వాటర్‌మిలన్ కూలర్ స్లషీ | Watermelon Cooler | Sakshi
Sakshi News home page

వాటర్‌మిలన్ కూలర్ స్లషీ

Published Sat, May 2 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

వాటర్‌మిలన్ కూలర్ స్లషీ

వాటర్‌మిలన్ కూలర్ స్లషీ

కావలసిన పదార్థాలు: పుచ్చకాయ - 1, చక్కెర - పావు కప్పు, నిమ్మరసం - అరకప్పు, నీళ్లు - పావుకప్పు, క్రష్డ్ ఐస్ - 1 కప్పు, ఉప్పు - అర చెంచా, పుదీనా ఆకులు - కావలసినన్ని
 
 తయారీ విధానం:  ముందుగా పుచ్చకాయలోని గింజలు తీసేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి; ఇందులోంచి అరకప్పు ముక్కలు తీసేసి పక్కన ఉంచుకోవాలి; మిగతా ముక్కలతో పాటు నీళ్లు, చక్కెర కలిపి మిక్సీలో వేసి, మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి; తర్వాత ఈ మిశ్రమంలో నిమ్మరసం వేసి మరికాసేపు బ్లెండ్ చేయాలి; తర్వాత గ్లాసుల్లో క్రష్డ్ ఐస్, పుచ్చకాయ ముక్కలు వేసి... ఆపైన జ్యూస్ పోయాలి; చివరగా పుదీనా ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి. కొన్ని దేశాల్లో అయితే... నీరు కలపకుండా దీనిని మెత్తని స్మూతీలా చేసుకుని స్పూన్‌తో ఆరగిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement