Summer Care- Health Tips: వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి చాలా మంది కూల్‌డ్రింకులు, ఐస్‌క్రీములు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి అప్పటికప్పుడు దాహార్తిని తీర్చిన ఫీలింగ్ కలిగించినా దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
కాబట్టి సహజసిద్ధంగానే ఇంట్లోనే కూల్‌కూల్‌గా.. అదే సమయంలో తక్షణ శక్తిని అందించే ఇలాంటి పవర్ బూస్టర్‌లు తయారు చేసుకోవడం ఉత్తమం. పైనాపిల్, పుచ్చకాయ, క్యారెట్లతో డ్రింక్‌ను తయారు చేసుకుని చల్లచల్లగా తాగితే ఎండ నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎలా తయారు చేసుకోవాలంటే..
పావు కప్పు పైనాపిల్ ముక్కలు, పావు కప్పు పుచ్చకాయ ముక్కలు, రెండు క్యారట్లు, రెండు రెమ్మలు కొత్తిమీర తరుగు, రెండు అంగుళాల అల్లం ముక్క (ముక్కలు తరగాలి)ను తీసుకోవాలి. వీటన్నింటిని జ్యూసర్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
వడగట్టి అవసరాన్ని బట్టి రెండు మూడు ఐస్ ముక్కలను వేసుకోని తాగాలి.
ఇది ఆటలు ఆడేవారికి తక్షణ శక్తినందించే సహజసిద్ధమైన డ్రింక్‌లా పనిచేస్తుంది.
శరీరానికి కావాల్సిన మొత్తంలో కార్బొహైడ్రేట్స్‌ను అందిస్తుంది.
పుచ్చకాయ, క్యారట్‌లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.
కొత్తిమీరలో సోడియం, పైనాపిల్ లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫైటో న్యూట్రియంట్స్, విటమిన్ బీ ఉండడం వల్ల మంచి రిఫ్రెష్‌మెంట్ డ్రింక్‌గా పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment