పంటను కిలోకు రూ.20 చొప్పున విక్రయించాడు. ఒక్కో కాయ 3నుంచి 4కిలోల బరువు ఉంది. మరో 5టన్నులు చేను వద్దకే వచ్చి ప్రజలు కొన్నారు. మరో రెండెకరాల్లో పంట పూత దశలో ఉంది. ఎల్లో పుచ్చ ఆకారం వినూత్నంగా ఉండటంతో ప్రజలు కొనుగోలుకు మొగ్గు చూపినట్లు రైతు తెలిపాడు. పచ్చి మిర్చికీ ఆదాయం గతేడాది ఎకరంలో అరటి పంట వేయగా దిగుబడి రాలేదు. దీంతో ఈసారి ఎకరంలో మిర్చి వేశాడు. చేను ఏపుగా పెరిగి దిగుబడి బాగా వచ్చింది. 10క్వింటాళ్ల పచ్చిమిర్చికి రూ.90వేల ఆదాయం వచ్చినట్లు శ్రీనివాస్‌రెడ్డి తెలిపాడు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తే అధిక లాభాలు అర్జించవచ్చని నిరూపించాడు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలనే.. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ఉద్దేశంతో పుచ్చ సాగును ఎంచుకున్న. ఆరెకరాల పొలం మడులను చెడగొట్టి చెలక చేసిన. చేను చుట్టూ నీరు నిల్వ ఉండకుండా కందకాలు కొట్టిచ్చిన. పుచ్చ పంటతో మంచి లాభం వచ్చింది. పచ్చి మిర్చి మీదమీదనే అమ్ముడు పోయింది. వచ్చే ఏడాది కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తా. రైతులు కూడా ఒకేరకం కాకుండా ఇతర పంటల వైపు చూడాలి. – కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, రైతు, మామిడాలపల్లి -
పసుపు పుచ్చకాయలు.. ఇకపై మన దేశంలోనే!
సాక్షి, అమరావతి: వేసవి తాపాన్ని తీర్చే.. రుచికరమైన.. అందరూ ఇష్టంగా తినే ఫలాలలో ఒకటి పుచ్చకాయ. అయితే పుచ్చకాయ ఎలా ఉంటుంది అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు? ఆకుపచ్చ చారలుండే తొక్క, లోపల ఎరుపు/గులాబీ రంగు గుజ్జు, అందులో నల్లటి విత్తనాలు.. అనే కదా. కానీ ఈ ‘వెరైటీ’ పుచ్చకాయలో మాత్రం గుజ్జు పసుపు పచ్చ రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. అయితే, అది సహజ సిద్ధమైన రంగేనా? లేక రసాయనాలు వాడతారా? అంటే నూటికి నూరుపాళ్లు సహజసిద్ధంగా వచ్చిన రంగే అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు, విత్తన తయారీ సంస్థలు. అంతేకాదు.. ఆకుపచ్చ తొక్క, ఎరుపు, గులాబీ, పసుపు రంగు కండతో విత్తనాలు లేని (సీడ్ లెస్) పుచ్చకాయలు కూడా త్వరలో మార్కెట్‌కు రానున్నాయని వివరిస్తున్నారు. పసుపు రంగు ఎలా వస్తుందంటే.. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో 1,200కి పైగా పుచ్చ రకాలున్నాయి. వాటిల్లో పసుపు రంగు కాయ ఒకటి. ఈ పసుపు పుచ్చకాయలు కూడా ఎరుపు/గులాబీ రంగు కాయల మాదిరిగానే ఆకుపచ్చ చారలతో ఉంటాయి. లోపల కండ మాత్రం పసుపు రంగులో ఉంటుంది. పసుపు పుచ్చకాయల్లో లైకోపీన్ అనే పదార్థం ఉండదు కనుక అవి ఎప్పుడూ ఎర్రటి రంగును తీసుకోవని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. చిత్రమేమిటంటే పసుపు పుచ్చకాయల సాగు ఎరుపు/గులాబీ పుచ్చ కంటే ముందు నుంచే ఉంది. ఇదో సంకర విత్తనం. ఆఫ్రికా నుంచి వచ్చింది. సంప్రదాయ పుచ్చకాయలకు ఇదో ప్రత్యామ్నాయం. పర్పుల్ కాలే, ఆరెంజ్ కాలీఫ్లవర్, బ్లూ బంగాళాదుంపలు మాదిరే ఇదీనూ. ఎల్లో గోల్డ్–48 రకం విడుదల.. రెండేళ్ల క్షేత్రస్థాయి ప్రయోగాలు, పరిశోధనల అనంతరం దేశంలో పసుపు పుచ్చ రకాన్ని మార్కెట్‌కు వాణిజ్యపరమైన వినియోగం కోసం విడుదల చేస్తున్నట్టు జర్మనీకి చెందిన బేయర్ కంపెనీ ప్రకటించింది. ఎల్లో గోల్డ్–48 పేరిట మార్కెట్లో ఈ విత్తనం దొరుకుతుంది. దేశంలో విడుదలైన తొలి పసుపు పుచ్చ వంగడం ఇదే. అత్యున్నత జెర్మీప్లాసమ్ నుంచి ఈ వంగడాన్ని అభివృద్ధి చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పంట ప్రయోగాలు నిర్వహించిన అనంతరం దీన్ని మార్కెట్‌కు విడుదల చేశారు. దీంతో పాటు డిజర్ట్ కింగ్ ఎల్లో, ఎల్లో డాల్, బటర్‌కప్, ఎల్లో ఫ్లెష్‌బ్లాక్ డైమండ్ వంటి రకాలను పేరున్న విత్తన కంపెనీలు ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు విడుదల చేస్తున్నాయి. ‘సేంద్రీయ’ సాగు చేస్తే మంచి లాభాలు.. ఎల్లో గోల్డ్–48 అధిక దిగుబడి ఇచ్చే వంగడం. తెగుళ్లను, ఇతర క్రిమికీటకాలను తట్టుకుంటుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య సాగు చేయవచ్చు. ఏప్రిల్ నుంచి జూలై వరకు దిగుబడి వస్తుంది. పంట కాలం గరిష్టంగా నాలుగు నెలలు. కాయ తియ్యగా, తేనె లాంటి రుచిని కలిగి ఉంటుంది. పోషక విలువలూ ఎక్కువే. పుచ్చ వేసవి కాలపు పంటే అయినా ఇప్పుడు అన్ని కాలాలలోనూ సాగు చేస్తున్నారు. పసుపు పుచ్చను సేంద్రీయ పద్ధతిలో సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు. రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఈ రకాన్ని సాగు చేసేందుకు ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నారు. -
సోనూసూద్: ఓ ఇంట్రస్టింగ్ వీడియో
సాక్షి,హైదారాబాద్: వలస కార్మికులు,పిల్లలు పెద్దలు ఇలా కరోనా బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నవ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే..ఎవరికైనా మదిలో మెదిలో ఒకే ఒక్క పేరు నిస్సందేహంగా సోనూ సూద్. తన విశేష సేవలతో రిలయ్ హీరోగా ప్రశంసంలందుకుంటున్న సోనూసూద్‌కు అనేకమంది అనేక రకాలుగా తమ కృతజ్ఞతలు తెలిపారు. ముంబైలోని ఆయన నివాసానికి వెళ్లి తమ సంతోషాన్ని పంచు కుంటున్నారు. తాజాగా ఒక ఆర్టిస్టు వీడియో ఒకటి ఆసక్తికరంగా నిలిచింది. కోవిడ్ వారియర్‌గా సోనూసూద్ అందిస్తున్న సేవలకు ట్రిబ్యూట్‌గా పుచ్చకాయతో సోనూసూద్ చిత్రాన్ని అందంగా తీర్చి దిద్దారు ఆర్టిస్ట్ పర్వేష్. ఇటీవల ఒక డ్యాన్స్ రియాలిటీ షోకు అతిథిగా హాజరైన సోను ఒక కంటెస్టెంట్ ఉదయ్ సింగ్ షేర్ చేసిన అంశాలపై కదిలిపోయారు. లాక్డౌన్ కాలంలో మధ్యప్రదేశ్లోనిఇ నీముచ్ గ్రామస్తులు పడుతున్న కష్టాలపై ఉదయ్ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో వెంటనే స్పందించిన సోనూ ఒక నెల, రెండు నెలలు లేదా ఆరు నెలలు ఎన్నాళ్లు లాక్డౌన్ కొనసాగినా, తిరిగి మామూలు పరిస్థితులు వచ్చేంతవరకూ గ్రామం మొత్తానికి రేషన్ అందించేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సోనూ వాయిస్ బ్యాక్ గ్రౌండ్‌తో సాగే ఈ విడియో ప్రస్తుతం నెటిజనులను ఆకట్టుకుంటోంది. కాగా కరోనా మహమ్మారి, జాతీయ లాక్డౌన్లో సొంతూళ్లకు పయనమైన వలస కార్మికుల వెతలతో చలించిపోయిన సోనూ సూద్ నేనున్నానటూ రంగంలోకి దిగారు. అది మొదలు ఎడతెరిపి లేకుండా బాధితులకు అండగా నిలుస్తునే ఉన్నారు. ముఖ్యంగా సెకండ్‌వేవ్‌లో మందులు కొరత, ఆక్సిజన్ కొరతతో ఊపిరి ఆడక అల్లాడిపోతున్నవారిని ఆదుకునేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశారు. సోనూ సూద్ ఫౌండేషన్ ద్వారా నిర్మాణాత్మక కార్యక్రమాలతో వేలాదిమందికి అండగా నిలుస్తూ నిరంతాయంగా సేవలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్ Tell us you are @SonuSood fan without telling us you are a Sonu Sood fan? we’re all thankful to all the Covid Warriors and here’s a small tribute to him. ❤️🙏 .@SoodFoundation .#sonusood #sonusood_a_real_hero #sonusoodfoundation #sonusoodfans pic.twitter.com/VmXi1mEUbW — Artistparvesh (@parveshkumarart) June 5, 2021 -
ప్రాణాలు తీసిన పుచ్చకాయ!
రామగుండం: ఎలుకలు కొరికిన పుచ్చకాయ తినడం ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది. ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం విసంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. విసంపేట గ్రామానికి చెందిన దారబోయిన కొమురయ్య, సారమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు.. వృద్ధాప్యం కారణంగా పెద్ద కొడుకు శ్రీశైలం, కోడలు గుణవతి వద్ద ఉంటున్నారు. శ్రీశైలం దంపతులకు ఇద్దరు కుమారులు శివానంద్ (12), శరణ్ (10) ఉన్నారు. గత సోమవారం గ్రామానికి వచ్చిన వ్యక్తి వద్ద పుచ్చకాయలు కొనుగోలు చేశారు. సాయంత్రం కుటుంబ సభ్యులంతా సగం పుచ్చకాయ తిన్నారు. మిగతా సగం ఇంట్లోని సెల్ఫ్‌లో ఉంచారు. అదేరోజు రాత్రి కొమురయ్య ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని తవుడులో విషం కలిపి పెట్టాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు మిగతా సగం పుచ్చకాయ తినగా, కొమురయ్య మాత్రం తినలేదు. ఆ రోజు ఇంట్లో ఎల్లమ్మ పూజలు చేసుకోవడంతో మాంసాహారం తిన్నారు. కాగా, సాయంత్రం నుంచి పుచ్చకాయ తిన్న వారికి మాత్రమే వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. తొలుత మాంసాహారంతోనే అస్వస్థతకు గురైనట్లు భావించి స్థానికంగా ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నారు. ఎల్లమ్మ పూజల నేపథ్యంలో శ్రీశైలం కుటుంబంతోపాటు అతని సోదరులు కనకరాజు, ప్రభాకర్ కుటుంబాలు సైతం భోజనం చేశాయి. వారికి ఎలాంటి అస్వస్థత లేకపోగా, శ్రీశైలం తండ్రి కొమురయ్య సైతం ఆరోగ్యంగా ఉండడంతో, పుచ్చకాయతోనే అనారోగ్యం బారిన పగినట్లు గుర్తించారు. విషం తిన్న ఎలుకలు పుచ్చకాయను కొరకవడంతో అది విషపూరితమైనట్లు భావిస్తున్నారు. అస్వస్థతకు గురైనవారి పరిస్థితి క్షీణిస్తుండడంతో గురువారం ఉదయం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో శివానంద్, శరణ్‌లను చేర్పించారు. శ్రీశైలం, గుణవతి మరో ఆస్పత్రిలో చేరారు. చిన్నారుల పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి శివానంద్, శుక్రవారం వేకువజామున శరణ్ మృతిచెందారు. శ్రీశైలం, గుణవతిలకు శ్వాస సంబంధ సమస్య తీవ్రం కావడంతో బంధువులు వారిని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు. శ్రీశైలం తల్లి సారమ్మ సైతం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని తెలిసింది. -
వామ్మో.. ఏంటి ఇది నిజమేనా.?!
సంగీతానికి రాళ్లు కరుగుతాయి... రాతిలో నుంచి కూడా సంగీతం వినిపిస్తుంది అని మనకు తెలుసు. కానీ పండ్ల నుంచి మ్యూజిక్ రావడం ఎప్పుడైనా చూశారా.. కనీసం విన్నారా లేదు కదా. అయితే ఈ వీడియో చూడండి. ఆశ్చర్యంతో మీకు కూడా నోట మాట రాదు. ఎందుకంటే ఓ వ్యక్తి పుచ్చకాయ, కివి పండ్ల ముక్కలను పియానో కీస్లాగా వాయిస్తూ.. వాటి నుంచి సంగీతాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను మాజీ బాస్కెట్ బాల్ ఆటగాడు రెక్స్ చాప్మన్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. ‘బ్రో.. ఇతను పుచ్చకాయలతో వాయిస్తున్నాడు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. (చదవండి: అనుకోని అతిధి రాకతో అద్భుతం..) Bro - he’s playing melons...pic.twitter.com/Q8v93qRG46 — Rex Chapman🏇🏼 (@RexChapman) September 3, 2020 వివరాలు.. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ యువకుడు స్విమ్మింగ్ ఫూల్ వద్ద కూర్చుని ఉన్నాడు. అతని ఎదురుగా బల్లమీద వరుసగా పుచ్చకాయ ముక్కలతో రెండు కివి ముక్కలు కూడా ఉన్నాయి. వాటి నుంచి వైర్లను ఓ మెటల్ బోర్డుకి కనెక్ట్ చేశాడు. దాన్ని ల్యాప్‌టాప్‌కి కలిపాడు. కింద కాలు దగ్గర పెడల్స్ ఉన్న డ్రమ్ కూడా ఉన్నది. ఇక ఆ వ్యక్తి పుచ్చకాయ ముక్కలను సింథసైజర్ కీస్లాగా నొక్కడం ప్రారంభించగానే వాటి నుంచి శబ్దం వస్తుంది. కొన్ని సెకన్ల తర్వాత డ్రమ్‌ని కాలితో వాయిస్తాడు. చివరకు కివి ముక్కలను కూడా నొక్కుతాడు. అవి కూడా శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. మొత్తానికి మాంచి మ్యూజిక్‌ని ప్లే చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా అతడు నిజంగానే పండ్ల ముక్కల నుంచి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నాడా.. లేక వేరే సెటప్ ఉందా అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే వేలాది మంది ఈ వీడియోను చూశారు.. మీరూ ఓ లుక్కేయండి. -
చల్లగా వుండండి
వేసవి తన చండప్రతాపం చూపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. బయటకు వెళ్తే వడదెబ్బ, డీ–హైడ్రేషన్ సమస్యలు వెన్నాడే పరిస్థితి. ఆహారాల పరంగా అందరూ చలువ పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ద్రవాహారాలైతే మజ్జిగ, కొబ్బరినీళ్ల వంటివీ, పండ్ల విషయానికి వస్తే కీర, పుచ్చకాయలు, కర్బూజ వంటివి మామూలే. ఇలా అందరికీ తెలిసిన సాధారణ చలవచేసే పదార్థాలే కాకుండా... మనం రోజూ తీసుకునే వాటితో పాటు, మరికొన్ని ప్రత్యేక ఆహారాల గురించి తెలుసుకుందాం. అలాగే వేసవితాపాన్ని సమర్థంగా ఎదుర్కోడానికి పనికి వచ్చే ఘనాహారాలేమిటి, వేటితో ఎలాంటి ప్రయోజనాలుంటాయన్న సంగతులతో పాటు... కొన్ని ఆహారాలపై ఉండే అపోహలూ, వాస్తవాలతోపాటు అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. చల్లబరిచే ఆహార ధాన్యాలివే... వరి: వరిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువనీ, అందుకే తినగానే తక్షణం శక్తి సమకూరుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది చలవ చేసే ఆహారమేనని చెప్పవచ్చు. పైగా చాలా తేలిగ్గా జీర్ణమవుతుంది. పొట్టుతీయని స్వాభావికమైన వరిలో విటమిన్–బి కాంప్లెక్స్ చాలా ఎక్కువ. స్వాభావికంగా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పాలిష్ చేయని వరి అన్నం, పోహా, ఇడ్లీ, దోస వంటివి ఈ వేసవిలో మనకు మేలు చేస్తాయి. బార్లీ: బాగా చలవ చేసే ఆరోగ్యకరమైన ఆహారాల్లో బార్లీ చాలా ముఖ్యమైనది. దీన్ని వేసవి ధాన్యం (సమ్మర్ సిరేల్) అని చెప్పడం అతిశయోక్తి కాదు. బార్లీలో ఫాస్ఫరస్ చాలా ఎక్కువ. దాంతో పాటు క్యాల్షియమ్, ఐరన్ పాళ్లూ అధికంగానే ఉంటాయి. బార్లీ అనేది అల్సర్, డయాబెటిక్ రోగులకు అమృతం లాంటిది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులకు ఉపశమనం ఇస్తుంది. బార్లీ గింజలను ఉడికించి సలాడ్‌గా తీసుకోవచ్చు. అలాగే దీని పిండితో పూరీలు, చపాతీలను చేసుకోవడమే కాకుండా అట్లుగా కూడా వేసుకోవచ్చు. బార్లీ జావ చలవ పానియంగా పనిచేస్తుంది. కొంతమంది దీన్ని నిమ్మకాయ నీటితో కలుపుకొని కూడా తాగుతుంటారు. ఎలా తీసుకున్నా ఈ వేసవిలో బార్లీ చాలా మంచి ఆహారం. తృణధాన్యాలు (చిరుధాన్యాలు) ఇటీవల చిరుధాన్యాల (మిల్లెట్స్) వాడకం చాలా ఎక్కువగా పెరిగింది. ఆరోగ్య స్పృహ పెరగడంతో ఈమధ్య చాలామంది రాగులు, కొర్రలు, సజ్జలు, ఊదలు లాంటి చిరుధాన్యాలను చాలా మక్కువతో తమ ప్రధాన ఆహారంగానే తీసుకుంటున్నారు. కొంతమందిలో వీటిని వేసవిలో తీసుకోకూడదనే దురభిప్రాయం ఉంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే. పైగా వేసవిలో వీటిని తీసుకోవడం వేసవిని ఎదుర్కోవడంతో పాటు... ఇంకా అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చాలామంది తృణధాన్యాలను ఇటీవల అన్నంలా వండుకుంటున్నారు కదా. దానికి బదులుగా వరి అన్నాన్ని గంజి కాచుకున్నట్లుగానే వేసవిలో వీటిని జావలాగా కాచుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం... చలవకు చలవ. అయితే వీటిని అలా వండే ముందుగా క్రితం రాత్రి నానబెట్టుకోవడం మరవద్దు. ఇక్కడ పేర్కొన్న విధంగా సజ్జలతో చేయదగిన కొన్ని రకాల రెసిపీలలాగే మిగతా తృణ(చిరు)ధాన్యాలతోనూ దాదాపు అలాంటివే చేసుకోవచ్చు. ఉదాహరణకు సజ్జలను నీళ్లలో బాగా నానబెట్టి, లస్సీ తయారు చేసుకున్న తర్వాత వాటిని... ఆ పానీయంతో కలుపుకొని బాజ్రా లస్సీలా చేసుకోవచ్చు. ఇది వేసవిని ఎదుర్కొనేందుకు చాలా సమర్థమైన పానీయం. ఇందులో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉండటంతోపాటు ఐరన్, ఫాస్ఫరస్, క్యాల్షియమ్ పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు పీచు పదార్థాలూ ఎక్కువే. పైగా తృణధాన్యాలన్నింటిలోనూ పీచు పదార్థాలు ఎక్కువ కాబట్టి అవి వేసవిలో సులభంగా జీర్ణమైపోయి ఒంటిని తేలిగ్గా ఉంచుతాయి. పప్పుదినుసులు (దాల్స్) పప్పుధాన్యాల్లో పెసర్లు, సాగో లాంటి పప్పులు ఒంటిని చల్లబరచడంలో కీలక భూమిక వహిస్తాయి. పెసర్లు/పెసలు: వీటిలో చాలారకాల ఖనిజలవణాలు ఎక్కువ. వేసవిలో మనం చెమట రూపంలో కోల్పోయే పోషకాలు ఖనిజ లవణాలే ప్రధానం. వాటిని భర్తీ చేయడానికి ద్రవాలతో పాటు వాటిని తీసుకుంటూ ఉండాలి. ద్రవాలతోపాటు ఖనిజలవణాలు తగ్గడాన్నే డీ–హైడ్రేషన్ అంటారు. వేసవిలో ఈ ప్రమాదం చాలా ఎక్కువ. పెసర్లలో క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి ఖనిజాలు చాలా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు... పెసలు చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. అందుకే వీటిని ఎన్నో రకాలైన రెసిపీలుగా చేసుకొని... వైవిధ్యమైన వంటకాలుగా తీసుకోవచ్చు. ఆకుపచ్చటి ఆకుకూరలు, కొన్ని కాయగూరలతో కలిపి, పైన కాస్తంత ఆలివ్‌నూనెను డ్రెస్సింగ్‌గా వేసుకొని సలాడ్‌గా తీసుకోవచ్చు. సలాడ్‌లో టొమాటోలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరప... లాంటి వాటితో కలిపి తీసుకుంటే అవన్నీ ఖనిజలవణాలనూ పుష్కలంగా సమకూర్చుతాయి. అంతేకాదు... ఇక్కడ సలాడ్‌లో పేర్కొన్న పదార్థాలన్నీ చలవచేసేవే. ఇక వంటకాల్లో పెసరట్టు అందరూ చాలా ఇష్టంగానూ, విస్తృతంగా తినే రూపం. పెసర్లతో ఉప్మా, కిచిడీ కూడా చేసుకోవచ్చు. నిజానికి కాస్తంత జావజావగా ఉప్మా, కిచిడీ లాంటి రెసిపీలను ఆయుర్వేదంలో స్నిగ్ధవంటకాలుగా చెబుతుంటారు. పెసర్లు కాలేయం పనితీరునూ మెరుగుపరుస్తాయి. శనగలు: దేశంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే మించిపోయే చాలా వేడిప్రదేశాల్లో శనగలను ఒక ప్రధానాహారంగా ఉపయోగిస్తుంటారు. ఇందులో ఐరన్, మెగ్నీషియమ్, క్యాల్షియమ్ లాంటి లవణాలు చాలా ఎక్కువ. వీటిని చాట్ రూపంలో చాట్భండార్లలోనూ, కొన్ని చోట్ల ఇళ్లలోనూ చేసుకుంటూ ఉంటారు. ఇక టొమాటోలు, ఉల్లిముక్కలు, పచ్చిమిరపకాయలతో పాటు కొన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలతో కలిపి చెనా సలాడ్స్‌గా కూడా తింటుంటారు. శనగలు కూడా వేసవిలో చలవపదార్థంగా ఉపయోగపడ టంతో పాటు ఖనిజలవణాలను పుష్కలంగా ఒంటికి అందిస్తాయి. వేసవి కూరలు కాకరకాయ: కేవలం వంటకాలలో కూరగా ఉపయోగపడటంతో పాటు డయాబెటిస్ నివారణ, నియంత్రణలలో దీనికి ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. వేసవిలో ఒక మనిషి కోల్పోయే దాదాపు అన్ని రకాల ఖనిజలవణాలన్నీ కాకరకాయలోనే ఉన్నాయంటే అది అతిశయోక్తి కాదు. అందుకే దీన్ని అనేక రకాల వైద్యప్రక్రియల్లో ఔషధంగా కూడా ఉపయోగిస్తుంటారు. కాకరకాయ కూరను వేసవిలో ఎక్కువగా వండుకోవడం చాలా మంచిది. చలవచేయడంతో పాటు ఇది సాధారణ వ్యాధినిరోధకతను పెంచి వేసవిలో వచ్చే చాలా రకాల జబ్బులను నివారిస్తుంది. చర్మం పేలడం, చర్మంపై పగుళ్లను నిరోధిస్తుంది. వేడిమికి ట్యాన్కావడాన్నించి కూడా కాకర మన ఒంటిని కాపాడుతుంది. గోరుచిక్కుడు: ఈ వేసవిలో తేలిగ్గా జీర్ణం కావడంతో పాటు, ఒంట్లో అవసరమైన అన్ని ఖనిజలవణాలనూ భర్తీ చేస్తుంది. దీనిలో ఉన్న గ్లైకోన్యూట్రియెంట్స్ రక్తంలో చక్కెరపాళ్లను నియంత్రిస్తాయి. దాంతో గోరు చిక్కుళ్లు వేసవిలో డయాబెటిస్ రోగులకు మంచి రక్షణ ఇస్తాయి. ఇందులోని క్యాల్షియమ్, ఫాస్ఫరస్ ఎముకల్లోకి తేలిగ్గా ఇంకుతాయి. పైగా ఇందులో ఉన్న పొటాషియమ్, ఫోలేట్ పోషకాలు గుండెకు మేలు చేస్తాయి. ఇందులో పోటాషియమ్ పుష్కలంగా ఉన్నందున ఇవి రక్తపోటునూ (హైబీపీని) అదుపు చేస్తాయి. మెదడు ప్రశాంతంగా ఉంచగల అద్భుతమైన ఆహారం ఇది. వేసవిలో ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నందున సులువుగా జీర్ణమై, ఉక్కపోతతో కూడిన వాతావరణంలో శరీరం చాలా తేలిగ్గా ఉండేందుకు ఇవి ఉపకరిస్తాయి. తోటకూర (అమరాంత్ గ్రీన్స్) : వేసవిలో తోటకూర తినడం చాలా మంచిది. ఇందులోని ప్రోటీన్లు, ఫోలేట్ వంటి విటిమిన్లు, ఖనిజలవణాలు ఒంటిలోని మినరల్ రిసోర్సెస్‌ను భర్తీ చేయడంతో పాటు గుండెజబ్బులు, గుండెపోటు, పక్షవాతం, అనేక రకాల క్యాన్సర్లు, డయాబెటిస్‌ను నివారిస్తాయి. పుట్టగొడుగులు: పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే తీసుకునే వేగన్లకు పుట్టగొడుగులు మంచి ప్రోటీన్ వనరుగా చెప్పవచ్చు. ఇందులో నీటిపాళ్లు చాలా ఎక్కువ. పుట్టగొడుగుల్లో దాదాపు 92% నీళ్లే ఉంటాయి. కాబట్టి వేసవిలో అనేక రెసిపీలుగా వీటిని చేసుకొని తినడం అన్ని విధాలా మేలు చేస్తుంది. వేసవి... కొన్ని ఆహారాల పట్ల అపోహలు గుడ్లు: సాధారణంగా గుడ్లు వేడి చేస్తాయనే దురభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అందుకే వేసవిలో దీన్ని వాడకాన్ని తగ్గిస్తారు. అయితే గుడ్లు వేడి చేస్తాయనేది పూర్తిగా అపోహ మాత్రమే. గుడ్లలో దాదాపు 75% నీళ్లే ఉంటాయి. పైగా ఇందులో ఖనిజాలు లవణాలూ అన్నీ ఎక్కువే. అందుకే ఇవి చలవ చేయడంతో పాటు ఒళ్లు కోల్పోయే నీటినీ భర్తీ చేస్తాయి. వేసవిలో గుడ్లను మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా పరిగణించవచ్చు. పాలు: చాలామందిలో వేసవిలో పాలను అంతగా తీసుకోకూడదనీ, పెరుగుగా తోడుపెట్టి... దాన్ని కూడా మజ్జిగగా మార్చే తీసుకోవాలని అంటుంటారు. నిజానికి వేసవిలో మజ్జిగ చాలామంచిదే. ఎండాకాలంలో దాని వాడకం కూడా ఎక్కువే. కానీ వేసవిలో పాలు కూడా మంచి ఆహారమే. నిజానికి పాలలో నీటిపాళ్లే చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు మనం కోల్పోయే ఖనిజలవణాలూ ఉంటాయి. అంటే పాలు తాగడం అంటే నీటినీ, ఖనిజలవణాలనూ ఏకకాలంలో భర్తీ చేయడమేనన్నమాట. అందుకే వేసవిలో ఉదయం, రాత్రి వేళల్లో పాలు తాగడం చాలా మేలు చేస్తుంది. సూప్‌లు అన్ని రకాల సూప్‌లలోనూ దాదాపు 98 శాతం నీళ్లే ఉంటాయి. మిగతా సూప్‌లలో ఉపయోగించే మిగతా ఆకుకూరలు, కాయగూరల్లోంచి సూప్‌లోకి లవణాలు పుష్కలంగా ఊరి, అవి తేలిగ్గా ఒంటపడతాయి. అందుకే వేసవిలో అన్ని రకాల సూప్‌లు తీసుకోవడం మేలు చేస్తుంది. మొక్కజొన్న, దోసకాయ, టోమాటో, ఆలూ (బంగాళదుంప), చిలగడదుంప (మోరంగడ్డ), గ్రీన్‌పీస్, జ్యూషీనీ, అవకాడో, బీట్రూట్, పుదీనా, కొత్తిమీర, బ్రాకలీ, పుట్టగొడుగులు (మష్రూమ్స్)... ఇలా దాదాపు అన్ని రకాల ఆకుకూరలు/కాయగూరలతో సూప్‌లు తయారుచేసుకోవచ్చు. అవన్నీ వేసవిలో ఖనిజలవణాలను చాలా వేగంగా ఒంటికి సమకూర్చుతాయి. పిల్లలకు జావ రూపంలో ఈ వేసవిలో పిల్లలు ఆరుబయట ఎండల్లో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. దాంతో వారు చాలా వేగంగా నీళ్లనూ, లవణాలను కోల్పోతుంటారు. పైగా ఈ సీజన్లో ఘనాహారం తీసుకోవడం ఒకింత కష్టంగా ఉంటుంది. అందుకే జావ రూపంలోనూ లేదా పలచటి ఉప్మా (పారిజ్) రూపంలో రెసిపీలను తీసుకోవడం వల్ల ఒంటికి నీళ్లూ, లవణాలూ తక్షణం సమకూరతాయి. ఇలా జావరూపంలో తీసుకునేందుకు రాగులు మేలైన ఆహారం. ఇలా జావ/పారిజ్ రూపంలో తీసుకునేందుకు నూకలూ మంచివే. అయితే ఆర్గానిక్ మార్గంలో పండించిన పొట్టుతీయని వరినూక, గోధుమనూక చాలా మేలు చేస్తాయి. వీటిలో పీచుపదార్థాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకూ, వృద్ధులకూ ఇవి తేలిగ్గా జీర్ణం అవుతాయి. దాంతో వేసవిలో ఒళ్లు చాలా తేలిగ్గా ఉంటుంది. పానీయాలు... సాధారణంగా వేసవిలో నిమ్మకాయరసాన్ని తీసుకొని అందులో కాస్తంత పంచదారతో చేసుకునే పానీయం చాలా త్వరగా చేసుకోవచ్చు. పైగా చాలా చవగ్గా కూడా తయారవుతుంది. అలాగే దానికంటే కాస్త ఖరీదే అయినా బత్తాయిరసం, ఆరెంజ్ జ్యూస్, ద్రాక్షపానియాలూ అందరికీ అందుబాటులో ఉండేవే. అయితే దీనితోపాటు వేసవిని సమర్థంగా ఎదుర్కొనే పానీయమే సారస్పరిల్లా. దీన్ని ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం. సారస్పరిల్లా: ఇది భూమి కింద పెరిగే ఒక రకం వేరు. దీన్నే చాలామంది చాలా చోట్ల వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. కొందరు సుగంధ అనీ, మరికొందరు మారేడు అనీ, ఇంకొందరు నన్నారి అని దీన్ని పిలుస్తారు. దీని వేర్లతో ఎసెన్స్ తీసుకొని లేదా ఆ వేర్ల పౌడర్‌ను ఉపయోగించి, ఒక గ్లాసులో కాస్తంత ఎసెన్స్ తీసుకొని, అందులో నీళ్లు లేదా సోడా కలపాలి. ఒక టీస్పూన్ నిమ్మరసం, కాస్తంత చక్కెరతో చాలా పరిమళ భరితమైన వేసవి పానీయం తయారవుతుంది. ఇది చలవచేస్తుందీ, ఆరోగ్యానికీ మేలూ చేస్తుంది. ఇవీ కాకుండా ఈ వేసవిలో మామిడిపండ్లు విరివిగా లభిస్తాయి కాబట్టి... ఆమ్‌పన్నా అనేది సీజనల్ డ్రింక్‌గా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇవేగాక ఖస్ షర్బత్, వెలగపండు షర్బత్, రోజ్ షర్బత్‌లు చాలా మంచివి. ఇక వేసవిలో చెరుకురసాన్ని తాగడానికి చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఇందులో కల్తీనీళ్లనుంచి తయారు చేసే ఐస్ కలపడం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి చెరుకురసాన్ని ఎలాంటి ఇతర పదార్థాలతో కలపకుండా తాజాగా తీసుకోవడం చాలా మేలు. ఇక ఇవేగాక... పుచ్చకాయ – ఇందులో 80 శాతం కంటె అధికంగా నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. గ్రిల్డ్ వెజిటబుల్స్ – ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, వెల్లుల్లి వంటి కూరలను ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే తినటం మంచిది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వేసవిలో ఎండలో తిరగటం వల్ల కలిగే చర్మవ్యాధులనుంచి రక్షిస్తాయి. వెజిటబుల్ చీజ్ సలాడ్స్ – తక్కువ క్యాలరీలున్న చీజ్‌ను తరిగిన అనేక రకాల కూరలతో కలపటం వల్ల క్యాల్షియం, ప్రొటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు. కొవ్వుపదార్థాలు తక్కువగా ఉండే పానీయాలు – వేసవి రాగానే సాధారణంగా ... తియ్యగా, చిక్కగా ఉండే కాఫీ, టీ, సోడాలను, ఐస్‌క్రీమ్‌లను తీసుకోవటం చూస్తుంటాం. వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. వీటివల్ల తాత్కాలికంగా దాహం నుంచి ఉపశమనం లభిస్తుందే కాని, అవి ఆకలిని తీర్చలేవు. అందువల్ల – మజ్జిగ, లస్సీ వంటివి తీసుకోవాలి. పండ్లతో తయారయిన డెజర్ట్స్ – చిక్కగా, మందంగా ఉండే డెజర్ట్స్‌ను వేసవిలో తీసుకోకపోవడమే మంచిది. వీటికి బదులుగా పండ్లతో తయారు చేసిన డెజర్ట్స్‌ని తీసుకోవాలి. తక్కువ కొవ్వు ఉన్న తాజా పండ్లతో కూడిన పెరుగు, ఫ్రూట్ కస్టర్డ్ వంటివి తీసుకోవటం మంచిది. ఇవి శరీరానికి కావలసిన ప్రోటీన్లు, క్యాల్షియంలను అందిస్తాయి. వేసవిలో ఆకలి వేసినప్పుడు రకరకాల పండ్లు, బెర్రీలు తీసుకోవాలి. వేసవిలో లభించే ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠాణీ వంటివి తీసుకోవటం వల్ల పోషకపదార్థాలు శరీరానికి అందుతాయి. ఇవి తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. చల్లని కుకుంబర్ – దోస వంటివి సహజంగానే చల్లగా ఉంటాయి. తాజాగా ఉన్న చల్లని దోసకాయ ముక్కలను సలాడ్స్‌లోను, కూరలలో వాడుకోవాలి. మామిడి – కేవలం వేసవిలో మాత్రమే లభిస్తాయి. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఉంటాయి. వేడి చేస్తాయనే అభిప్రాయం ఉన్నా సీజనల్ ఫ్రూట్‌గా చాలా మంచి ఆరోగ్యాన్నిస్తుంది. బెర్రీలు (స్ట్రాబెర్రీలు)– ఇవి చాలా రుచిగా ఉంటాయి. వేసవిలో ఈ చిన్న చిన్న పళ్లను తినటం మంచిది. అంతేకాక వీటిని పెరుగులోనూ, ఐస్‌క్రీంలాంటి వాటిలోను వాడవచ్చు. పనీర్ – ఇందులో ప్రొటీన్లు, క్యాల్షియం ఎక్కువ. వాల్నట్స్ – వేసవిలో తీసుకునే ఆహారంలో కొద్దిగా ఆక్రోట్లు (వాల్నట్) , చేపలు తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే ఒమేగా – 3 ఫ్యాటీయాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. అయితే వేయించిన చేపల కంటె ఉడకబెట్టిన లేదా గ్రిల్డ్ చేపలు మంచిది. ఓట్లు – ఇందులో ఫైబర్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే తీసుకోవటం మంచిది. ఎరుపు, ఆరంజ్, పసుపు రంగులలో ఉన్న కూరలు... గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బెల్‌పెపర్... వంటివాటిలో ఎ విటమిన్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నీరు – దాహాన్ని తీర్చడానికి మంచినీటికి మించినది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే చాలు, శరీరం ఉత్తేజితమవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్‌కు దూరంగా ఉండవచ్చు. పెద్దలకు ►బరువు తగ్గి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపటానికి వేసవి మంచి సమయం. పద్ధతి ప్రకారం సమతుల ఆహారం తీసుకుంటే, బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. నేరుగా ఎండలోకి వెళ్లి వ్యాయామం చేయటం ఈ కాలంలో మంచిది కాదు. ►తాజాపండ్లు, కూరలు తీసుకోవాలి. తర్బూజా, పుచ్చకాయ వంటివి ప్రతిరోజూ తీసుకోవాలి. ►మజ్జిగను ఎక్కువగా తాగుతుండాలి. ►తాజాగా ఉండే పండ్లరసాలు తీసుకోవటం మంచిది. ►క్యారట్లు, బీట్రూట్లను రసం రూపంలో తీసుకుంటే మంచిది. ఈ కాలంలో దొరికే తాజాగా ఉండే ఆకుపచ్చ రంగు కూరల వాడకం చాలా మంచిది. ►మధ్యాహ్నం, రాత్రివేళలో తీసుకునే భోజనంలో తప్పనిసరిగా తాజా పచ్చికూరలు, మొలకెత్తిన ధాన్యం ఉండేలా చూసుకోవాలి. ►ఆల్కహాల్ మానేయాలి. ఇక కెఫిన్ ఉంటే కాఫీలవంటి వాటిని కూడా తగ్గిస్తే మంచిది. ఎందుకంటే అవి శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. పీచుపదార్థాలు (ఫైబర్) పేగు సంబంధిత సమస్యలు వయసుపెరిగే కొద్దీ ఎక్కువవుతుంటాయి. ముఖ్యంగా మలబద్ధకం అధికమవుతుంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండటానికి తగినంత పీచుపదార్థాలు తీసుకోవటం అవసరం. వీటిని తీసుకోవటం మంచిది... ►పొద్దున్నే అల్పాహారంగా తృణధాన్యాలు లేదా ఓట్లు ►హోల్గ్రెయిన్తో చేసిన బ్రెడ్ ►గోధుమ పాస్తా లేదా బ్రౌన్ రైస్ ►బీన్స్ లేదా ఆ జాతికి చెందిన గింజలు తీసుకోకూడని ఆహారాలు ►వేసవిలో ఉప్పును సాధ్యమైనంతగా తగ్గించాలి. ఇది డీహైడ్రేషన్‌ను కలిగిస్తుంది. దాహాన్ని పెంచుతుంది. ►ఈ సీజన్లో కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలి. అలాగే ఆయిల్స్ ఉపయోగాల్సి కూడా వీలైనంతగా తగ్గించాలి. ►కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌లో కెఫిన్ పాళ్లు ఎక్కువ. అందుకే అవి డీహైడ్రేషన్ కలిగిస్తాయి. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండాలి. ►రెడ్‌మీట్ వంటి మాంసాహారం నుంచి దూరంగా ఉండటం ఈ సీజన్లోనే కాదు... ఏ సీజన్లో అయినా మంచిదే. ►ప్రాసెస్ చేసిన మాంసం, కేకులు, బిస్కెట్ల వంటి వాటికి దూరంగా ఉండాలి. ►చక్కెర ఎక్కువగా ఉండే అన్ని రకాల పదార్థాల నుంచి దూరంగా ఉండాలి. పిల్లలకు... ►వేసవిలో పిల్లలు ఇంట్లో గడుపుతుంటారు. ప్రయాణాలు చేస్తుంటారు. లేదా సమ్మర్ క్యాంపులతో బిజీగా ఉంటారు. విపరీతంగా ఆడుతూండటం వల్ల వారిలోని శక్తి సన్నగిల్లుతూంటుంది. శరీరంలో ఉన్న నీటిశాతం తగ్గిపోతుంటుంది. అందువల్ల పిల్లలకు పోషకాహారాన్ని అందించాలి. ►పాల ఉత్పత్తులు – లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్‌లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని, ప్రొటీన్లను, క్యాల్షియమ్‌ను, ఫ్లూయిడ్లను అందిస్తాయి. అయితే ఇందులో చక్కర పరిమితంగానే వాడాలి. ►తాజా పండ్లు, చల్లగా ఉండే పండ్ల రసాలు వంటివి కూడా పిల్లల శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా కాపాడతాయి. ►పిజ్జాలు, శాండ్విచ్ వంటివి పనీర్, తాజాకూరగాయలతో తీసుకుంటే పరవాలేదు కాని, ఎక్కువగా చీజ్ ఉపయోగించినవి మాత్రం మంచిది కాదు. ►గ్రిల్డ్ వెజిటబుల్స్‌ను పనీర్‌తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్ రోల్స్ కూడా ఇవ్వవచ్చు. ►ఇంట్లో తయారు చేసిన ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్, ఐస్ గోల్స్... వంటివి పిల్లలకి పెట్టవచ్చు. వృద్ధులకు ►వయసు మీద పడే కొద్దీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. సమతుల ఆహారం తీసుకుంటే మాత్రం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమయిన బరువుతో ఉండటానికి క్రమపద్ధతిలో తీసుకునే ఆహారం మంచిది. అందుకే వీరు తీసుకునే ఆహారంలో. ►గంజిలాంటి కార్బోహైడ్రేట్లు అంటే గోధుమ, బ్రౌన్ రైస్, బంగాళదుంపలు, తృణధాన్యాలు . ►ప్రొటీన్లు, కొవ్వు తక్కువగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు, పప్పు. ►ఆహారంలో ఐదువంతుల భాగం పండ్లు, కూరలు లేదా పండ్లరసాలు. ►తగినంత ఉప్పు (వృద్ధులు రోజుకి ఆరుగ్రాముల ఉప్పు కంటె ఎక్కువ తీసుకోకూడదు). ►ఈ సీజన్లో డీహైడ్రేషన్ ఎక్కువ కాబట్టి లవణాలను భర్తీ చేసేలా పొటాషియమ్, సోడియమ్ ఎక్కువగా ఉండే అన్ని రకాల పండ్లు తీసుకోవాలి. సుజాతా స్టీఫెన్, చీఫ్ న్యూట్రిషనిస్ట్ , యశోద హాస్పిటల్స్,మలక్‌పేట, హైదరాబాద్ -
చర్మ సౌందర్యానికి పుచ్చకాయ
టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసంలో 1 టేబుల్ స్పూన్ తేనెని కలిపి ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాలు పాటు ఆరనిచ్చి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇది మీ చర్మానికి కావాల్సిన తేమను సమకూర్చి మీ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసంలో 1 టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ముఖంపై పట్టించాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, కోమలంగా మార్చేస్తుంది. టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసంలో గుజ్జుగా చేసిన అవకాడో పండుని కలిపి ఈ మిశ్రమాన్ని మీ ముఖం మెడ మీద పట్టించాలి. 20 నిమిషాలు తర్వాత మీ ముఖాన్ని చల్లని నీటితో కడగాలి. -
బ్యూటిప్స్
►వాతావరణంలో దుమ్మూ, ధూళి ఎక్కువై చర్మ సమస్యలు అధికంగా పెరిగిపోయాయి. ఎక్కువగా, చర్మంపై జిడ్డు పేరుకుపోవడం వలన మొటిమలు వస్తుంటాయి. ►మొటిమలు తగ్గించుకోవటానికి ఒక అరటి పండుని గుజ్జుగా చేసి ఒక టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసాన్ని కలపాలి. ►ఈ పేస్ట్‌ని ముఖం, మెడ భాగాల మీద రాసుకుని 20 నిముషాల పాటు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ►అరటిపండులో ఉండే విటమిన్ బి2,విటమిన్ బి6, విటమిన్ బి12 మీ చర్మం పొడి బారకుండా చేసి మృదువుగా ఉంచుతుంది. ►పుచ్చకాయ రసం మీ చర్మం పై ఉన్న జిడ్డుని తగ్గించి ఎక్కువ సేపు మీ ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. -
హెల్దీ ట్రీట్
ఫ్రూట్ అండ్ లెట్యూస్ సలాడ్ కావలసినవి: లెట్యూస్ ఆకులు (దీనికి బదులుగా తరిగిన క్యాబేజీ ఆకులను వాడుకోవచ్చు) – 1 కప్పు బొప్పాయి ముక్కలు – అర కప్పు ద్రాక్ష – అర కప్పు ఆరెంజ్ తొనలు – అర కప్పు జామపండు ముక్కలు – అర కప్పు స్ట్రాబెర్రీలు – అర కప్పు పుచ్చకాయ ముక్కలు – అర కప్పు బాదం పప్పు పలుకులు – టేబుల్‌స్పూన్ డ్రెస్సింగ్కోసం... నిమ్మరసం – టేబుల్ స్పూన్ తేనె – 2 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి – 2 ఉప్పు – తగినంత తయారి: 1. డ్రెస్సింగ్ కోసం చెప్పిన పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసి కలపాలి. 2. పండ్ల ముక్కలన్నీ ఒక పాత్రలో తీసుకుని, డ్రెస్సింగ్ మిశ్రమం వేసి కలపాలి. 3. సలాడ్ కప్పులో లెట్యూస్ ఆకులు వేసి, పైన డ్రెస్సింగ్ చేసిన పండ్లముక్కలను వేసి సర్వ్ చేయాలి. కప్పు సలాడ్‌లో పోషకాలు: క్యాలరీలు : 103కి.క్యా కొవ్వు : 2.5 గ్రా. పిండిపదార్థాలు : 18.7 గ్రా. విటమిన్ : 30.7 గ్రా. -
తర్భూజా మస్త్ మజా
వినాయక్‌నగర్ : రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో మార్కెట్లో తర్బూజాల విక్రయాలు జోరందుకున్నాయి. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కోసం నగరవాసులు తర్బూజాలను ఆశ్రయిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడం, శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా తర్బూజా కాపాడుతుంది. నగరంలోని బస్టాండ్, కంఠేశ్వర్, ఎన్టీఆర్ చౌరస్తా, బోధన్‌రోడ్డు సహా ఆయా ప్రాంతాల్లో తర్బుజా విక్రయాలు జోరందుకున్నాయి. నగరానికి చెందిన పలువురు వ్యాపారులు వీటిని ఫ్రూట్ మార్కెట్లో కొనుగోలు చేస్తుండగా మరికొంత మంది నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఫ్రూట్ మార్కెట్ వ్యాపారులు తర్బుజాలను మహారాష్ట్ర, ధర్మాబాద్, బోకర్, బిలోలి, దెగ్లూర్, అనంతపురం, నిర్మల్, బాన్సువాడ, బోధన్, గాంధారి, కామారెడ్డి ప్రాంతాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. నగరంలో మొత్తం 80 వరకు తర్బూజ విక్రయ షాపులు వెలిశాయి. కాగా హోల్‌సేల్ మార్కెట్లో క్వింటాలు ధర రూ.600 నుంచి 700 వరకు ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో తర్బూజా ధర రూ.10 నుంచి రూ.20 వరకు ఉంది. గత వారం రోజులుగా ఎండలు తీవ్రం కావడంతో వీటికి డిమాండ్ పెరిగింది. గతంలో హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.4గా ఉన్న తర్బజా ధర క్రమంగా పెరుగుతోంది. ఈ సీజన్లో సుమారు రూ.15లక్షల వ్యాపారం జరగనుంది. పలుచోట్ల వీటిని లారీలు, ఆటోలు, జీపుల్లో తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. కాగా జీఎస్టీ, ట్రాన్స్‌పోర్టు చార్జీల కారణంగా కొంత ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని వ్యాపారులు తెలిపారు. తర్బుజా ఉపయోగాలు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తుంది. హృద్రోగ సంబంధిత వ్యాధులు రాకుండా తోడ్పడుతుంది. విటమిన్ ఏ, సీ, ఈలతో పాటు అనేక ఖనిజాలు ఉంటాయి. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. శరీరాన్ని డిహైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది. తర్బుజాలో ఉండే విటమిన్ బీ6 మెదడు చురుకుగా పని చేయడానికి దోహదపడుతుంది. సీజన్లో వ్యాపారం బాగుంటుంది వేసవి సీజన్లో తర్బుజాలను విక్రయిస్తుంటాం. ఎండ వేడిమి పెరుగుతుండటంతో తర్బుజాల కొనుగోలు పెరిగింది. మహారాష్ట్ర నుంచి తర్బుజాలను దిగుమతి చేసుకుంటాం. నాణ్యతను బట్టి ధర నిర్ణయించి విక్రయిస్తుంటాం. ముందుముందు విక్రయాలు పెరుగుతాయి. – షేక్ షాకీర్, వ్యాపారి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులున్నాయి ఎండ తీవ్రత పెరుగుతుండటంతో తర్బూజ విక్రయాలు జోరందుకున్నాయి. ఆరోగ్యానికి మంచిది కా వడంతో చాలా మంది తినేందు కు ఆసక్తి చూపుతా రు. వ్యా పారం బాగున్నా జీఎస్టీ, ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెరగడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కొంత మంది రైతులు నేరుగా మావ ద్దకు వచ్చి విక్రయిస్తుంటారు. – అహ్మద్ వసీముద్దీన్, వ్యాపారి -
పసుపుపచ్చ దాహం
దాహానికి రంగుండదు. కాని దాహం తీర్చేవాటికి రంగు ఉంటుంది. పుచ్చ ఎర్రన... కీర పచ్చన... కొబ్బరి తెల్లన... వీటన్నింటిలో నిమ్మరసం కలిపితే... పసుపు పచ్చ నిమ్మ నుంచి కొన్ని చుక్కలను పిండి రుచి తెస్తే.... ఆ దాహం పుల్లపుల్లగా తియ్యతియ్యగా తీరుతుంది. ఎర్రటి ఎండను హాయిగా మార్చుతుంది. కీర దోస లెమనేడ్ కావలసినవి: కీర దోస – 2; పుదీనా – పావు కప్పు; నిమ్మ చెక్క తురుము – అర టీ స్పూను; నిమ్మ రసం – పావు కప్పు; వేడి నీళ్లు – నాలుగు కప్పులు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు గార్నిషింగ్ కోసం: ఐస్ క్యూబ్స్ – అర కప్పు; సన్నగా తరిగిన కీర దోస చక్రాలు – 10; తాజా పుదీనా ఆకులు – కొద్దిగా తయారీ: కీర దోసను శుభ్రంగా కడిగి, తొక్క తీసి, సన్నగా తురిమి పక్కన ఉంచాలి ♦ పుదీనా ఆకులు, నిమ్మ చెక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, బాణలిలో వేసి కొద్దిగా వేయించి తీసేసి, పల్చటి వస్త్రంలో వడబోసి, ఒక పాత్రలోకి రసం తీసుకుని పక్కన ఉంచాలి ♦ వేడి నీళ్లలో పంచదార, నిమ్మ రసం వేసి, స్టౌ మీద ఉంచి, పంచదార కరిగే వరకు కలిపి దింపేయాలి ♦ కీర దోస రసానికి ఈ మిశ్రమం జత చేయాలి ∙గంటసేపు ఫ్రీజర్‌లో ఉంచి తీశాక, ఒక గ్లాసులో కొద్దిగా రసం పోసి, ఐస్ క్యూబ్స్, పుదీనా ఆకులు, కీర దోస చక్రాలు జత చేసి అందించాలి. పుచ్చకాయ అల్లం లెమనేడ్ కావలసినవి: పుచ్చకాయ ముక్కలు – 4 కప్పులు; పంచదార – ఒక కప్పు; నీళ్లు – ఒక కప్పు; అల్లం తురుము – అర టీ స్పూను; సబ్జా గింజలు – టీ స్పూను; కీర దోస చక్రాలు – అర కప్పు (గింజలు తీసేయాలి); సోడా – ఒక కప్పు; నిమ్మ రసం – టేబుల్ స్పూను తయారీ: కీర దోస చక్రాలను సోడాలో వేసి పక్కన ఉంచాలి. ♦ పుచ్చకాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా అయ్యేవరకు మిక్సీ తిప్పాక, సన్నని రంధ్రాలున్న జల్లెడతో పెద్ద పాత్రలోకి వడ పోయాలి ♦ ఒక పాన్‌లో పంచదార, నీళ్లు, అల్లం తురుము వేసి స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి, పంచదార కరిగి, కొద్దిగా తీగ పాకంలా అవుతుండగా దింపేయాలి ♦ ఒక కప్పులో పొడి చేసిన ఐస్, కొద్దిగా పంచదార మిశ్రమం సిరప్, కొద్దిగా నిమ్మ రసం, నాలుగు టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసం పోసి బాగా కలపాలి ♦ సబ్జా గింజలు జత చేయాలి ♦ సోడాలో నానబెట్టిన కీరదోస ముక్కలు సహా సోడాను జత చేసి, బాగా కలిపి చల్లగా సర్వ్ చేయాలి. కమలా – దానిమ్మ లెమనేడ్ కావలసినవి: చల్లటి గ్రీన్ టీ – ముప్పావు కప్పు; తాజా కమలాపండు రసం – అర కప్పు; దానిమ్మ రసం – అర కప్పు; నిమ్మ రసం – టేబుల్ స్పూను; గార్నిషింగ్ కోసం – కమలా పండు చక్రం; ఐస్ – తగినంత తయారీ: ఒక గ్లాసులో చల్లటి గ్రీన్ టీ, దానిమ్మ రసం, కొద్దిగా ఐస్ వేసి కలిపి, కమలాపండు రసం ఉన్న గ్లాసులో పోయాలి నిమ్మరసం జత చేయాలి ♦ కమలాపండు చక్రంతో గ్లాసును అలంకరించి అందించాలి ♦ ఇది మంచి డిన్నర్ డ్రింక్. సోడా బదులు ఈ లెమనేడ్ వాడటం ఆరోగ్యానికి మంచిది. స్ట్రాబెర్రీ లెమనేడ్ కావలసినవి: స్ట్రాబెర్రీలు – ఒక కప్పు (శుభ్రంగా కడిగి, బాగు చేసి ముక్కలు చేయాలి); పంచదార – 2 టేబుల్ స్పూన్లు; తాజా నిమ్మ రసం – ఒక కప్పు; నీళ్లు – 5 కప్పులు తయారీ: ఒక పాత్రలో స్ట్రాబెర్రీ ముక్కలు, పంచదార వేసి స్టౌ మీద ఉంచి, బాగా ఉడికే వరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ♦ దింపిన తరవాత గరిటెతో మెత్తగా మెదిపి, వడపోయాలి ♦ ఒక పాత్రలో నిమ్మ రసం, నీళ్లు, స్ట్రాబెర్రీ రసం వేసి బాగా కలపాలి ♦ ఐస్ జత చేసి గ్లాసులలో అందించాలి. కొబ్బరి నీళ్ల లెమనేడ్ కావలసినవి: కొబ్బరి నీళ్లు – 4 కప్పులు; నిమ్మ రసం – 5 టేబుల్ స్పూన్లు; తేనె లేదా పంచదార – 3 టేబుల్ స్పూన్లు; నిమ్మ కాయలు – 2 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి); ఐస్ క్యూబ్స్ – 2 కప్పులు; పుదీనా ఆకులు – గార్నిషింగ్‌కి సరిపడా తయారి: ఒక గిన్నెలో కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం, పంచదార /తేనె వేసి పంచదార కరిగేవరకు బాగా కలపాలి ♦ నిమ్మ ముక్కలు, ఐస్ క్యూబ్స్ వేసి మరోమారు బాగా కలిపి, గ్లాసులలో పోయాలి ♦ పుదీనా ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి. ♦ నిమ్మకాయను ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా అవసరం. శరీరానికి అవసరమైన సి విటమిను నిమ్మలో పుష్కలంగా ఉంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను నిమ్మకాయ బాగా తగ్గిస్తుంది. ♦ నిమ్మలో ఉండే విటమిన్ సి... ఎముకలు క్యాల్షియంను స్వీకరించేలా చేస్తుంది. అందువల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. నిమ్మరసంలోని ఫ్లావనాయిడ్లు క్యాన్సర్ కారక కణాలను నిరోధిస్తాయి. ♦ కొద్దిగా నిమ్మరసాన్ని గ్రీన్ టీ కి జత చేసి తాగితే, టీలోని 80 శాతం యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. ♦ తరచుగా నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగి, బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ♦ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపే శక్తి నిమ్మరసంలో పుష్కలంగా ఉంది. ♦ మానసిక ఒత్తిడి తగ్గించి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే లక్షణం నిమ్మలో మెండుగా ఉంది. ♦ కాలేయంలో పేరుకుపోయే విషపదార్థాలను తొలగించి, కాలేయం చురుకుగా పనిచేసేలా చేస్తుంది. ♦ వయసు పెరుగుతున్నా చర్మం ముడతలు పడనీయదు. ♦ పంటి నొప్పిని తగ్గిస్తుంది. పళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది. - సుజాత స్టీఫెన్ ,న్యూట్రిషనిస్ట్ -
పుచ్చ సాగు మెళకువలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): సీజన్లతో సంబంధం లేకుండా పుచ్చకాయలను ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. ఇక వేసవికాలంలో వీటికి బాగా డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ పంటల్లో అంతరపంటగా పుచ్చకాయ పైరును సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పుచ్చ తీగలు పూత, కాత దశలో ఉన్నాయి. ఇప్పుడు సాగు జాగ్రత్తలు చాలా కీలకం. తెగుళ్లు ఆశిస్తే..పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొత్తగూడెం, జూలూరుపాడు, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, పాల్వంచ తదితర మండలాల్లో 238 ఎకరాల్లో ఈ పుచ్చపంటను సాగు చేస్తున్నారు. పాటించాల్సిన సాగు మెళకువలను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి జినుగు మరియన్న ఇలా వివరించారు. సాగు విధానం.. పుచ్చపంటను వ్యవసాయ భూముల్లో నేరుగా వేసుకోవచ్చు. లేదంటే వివిధ పంటల్లో అంతర పంటగా దీనిని సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 80 నుంచి 90 రోజుల వ్యవధిలో రూ.60వేల రూపాయల పైచిలుకు నికర ఆదాయం పొందొచ్చు. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. విత్తనం సాగు చేసే దశనుంచే..రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తెగుళ్ల పీడను గుర్తించాలి. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి..తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవడం ఉత్తమం. రసాయన ఎరువులను అధికంగా వినియోగించొద్దు. సేంద్రియ ఎరువులను వాడడం ద్వారా కూడా మంచి దిగుబడి పొందొచ్చు. తెగుళ్ల నివారణ.. ఆకుమచ్చ తెగులు ఈ పంటలో కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి రెండు గ్రాముల సాఫ్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఆకు ముడత నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము ఎసిఫిల్ లేదా సువాస్ రెండు మిల్లీ లీటర్లతోపాటు ఐదు మిల్లీలీటర్ల వేపనూనెను కలిపి పిచికారీ చేయాలి. నాణ్యమైన ఉత్పత్తికి, కాయ ఎదుగుదలకు పంటకాలంలో వారానికి ఒకసారి 19:19:19 లేదా 13:0:45 లను కేజీ పరిమాణాన్ని డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో అందించాలి. అలాగే నాణ్యతకు, నిల్వకు దోహదపడే బోరాన్ మూలకాన్ని బోరాక్స్ రూపంలో పిచికారీ చేయాలి. లీటరు నీటికి రెండు గ్రాములు లేదా పంట కాలంలో ఎకరానికి రెండు నుంచి మూడు కేజీలపై పాటుగా లేదా డ్రిప్ అందించాలి. -
వేసవి తాపాన్ని హరించే పుచ్చకాయ!
గుడ్‌ఫుడ్ చలవ చేసే చాలా పండ్లు ఆస్తమాను ప్రేరేపిస్తాయనే అపోహ ఉంటుంది. అసలు ఆ అపోహ కూడా లేని పండు పుచ్చకాయ. పైగా దానివల్ల ఆస్తమా తగ్గుతుంది కూడా.క్రమం తప్పకుండా పుచ్చకాయ తినేవారిలో హైబీపీ నియంత్రణలో ఉంటుందనే అధ్యయన ఫలితం ఇటీవల‘అమెరికన్ జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్’లో ప్రచురితమైంది.పుచ్చకాయలోని విటమిన్–సి, యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా అది ఫ్రీరాడికల్స్‌ను అరికడుతుంది. దాంతో ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలుకొని అనేక రకాల క్యాన్సర్లు నివారితమవుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. ఇందులో పీచు పదార్థాలు ఎక్కువ కాబట్టి జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి బాగా ఉపకరిస్తుంది. ఈ పండులో 92% నీళ్లే కాబట్టి వేసవిలో కోల్పోయే నీళ్లను భర్తీ చేసి, డీ–హైడ్రేషన్‌ను నివారిస్తుంది. -
బ్యూటిప్స్
ఆరు టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసం, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టిం చాలి. ఆరిన తర్వాత చన్నీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఈ ప్యాక్‌ను రోజూ వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ తేనెలో తెల్లసొన కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. -
పసందైన పుచ్చకాయ..
ఎదులాపురం: ప్రస్తుతం ఎండలు అదరగొడుతున్నాయి... ఎండ వేడిమి నుంచి రక్షణ పొందేందుకు ఆహార పదార్థాలను తీసుకునేందుకు ప్రజలు దృష్టి సారిస్తున్నారు. గతేడాది కంటే ఈసారి ఒక నెల ముందుగానే ఎండ తీవ్రత పెరిగిపోయింది. వేసవిలో ప్రజలు పుచ్చకాయలను పసందు గా తింటుంటారు. ప్రసుత్తం ఆదిలాబాద్ మార్కెట్లో పుచ్చకాయలు అందుబాటులో ఉన్నాయి. వేసవితాపం నుంచి ఉపశమనంతో పాటు పోషక విలువు అధికంగా ఉండడంతో వీ టి కొ నుగోలు కోసం ప్రజలు ఆసక్తి కనబర్చుతున్నారు. శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది.. నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయాలను వేసవిలో ఎక్కువగా తీసుకుంటారు. ఎండ తీవ్రతకు గొంతు తడారిపోకుండా, ఎండలో తిరిగి అలసిపోయి ఇంటికి చేరిన వ్యక్తి తీసుకుంటే శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గిస్తోంది. చెమట రూపంలో విసర్జన జరిగిన శరీరంలోని నీటి శాతం పడిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ఎంతగానో దోహద పడుతోంది. పట్టణంలో విక్రయాలు.. ఆదిలాబాద్ పట్టణంలో ప్రస్తుతం పుచ్చకాయల విక్రయాలు జరుగుతున్నాయి. ప్రజలు పుచ్చకాయలను ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ వీటిపై ఆసక్తి క నబర్చుతారు. రుచిగా తియ్యగా ఉండే ఈ కా యల్లో ఎన్నో పోషక విలువలున్నాయి. ప్రస్తు తం పుచ్చకాయలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఎండలు ముదురుతున్న సమయంలో పుచ్చకాయల రుచిచూడటానికి అందరు ఇష్టపడతారు. కిలో పుచ్చకాయ ధర రూ.30 నుంచి రూ.40 పలుకుతోంది. ధరలు కాస్తా అధికంగా ఉన్నప్పటికీ ప్రజలు తింటున్నారు. ఎండలు ముదిరి శరీరంలోని ఖనిజ లవణాలు బయటకు పో యే తరుణంలో పుచ్చకాయ తినడం శ్రేయస్క రం. ప్రస్తుతం వేసవి ఆరంభంలోనే ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టర్‌చౌక్, ఎన్టీఆర్‌చౌక్, బస్టాండ్ ఏరియా, శివాజీచౌక్, దస్నాపూర్, గాంధీచౌక్, అంబేద్కర్లతో పాటు తదితర ముఖ్య కూడళ్ల లో వీటి విక్రయాలు జోరందుకుంటున్నాయి. భానుడు తన ప్రతాపం చూపించడం ఆరంభిం చడంతో ప్రజలు చల్లదనాన్ని కోరుకుంటూ పు చ్చకాయలపై దృష్టి పెట్టారు. దాహర్తిన్ని తీర్చేందుకు పుచ్చకాయలు ఉపయోగకరం. ప్రజలను ఆకర్షించేలా.. పుచ్చకాయలు మార్కెట్లో అందుబాటులోకి వ చ్చాయి. వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని హోల్‌సేల్‌కు విక్రయిస్తున్నారు. చిన్న వ్యాపారులు తోపుడు బండ్లపై పుచ్చకాయలను విక్రయిస్తున్నారు. ప్రజలను ఆకర్షించే విధంగా ఐస్ గడ్డలపై ముక్కలు చేసిన పుచ్చకాయలను ఉంచుతూ అమ్ముతున్నారు. రూ.10 కి ఒక ప్లేట్ చొప్పున అమ్ముతూ, వాటిపై మసాల, ఉప్పు లాంటివి చల్లి ఇస్తుండడంతో ప్రజలు మరింత ఇష్టంగా వాటిని తింటున్నారు. ఎండ వేడిమిని తట్టుకోవడానికి ఇవి ఎంతో మేలు. -
చర్మానికి ట్రీట్మెంట్
బ్యూటిప్స్ పుచ్చకాయ సహజమైన ఆస్ట్రింజెంట్. చర్మం మీద పేరుకుపోయిన కాలుష్యపు జిడ్డును తొలగిస్తుంది. మచ్చలు, గాయాల గీతలను పోగొడుతుంది. వార్ధక్యంతో వచ్చే ముడతలను నివారిస్తుంది. ఒక్కమాటలో... చర్మానికి ఇది... ట్రీట్ (విందు) మెంట్.అర కప్పు పుచ్చకాయ ముక్కలను మిక్సీలో బ్లెండ్ చేసి రసం తీసుకుని ఆ రసాన్ని దూదితో ఒంటికి పట్టించాలి. ఎండ ఉన్నప్పుడు ప్రతిరోజూ ఈ ప్యాక్ వేయవచ్చు. పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో స్నానం చేయాలి. వాటర్మెలన్ ఎక్స్‌ఫోలియేషన్‌కు కూడా బాగా పని చేస్తుంది. పుచ్చకాయలోని తెల్లటి భాగాన్ని చిక్కగా పేస్టు చేసి ఒంటికి పట్టించి వలయాకారంగా మర్దన చేయాలి. ఇది మృతకణాలను తొలగించడంతోపాటు నాచురల్ క్లెన్సర్‌గానూ పని చేస్తుంది. చర్మం పటుత్వాన్ని పెంచుతుంది. -
సెక్స్ సామర్థ్యాన్ని పెంచే పుచ్చకాయ!
పరిపరి శోధన పుచ్చకాయలోని సిట్రులిన్ అనే పోషకం వల్ల రక్తనాళల్లోకి రక్తం వేగంగా ప్రవహించి, అంగస్తంభన సామర్థ్యాలు పెరుగుతాయని పేర్కొంటున్నారు టెక్సస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. నిజానికి సిట్రులిన్ అనేది ఒక అమైనో యాసిడ్. లాటిన్ భాషలో పుచ్చకాయను సిట్రులిన్ అంటారు. అందులో పుష్కలంగా లభ్యమయ్యే పోషకానికి ఆ పేరు పెట్టారు. అయితే ఆరోగ్యం కోసం తినాలే తప్ప అంగస్తంభన కోసం మాత్రమే అదేపనిగా పుచ్చకాయ తినవద్దని ఈ అధ్యయనాల్లో పాల్గొన్న డాక్టర్ భీమూ పాటిల్ అనే నిపుణుడు హెచ్చరిస్తున్నారు. అంగస్తంభనను కలిగించే టాబ్లెట్ల అంతటి ప్రభావం చూపించాలంటే కిలోల కొద్దీ పుచ్చకాయ ముక్కలను తినాల్సి ఉంటుందని, అది సరికాదని ఆయన పేర్కొంటున్నారు. -
కళింగరకు వడదెబ్బ
ఎండకు దెబ్బతిన్న కళింగర పంట పొలంలోనే వదిలేసిన రైతులు పెట్టుబడులు నేల పాలు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు కళింగర.. పేరు వింటూనే అలసిన ప్రాణానికి కాసింత ఊరట.. ఎర్రముక్క గొంతులో పడగానే కడుపంతా చల్లగా అవుతుంది. అలాంటి కళింగరపై భానుడు కన్నెర్ర చేశాడు. నిండు వేసవిలో పచ్చగా కళకళలాడాల్సిన కళింగర పంట మితిమీరిన వేసవి తాపానికి తాళలేక విలవిల్లాడింది. నిప్పులు గక్కుతున్న భానుడి భగభగలకు సొమ్మసిల్లి పుడమి తల్లి ఒడిలో వాలిపోయింది. తొండూరు మండలం మల్లేల గ్రామంలో మండుతున్న ఎండల ధాటికి ఆకులు వాడిపోయి.. కాయలు పచ్చగా మారిపోయి కళింగర పంట నేలముఖం వేసింది. రైతన్నకు నష్టం మిగిల్చింది. తొండూరు : ప్రకృతి ఏదో ఒక రూపంలో అన్నదాతపై కన్నెర్ర చేస్తూనే ఉంది. పంట పండింది. ఆశాజనకంగా దిగుబడి వస్తుంది. రెండు రోజుల్లో డబ్బులు కళ్ల చూస్తామనుకున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. గత వారం రోజులనుంచి ఎండలు మండిపోతుండటంతో కోత దశకు వచ్చిన కళింగర పంటకు వడదెబ్బ సోకి కాయలు మచ్చలు మచ్చలుగా మారి దెబ్బతిన్నాయి. వైఎస్ఆర్ జిల్లా తొండూరు మండలంలోని మల్లేల గ్రామానికి చెందిన రైతులు ఈ ఏడాది కొత్తరకం కళింగర పంటను సాగు చేశారు. అయితే ఈ పంట 70 రోజులకే దిగుబడి వచ్చి రైతుల చేతికందుతుంది. కొంతమంది రైతులు ముందస్తుగా సాగు చేయడంతో ఆ పంటకు ఎండల ప్రభావం లేక పంట చేతికంది పది రూకలు వచ్చాయి. అలాగే మల్లేల గ్రామానికి చెందిన సింహం సురేష్, మల్లికార్జున, గాజుల రమణయ్య, వెంకటేష్, గంగులయ్య, కృష్ణయ్య తదితర రైతులు 100 ఎకరాల్లో కళింగర పంటను సాగు చేశారు. మండుతున్న ఎండల ధాటికి వడదెబ్బ సోకి కాయలు పనికి రాకుండా పోయాయి. దీంతో వ్యాపారులు వాటిని కొనుగోలు చేయకపోవడంతో పొలాల్లోనే వదిలేశారు. ఆశ.. నిరాశ పంట సాగు చేసినప్పటి నుంచి వాటికి అవసరమైన నీటి తడులు అందించి.. కాయలు బాగా సైజు వచ్చేందుకు అవసరమైన పోషక విలువలు కలిగిన రసాయనిక ఎరువులు, పురుగు మందులు పిచికారి చేసి.. పంట వారం రోజుల్లో కోతకు వస్తుంది.. పది రూకలు కళ్ల జూస్తామనుకున్న రైతుల ఆశలు నిరాశలయ్యాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసిన రైతులకు చివరకు కన్నీళ్లు మిగిలాయి. కళింగర కాయలు అగ్గిలో కాలిన విధంగా పొరలు వచ్చి రంగు మారాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండకు కళింగర కాయలు దెబ్బతినకుండా ఉండేందుకు డబ్బులు ఖర్చుపెట్టి వరి గడ్డి తెచ్చి కాయలపై కప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కళింగర పంట సాగు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని లేకపోతే ఆత్మహత్యలు తప్పవని పలువురు పేర్కొంటున్నారు. ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే లక్షలాది రూపాయలు అప్పులు చేసి కళింగర పంటను సాగు చేశాను. పంట మొదట ఆశాజనకంగా ఉంది. మంచి సైజులో కాయలు కూడా వచ్చాయి. అధికంగా ఎండలు కాయడం వల్ల కళింగర కాయలకు వడ దెబ్బ సోకి మచ్చలు వచ్చి కాలిపోయిన వాటిలా ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అలాగే వదిలేశాం. - సింహం మల్లికార్జున(కళింగర రైతు), మల్లేల దాదాపు 50 టన్నులు విడిచిపెట్టాం నాకు ఉన్న మూడున్నర్ర ఎకరాల్లో కళింగర పంటను సాగు చేశాను. దాదాపు రూ.3లక్షలు పెట్టుబడి అయింది. వారం రోజుల్లో డబ్బులు చేతికి వస్తాయనుకున్న నేపథ్యంలో ఎండలు తీవ్రమై వడదెబ్బ సోకి దాదాపు 50 టన్నుల కళింగర కాయలను పొలంలోనే వదిలేశాను. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి. - సురేష్(కళింగర రైతు), మల్లేల -
'పుచ్చ' పేలిపోయింది
న్యూయార్క్: ఇద్దరు రిపోర్టర్లు చేసిన చిలిపి సరదా వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. రబ్బరు బ్యాండ్లతో పుచ్చకాయను వారు పేల్చి వేసిన తీరు ఫేస్ బుక్‌లో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల మంది వీక్షించారు. ఓ మీడియా సంస్థకు చెందిన ఇద్దరు రిపోర్టర్లు ఒక ప్రయోగం చేద్దామనుకున్నారు. అనుకుందే తడవుగా తెల్లని వస్త్రాలు నిండుగా ధరించి ఒక పుచ్చకాయను తెచ్చి టేబుల్‌పై పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 500 రబ్బర్లు బ్యాండ్లు ఒకదాని తర్వాత మరకొకటి వేశారు. దాదాపు 45 నిమిషాలపాటు వారు ఈ కార్యక్రమం నిర్వహించారు. వారు చేస్తున్న ఈ ప్రయోగాన్ని తొలుత చూసినవారు కాస్తంతా ఓపిక కోల్పోయి చిరాకుగా కనిపించారు. ఆ తర్వాత సరిగ్గా 500 రబ్బరు బ్యాండ్లు దాటిన తర్వాత బూమ్ అని ఒక్కసారిగా పుచ్చకాయ పేలిపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను వారు ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. -
గింజలులేని పుచ్చకాయ తెలుసా!
కొచ్చి: వేసవి తాపం తీరాలంటే పుచ్చకాయను మించిన పండు మరొకటి లేదు. రుచికి రుచి.. పోషకాలు కూడా మెండుగా ఉన్న పుచ్చకాయలో ఎవరికైనా నచ్చని ఒకేఒక్క విషయం గింజలు. ఎంతో ఇష్టంగా తింటుంటే .. పంటికింద రాయిలా గింజలు అడ్డుపడుతుంటాయి. మరి ఈ గింజలే లేని పుచ్చకాయ ఉంటే ఎంతో బాగుంటుందని మీకెప్పుడైనా అనిపించిందా? అయితే మీ కోరిక తీరాలంటే మీరు కేరళ వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కేరళ మార్కెట్లో గింజలు లేని పుచ్చకాయలు దొరుకుతున్నాయి. కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ.. పిరావామ్లోని ఐదున్నర ఎకరాల్లో ఈ కాయలను పండించింది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ పుచ్చకాయలకు భలే డిమాండ్ ఉందట. ఇంకెల్ అనే సంస్థ వీటిని పండిస్తోంది. అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి పుచ్చకాయలను పండించామని ఆ సంస్థ ఎండీ టి. బాలకృష్ణన్ తెలిపారు. -
యమ కాస్ట్లీ... పుచ్చకాయ
తిక్క లెక్క పుచ్చకాయ ధర ఏమాత్రం ఉంటుందేంటి? కిలో ఇరవయ్యో పాతికో ఉంటుంది... మూడు నాలుగు కిలోలకు అటూ ఇటుగా తూగినా వంద రూపాయలకు మించదని డిసైడైపోతున్నారా..? ఈ పుచ్చకాయ ధర వింటే మాత్రం కళ్లు తిరగడం ఖాయం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయగా గిన్నెస్ రికార్డు బద్దలుకొట్టింది. విశేషం ఏమంటారా? ఏమాత్రం తేడా రాకుండా గ్లోబులా గుండ్రంగా రూపొందేలా దీనిని పండించారు. ఉత్తర జపాన్‌లో పండించిన ఈ పుచ్చకాయకు ఏకంగా 3.50 లక్షల యెన్ల (రూ.2.01 లక్షలు) ధర పలికింది. -
పుచ్చకాయలకు ప్రత్యేకంగా..
మ్యూజియం అనగానే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎగిరి గంతేస్తారు. అక్కడికెళితే చరిత్రకు సంబంధించిన ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు అని తెగ సంబరపడి పోతుంటారు. అయితే ఇప్పటివరకు ఎన్నో రకాల మ్యూజియాలు చూసి ఉంటారు. చైనాలోని బీజింగ్‌లో ఉన్న ఓ వినూత్నమైన మ్యూజియాన్ని మాత్రం చూసి ఉండరు. ఎందుకంటే అది అలాంటి ఇలాంటిది కాదు.. పుచ్చకాయల కోసమే ఏర్పాటు చేసిన ప్రపంచంలోని ఏకైక మ్యూజియం. దాదాపు 43 వేల చదరపు అడుగులు ఉండే ఈ మ్యూజియంలో పుచ్చకాయల పుట్టుపూర్వోత్తరాలు, పుస్తకాలు, ఫొటోలు, కామిక్స్ వంటివి అక్కడ ఉంటాయి. అంతేకాదు ప్రపంచంలోని అన్ని దేశాల్లో లభించే వివిధ ఆకారాల్లోని పుచ్చకాయలను చూడొచ్చు. అయితే అవన్నీ నిజమైనవి కావు.. మైనంతో తయారు చేసినవే ప్రదర్శనకు ఉంచారు. ఆఖరికి మ్యూజియంను కూడా పుచ్చకాయ ఆకారంలోనే నిర్మించారు. -
వాటర్‌మిలన్ కూలర్ స్లషీ
కావలసిన పదార్థాలు: పుచ్చకాయ - 1, చక్కెర - పావు కప్పు, నిమ్మరసం - అరకప్పు, నీళ్లు - పావుకప్పు, క్రష్డ్ ఐస్ - 1 కప్పు, ఉప్పు - అర చెంచా, పుదీనా ఆకులు - కావలసినన్ని తయారీ విధానం: ముందుగా పుచ్చకాయలోని గింజలు తీసేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి; ఇందులోంచి అరకప్పు ముక్కలు తీసేసి పక్కన ఉంచుకోవాలి; మిగతా ముక్కలతో పాటు నీళ్లు, చక్కెర కలిపి మిక్సీలో వేసి, మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి; తర్వాత ఈ మిశ్రమంలో నిమ్మరసం వేసి మరికాసేపు బ్లెండ్ చేయాలి; తర్వాత గ్లాసుల్లో క్రష్డ్ ఐస్, పుచ్చకాయ ముక్కలు వేసి... ఆపైన జ్యూస్ పోయాలి; చివరగా పుదీనా ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి. కొన్ని దేశాల్లో అయితే... నీరు కలపకుండా దీనిని మెత్తని స్మూతీలా చేసుకుని స్పూన్‌తో ఆరగిస్తారు. -
సమ్మర్ ఫుడ్స్... సమ్మర్ ఫ్రూట్స్!
అందరి కడుపు చల్లగా..! పుచ్చకాయ -ఇందులో 80 శాతం కంటె అధికంగా నీరు ఉంటుంది. అందువల్ల ఈ వేసవిఫలం దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.కూరగాయలు - ఉల్లిపాయ చలువ చేస్తుంది. అలాగే క్యారట్, బీన్స్, వెల్లుల్లి వంటి కూరలను ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే తినటం మంచిది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వేసవిలో ఎండలో తిరగటం వల్ల కలిగే చర్మవ్యాధులనుంచి రక్షిస్తాయి. ఎండ నుంచి ఇంటిలోకి రాగానే పుదీనా ఆకుల్ని కాస్త నలిపి, ఆ రసాన్ని తాజా నీటిలో కలుపుకుని, అందులో ఒక నిమ్మకాయ పిండుకుని తాగితే చాలా మందిచి. ఇది సమ్మర్లో బయట తిరిగిన అలసటను తగ్గించి, వెంటనే తాజా అనుభూతిని కలిగిస్తుంది. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ వీటన్నింటిలోనూ నీటి పాళ్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వేసవి ఆహారంగా తీసుకుంటే చలువ చేస్తాయి. వెజిటబుల్ చిల్డ్ సూప్స్: దోసకాయ వంటివాటితో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవటం వల్ల ఆకలి పెరుగుతుంది. దీనితో పాటు జుకినీ (దోసకాయ కుటుంబానికి చెందిన ఇది ఇప్పుడు చిన్నదోసకాయలాగే కనిపిస్తూ, పైన గీతల్ని కలిగి ఉంటుంది) వాడటం మంచిది. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచి డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతాయి.హోల్ గ్రెయిన్ సలాడ్స్: మొక్కజొన్నలు, మొలకెత్తిన పెసలు, శనగలు (స్ప్రౌట్స్), కూరముక్కలు... వంటివాటిని కలిపి తింటే మంచిది. వీటిని అతి తక్కువసమయంలోనే తయారుచేసుకోవచ్చు. ఎంత ఎక్కువ పచ్చికూరలను తీసుకుంటే అంత ఎక్కువ ఆరోగ్యాన్ని వేసవిలో పొందవచ్చు. స్ప్రౌట్ సలాడ్: మొలకెత్తిన రకరకాల గింజలను (స్ప్రౌట్స్‌ను) సన్నగా తరిగిన కూరముక్కలు, పండ్ల ముక్కలతో పాటు కలిపి తీసుకుంటే క్యాల్షియం, ప్రొటీన్లుతో పాటు శరీరానికి చలువ చేకూరుతుంది. కొవ్వుపదార్థాలు తక్కువగా ఉండే పానీయాలే మేలు : వేసవి రాగానే సాధారణంగా ... తియ్యగా, చిక్కగా ఉండే కాఫీ, టీ, సోడాలను, ఐస్‌క్రీమ్‌లను తీసుకోవటం చూస్తాం. వీటిలో క్యాలరీలున్న అధికంగా ఉంటాయి. ఎటువంటి ద్రవపదార్థాన్ని తీసుకున్నా వాటి వల్ల తాత్కాలికంగా దాహం నుంచి ఉపశమనం లభిస్తుందే కాని, అవి ఆకలిని తీర్చలేవు. అందువల్ల - మజ్జిగ, లస్సీ, లో ఫ్యాట్ పాలు వంటివి తీసుకోవాలి. పండ్లతో తయారయిన డెజర్ట్స్: వేసవిలో ఆరోగ్యాన్నిచ్చే పండ్లతో తయారుచేసిన డెజర్ట్స్‌ని తీసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ కొవ్వు ఉన్న తాజా పండ్లతో కూడిన పెరుగు, ఫ్రూట్ కస్టర్డ్ వంటివి తీసుకోవటం మంచిది. ఇవి శరీరానికి కావలసిన ప్రోటీన్లు, క్యాల్షియంలను అందిస్తాయి. బెటర్ ఫ్రూట్స్... బెర్రీఫ్రూట్స్ : మొత్తం పండును తినగలిగే టొమాటో, బెర్రీల వంటి వాటినే బెర్రీ ఫ్రూట్స్ అంటారు. వేసవిలో ఆకలి వేసినప్పుడు రకరకాల బెర్రీ ఫ్రూట్స్ మంచిది. ఇక కూరల విషయానికి వస్తే లభించే ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠాణీ వంటివి తీసుకోవటం వల్ల పోషకపదార్థాలు శరీరానికి అందుతాయి. పైగా ఇవి తక్కువ క్యాలరీలను కలిగి, తేలిగ్గా జీర్ణమయ్యేలా ఉంటాయి. కూల్ కూల్ కుకుంబర్ - దోస వంటివి సహజంగానే చల్లగా ఉంటాయి. తాజాగా ఉన్న చల్లని దోసకాయ ముక్కలను సలాడ్స్‌లోను, కూరలలోనూ వాడటం మంచిది. మామిడి - ఇవి కేవలం వేసవిలో మాత్రమే లభిస్తాయి. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఉంటాయి. వాల్నట్స్ - వేసవిలో తీసుకునే ఆహారంలో కొద్దిగా అక్రోట్లు (వాల్నట్) తీసుకోవడం మంచిది. జీడిపప్పు కంటే బాదంపప్పు మేలు. చేపలు : వేసవిలో చేపలు తినడం మంచిది. వీటిలో ఉండే ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. అయితే వేయించిన చేపల కంటె ఉడకబెట్టిన లేదా గ్రిల్డ్ చేపలు తినడం మరీ మంచిది. సుజాతా స్టీఫెన్ న్యూట్రీషనిస్ట్, సన్‌షైన్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
తీయగా... చల్లగా!
ఫుడ్ n బ్యూటీ: మృదువుగా తీయగా రసపూరితంగా ఉండే పుచ్చకాయకు వేసవి తాపానికి తగ్గించే శక్తి పుష్కలంగా ఉంది. వేసవిలో విరివిగా దొరికే కాయను చల్లగా తినేయవచ్చు, సలాడ్‌లా మార్చేసుకొని కాస్త రుచిని కూడా దట్టించవచ్చు. ఇట్టే వండేసుకోగల అలాంటి సలాడ్లలో ఒకటి ఇది. కావాల్సినవి: ఒక ఉల్లిపాయ, నాలుగు నిమ్మకాయలు, ఒకటిన్నర కిలో పరిమాణంలో పుచ్చకాయ, కొత్తిమీర కట్ట ఒకటి, పుదీన కొంత, నాలుగు టీస్పూన్ల పరిమాణంలో ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, ఉప్పు. తయారీ విధానం: ముందుగా పుచ్చకాయను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొని ఒక గిన్నెలో ఉంచుకోవాలి. మరో గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడిని కలిపి ఉంచాలి. కొత్తిమీర, పుదీనాలను తరిగి ఉంచుకోవాలి, వీటన్నింటిని మిక్స్ చేస్తే సలాడ్ రెడీ! పోషక విలువలు: పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. దీని ద్వారా సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పుచ్చకాయల్లో కొవ్వుపదార్థాలేమీ ఉండవు. అరటితో అందంగా..! ఆకలి తీర్చి శక్తినందించడమే కాదు అందాన్ని కాపాడటంలో కూడా అరటిపండు ఎంతో మంచి పాత్ర పోషించగలదు. సర్జరీలను తలదన్నే స్థాయిలో చర్మాన్ని అందంగా ఉంచగలదు అరటి. విటమిన్ ఏ, బి, ఇ పొటాషియంలు పుష్కలంగా ఉంటాయిందులో. ఇవి ముఖంలో డ్రై నెస్‌ను తగ్గించడం, చర్మ సున్నితత్వాన్ని సూర్య కిరణాల నుంచి కాపాడటం, చర్మకణాలను కాపాడటం చేస్తాయి. అరటి పండుతో వివిధ రకాల ప్యాక్‌లు తయారు చేసుకొని ముఖానికి అప్లై చేయవచ్చు. వాటిలో ముఖ్యమైనవి ఇవి... - బాగా పండిన అరటి పండును గుజ్జుగా చేసుకొని ముఖానికి పట్టించాలి. కాసేపు దాన్ని అలాగే ఉంచి తర్వాత కడిగేసుకోవాలి. దీని వల్ల నల్లమచ్చలను తగ్గి ముఖం ప్రకాశవంతం అవుతుంది. - అరటిపండు గుజ్జులోకే తేనె లేదా నిమ్మరసాన్ని కలుపుకొని కూడా ఫేస్‌ప్యాక్ చేసుకోవచ్చు. తేనెతో ముఖం కాంతిమంతం అవుతుంది, నిమ్మరసం కాంబినేషన్‌తో మొటిమలు తగ్గుతాయి. -
టేస్టాతురాణాం... న క్లాసూ... న మాసు!
పెట్టే చేతిని మరవడం... ఇచ్చే చేతిని కరవడం మన హైదరాబాద్ వాసులకు తెలియని పని. తిండి పెట్టే వారి విషయంలో నగరవాసులకు లాయల్టీ ఎక్కువ. ‘బ్రాండ్ లాయల్టీ’ తరహాలోనే... తమకు ఏదైనా పెట్టేవారి పట్ల ‘ఫుడ్డు లాయల్టీ’ అనే ప్రత్యేక గుణం భాగ్యనగరవాసులకు ఉండటం ఆ పెట్టేవారి మహద్భాగ్యం. తాత్పర్యమేమనగా... సదరు పెట్టేవారు తమ గల్లా పెట్టె నింపుకునేందుకు పెట్టి పుట్టారన్నమాట. ఓ పక్క మింట్ కాంపౌండ్ పక్కనే ఉందా! మరో పక్క రాష్ట్ర పాలన సాగించే కేంద్ర బిందువు సచివాలయం వెనకభాగం ఉందా! ఈ రెండూ కలిసే చోట ఓ పెద్ద చెట్టు నీడ ఉందా! అక్కడున్న పుచ్చకాయల అమ్మకం ఎంత ఫేమస్సంటే... ‘ఎర్రని పండూ ఎన్నీయల్లో... ఎర్రెర్రెని పండూ ఎన్నీయలో... కోసుకు కొనండి, తినండి ఎన్నీయల్లో... తిని కూలైపోండి ఎన్నీయల్లో’ అంటూ ఆత్రమాత్రంగా తింటుంటారు. ఇక మరో దృష్టాంతం. ఒకనాటి వివిధభారతి వాణిజ్య విభాగంలో వినిపించే బట్టలషాపు పేరైన ‘తుంగస్వామి’ సిల్క్స్ పక్కనే మరో కొట్టు ఉంటుంది. బయట కణకణలాడుతూ కనిపించే ఓ నిప్పు కణికెల పే...ద్ద పొయ్యి మీద పాలు మరుగుతూ ఉంటాయి. అక్కడ పాలతో పాటు, లస్సీ, మలాయ్ మీద చక్కెర, పాలతో చేసే కలాఖండ్ ఇత్యాది పాల ఉత్పాదనలన్నీ అమ్ముతూ ఉంటారు. అదెంత పాతదంటే... దాదాపు పాతికేళ్ల క్రితమే దుకణాలకు షట్టర్లు అమర్చిన ఈ కాలంలోనూ... అలనాటి పాత గట్టి చెక్క తలుపులతో... అలనాటి వాళ్ల తలపులతో అలరారుతూ ఉంటుందా కొట్టు. చక్కెర వ్యాధి ఉన్నవాడు దాన్ని చెత్తబుట్టలో వేసేసి, కొలెస్ట్రాల్‌తో కొట్లాడి, దాన్ని పక్కన పడుకోబెట్టి... డబుల్ మలాయ్ మీద త్రిబుల్ చక్కెర వేయించుకుని తింటూ ఉంటాడు. సినిమా థియేటర్ల తాలూకు జురాసిక్ పిరియడ్‌లో ఆ కొట్టుకు సరిగ్గా ఇరువైపులా ముందు భాగంలో రాయల్ టాకీసూ, దిల్షాద్ థియేటరూ అని రెండు సినిమా హాళ్లుండేవి. థియేటర్ల జురాసిక్ కాలాంతం నాటికి అలనాటి ఆ థియేటర్లతో పాటూ తర్వాత ఆవిర్భవించిన పరమేశ్వరీ, మహేశ్వరీ లాంటి మరెన్నో అంతరించి పోయాయేమోగానీ... పాలలోని అమృతగుణం వల్ల ఆ షాపు మాత్రం ఇంకా నిప్పుకణికల పొయ్యిలోని ఎర్రదనంతో ఖణఖణలాడుతూ... సారీ కళకళలాడుతూ జనాల మలాయ్ జిహ్వను తీరుస్తూ అక్కడే ఉంది. ఇక మెహదీపట్నం రైతుబజార్ పక్కనే ఉన్న రోడ్డు మీద ఇంటర్నేషనల్ ఫ్రూట్‌జ్యూస్ సెంటర్లోని ఫ్రూట్సలాడ్ సరేసరి. కాకపోతే అప్పట్లో మట్టిముంతలో ఫ్రూట్సలాడ్ ఇచ్చేవారు. కాలక్రమంలో మట్టిముంత మట్టిలో కలిసిపోగా... ఇప్పుడు ప్లాస్టిక్ గిన్నెల్లో ఇస్తున్నారు. ఇలాంటివే మరెన్నో... అల్ఫా చాయ్, బ్లూసీ టీ, బవర్చీ బిర్యానీ, పిస్తాహౌజ్ హలీమ్. వీటన్నింటికీ సలామ్. ఇంత ఏల... మచ్చుకో ఉదాహరణ ఇచ్చుకుందాం చాలు. మన గోకుల్ చాట్‌లో బాంబులు పెట్టి పేల్చేసినా సరే... ఉగ్రవాదుల్నీ, వాళ్ల దుశ్చర్యలనూ తమ నాలుకలను బయటపెట్టి... ‘వెవ్వెవ్వే’ అని వెక్కిరించి... బయటకు తీసిన ఆ నాలుక మీద కాసిన్ని చాట్ ఐటమ్స్‌ను చప్పరిస్తూ ఇప్పటికీ తమ చాటాభిమానం చాట్కుంటున్నారు మన నగరవాసులు. ఈ అన్నిచోట్లకూ కార్లలోని క్లాసు పీపుల్‌తో పాటు మాస్ పీపులూ ఒకేలా వస్తూ, ఐటమ్స్‌ను టేస్ట్ చేస్తూ ఉంటారు. ఇదీ సగటు హైదరాబాదీల కాస్టు ఎఫెక్టివ్ టేస్టు మహిమ. - యాసీన్ -
పుచ్చకాయపై కోపం చూపినందుకు కటకటాలపాలు..!
కనెక్టికట్ (అమెరికా): అది అమెరికా కనెక్టికట్‌లోని బాంటమ్ సుపీరియర్ కోర్టు. థామస్టన్కు చెందిన కర్మైన్ సెర్విల్లీనో అనే 49 ఏళ్ల వ్యక్తిని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అతడు ప్రమాదకరమైన పనులకు పాల్పడ్డాడని, అతడి చర్యలు భయపెట్టే రీతిలో ఉన్నాయనే అభియోగాలపై అరెస్టు చేసినట్టు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి 500 డాలర్ల బెయిల్ బాండ్ సమర్పించిన తర్వాత కర్మైన్ను విడుదల చేశారు. ఇంతకీ అతడు చేసిన ఆ ప్రమాదకరమైన పని ఏమిటో తెలుసా? పుచ్చకాయను కసితీరా కోయడమే.! విషయం ఏమిటంటే.. సెర్విల్లీనోకు, అతడి భార్యకు మనస్పర్థలొచ్చి విడిపోదామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తన భర్త టూల్ బాక్సులో గంజాయితోపాటు కొన్ని డ్రగ్స్ గుర్తించానని పేర్కొంటూ అతడి భార్య ఈనెల 4న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్ నుంచి ఆమె ఇంటికి వచ్చేసరికి వంటగదిలో ఓ పెద్ద కత్తి గుచ్చి ఉన్న పుచ్చకాయ కనిపించింది. అదే సమయంలో ఆమె భర్త అక్కడకు వచ్చి ఏమీ మాట్లాడకుండానే ఆ కత్తితో పుచ్చకాయను కసితీరా కోసిపారేశాడు. తనను బెదిరించే ఉద్దేశంతోనే అతడు అలా చేశాడని ఆమె మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెర్విల్లీనోను శనివారం పోలీసులు అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ ఉదంతాన్ని తాము గృహహింస కిందే పరిగణనలోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.