జాతీయ పుచ్చకాయ(వాటర్ మిలన్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 3న జరుపుకుంటారు. పుచ్చకాయలో 92శాతం మేరకు నీరు ఉంటుంది. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి పుచ్చకాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పంట సాగు 2000 బీసీ నుండి కొనసాగుతోంది.
పుచ్చకాయ చరిత్ర
పుచ్చకాయ మొదటి పంటను సుమారు 5,000 సంవత్సరాల క్రితం ఈజిప్టులో పండిచారని చరిత్ర చెబుతోంది. 12వ ఈజిప్షియన్ రాజవంశీయులు తిరుగాడిన ప్రదేశాలలో పుచ్చకాయ, దాని గింజల జాడలను కనుగొన్నారు. కింగ్ టుటన్‌ఖామెన్ సమాధిలోనూ పుచ్చకాయ ఆనవాళ్లు కనిపించాయి. పురాతన ఈజిప్షియన్ శాసనాలలో వివిధ రకాల పుచ్చకాయల పెయింటింగ్‌లు కనిపించాయి.
ఆఫ్రికాలోని కలహరి ఎడారిలో ప్రయాణించే వ్యాపారులకు పుచ్చకాయ విత్తనాలను విక్రయించినట్లు తెలుస్తోంది. పుచ్చకాయ సాగు ఆఫ్రికా అంతటా చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత ఇది మధ్యధరా దేశాలకు, ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. తొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి, చైనాతో పాటు మిగిలిన ఆసియా దేశాలలో పుచ్చకాయను విరివిగా సాగు చేయడం మొదలుపెట్టారు.
జాన్ మరియాని రాసిన ‘ది డిక్షనరీ ఆఫ్ అమెరికన్ ఫుడ్ అండ్ డ్రింక్’ లోని వివరాల ప్రకారం పుచ్చకాయ అనే పదం 1615లో ఆంగ్ల నిఘంటువులో కనిపించింది. యునైటెడ్ స్టేట్స్‌లో 300కు మించిన రకాల పుచ్చకాయలను పండిస్తున్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు
పుచ్చకాయలో 92శాతం మేరకు నీరు ఉంటుంది . కేలరీలు తక్కువ పరిణామంలో ఉంటాయి. ఈ పండు నిర్జలీకరణాన్ని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్‌లో ఈ జ్యూసీ ఫ్రూట్‌ని చేర్చుకోవాలి. పుచ్చకాయ గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. పుచ్చకాయలో హీట్ స్ట్రోక్‌ను నిరోధించే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment